డైలీ సీరియల్

ట్విన్ టవర్స్-80

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘లెటర్ తెచ్చి లాయర్‌గారికి యివ్వు’’ అన్నాడు అన్నయ్య.
లాయర్‌గారు లెటర్ అందుకుని, అంతా చదివి ‘‘మీరు చదివారా, అర్థమయిందా’’ అని నన్ను ప్రశ్నించాడు.
నేను తల వూపేలోగానే అన్నయ్య అన్నాడు ‘‘షీ రుూజ్ ఎ లెక్చరర్’’ అన్నాడు.
‘‘్భర్యాభర్తలు ఒకరికొకరు దూరంగా వున్నప్పుడు రుూ పద్ధతులు అవలంబిస్తూ వుంటారు అన్నాడు లాయర్‌గారు.
దూరమయిపోవడం, సామరస్యం లేకపోవడం వగైరాలు మామూలు సాధనాలు అన్నాడు లాయర్‌గారు.
‘‘అతనికి విడాకులు కావాలి’’ అదీ దీని సారాంశం.
‘‘కల్యాణి ఆప్షన్ ఏమిటి’’ అడిగాడు అన్నయ్య.
లాయరుగారు నా వంక చూచారు. ‘‘మీ వుద్దేశ్యం ఏమిటి’’ అన్నాడు.
‘‘ప్రస్తుతం ఎలాంటి ఉద్దేశ్యాలు లేవు అన్నాను. పరిస్థితిని ఆకళింపు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ’’.
‘‘ఇది జరగకుండా ఆపలేమా!’’ అంది వెనక నుంచున్న అమ్మ.
‘‘ఆపవచ్చు. దానివల్ల ప్రయోజనం ఏముంటుంది’’ అన్నాడు.
అది నిజమే. విడిపోవాలనుకున్నవారిని, ఆపితే ప్రయోజనం ఏముంది అనుకున్నాను, కాలయాపన తప్ప.
‘‘నేను ఈమధ్యనే ఇలాంటి కేసు మరొకటి హ్యాండిల్ చేశాను. అతను అమెరికాలో వున్నాడు. రుూవిడ ఈ దేశంలో వున్నారు. ఈవిడ ఎలాంటి పరిస్థితిలోనూ అక్కడకు వెళ్లలేదు. అక్కడ వున్న అతను రుూ చట్టానికి ఎటువంటి విలువ ఇవ్వకుండా తన ధోరణిలో తను బతకాలనుకుంటే మీరేం చెయ్యలరు?’’
కాని మీరు ఒక్కటి చెయ్యగలరు. ఆయనమీద కేసు పెట్టగలరు. భారతదేశంపు భూమిమీద అడుగుపెట్టిన మరుక్షణం అరెస్టు చేయించగలరు. అంతకుమించి వివాహాన్ని నిలపలేరు. క్రిమినల్ కేసుల్లో తప్ప ఇలాంటివి సివిల్ కేసులో గవర్నమెంట్ జోక్యం కలిగించుకోదు అన్నాడు. ‘‘ఆలోచించుకోండి, అంత అర్జంటు ఏమీ లేదు దీనికి సమాధానం ఇవ్వడానికి’’ అన్నాడు లాయరుగారు.
‘‘మీరు కల్యాణిగారి ఆప్షన్ అడిగారు. మొదటిది ఆవిడ కూడా యిందుకు ఒప్పుకుని సంతకాలు చేసి వెనక్కి పంపిస్తే కోర్టువారు విడాకులు మంజూరు చేసి పంపిస్తారు.
రెండవది ఆవిడ నిరాకరించవచ్చు. దాని మూలంగా కొంతకాలం గడుస్తుంది. వారివైపునుండి ఆధారాలు అడగవచ్చు. కొంచెం ఇద్దరిమద్య కఠినమైన సంభాషణలు, కష్టతరమైన మార్గం మొదలవుతుంది. చివరకు, రుూ పరిస్థితులలోనూ విడాకులు యిస్తారు. ఇవ్వకపోయినా ఇంతవరకు వచ్చిన తరువాత రెండు దేశాల మధ్య మనుషులను కలపడం కష్టమే.
ఇక మూడోది ముఖ్యమైన విషయం కల్యాణిగారు, వీటిమీద సంతకాలు చేసేలోపలే ఒక ఒప్పందం చేసుకోవచ్చు. ఆస్తి వ్యవహారాల్లో, ఆవిడకు, ఆవిడ కొడుక్కు డబ్బు డిమాండ్ చేసేందుకు సర్వ అధికారాలు వున్నాయి. ఆవిడకు న్యాయం జరుగుతుంది కూడా అన్నాడు లాయరు.
ఆ తరువాత చాలాసేపు అన్నయ్య, వదిన, అమ్మ మాట్లాడుతూనే వున్నారు. ఆయన ఎటువంటి రికమండేషన్ చేయలేదు. వున్న పరిస్థితి విడమర్చి చెప్పాడు. తనకున్న మార్గాలు చెప్పాడు. నన్ను నిర్ణయించుకోమన్నాడు.
చాలా ఏళ్ళ క్రితం డాక్టర్ వసుంధర లాగానే సంభాషణలు కొనసాగుతూనే వున్నాయి. నేను లేచి డాబామీదకు వెళ్లాను. సామాన్యంగా నేను డాబామీదకు వెళితే ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. వాళ్ళకు తెలుసు, నేను ఒంటరిగా వుండాలని అనుకుంటున్నాను అని.
లాయరుగారు ఎంత విశదంగా మాట్లాడారు. పరిస్థితి ఎంత క్లిష్టమయినదో మూడు ముక్కల్లో చెప్పారు.
నిజమే ఇంతవరకు వచ్చాక తాను, రఘు కలిసి వుండటం జరిగే పనేనా?
ఎందుకిలా తనని సందిగ్ధంలో పడేస్తున్నాడు. రఘు విడాకులు అడుగుతున్నాడు. అంటే ఏదో కారణం వుండాలి కదా! గోపాల్ వ్రాసిన ఉత్తరం నిజం లేకుండా వుండదు. అందుకే బహుశా రుూ విడాకులు. ఆ బంధం లీగల్ చేసుకోవాలంటే రుూ బంధంతో విడాకులు తీసుకోవాలి.
ఒక్కసారి మనసు రఘును, మరో వ్యక్తితో కలిపి చూడబోయింది. ఒకరకమైన కంపరం కలిగింది. అది నిజమయితే! తను జన్మలో రఘుతో జీవితం కోరుకోదు.
నిర్ణయం జరిగిపోయింది. నెమ్మదిగా మెట్లు దిగుతూ చివరి మెట్లు రాగానే ఆగిపోయాను.
నాన్న ఎవరికో ఫోన్ చెయ్యబోతున్నారు.
‘‘హలో జగన్నాథంగారు నమస్కారం’’ అన్నారు. నాన్న ఎప్పుడూ ఆయన్ని పేరు పెట్టి పిలవలేదు. ఎప్పుడూ బావగారూ అనేవారు. యివాళ ఆఖరికి నాన్నకి కూడా పిలవాలనిపించలేదన్నమాట.
‘‘నిన్న కళ్యాణకి ఉత్తరం వచ్చింది’’ అన్నారు.
‘‘నాన్న సరాసరి అసలు విషయానికి వచ్చి ‘‘మీరేమనుకుంటున్నారు’’ ఏం చెప్పాల్సింది లేదా! ఏం చేయమన్నారు కళ్యాణిని.
నాన్న ఫోన్ పెట్టేశారు. నాన్న ఏం చెప్తారా అని అమ్మ ఎదురుచూస్తోంది.
‘‘జగన్నాధంగారు నా దగ్గర నుండి ఫోన్ వస్తుందని’’ అనుకుంటూనే వున్నారులా వుంది.
ఆయన మాటల ధోరణి చూస్తే, వాళ్ళు చేయగలిగింది, చెప్పగలిగింది ఏమీ లేదు అనిపిస్తోంది.
‘‘మేము చెప్పే రోజులు, వాడు వినే రోజులు పోయి చాలాకాలం అయింది’’’ అన్నారు ఆయన, అన్నాడు నాన్న.
‘‘కళ్యాణిని ఏం చేయమంటారు అని అడిగితే తాను ఎటువంటి సలహా ఇవ్వగలిగే స్థితిలో లేనన్నాడు’’. టెలిఫోను నెంబరు అడుగగానే ఏ మాత్రం అభ్యంతరం పెట్టకుండా ఇచ్చేశాడు అన్నారు నాన్న.
‘‘రఘుకు నువ్వు పోన్ చేస్తావా!’’ అడిగాడు నాన్న.
దేనికన్నట్లు చూశాను. ‘‘ఒకసారి పిలిచి మాట్లాడు. ఇలా అర్థాంతరంగా రుూ ఉత్తరమేమిటి అని అడుగు’’ అన్నారు.
‘‘అర్థాంతరంగా ఎక్కడ నాన్నా 10 ఏళ్ళుగా జరుగుతున్న విషయమే! మనం ఒప్పుకోవడానికి సందేహించాం’’ అన్నాను.
‘‘నీ యిష్టం నాన్నా. నీకు పిలవాలని వుంటే పిలువు. ఏది అడగాలని వుంటే అది అడుగు. నేను ఆపను. నేను మాత్రం ఆ పనిచేయను’’ అని వెళ్లిపోయాను.
రాత్రి కాగితంమీద సంతకం పెట్టి ఆన్నయ్యకి ఇచ్చేశాను..

-ఇంకా ఉంది

రమాదేవి చెరుకూరి