డైలీ సీరియల్

ట్విన్ టవర్స్-103

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నిన్నటినుంచి ఫోన్స్ చేస్తూనే ఉన్నాను. చివరికి శశి చెప్పింది. నువ్వు డాడీ ఇక్కడకు బయలుదేరారని’’ అంటూ వాళ్లమ్మను కౌగలించుకుంది.
‘‘నువ్వు వెళ్లు లతా అమ్మతో’’ అన్నాను. ఆంటీ మీరూ వెళ్లండి. నిన్నటినంచి మీరు ఎంత కంగారుపడుతున్నారో నాకు తెలుసు. మీరు ఒకసారి చూచిరండి. తరువాత నేను వెడతాను. అంతదాకా ఉషని నేను చూస్తాను’’ అంది.
ఇద్దరం టాక్సీలో హాస్పిటల్‌కి వెళ్లాం. ఎమర్జెన్సీ ఎంట్రెన్స్ నుండి గబగబా లోపలకు వెళ్లాం ఆటోమేటిక్ తలుపులోంచి.
మేము చాలా హడావిడిగా లోపలకు వెళ్లడం చూచి, మాకు దోవ ఇస్తున్నట్లుగా పక్కకు తప్పుకున్నాడు. ఎందుకనో మేము లోపలకు వెళ్లంగానే అతను బయటకు వెళ్లకుండా ఆగిపోయాడు. అక్కడే నిలబడిపోయాడు.
అంతలో మూర్తిగారు గబగబా ఎదురువచ్చారు. చాలా ఎక్సయిటెడ్‌గా వున్నాడు.
చటుక్కున నా రెండు చేతులు పట్టుకుని ‘‘ఇదంతా మీ నమ్మకమూ, ప్రార్థనల ఫలితమే’’ అన్నాడు ఆవేశంగా. కళ్లు తడిగా ఉన్నాయి.
కొంచెం ఆశ్చర్యపోయాను. ఆయనని అలా ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడూ నిండుకుండలా వుండేవాడు. మెల్లగా నా చేతులు వెనక్కి తీసుకున్నాను.
ఆయన రెండు చేతులు జోడించాడు. ‘‘మీరు నమస్కరించాల్సింది ఆ పైవాడికి’’ అని తల, కళ్లు పైకెత్తాను.
ఆయన అవున్నట్లు తల పంకించాడు. అంతలో వౌళి లోపలనుండి వచ్చాడు. ఇంతకు ముందున్న నిస్పృహ, నిరాశా మొహంలో మాయమయ్యాయి. ఆ చోటులో ఆందోళన చోటుచేసుకుంది.
మా ముగ్గురి మొహాలలోనూ ఒకటే ప్రశ్న. అది అడగక్కర్లేదు.
‘‘ఇంకా స్పృహ రాలేదమ్మా! వైటల్ సైన్ అన్నీ బాగానే ఉన్నాయిట. కాలు చెయ్యి ఫ్రాక్చర్ అయిందట. ప్రస్తుతం కేవలం ప్రథమ చికిత్స చేశారు. చాలా టెస్టులు, ఎక్స్‌రే అన్నీ అయ్యాక కాని ఏం తెలియదు’’ అన్నాడు.
‘‘నువ్వు చూశావా?’’
తల వూగించాడు.
‘‘ఎలా వుంది?’’ అడిగాను. తల అడ్డంగా ఊగించాడు నమ్మలేనట్లు.
‘‘ఎక్కడ పడితే అక్కడ దెబ్బలు తగిలాయి. తలకు బాగా దెబ్బ తగిలింది. కండిషన్ ఏమో తెలియదు. స్పెషలిస్ట్స్ వచ్చి చూశాక కాని ఏమీ తెలియదు’’ అన్నాడు చాలా వర్రీగా!
దగ్గరగా వెళ్లి చెయ్యి వీపుమీద వేశాను, అనునయంగా వీపు రాస్తూ!
వన్ థింగ్ ఎట్ ఎ టైమ్ వౌళి అన్నాను. ‘‘తేజ కనిపించింది ప్రాణాలతో, డాక్టర్స్ చూస్తున్నారు. మెల్లిగా ఒక్కొక్కటిగా అన్నీ చక్కబడతాయి. ధైర్యంగా ఉండు. నువ్వే ధైర్యం కోల్పోతే- అంత బీభత్సం చూచొచ్చిన తేజ ఎలా వుంటుంది’’ అన్నాను. మూర్తిగారు, సావిత్రి నావంక చాలా ఎప్రీషియేట్‌గా చూశారు. వౌళి నా చుట్టూ చేతులు వేసి మెడ వంపులో మొహం దాచుకున్నాడరు.
మరో సమయంలో అయితే అంత పబ్లిక్‌గా వాడు దగ్గరకు వచ్చేవాడు కాదు. నేను హత్తుకునేదాన్ని కాదు. ఆ సమయంలో నేను మరేమీ ఆలోచించలేదు. ఎందుకనో తెలియదు. ఎవరో మా ఇద్దరిని ఎవరో చూస్తున్న ఫీలింగ్ వచ్చింది.
మర్నాడు రోజంతా తేజ కళ్లు తెరుస్తుందేమోనని ఎదురుచూస్తూనే ఉన్నాము. కాని ఎటువంటిమార్పు రాలేదు. ఆ సాయంత్రానికి తేజాని రూమ్‌కి మార్చారు. అదే ఈ రూమ్‌లో మరో ముగ్గురు వున్నారు. ఆ హాస్పిటల్ చాలా బిజీగావుంది. మరి ట్విన్ టవర్స్ మూలంగానో, మామూలుగానే అలా వుంటుందో?
తేజా రూమ్ ఏర్పాట్లు వౌళికి నచ్చలేదు. వెంటనే బయటకు వెళ్లి సింగిల్ రూమ్ కాని, సెమి ప్రైవేట్‌రూమ్ కాని కోరాడు.
డెస్క్ క్లర్క్ కంప్యూటర్‌లో చూచి, మీ ఇన్సూరెన్స్ సెమి ప్రైవేట్ మాత్రమే కవర్ చేస్తుంది. కాని ఏమీ ప్రస్తుతం ఖాళీగాలేవు అన్నది. వెంటనే పర్సులోంచి క్రెడిట్ కార్డు ఇచ్చి ప్రయివేట్ రూమ్ దొరుకుతుందేమో చూడండి అన్నాను.
‘‘సారీ నాట్ ఎవైలబుల్’’ అన్నది.
‘‘ఏదైనా ఖాళీ అవుతే చెప్పండి’’ అన్నాడు వౌళి.
చాలాసేపు అక్కడ గడిపి ఇంటికెళ్లాం.
మర్నాడు ఉదయం నలుగురం హాస్పిటల్‌కి వెళ్లాం. సరాసరి క్రితంరోజు తేజా వున్నరూమ్‌కి వెళ్లాం.
కాని అక్కడ తేజా లేదు. తేజా పడుకున్న బెడ్ ఖాళీగా వుంది.
నా గుండె గుభేలుమంది. సావిత్రి బిక్కమొహంతో వౌళి వంక చూచింది.
మూర్తిగారు గబగబా బయటకు వెళ్లబోయారు విషయమేమిటో కనుక్కోవాలని. ఎదురుగా అటెండర్ వచ్చాడు. నిన్న రాత్రే వేరే రూమ్‌కి షిప్ట్ చేశారని చెప్పి, నంబర్ కనుక్కు వచ్చి చెప్పాడు.
ముగ్గురం ఫిఫ్త్ ఫ్లోర్‌లో వున్న రూమ్ దగ్గరకు వచ్చాం. అది ప్రైవేట్ గది.
కొంచెం ఆశ్చర్యంతో ఒకరి మొహం ఒకరు చూచుకున్నాం. అది అంత త్వరగా ఎలా దొరికిందా అని.
రూమ్ ముందుకు వెళ్ళేటప్పటికి లోపల ఓ అరడజను డాక్టర్స్ వున్నారు, సీరియస్‌గా చర్చిస్తూ!
ఆశ్చర్యం!
వారిలో ఒక్కడు డా. రఘురామ్! అతను మెడికల్ డాక్టర్ కాదు. అయిన వాళ్ళందరూ అతనితో చర్చిస్తున్నారు.
అతన్ని చూడగానే, వౌళి మొహంలో నెత్తురు చిమ్మింది. గబగబా రెండడుగులు వేయబోయాడు.
అదేమీ గమనించని మూర్తిగారు, వౌళి భుజంమీద చేయి వేసి ఆపారు.
‘‘చూస్తుంటే తేజా కండిషన్ గురించి డిస్కస్ చేస్తున్నట్లున్నారు. లెట్ అజ్ వెయిట్ అన్నాడు. అందరం ఆగిపోయాం.
నా మనసు మామూలుగా పరిపరివిధాల ఆలోచిస్తోంది. రఘురామ్ ఇక్కడెందుకున్నాడు. తేజా ఎవరో అతనికెలా తెలుసు? అసలు అతనికి హాస్పిటల్‌లో ఏం పని? ఆరోగ్యం బాగాలేదా? ఎప్పుడులాగానే నా బుర్ర ప్రశ్నలతో నిండిపోయింది.
మాటల మధ్యలో ముందురోజు మా అందరితో మాట్లాడిన డావాకర్ మమ్మల్ని చూశాడు.
వెంటనే ముందుకు వచ్చి ‘లోపలకు రండి’ అన్నాడు-
-ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి