డైలీ సీరియల్

ట్విన్ టవర్స్ 105

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కాలు బాగా నలిగిపోయిందట. ఎంతవరకు మామూలుగా అవుతుందో చెప్పలేమంటున్నారు’’ అన్నాడు దిగులుగా.
‘‘విన్నాను’’ అన్నాను తిరిగి.
‘‘వౌళి, ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు. ప్రాణాలతో తేజా కనిపించింది. తక్కిన సమస్యలు ఒకటొకటిగా సర్దుకుంటాయి. అది నువ్వు నమ్మాలి’’ అన్నాను.
చిరాగ్గా నావైపు తిరిగాడు. నువ్వంత పాజిటివ్‌గా ఎలా అనుకోగలవు? అన్నాడు. నా భుజం మీద చేతులుంచి ‘‘అన్నీ సర్దుకుంటాయని ఎలా నమ్మగలవు?’’ అన్నాడు.
‘‘ఏవీ సర్దుకోవన్న విషయం నీకు తెలుసా?’’ అడిగాను వాడి కళ్ళల్లోకి చూస్తూ.
వాడు సమాధానం ఇవ్వలేదు.
తెలియదు కదా! అన్నాను. నీకు తేజా బాగుపడుతుందని తెలియదు, బాగుపడదని తెలియదు. మంచి, చెడు రెండూ తెలియనప్పుడు చెడును గురించే ఆలోచించడం ఎందుకు? మంచి గూర్చి కూడా ఎందుకు ఆలోచించలేవు. మనసుకు ఏది సేద తీరుస్తుందంటే అదే నమ్ము. నాకు పాజిటివ్‌గా ఆలోచించినప్పుడే ధైర్యం కలుగుతుంది. అందుకే నేను అదే చేస్తాను. నాకు భగవంతుడిమీద నమ్మకం వుంది. కర్మ సిద్ధాంతాలమీద నమ్మకం వుంది అన్నాను దృఢంగా.
అయినా వౌళి ఏమీ మాట్లాడకుండానే వుండిపోయాడు.
‘‘మొన్న రాత్రిదాకా తేజా దొరుకుతుందన్న నమ్మకం లేదు. నిన్న మనం ఇంటికొచ్చేముందు, తెల్లవారేసరికి, తేజాకి ప్రైవేటు రూమ్ దొరుకుతుంది అనుకోలేదు. అంత పెద్ద డాక్టర్లు వచ్చి ట్రీట్ చేస్తారని అనుకున్నావా! అన్ని జరుగుతున్నాయి కదా! అన్నీ లాగానే మిగిలినవి కూడా జరుగుతాయి. ఆ నమ్మకం నాకుంది’’.
‘‘అవన్ని ఎవరివల్ల జరుగుతున్నాయో నీకు తెలుసు కదా!’’ అన్నాడు పళ్ల బిగువున.
నేను మాట్లాడలేదు. నా దగ్గర సమాధానం లేదు.
‘‘నీకేమీ అనిపించడంలేదా!’’
తల అడ్డంగా ఊగించాను, లేదన్నట్లు. ‘‘నాకు తేజా ఆరోగ్యం కంటే మరేదీ ముఖ్యం కాదు. అది ఎవరివల్ల చేకూరినా సరే వాళ్లకు కృతజ్ఞతతో చేతులెత్తి నమస్కరిస్తాను, అంతే!’’ అన్నాను దృఢంగా.
‘‘అదే నీ మనసులో ఉందని నాకు తెలుసు. అది ఒప్పుకోలేకే నిన్ను నువ్వు చిత్రవధ చేసుకుంటున్నావు’’ అన్నాను. ఈసారి నేనే వౌళికి దగ్గరగా వెళ్లాను. చెంపలమీద రెండు చేతులు వుంచి, ముందుకు వంచి నుదుటిపైన ముద్దు పెట్టుకున్నాను. ఎప్పుడూ లాగానే కొద్దిగా సేద తీరాడు. ఆ క్షణంలో వాడి చిన్నతనంలో టైమ్ మాగజైన్ చదివి అప్‌సెట్ అయిన వౌళియే కనిపించాడు.
‘‘నువ్వు ఇంటికి వెళ్లిపోయాక రఘురామ్‌గారు రూమ్‌కి వచ్చారు, కప్స్‌తో కాఫీ తీసుకుని. మా అందరికీ ఇచ్చారు. నీకోసం కూడా తెచ్చారు. మీ మదర్ ఎక్కడ అని అడిగాడు. నాకంటే ముందుగా మూర్తిగారు సమాధానం ఇచ్చారు. నువ్వు ఇంటికెళ్లిపోయావు. ఉషని చూడటం కోసం అని అన్నాడు వౌళి. బలంగా నిట్టూర్చాను. ఆ ఉదయం డాక్టర్స్ వెళ్లిపోగానే నేను ఇంటికొచ్చేశాను లతని పంపించాలని. ఎంతయినా, స్వంత చెల్లెలు. తను అక్కడ వుండటం ముఖ్యం అనిపించింది.
‘‘ఇదివరకెప్పుడయినా మనం కలిశామా? నువ్వు ఫెమిలియర్‌గా కనుపిస్తున్నావు’’ అని అడిగాడు.
‘‘నా గ్రాడ్యుయేషన్‌లో, యు ఆఫ్ యంకి మీరు కీనోట్ స్పీకర్‌గా వచ్చినపుడు’’ అన్నాను.
‘‘తల తాటిస్తూ, వాట్ ఏ స్మాల్ వరల్డ్’’ అన్నాడు. వెళ్లిపోతూ నా భుజం తట్టి డోంట్ వర్రీ టూమచ్ అని వెళ్లాడు అన్నాడు వౌళి.
‘‘కోపంగా వుందా’’ అని అడిగాను.
తల అడ్డంగా ఊగించాడు. ‘‘ఇందాక నువ్వే చెప్పావుగా. తేజా ఆరోగ్యం ముఖ్యం, అంతే!’’ అన్నాడు నిర్లిప్తంగా.
మర్నాడు ఉదయం మళ్లీ అందరం హాస్పిటల్‌కి వెళ్లాం. నిన్నటి డాక్టర్ కాక ఇంకో ఇద్దరు కొత్తవాళ్లు కూడా వున్నారు. అందులో సైకియాట్రిస్ట్ కూడా ఉన్నాడు.
ఆ రోజు వాళ్లు చెప్పిన మాటలు విని సంతోషించాలో, భయపడాలో అర్థం కాలేదు. ఇంతమటుకు జరిపిన టెస్టుల్లో అన్నీ నెగటివ్‌గానే వచ్చాయి.
ఏ సమస్య కనిపించలేదు. అన్నీ నార్మల్‌గా ఉన్నాయి. బ్రెయిన్ ఏక్టివిటీ అన్నీ సవ్యంగా వున్నాయి.
అయినా తేజాకి మెలుకవ రాలేదు. అందుకు కారణం వాళ్లకు తెలియడంలేదు. తను అలా ఎంతకాలం వుండిపోతుందో కూడా చెప్పలేకుండా వున్నారు.
అది వింటూనే, సావిత్రి చాలా భయపడిపోయింది. తేజా కోమాలోకి వెళ్లిపోయిందేమోనని భయపడింది. అలా ఎన్ని రోజులు వుండిపోతుందో కూడా తెలియదు. ఇదివరలో పేపర్లలో కోమాలో నెలలు, ఏళ్ల తరబడి వుండిపోయారని విన్నాం. సావిత్రి దుఃఖాన్ని మేమెవరం ఆపలేకపోయాం.
చివరకు ఓ నర్సు సావిత్రి దగ్గరకు వచ్చింది. ఆవిడ కూడా భారతీయురాలే. కేరళ ప్రాంతం నుంచి వచ్చినట్లుంది. చాలామంది డాక్టర్స్, ఇంకా ట్రైనింగ్‌లో ఉన్న రెసిడెక్ట్స్, నర్సులు చాలామంది భారతీయులే కనిపిస్తున్నారు.
సావిత్రితో చాలా అనునయంగా మాట్లాడింది. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడంలో ఆమెకు చాలా సమర్థత వున్నట్లుంది.
‘‘మీరు మరీ కంగారుపడకండి. ధైర్యంగా వుండండి. ఆవిడ టెస్టుల్లో ఏ ప్రమాదం లేదని డాక్టర్స్ చెప్తున్నారు కదా! ఆ అమ్మాయి చాలా భయంకరమైన దృశ్యాలు చూచి వుంటుంది. బాగా భయపడిపోయిందేమో! కొంచెం టైము ఇచ్చి చూడండి. మీరు అంత కంగారు పడద్దు’’ అని సముదాయించబోయింది.
డాక్టర్స్ అంతా ఎందుకో ఒకరి ముఖంలోకి ఒకరు చూచుకున్నారు. కానీ ఏమీ మాట్లాడలేదు.
రుూ నర్సు కేవలం సావిత్రిని ఓదార్చడానికే అనివుంటుంది.
కాని నాకెందుకో నమ్మాలనిపించింది. వౌళి పుట్టినపుడు నాకిలాంటిదే జరిగింది. నేను రెండు రోజులపాటు స్పృహ లేకుండా వుండిపోయాను. కాని నాకు ఏవేవో మాటలు వినిపిస్తున్నట్లే అనిపించేది. కాని కళ్లు తెరుచుకునేవి కావు. ఎవరిని చూడటానికి మనస్సు ఇష్టపడేది కాదు. ఆ తరువాత కూడా పూర్తిగా నిశ్శబ్దంగా వున్నప్పుడే, కళ్లు తెరిచాను. -ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి