డైలీ సీరియల్

ట్విన్ టవర్స్106

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ అంధకారం- ఆ నిశ్శబ్దం నా మనసుకు కావాలనిపించింది.
నా మనసు మళ్లీ గతంలోకి వెళ్లబోతోంది. ఇంతలో ఆ డాక్టర్స్ గ్రూపులో వున్న ఒక సైకియాట్రిస్ట్ వచ్చి మా అందరితో అన్నాడు.
‘‘మీ అమ్మాయి పక్కన కూచుని బాగా కబుర్లు చెప్పండి. ఆమెకు చాలా ఇష్టమైన విషయాలు, మంచి ప్లెజెంట్‌గా వున్న సంఘటనలు అన్నీ రోజంతా గుర్తుచేస్తూ వుండండి’’ అన్నాడు. ఒక్కొక్కసారి ఇలాంటి పరిస్థితిలో అన్నీ వినిపిస్తూనే వుంటాయి. కాని రియాక్ట్ అవరు. సబ్ కాన్షస్‌లో ఏదో ఆపేస్తుంది. మనం పూర్తిగా యిదీ అని నిర్థారణ చేసేవరకు పేషెంట్‌ని అన్నీ మామూలుగా వున్నట్లే ట్రీట్ చెయ్యాలి’’ అన్నాడు.
వౌళి తేజా పక్కన కూర్చుని చాలాసేపు ఏదో స్వీటు కబుర్లు చెప్తూనే వున్నాడు. వాళ్ళ హనీమూన్‌లో వెళ్లిన ప్రదేశాలు, వాళ్ల వెకేషన్స్ అన్నీ. మూర్తిగారు, లత, ఎవరికి తోచింది వాళ్లు చెప్తూనే రోజులో చాలా భాగం గడిచిపోయింది. సావిత్రి మాత్రం ఎక్కువగా మాట్లాడలేకపోయింది. పోయిన 4, 5 రోజుల సంఘటనలు ఆమెని బాగా కృంగదీశాయి. అందులో ఎంతో ఆశతో ఎదురుచూచిన రుూ రోజు, చాలా నిరాశ కలిగించింది.
కాఫీ తెస్తానని మూర్తిగారు బయటకు వెళ్లారు, సావిత్రి పరిస్థితి చూచి.
నేను తేజా పక్కన స్టూల్‌మీద కూర్చున్నాను. ‘‘ఆ అమ్మాయి చేతిని నా చేతిలోకి తీసుకున్నాను. అరచేయి తెరచి చూశాను. లైఫ్‌లైన్ చివరిదాకా వుంది. ఆ లైన్‌మీద చేతితో రాస్తుంటే- మామ్మ గుర్తుకు వచ్చింది. రుూ గీత ఇలా వుంటే, నాలాగే తొంభై ఏళ్ళు బతుకుతావ్’’ అనేది. తనకు జ్యోతిష్యం గురించి తెలియకపోయినా, ‘‘మామ్మా! నా జీవితం అంతా సంతోషంగా గడవాలి’’ అని ఆశీర్వదించేదానిని. ఎలా సంతోషంగా గడుస్తుంది మామ్మా! నా కొడుకు జీవితం ఇలా ఛిన్నాభిన్నం అయిపోతూంటే. నా జీవితం ఎలా సంతోషంగా వుంటుంది చెప్పు. మనసులోనే అడిగాను. ‘‘పిచ్చిపిల్లా, సంతోషం అంటే ఏ చెట్టుకో కాసిన పండు అనుకున్నావా! చటుక్కున కోసి ఒళ్లో పెట్టుకోవడానికి. కష్టపడ్డప్పుడే ఫలితం దక్కుతుంది. ఫలించినప్పుడే సంతోషం కలిగేది. నువ్వు కష్టపడుతున్నావు. ఫలించక ఏం చేస్తుంది’’ మామ్మ ధైర్యం చెప్తున్నట్లే అనిపించింది. ఇలాంటప్పుడు వదిన దగ్గర వుంటే బాగుండుననిపించింది. వదిన అయితే ఏం చేస్తుంది. అనునయించేదా! మందలించేదా? అనుకున్నాను తేజా వంక చూస్తూ!
‘‘చూశావా తేజా ఎన్నిసార్లు చెప్పాను. పాపాయికి బాటిల్‌లో పాలు అలవాటు చెయ్యమని. నువ్వేమో హాయిగా నిద్రపోతున్నావు. అదేమో బాటిల్‌తో పాలు తాగడానికి మారం చేస్తోంది. నువ్వు పాలు ఇస్తేగాని అది తాగేటట్లు లేదు. పొద్దున అయితే ఏడ్చి ఏడ్చి నిద్రపోయింది.
పొద్దున హాస్పిటల్‌కి రావాలన్న తొందరలో దానికి గబగబా నీళ్లు పోశాను. ఆ తొందర్లో చేతిలోంచి పిల్ల జారిపోయిందనుకో. మరో క్షణంలో రూంలో నీళ్లలోకి జారేది. ఇవాళ నువ్వు అక్కడ వుంటే వౌళిని చూచి నిజంగా నవ్వేదానివి. పాపాయికి స్నానం చేయించి, డైపర్ కట్టేలోపలే వౌళి షర్ట్ తడిపేసింది. చిన్నప్పుడు, షర్ట్‌మీద వాన చినుకు పడితే చిరాకుపడిపోయేవాడు మీ ఆయన. పొద్దున కిక్కురుమనకుండా షర్ట్ మార్చుకుని వచ్చాడు. అలా చెప్తూనే వున్నాను ఉష గురించి. భార్యాభర్తలమధ్య తల్లీ కూతుళ్లమధ్య ఎన్నో కబుర్లుంటాయి. కాని తేజాతో నేనేం మాట్లాడగలను. మాట్లాడితే వౌళి గురించి మాట్లాడాలి. లేకపోతే ఉష గురించి మాట్లాడాలి. అదే చేస్తున్నాను.
‘‘అమ్మా’’ అని పిలిచాడు వౌళి. ఇక వెడదాం అన్నట్లు తల ఊపాడు. టైము అయిపోయింది.
‘‘వెళ్తాను తేజా. ఉషకి పాలు పట్టాలి. మళ్లీ ఆ బాటిల్‌తో అంటే మాటలు కాదు. ఆకలికి ఏడుస్తుందో ఏమిటో. నువ్వింట్లోవుంటే హాయిగా పాలిచ్చేదానివి’’ అంటూ తేజా వంక పరీక్షగా చూశాను.
నాకెందుకో నా చేతిలో వున్న తేజా చెయ్యి కదిలిందనిపించింది. లేవబోతున్న నా దృష్టి తేజా ఛాతిమీద పడింది. అక్కడెందుకో తడి తడిగా అయిందనిపించింది. నా కళ్లను నేను నమ్మలేకపోయాను.
గది బయట నుంచున్న వాళ్లతో చెబ్దామనిపించింది. కాని ఎందుకో చెప్పలేకపోయాను. నిజంగానే తేజా చెయ్యి కదిలిందా! ఆర్ మై విష్‌ఫుల్ థింకింగ్, మరి ఆ పాలు? నా కళ్లను నేను నమ్మలేకుండా వున్నాను. అలా అని వాటిని కొట్టిపారేయలేకుండా వున్నాను.
దారిలో వెనక్కి వెడుతూ అడిగాను. తేజాతో మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పిందాని తరువాత ఏమయినా రియాక్ట్ అయినట్లు అనిపించిందా అని అడిగాను.
లేదన్నారు ముగ్గురూ!
‘‘నాకెందుకో అలా అనిపించింది వౌళి. నా చేతిలో వున్న తేజా చెయ్యి కొంచెం కదిలిందనిపించింది’’ అన్నాను.
తల అడ్డంగా ఊపాడు. ‘‘అంతా ఇమాజిన్ చేస్తున్నావు. విష్‌పుల్ థింకింగ్’’ అన్నాడు ముభావంగా!
ఇక తడిసిన గౌను గురించి మాట్లాడదలచుకోలేదు. వౌనంగా ఊరుకున్నాను. రేపు కూడా ఇవాళలాగే చేస్తాను. ఏదైనా మార్పు కనిపిస్తే- అప్పుడే డాక్టర్లకి చెప్పచ్చు అనుకున్నాను.
కాని ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు. పదే పదే ఆలోచిస్తున్నాను. నా అనుమానం నిజమైతే బాగుండును. ఉషే తేజాకి మెలుకువ తెప్పించాలి. తేజా ఉషకోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో చెప్పలేను. ఎలర్జీలు రావని తనే పాలు ఇస్తోంది. దీనికోసం అని తన భోజనం అలవాట్లే మార్చుకుంది. ఇంటర్‌నెట్‌లో చూచి, పుస్తకాలు చదివి తూ.చ తప్పకుండా పాటిస్తుంది. వౌళి అన్నట్లు ఇదంతా నా ఇమాజినేషన్ ఏమో! అనుమానంగా అనుకున్నాను.
తెల్లవారింది. హాస్పిటల్‌కి వెళ్ళేటప్పటికి డాక్టర్స్ అంతా అక్కడే వున్నారు.
సరాసరి వౌళి, సావిత్రి, మూర్తిగారు తేజ బెడ్ పక్కకి వెళ్లారు, ఏమైనా మార్పు వుందేమోనని. నాకు మాత్రం ఒక్కసారి డా.వాకర్‌తో మాట్లాడాలనిపించింది.
కారిడార్‌లో వున్న వీళ్ల సంభాషణ కొంచెం ఆగినట్లు అనిపించగానే నేనూ గది బయటకు వెళ్లాను.
డా. వాకర్‌కి దగ్గరగా వెళ్లి, ‘మే ఐ హేవ్ ఎ వర్డ్ విత్ యూ’ అని అడిగాను.
‘‘సర్టెన్లీ’’ అంటూ పక్కకి నడిచాడు.
-ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి