డైలీ సీరియల్

ట్విన్ టవర్స్107

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిన్న రాత్రి నా దృష్టిలోకి వచ్చినవన్ని అతనితో చెప్పాను. క్లుప్తంగా నేను మాట్లాడినవి కూడా చెప్పాను. ‘‘ఈజ్ ఇట్ పాజిబుల్ ఆర్ యామ్ ఐ జస్ట్ ఇమేజినింగ్’’ అన్నాను.
‘‘ఎనీథింగ్ రుూజ్ పాజిబుల్ యిన్ హ్యూమన్ మైండ్ అండ్ బాడీ!’’ అన్నాడు డా. వాకర్.
కొద్ది దూరంలోనే వున్న సైకియాట్రిస్ట్ డా మార్టిన్‌ని కూడా పిలిచాడు.
అతడు అన్నీ వినంగానే- అతని మొహం కొంచెం ఉల్లాసంగా కనుపించింది.
‘‘బేబిని కొద్దిసేపు తల్లి దగ్గరకు తీసుకువస్తే ఏమైనా ప్రయోజనం వుంటుందా. అంత చిన్న పాపాయిని హాస్పిటల్‌కు రానిస్తారా’’ అని అడిగాను.
నా అబ్జర్వేషన్ గురించి, వాళ్ళల్లో వాళ్ళు చాలాసేపు చర్చించుకున్నారు.
ఇంతలో వౌళి లేచి వాళ్ల దగ్గరగా వచ్చాడు. డా. వాకర్ అన్నాడు ‘‘తేజాలో కొంచెం రియాక్షన్ వచ్చిందేమోనని మీ మదర్ అనుకుంటున్నారు’’ అన్నాడు.
‘‘అవును, నాతోనూ అన్నది రాత్రి. కాని నేను ఏమీ నోటీస్ చేయలేదు’’ అన్నాడు వౌళి. ఒక్కసారి నా మొహంలోకి చూచి దృష్టి మరల్చుకున్నాడు.
బేబిని ఇక్కడకు తీసుకురావడమా లేదా అని ఆలోచిస్తున్నాం అన్నాడు డా.వాకర్.
‘‘బేబీనా’’ ఆశ్చర్యపోయాడు వౌళి. చాలా చిన్నపిల్ల. 12 వారాలు. ఇమ్యూనైజేషన్స్ కూడా మొదలవలేదు అన్నాడు వౌళి.
డాక్టర్స్ ఒకళ్ల మొహంలోకి ఒకళ్లు చూచుకున్నారు.
అసలు అంత చిన్న బేబిని పేషెంట్ విజిటింగ్‌కి రానివ్వరు.
డాక్టర్స్ మధ్య తర్జన భర్జనలు జరుగుతూనే వున్నాయి. సైకియాట్రిస్ట్ ప్రయత్నిద్దామన్నాడు. డా.వాకర్ తటస్థంగా వూరుకున్నాడు. న్యూరాలజిస్ట్‌కి పెద్ద ప్రయోజనం వుంటుందని అనిపించలేదు. ఆర్థోపెడిక్ సర్జన్ మాత్రం తనకి సంబంధించిన విషయం కాదన్నట్లు నిర్లిప్తంగా వుండిపోయాడు.
చాలాసేపు గడిచాక చివరకు డా.రఘురామ్ అన్నాడు- ‘‘మదర్స్ ఇన్‌స్టిక్స్ రేర్‌లి ఫెయిల్, ట్రై చేద్దాం’’ అన్నాడు.
ఇక అది నిశ్చయం అయిపోయింది. వౌళికి మాత్రం అంత పసిపిల్లను హాస్పిటల్‌కు తీసుకురావడం కొంచెం జంకుగానే వుంది.
అందరం 3 గంటలకు కలుద్దాం అని అందరూ కదిలారు.
నేను కూడా ఇంటికి వెళ్లడానికి సిద్ధమయ్యాను. వౌళి నాతో వస్తున్నాడు ఉషని తీసుకురావడానికి. మూర్తిగారు, సావిత్రి తేజా దగ్గరే వుండిపోయారు.
డాక్టర్స్ అంతా పై ఫ్లోర్‌కి వెళ్లడానికి ఎలివేటర్ దగ్గర ఎదురుచూస్తున్నారు.
నేను వౌళి క్రిందకు వెళ్ళే ఎలివేటర్‌లోకి వెళ్లాం. తలుపు మూసుకుంటూ వుండగా-
రఘురామ్ ఏదో అనబోతున్నాడు. వౌళి చటుక్కున ఎలివేటర్ తలుపు మూసుకోకుండా ఆపాడు. ‘‘బేబిని వెనకవైపు డాక్టర్స్ లాంజ్‌లోనుంచి తీసుకురండి. అక్కడయితే ఎక్కువగా ఎవరూ వుండరు’’ అన్నాడు.
నేను వౌళి ఒకరి మొహంలోకి ఒకరు చూసుకున్నాం. వౌళి తల తాటించి తలుపు మూశాడు.
రఘురామ్ మాటలు ఎందుకో ఆశ్చర్యపరిచాయి. అతను ఇంతగా ఆలోచించగలడా అని అనుకున్నాను. ఒక విధంగా బేబిని తేవడానికి చివరి నిర్ణయం కూడా అతనిదే!
టాక్సి ఇల్లు చేరుతుండగా వౌళి అన్నాడు- ‘‘ఏమిటోనమ్మా, నాకేం నమ్మకంగా అనిపించడంలేదు. అనవసరంగా ఉషని కూడా ఎక్స్‌పోజ్ చేస్తున్నామా అని. దానికి జలుబు వచ్చిందంటే, అది మరో చిక్కు అయిపోతుంది’’ అన్నాడు దిగులుగా!
నా చెయ్యి వాడి చెయ్యిమీద వేశాను ఓదార్పుగా!
‘‘వర్రీ అవకు. పిల్లలు గాజుబొమ్మలు కాదు వౌళి. వాళ్ళల్లో చాలా శక్తి వుంటుంది’’ మళ్లీ మామ్మే వినిపించింది నా కంఠంలో.
‘‘నీకు నిజంగా అనిపిస్తోందా, ఏదైనా ఫలితం వుంటుందని’’ మళ్లీ అడిగాడు వౌళి. వాడికి ఏదైనా రీ ఎస్యూరెన్స్ కావాలంటే, విషయాన్ని మరోసారి నన్ను అడుగుతాడు. వాడు చిన్నప్పటినుంచి అంతే!
అవునూ కాదూ అన్నట్లు తల ఊగించాను. మనసులో అనుకున్నాను. ఎవరు చెప్పగలరు. విసరగా విసరగా ఓ రాయి. నిట్టూర్చాను.
నాకెందుకో వౌళి పుట్టినప్పటి సంఘటనే మళ్లీ మళ్లీ గుర్తుకువస్తోంది. వాడు పుట్టాక నేను రెండు రోజులు కళ్లు తెరువలేదుట. అసలు నాకు 48 గంటల కాలం గడిచినట్లే తెలియలేదు.
మామ్మ గొంతు వినిపిస్తున్నట్లే వుంది. కాని కళ్లు తెరవడానికి భయం. పాపాయి ఏడుపు వినిపిస్తే ఆ భయం మరింత ఎక్కువయినట్లుండేది. కళ్లు తెరిస్తే ఏం చూడాలో అన్న భయం. ఆ భావన నాకిప్పటికీ అర్థంకాదు.
వౌళి హాస్పిటల్‌కి వెళ్లడానికి రెడి అయ్యాడు. పాపాయిని బేబి సీట్‌లో పెట్టి దుప్పటి కప్పాడు. రెండు సీసాలు పాలు సిద్ధం చేశాడు. నేను వౌనంగా నా దేముడి ముందు నుంచున్నాను. విజయవాడ కనకదుర్గ నన్నుచూచి నవ్వినట్లు అనిపించింది. ఆ ఫొటోలో ఇంత పిరికిదానవా అన్నట్లు. కనకదుర్గకు దండం పెడితే, నాకు ప్రియమైన ఇద్దరి ఆశీస్సులు ఒకేసారి లభిస్తాయనిపిస్తుంది ఎప్పుడూ. ఒకటి మా వూరి దేవత, రెండు మా అమ్మ. మా అమ్మ పేరు కూడా కనకదుర్గే.
మేము హాస్పిటల్‌కి చేరేటప్పటికి, అప్పుడే డాక్టర్స్ కూడా వచ్చేశారు. సావిత్రి ఎదురొచ్చి వౌళి చేతిలో వున్న బేబి సీట్‌లోంచి పాపాయిని ఎత్తుకుంది.
అది హాయిగానిద్రపోతోంది నోట్లో వేలు వేసుకుని. దాన్ని తేజా బెడ్ దగ్గరకు తీసుకువెళ్లింది. వౌళి, దాన్ని చేతుల్లోకి తీసుకుని. తేజా పక్కనున్న స్టూల్‌మీద కూర్చున్నాడు. నేను ముందుకు వంగి దాని నోట్లో వేలు తీసేశాను.
ఒక్కక్షణం అది కళ్లు తెరిచింది. నా మొహం చూసి నిద్రమత్తులోనే నవ్వింది. మళ్లీ వెంటనే వేలుకోసం వెదుక్కుంటూ నిద్రలోకి జారిపోబోయింది.
నేను దానిమీద వున్న బ్లాంకెట్ తీసేశాను. నోట్లో వేలు వేసుకోకుండా ఆపేశాను.
ఒళ్ళు చేసి, మిసమిసలాడుతున్న తొడలమీద చిన్నగా కితకితలు పెట్టాను. దానికి నిద్రాభంగం అయింది. దానికి దుఃఖం వచ్చింది. -ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి