డైలీ సీరియల్

యమహాపురి 30

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుకు జగదానందస్వామి దీవెన పొందాడు. ఇపుడు తన సాయం కోరి వచ్చాడు.
జగదానందస్వామి గురించీ, ఆయన దీవెన గురించీ శ్రీకర్‌కి తెలుసు. అది మీడియాలో వినిపించే ఒక మామూలు వార్తగా భావించి పట్టించుకోలేదు. కానీ ఇప్పుడాయన దీవెన తనకు శాసనమయింది.
ఒక్కక్షణం ఆగి, ‘‘మీరేదో చాలా పెద్ద మిషన్ మీదే వచ్చారని అర్థమైంది. మిమ్మల్ని నమ్మి పనివ్వడానికి నేను మామూలు మనిషిని కాను. బాధ్యతగల ప్రభుత్వాధికారిని. మీరు చెప్పేది నిజం కాదనీ, ఇది ఓ నేరస్థుడి ట్రాప్ అనీ నేనంటాను. కాదనడానికి మీ దగ్గిర ఏమైనా ఋజువులున్నాయా?’’ అన్నాడు శ్రీకర్.
‘‘ఉన్నాయి సార్. ఒకటి- నేరస్థులు మిమ్మల్ని భయంకర్ అంటారు. నేను మిమ్మల్ని శ్రీకర్ అన్నాను’’
‘‘నా అసలు పేరు చెబితే- అది ఒక ఋజువా?’’ హేళనగా నవ్వాడు శ్రీకర్.
‘‘నేరస్థుల ప్రచారాన్ని అలా తీసిపారేయకండి సార్! బయట ప్రపంచంలో చాలామందికి మీరు భయంకర్‌గానే తెలుసు. నేనీ కాలనీలో అడుగెట్టినప్పుడు భయంకర్‌గార్ని కలుసుకోవాలనే వచ్చాను. అదృష్టవశాత్తూ బిఏ ముత్యాల్రావుగారు కనిపించి మీ అసలు పేరు చెప్పారు...’’
అతడింకా ఏదో అనబోతూండగా, ‘‘బిఏ ముత్యాల్రావెవరు?’’ అన్నాడు శ్రీకర్ నొసలు చిట్లించి.
ఎలా చెప్పాలో తెలియక- ఆయన రూపాన్నీ, దుస్తుల్నీ వర్ణించాడు యోగి. శ్రీకర్ సాలోచనగా, ‘‘అలాంటివాళ్ళు చాలామందే ఉన్నారీ కాలనీలో. కానీ బిఏ ముత్యాల్రావెవరో తెలియడంలేదు. వేరే గుర్తులు చెప్పండి’’ అన్నాడు.
‘‘మేము మాట్లాడుతూండగా ఓ కుక్కొచ్చింది సార్! జాతి కుక్కలా ఉన్న వీధి కుక్క. ఆ కుక్క మీరొచ్చినపుడే ఈ కాలనీకి వచ్చిందని ఆయననన్నాడు. అది మీ ట్రయిన్డ్ డాగ్ అన్న అనుమానం కూడా వ్యక్తపరిచాడు’’
‘‘అంటే ఆ కుక్క మిమ్మల్ని చూసిందన్నమాట! చూసి ఊరుకుందా? ఈ కాలనీకి కొత్త కదా- మిమ్మల్ని చూసి మొరిగుండాలే’’ అన్నాడు శ్రీకర్.
‘‘లేదు సార్! ఓసారి ఆగి పెద్ద పోలీసాఫీసరొచ్చి పోజిచ్చి నన్ను పరీక్షగా చూసి తన దారిన వెళ్లిపోయింది’’.
‘‘అది సరే- కానీ ఆ ముత్యాల్రెవరో నాకింకా స్ఫురించడంలేదు. ఆయన గురించి ఇంకేమైనా చెప్పగలరా?’’
‘‘ఆయనకి కెజెరావని మారుపేరుందన్నాడు...’’ అన్నాడు యోగి.
శ్రీకర్ ఫక్కున నవ్వి, ‘‘ఓకే ఓకే తెలిసిపోయింది. మీ మాటలు నమ్మొచ్చులెండి’’ అన్నాడు.
యోగి ఆశ్చర్యంగా అతణ్ణి చూసి, ‘‘సార్! ఇందాకనే మీరు సంస్కారం గురించి మాట్లాడారు. మీరు కూడా ఆ ముత్యాల్రావుగార్ని కెజెరావుగా మాత్రమే గుర్తుంచుకోవడం బాగోలేదు’’ అన్నాడు.
శ్రీకర్ నవ్వాగిపోయింది. ‘‘ఆయన్ని కెజెరావనేది ఒకరో ఇద్దరో సన్నిహితులు. మిగతావాళ్లందరికీ ఆయన ముత్యాల్రావే. కానీ ఆయన కొత్తా పాతా అని లేకుండా కనిపించినవాళ్లందరికీ తన పేరు కెజెరావని ప్రచారం చేసుకుంటాడు. అక్కడికదేదో పద్మశ్రీ బిరుదైనట్లు. ఆయనవల్లే అంతా ముత్యాల్రావు పేరు మర్చిపోయి కెజెరావు పేరుకి అలవాటుపడిపోతున్నారు’’ అన్నాడు గంభీరంగా.
మనకి కనిపించేదీ, వినిపించేదీ ఒకటైతే- దాని వెనుక అసలైనదేదో ఇంకొకటుంటుంది. ‘‘ఔరా! అని మనసులో అనుకుని, ‘‘అందుకేనా, ఇనె్వస్టిగేషన్ స్పెషలిస్టనిపించునే మీక్కూడా- ఆయన కెజె రావుగా మాత్రమే గుర్తుండిపోయారు?’’ అన్నాడు యోగి.
శ్రీకర్ నవ్వి, ‘ముత్యాల్రావుగార్ని కలుసుకుని కెజె రావు పేరు వినుండకపోతే- మీరాయన్ని కలుసుకోలేదని అర్థం. అందుకే కాస్త డీప్‌గా వెళ్లాను. ఇదీ ఇనె్వస్టిగేషన్లో ఓ భాగమే’’ అన్నాడు.
‘‘నా నిజాయితీకి ఈ ఋజువులు చాలా సార్!’’ అన్నాడు యోగి.
‘‘అంటే మీ దగ్గిర ఇంకేం ఋజువులు లేవా?’’
‘‘అసలైన ఋజువొకటుంది సార్!’’ అంటూ యోగి తన జేబులోంచి ఓ కాగితం తీసి శ్రీకర్‌కి అందించాడు.
అది ఒక దినపత్రికలో వార్తకి జిరాక్స్ కాపీ. శ్రీకర్ దాన్ని శ్రద్ధగా చూశాడు.
అది రెండు వారాల క్రితం ఆ ఊళ్ళో జగదానందస్వామి నిర్వహించిన సభ గురించి వార్త. అందులో ఆయనదీ, ఆయన దీవెనలు పొందిన ఆరుగురివీ ఫొటోలున్నాయి. ఆ ఆరుగురిలో యోగి కూడా ఉన్నాడు.
‘‘కంగ్రాట్యులేషన్స్! జగదానందస్వామి అంతటివాడి దీవెన మీకు లభించింది’’ అన్నాడు చేయి చాపి.
యోగి తన చేయి చాపలేదు. ‘‘మీరు నాకు సాయం చేస్తానంటేనే, ఆ దీవెన గొప్పతనం ఋజువౌతుంది. అప్పుడే మీ అభినందనలకి అర్హుణ్ణి’’ అన్నాడు.
‘‘లతికని ప్రేమించానన్నారు. నరకపురి దుర్బేధ్యమన్నారు. స్వామి దీవెన అన్నారు. అన్నీ నిజమని చాలావరకూ ఋజువు చేశారు. ఇప్పుడు నేను చెయ్యాల్సిన సాయమేమిటో నాకు తెలియడంలేదు’’ అన్నాడు శ్రీకర్.
‘‘సార్! స్వామి ఆరుగుర్ని వేదికమీదకి పిలిచి దీవెన అందించాడు. మా ఆరుగురికీ ఏదో లింకు ఉందని నా అనుమానం. అదేమిటో తెలుసుకోవాలంటే నేను మిగతా ఐదుగుర్నీ కలుసుకోవాలి. కానీ నాకా ఐదుగురూ ఎవరో తెలియదు. వాళ్ళెవరో తెలుసుకోవడం మీ వంటి వాళ్లకే సాధ్యం’’ అన్నాడు యోగి.
‘‘ముక్కెక్కడంటే తల చుట్టూ తిప్పి చూపించినట్లుంది. వేదిక దిగగానే ఒకరినొకరు కలుసుకుని మాట్లాడుకుంటే పోయేదానికి- ఇప్పుడో పెద్ద పోలీసు ఎంక్వయిరీయా?’’ అన్నాడు శ్రీకర్.
‘‘స్వామి ఆరుగుర్ని వేదికమీదికి పిలిచాడు. అందులో ఒకటి యువతీ యువకుల జంట. మిగతా నలుగుర్నీ ఆయన విడివిడిగా పిలిచాడు. ఆ రోజుకి మేమెవ్వరం ఒకరినొకరు పలకరించుకోరాదని నియమం. ఆ తర్వాత ఒకరినొకరు ఎలా కలుసుకోవాలో తెలియలేదు’’ సంజాయిషీ ఇచ్చాడు యోగి.

ఇంకా ఉంది

వసుంధర