డైలీ సీరియల్

ట్విన్ టవర్స్-109

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరి మొగంలో ఆనందం కనిపించింది. దాని వెనుక స్పెక్యులేషన్ మొదలైంది.
తల పక్కగా తిప్పి వున్న తేజా, కళ్లు చాలా కష్టంగా తెరచుకుంటున్నాయి. వాళ్ళ అమ్మా నాన్న కనుపించారు. వాళ్లు చిరునవ్వుతో తేజా వంక చూడాలని ప్రయత్నించారు. కాని సావిత్రి కళ్లు కోఆపరేట్ చెయ్యడంలేదు. తేజా కళ్లు కూడా తడుస్తున్నాయి.
మెల్లిగా దృష్టి పక్కనే వున్న లతమీదకు కూడా వెళ్లింది. అక్క చూపులు తనమీదకు రాంగానే - గుప్పెట్లు మూసి రెండు బొటనవేళ్లు నిటారుగా నిలబెట్టింది ‘గుడ్ జాబ్’ అన్నట్లు.
ఏమి స్పందించిన తేజా కళ్లు కాళ్లవైపుగా నుంచున్న డాక్టర్స్‌మీద నిలిచిపోయాయి. ఒక్కొక్కరిమీద సాగుతున్న దృష్టి రఘురామ్‌మీద క్షణకాలం ఎందుకో ఆగిపోయింది. ఎక్కడో చూచానన్న భావన ఏమయినా మెదిలిందేమో! అతని మొహంలో ఎటువంటి భావనా లేకుండా అతి మామూలుగా ఆమె వంక చూచాడు. డాక్టర్లు అందరూ వాళ్లే- వాళ్ల మొహాల్లో ఎటువంటి ఫీలింగ్స్ కనిపించలేదు. పూర్తి ప్రొఫెషనలిజమ్ తప్ప- ఎటువంటి సందర్భాన్నైనా స్థిరంగా ఎదుర్కోవడం, పేషెంట్‌లో ఎటువంటి ఆందోళనా కలిగించకుండా వుండటం వాళ్లకు ఉద్యోగరీత్యా అలవడిన ట్రైనింగ్ గావచ్చు.
చూపు ఒకరిమీంచి ఒకరిమీదకు సాగుతున్నకొద్దీ తేజా కళ్లు నీళ్లతో నిండిపోతున్నాయి.
మెల్లిగా చూపు వౌళి దగ్గర ఆగిపోయింది. వౌళి చిరునవ్వు నవ్వాలని ప్రయత్నించాడు. కాని నవ్వుకంటే ముందుగా భావోద్వేగంతో పెదిమలు అదరసాగాయి.
తదేకంగా చూస్తున్న తేజా కళ్లల్లో ఇక నీరు నిలవలేక కన్ను ఇరుపక్కలనుంచి కణతలమీదకు కారిపోసాగాయి.
అది చూచిన నేను చటుక్కున పక్కనేవున్న టిష్యూ తీసి వౌళి చేతిలో పెట్టాను. వాడు కొద్దిగా ముందుకు వంగి తేజా రెండు కణతలను తుడిచాడు.
ఎడం చేతివేళ్లను తేజా జుట్టులోకి పోనిచ్చి నుదుటను బొటనవేలుతో మృదువుగా రాయసాగాడు.
ఆ క్షణంలో వౌళి కూడా తన కంట్రోల్ కోల్పోయాడు. బిగబట్టుకున్న దుఃఖమో, తేజాని చూస్తుంటే కలిగిన ఆనందబాష్పాలుగా మారి జారాయి.
తేజా కుడి చెయ్యి ఎందుకో పైకి లేపడానికి ప్రయత్నించింది. తనేం చేయబోతోందో ఎవరికైనా అర్థం అయిందో లేదో నాకు మాత్రం తోచింది.
వెంటనే వౌళి మెడమీద చేయి వుంచి ముందుకు వంచాను.
వెనుకనుంచి అనుకోని ఆ సంఘటనకు, వౌళి ఒకసారి తూలి ముందుకు పడబోయి నిగ్రహించుకున్నాడు.
వాడి మొహం తేజాకి బాగా దగ్గరలో ఆగింది. తేజా మెల్లిగా శక్తి లేనట్లున్న చేతితో, వాడి కళ్ల క్రింద నీరు తుడవబోయింది. వౌళి ఆ చేతిని అందుకుని పెదిమలకు ఆనించుకున్నాడు.
అంతవరకు ఊపిరి బిగపట్టి అబ్జర్వ్ చేస్తున్న వాళ్లంతా ఒక్కసారిగా నిట్టూర్చారు. నా సమయస్ఫూర్తికి కొంచెం ఆశ్చర్యపోయారేమో!
తేజా నుదుటిపైన వౌళి చెయ్యి. వౌళి పెదిమల దగ్గర తేజా చెయ్యి. వాళ్లిద్దరినీ అలా చూడంగానే అక్కడ వున్న వాళ్లు బలంగా శ్వాస వదిలారు. ఒకరమైన రిలీఫ్ పొందారు. వాళ్ళిద్దరి వంకే చూస్తున్న నా కళ్లు అప్రయత్నంగా ఎదురుగా నుంచున్న సావిత్రిమీద పడింది. ఆవిడ చాలా ఎమోషనల్‌గా వుంది. మూర్తిగారు వెనుకనుంచి చెయ్యి వేసి జబ్బమీద అనుననయంగా పైకి క్రిందకు రాస్తున్నారు ఓదార్పుగా! ప్రక్కనే నుంచున్న లత సంతోషంతో కనిపిస్తోంది. తల్లి చేతిని పెనవేసుకుంది.
డాక్టర్స్ అంతా అబ్జర్వేషన్‌లో ఉండిపోయారు. ఎందుకో రఘురామ్ మాత్రం నా ప్రతి కదలికలను చూస్తున్నాడనిపించింది.
అందరూ ఆ సంతోషాన్ని ఏదో విధంగా, ఎవరో ఒకరితో పంచుకుంటున్నారని అనిపించింది, నేను తప్ప. ఒక్కసారిగా నా మనసెందుకో విపరీతమైన వంటరితనం కలిగించింది. చేతిలో నిద్రపోతున్న ఉషను మెల్లిగా బేబి సీట్‌లో వుంచాను.
పక్కనే వున్న బాగ్ భుజాన వేసుకుని, ఎవరికీ ఎటువంటి డిస్టర్బెన్స్ కలిగించకుండా బయటకు వచ్చేశాను. నా వెనుక, ఎవరో నాతోబాటు రాబోయి మానేశారా అన్న భావన కలిగింది ఎందుకనో-
కొద్దిగజాల దూరంలో వున్న లేడీస్ రూమ్‌లోకి వెళ్లాను. అదృష్టవశాత్తు అది ఖాళీగా వుంది. ఒక్కసారి గోడకు ఆనుకుని నన్ను నేను సంభాళించుకోవాలని ప్రయత్నించాను. కాని అది నాకు సాధ్యపడలేదు. గత రెండు మూడు రోజులుగా, అదిమిపెట్టుకున్న భావోద్వేగాలు కట్టలు తెంచుకున్నాయి. అందరి ముందు, ముఖ్యంగా వౌళి ముందు చూపుతున్న మేకపోతు గాంభీర్యం అంతా కరిగిపోయింది. కన్నీళ్లయిపోయింది. ఎటువంటి అదుపు అడ్డు లేకుండా యధేచ్చగా కారి ప్రవహించసాగాయి.
కొద్ది నిముషాల్లో గుండెలో బరువు తగ్గినట్లనిపించింది. చల్లటి నీళ్లతో మొహం కడుక్కున్నాను. అయినా కళ్లు, ముక్కు ఎర్రగా కనిపిస్తూనే వున్నాయి.
బలంగా శ్వాస వదిలి రూమ్ బయటకు వచ్చాను. డాక్టర్స్ అంతా కారిడార్‌లో నుంచుని మాట్లాడుకుంటున్నారు. నేను అందరికీ ఒకేసారి నమస్కరించాను. ‘ఐ డోన్డ్ హౌ టు థాంక్ యు ఆల్’ అన్నాను. ఎర్రపోయిన నా ముఖం డాక్టర్స్ దృష్టి దాటిపోయిందని నేను అనుకోను.
డా.వాకర్ నాకు దగ్గరగా వచ్చి నా చెయ్యి అందుకున్నాడు, షేక్‌హాండ్ ఇవ్వడానికి.
‘‘యువర్ అబ్జర్వేషన్ రుూజ్ అబ్‌సల్యూట్‌లీ రైట్’’ అన్నాడు.
చిరునవ్వుతో ఆయన వంక చూశాను. రఘురాం కళ్లు నామీదే వున్నాయని నాకు తెలుసు. అవి తప్పించుకోవడానికే నేను ప్రయత్నిస్తూనే వున్నాను.
పక్కనే వున్న న్యూరాలజిస్టు అన్నాడు, ‘వుయ్ ఆర్ వెరీ ప్లీజ్‌డ్ విత్‌ది ప్రోగ్రెస్’ అన్నాడు.
తల ఊగించాను. ఏమనాలో తెలియక కొద్ది నిముషాలు నిశ్శబ్దంగా నడిచాయి. అంతలో డా మార్టిన్ అన్నాడు ‘వుయ్ హార్డ్ యు ఆర్ ఏ గ్రేట్ కంట్రిబ్యూషన్ టు ది ఫ్రీ వరల్డ్. ఐ వుడ్ లవ్ టు రీడ్ దెమ్’ అన్నాడు. -ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి