డైలీ సీరియల్

ట్విన్ టవర్స్-110

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నో.. నో అదేం లేదు. మీ అందరి ప్రొఫెషన్‌మధ్య అది నథింగ్. జస్ట్ పాసింగ్ క్లౌడ్స్’’ అన్నాను.
‘‘పాసెస్ క్లౌడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది వరల్డ్ టు గ్రోత్’’
ఒక్క చిన్న పొగడ్త, ఎప్రిసియేషన్ ఎటువంటి సందర్భాలలోననా, మనసుకు వూరట కలిగిస్తుంది. తిరిగి లోపలకు వెళ్లాను. వౌళి ఉషను ఎత్తుకుని తేజాకి చూపిస్తున్నాడు.
నేను రాత్రి గమనించినది ఏమీ తప్పుకాదు. ఉషను చూడంగానే ‘తేజాలో ప్రేమ, పాలు పొంగిపోయాయి.
మూర్తిగారు లేచి ముందు కారిడార్‌వైపు వెళ్లాడు. డాక్టర్స్‌కి థాంక్స్ చెప్పడానికి. వౌళి కూడా ఆయన వెనుకే వెళ్లాడు, చేతిలో బేబితో సహా.
ఉష హాయిగా నోట్లో వేలు వేసుకుని వాళ్ల నాన్న చేతుల్లో ఆడుకుంటూ అటూ ఇటూ చూస్తోంది. కొద్దిసేపుముందు రూఫ్ లేపేసిన పిల్ల అంత మామూలుగా వుంటే డాక్టర్స్ కూడా దానివంకే చిరునవ్వుతో చూస్తున్నారు.
డాక్టర్స్ వెళ్లిపోయారు. నేను కూడా ఉషని తీసుకుని వెళ్లిపోతానని లేచాను. లత కూడా నాతో తోడు వస్తానని లేచింది.
‘‘లేదు లతా! నేను వెళ్లగలను. నువ్వు కాసేపు ఇక్కడ వుండు. మీ అక్కతో మాట్లాడు. విన్నావుగా. డాక్టర్స్ చెప్పింది. బయట కబుర్లు ఏవీ మాట్లాడకు. హాయిగా మీ కాలేజ్ కబుర్లు చెప్పు’’ అన్నాను.
నన్ను టాక్సీ ఎక్కించడం కోసం వౌళి ఉషని బేబి సీట్‌లో పెట్టి నాతో బయలుదేరాడు.
క్రిందకి దిగిన ఎలివేటర్ డోర్ తెరచుకుంది. ఎదురుగా ఎలివేటర్‌తో పైకి వెళ్లడంకోసం నుంచుని ఉన్నాడు రఘురాం.
ఆశ్చర్యంగా మావంక చూశాడు. ఒక్కసారి గుటక వేశాడు. క్షణకాలం మాటలకు తడుముకున్నాడు.
నాకు అప్రయత్నంగా పెదవులమీదకు నవ్వు వచ్చింది. మహా మేధావులు కూడా మాటలకు వెతుక్కుంటున్నారన్నమాట అనుకున్నాను.
పోయిన మూడు రోజులుగా అతన్ని చూశాను. అందరి డాక్టర్స్ మధ్య, విష్ చేయడం తప్ప, నేను అతన్ని పలుకరించలేదు. అతను నన్ను పలుకరించలేదు.
మధ్యమధ్య ఒక రెండుసార్లు వౌళితో క్లుప్తంగా ఏదో అనడం తప్ప.
ఎలివేటర్ పైకి వెళ్లిపోయింది, రఘు ఎక్కకుండానే! ఆగిపోయిన అతనితో మాట్లాడకుండా వుండడం సరికాదని అనిపించిందేమో వౌళికి. తల పంకిస్తూ విష్ చేశాడు.
‘డా.విల్సన్ బోస్టన్‌కి వెళ్లిపోతున్నాడు. అతన్ని పంపడం కోసం వచ్చాను’ అన్నాడు రఘురాం.
‘‘అమ్మా, బేబి ఇంటికి వెళ్లిపోతున్నారు’’ అన్నాడు వౌళి.
‘‘ఏమైనా హెల్ప్ కావాలా?’’
తల అడ్డంగా వూపాడు వౌళి ‘యు హావ్ హెల్ప్‌డ్ ఎ లాట్, థాంక్ యూ’ అన్నాడు వౌళి.
అందుకు సమాధానం చెప్పకుండా ‘యువర్ అబ్జర్వేషన్ రుూజ్ రిమార్కబుల్’ అన్నాడు నా వంక చూచి.
‘‘్థంక్స్ ఫర్ యువర్ హెల్ప్’’ అన్నాను.
ఎలివేటర్ తెరచుకుంది మళ్లీ. రఘు లోపలకు వెళ్లాడు. ‘‘ఇంతమంది ఇన్నిసార్లు థాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు ’’ అన్నాడు.
ఎలివేటర్ తలుపులు మూసుకున్నాయి. నేను ఉష ఇంటికి వెళ్లిపోయాం.
ఆ టాక్సీ నడిపేవాడు భారతీయుడే. నన్ను చూడగాంగానే హిందీలో పలకరించాడు. నా తాలూకు వారికెవరికయినా మొన్నటి బీభత్సంలో దెబ్బలు తగిలాయా అని.
అవునన్నాను.
ఆ టవర్స్ పడిపోయిన రోజు అతను ఆ చుట్టుప్రక్కలే వున్నాడుట. కళ్ళతో చూచిన ఆ భయంకరమైన దృశ్యాన్ని మరచిపోలేకుండా ఉన్నాను అన్నాడు. ఎంతమందినో ఆ రోజంతా టాక్సీలో హాస్పిటల్‌లో దింపుతూనే వున్నాడుట. ఆ టవర్ కూలిపోతూ విసిరేసిన ధూళి చెత్తకు ఎంతమందికి చిన్న పెద్ద దెబ్బలు తగిలేయో అవిరామంగా ఆ రోజు డబ్బు తీసుకోకుండా రాత్రిదాకా ఎంతోమందిని టాక్సీలో దింపాడుట.
అన్నీ చెప్పి ‘‘బ్రతుకుతెరువు కల్పించి కడుపునింపుకొని రుూ దేశంమీద దెబ్బకొట్టడం, కన్నతల్లిని కొట్టినట్లే- ఈ కష్టానికి నా తరఫున సాయంగా టాక్సీ సర్వీసుని చేస్తున్నాను. రెడ్‌క్రాస్‌కు వెళ్లి రక్తం ఇచ్చి వచ్చాను’’ అన్నాడు.
ఆ రోజు ఉదయం టీవీలో, దేశం నలుమూలలా, ఉద్యోగం నుంచి శెలవ తీసుకుని మధ్యలో వెళ్లి రక్తాలు ధారపోసి దానం ఇస్తున్న వేలమందిని చూపిస్తున్నారు.
ఎంత దేశభక్తి! అనుకున్నాను.
టాక్సి అపార్టుమెంటు చేరింది. డబ్బు ఇచ్చేసి మరో 20 డాలర్లు ఇచ్చాను. ‘‘వద్దు మాతాజీ’’ అన్నాడు.
‘‘నీకోసం కాదు, నువ్వంటే ఉచితంగా చాలామందికి సహాయం చేశావు. కాని పెట్రోలు ఉచితంగా రాదు కదా’’ అన్నాను.
నమస్కరించి జేబులో పెట్టుకున్నాడు. ఉషని వుంచిన బేబీ సీటును ఎలివేటర్ దాకా తీసుకువచ్చాడు. అపార్టుమెంటులోకి రాంగానే సోఫాలో చతికిలపడ్డాను.
మనసు తేలికయింది. శరీరం అలసిపోయింది. శక్తి అంతా హరించినట్లయింది.
లేచి హాయిగా స్నానం చేశాను. ఉషకి కూడా చేయించాను.
అందరూ సరిగా భోజనం చేసి మూడు రోజులవుతుంది. అందుకని అందరికీ భోజనం సిద్ధం చేశాను.
టీవీలో ట్విన్ టవర్స్ విధ్వంసం పదే పదే చూపిస్తూనే వున్నారు. జాడ తెలియని ఆప్తుల ఫొటోలు ఆ చుట్టుపక్కల కనిపించిన ప్రతి స్తంభానికీ, గోడకి అంటిస్తున్నారు. ఏమయినా జాడ తెలుస్తుందేమోనని అత్యాసతో ఎదురుచూస్తూనే వున్నారు. అదెంత నరకమో స్వయంగా అనుభవించిన నా మనసు వాళ్ళందరికోసం తపించి పోయింది. జీవితంలో అన్ని ప్రశ్నలే! సమాధానాలు దొరకవు.
సిమెంట్ అంతా కొట్టుకుపోయి, విపరీతమైన వేడికి వంగిపోయి, కురుసభలో తలవంచుకున్న సభ్యుల్లా వుంది టవరు. టెలివిజన్‌లో చూసింది ఓ సినిమా కాదు. నూటికి నూరుపాళ్లు పచ్చి నిజం అని చెప్తోంది. ఆ బిల్డింగ్స్ కట్టిన ఇంజనీర్లు అన్ని విషయాలలోనూ తగు జాగ్రత్త వహించి కట్టారుట.
-ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి