డైలీ సీరియల్

ట్విన్ టవర్స్-111

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆఖరికి ఆ భవనాలు ఎప్పుడయినా కూలిపోవడం సంభవిస్తే పక్కకి పడిపోయి పరిసరాల భీభత్సం కలగచేయకుండా తమలోనే కూలిపోయేటట్టుగా కట్టారుట. అలా అయితే చుట్టూ వున్న ప్రపంచానికి హాని, నష్టం కలుగకూడదని.
కాని ఆ ప్రణాళికలో పనిచేసిన వారెవరికీ, ఒక రోజు విమానం ఒక మారణాయుధం అవుతుందని గుద్దిన విమానంలోంచి, వేల వేల గాలన్ల పెట్రోలు ఆ భవనంమీద పడి మంటలు చెలరేగగలవని ఊహించలేదు.
అదే జరిగింది ఇప్పుడు. ఆ మంటల వేడికి భవన కట్టడంలో, సిమెంట్ వెనుక నిలిచి ఊతమిచ్చే ఇనుప కడ్డీలు కరిగి, భవనాలను కూల్చేశాయి.
మానవ మేధను కించపరచడమే ప్రకృతి పరిహాసమా?
మళ్లీ ప్రశ్నలే!
టీవీ స్క్రీన్ క్రింద భాగంలో వరుసగా, మరణించిన వారిలో, ఆచూకీ కనుక్కోబడిన పేర్లు వరసగా వేస్తున్నారు. అందులో భారతీయుల పేర్లు కూడా కనిపించాయి. ఒకరేమిటి ఆహుతయిన వారిలో క్రిస్టియన్స్, జూస్, హిందువులు, ముస్లిమ్స్ అన్ని మతాల వారి పేర్లు కనిపిస్తున్నాయి.
న్యూయార్క్ నిజంగా ఒక ‘మెల్టింగ్ పాట్’ రుూ ప్రాంతంలో. ప్రపంచంలో ప్రతి దేశస్థుడు తలదాచుకుంటున్నాడు. పొట్ట నింపుకుంటున్నాడు. అలాటి గడ్డనే కొట్టాలనుకోవడం ఎలా జరిగింది. మళ్లీ ప్రశ్నలే!
దూరంగా వుండి అమెరికాని గురించి తలచుకున్నప్పుడు ఏదో ఒక గొప్ప దేశం అని తప్ప నాకు వేరే విధంగా ఆలోచించలేదు. కాని నేను కూడా ఇక్కడికి వచ్చి నెలలు గడుపుతుంటే తెలుస్తోంది.
లాండ్ ఆఫ్ ఆపర్చ్యునిటీ అంటే ఏమిటో, లేకపోతే భాస్కర్ లాంటి కుర్రాడు పౌరసత్వం కూడా లేనివాడు వ్యాపారాలు చేస్తున్నారు. అందుకు దేశం అవకాశం కలిగిస్తోంది. మన దేశంలో ఒక రాష్ట్రంనుండి మరో రాష్ట్రంలో నిలదొక్కుకోవాలంటేనే కష్టం.
ఆ అవకాశం వుపయోగించుకుంటున్న భారతీయులు అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకువెడుతున్న భారతీయులు, రుూ విధ్వంసంలో కూడా హతులయ్యారు.
బలంగా శ్వాస విడుస్తూ కళ్లు మూసుకున్నాను. బిల్డింగ్‌లోకి దూసుకుపోతున్న విమానమే కనిపిస్తోంది. భగభగ మండే మంటలు. ఆకాశాన్ని కప్పేసిన పొగలు, విసిరేస్తున్న ధూళి. దూకుతున్న మనుషులు. ఏ ఒక్క దృశ్యం దాటిపోవడంలేదు.
అంతలోనే ఎక్కడ పడితే అక్కడ దెబ్బలు తగిలి అచేతనంగా పడివున్న తేజా!
ఒకటేమిటి మనోఫలకం మీద టెలివిజన్ స్క్రీన్ అయిపోయింది.
రాత్రికి అందరూ తిరిగి వచ్చారు. అందరి వదనాలలోను ఒక రిలీఫ్ కనిపిస్తోంది. తేజాకి ఇంకాచాలా గడ్డురోజులు ముందున్నాయి. కాని ఒక ముఖ్యమైన టైం ఇవాళ.
లత ఒక్కసారి నన్ను గట్టిగా కౌగిలించుకుంది. యూ ఆర్ యాన్ క్లవర్ ఆంటీ అంటూ ఊపేసింది. రుూ అమెరికాలో పుట్టిన పిల్లలకు భావోద్వేగాలను దాచుకోవడం చేతకాదు.
‘‘అందరూ అదేమాట. ఇందులో నేను చేసింది ఏముంది. రుూ క్రెడిట్ అంతా ఉషది’’ అన్నాను. పాపం చాలా కష్టపడి ఏడ్చింది’’ అన్నాను చిరునవ్వుతో.
డా.మార్టిన్ ఏమన్నారో తెలుసా? ఉష ఏడుపు, మీ పాట, పక్కన వౌళి- అంతా అక్కకు ఇంట్లో వున్న భావన వచ్చింది. తను క్షేమంగా వున్నానన్న ఫీలింగ్ వచ్చింది. అందుకే కళ్లు తెరిచింది అన్నాడు.
మనసులో నమస్కరించాను. కారణం ఏదయితేనేం- తేజ బాగుంది. అదే కావాలి. సావిత్రి కూడా సంతోషంగా చేతులు పట్టుకుంది.
‘‘మనం అంతా అదృష్టవంతులం సావిత్రి’’ అన్నాను.
తల ఊపింది. ఏమీ మాట్లాడలేక తల ఎత్తి మూర్తిగారి వంక చూడదలచుకోలేదు. ఆయన కళ్ళల్లో కనిపించే ఎడ్మిరేషన్, ఎప్రీసియేషన్ చూడదల్చుకోలేదు. ఇది నా ప్రతిభ కాదు, కేవలం భగవత్ నిర్ణయం.
అందరూ భోజనాలకు కూర్చున్నారు. ‘‘తేజా ఏమంది. ఏమైనా మాట్లాడిందా మామూలుగా’’ అన్నాను.
‘‘ఐ నీడ్ ఎ హెయిర్ కట్’’ అని చెప్పింది అని నవ్వాడు వౌళి. నేనూ నవ్వాను. వాళ్లు నలుగురు ఉషను చూసుకుంటున్నారు. నేను గదిలోకి పడుకోవడానికి వెళ్లిపోయాను.
మనసు ద్వంద్వ భావాలతో సతమతమవుతోంది. ఒక పక్క తేజాని గురించి సంతోషంగా వుంది. మరోపక్క కలవరపడుతోంది.
అందుకు కారకులెవరో తెలుసు. కాని కారణం తెలియడంలేదు.
పోయిన మూడు రోజులు రఘురామ్‌ని చూచాను. మాట్లాడలేదు. అతని ఆగమనం- మనసును కలవరపెట్టిందో లేదో ముందు తెలియదు. తేజామీద వున్న ఆందోళన అన్నింటినీ కప్పేసింది.
ఇప్పుడు ఆందోళన కొంచెం తగ్గేటప్పటికి మిగిలిన భావాలు పైకి వస్తున్నాయి.
కాని ఎందుకు? మళ్లీ ప్రశే్న!
ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. అసలు ఇద్దరిమధ్య ఏం మిగిలింది. అనుబంధాలు ఏనాడో అడుగంటాయి. చట్టాలు ఎప్పుడో విడదీశాయి. మరి ఇప్పుడేమిటీ రెస్ట్‌లెస్‌నెస్!
కోపమా కక్షా ఏమిటిది.
ఏమో తెలియడంలేదు. కాని ఒకటే అశాంతి.
ఎన్నో ఏళ్ళ క్రితం చిన్మయానందస్వామి ఇచ్చిన సలహా గుర్తుకు వచ్చింది.
చాలా ఏళ్ళ క్రితం చిన్మయానందస్వామి మా కాలేజీకి వచ్చారు. ఆయన విద్యార్థులను ఉద్దేశించి ఉపన్యాసం ఇవ్వమని కోరారు.
ఆ రోజు ఆయన భోజన సదుపాయాలు చూడాల్సిన బాధ్యత నా మీద ఉంచారు.
ఆయన భోజనం పూర్తిచేస్తూనే నా వంక చూచారు. ‘‘వాట్స్ బాదరింగ్ యూ’’ అన్నారు.
ఆశ్చర్యంగా ఆయన వంక చూచాను. నాలో ఏం చూచారా ఆ ప్రశ్న వేయడానికి? అన్న ప్రశ్న నాలో ఉదయించింది.
నాకు సమాధానం దొరకకుండానే ఆయనే మళ్లీ అడిగారు.
‘‘తెలియదు స్వామి గతం ఎప్పుడు గుర్తుకు వచ్చినా, మనసు చాలా కలవరపడుతుంది’’’ అన్నాను. -ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి