డైలీ సీరియల్

ట్విన్ టవర్స్-112

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అయితే గతం గుర్తుతెచ్చుకోకు’’ అన్నారు చాలా తేలిగ్గా.
‘‘అదే సాధ్యపడటంలేదు’’ అన్నాను. మా ఇద్దరి సంభాషణ అంతా ఇంగ్లీషులోనే సాగుతోంది.
ఆయన నా ముఖంలోకి చూస్తూ ‘‘నిన్న ఏ రంగు చీర కట్టుకున్నావో, ఏం కూర వేసుకుని భోజనం చేశావో గుర్తువున్నదా?’’ అడిగారు నా ముఖంలోకి గుచ్చి చూస్తూ.
లేదన్నట్లు తల ఊగించాను.
‘‘వై నాట్? ఇరవై నాలుగు గంటలసేపు కట్టుకున్న చీర గుర్తుకు లేదు. శరీరంకి శక్తినిచ్చే భోజనం గుర్తుకు లేదు?’’ అయన నన్నో దోషిని అడిగినట్లే అడిగారు.
సమాధానం ఆయన నుండే రావాలన్నట్లు వౌనంగా ఉండిపోయాను.
‘‘ఏ సంఘటన అయినా, మనం ఇచ్చే ప్రాధాన్యతను బట్టే మన మనసులో చోటుచేసుకుంటుం. నిన్ను బాదర్ చేస్తున్న సంఘటనలలో నీ బాధ్యత నిమిత్త మాత్రమే అని అనుకోగలిగితే బాధ తగ్గిపోతుంది’’ అన్నారు.
ఎంత క్లుప్తంగా, ఎంత చక్కగా చెప్పారు. అందుకే ఆయన స్వామి అయ్యారు. కానీ పాటించడం చెప్పినంత సులువుకాదు.
‘‘నిన్ను ఏది బాధిస్తోందో దాని గుర్తులు కళ్లముందు నుంచి తీసేయి. అవుట్ ఆఫ్ సైట్. అవుట్ ఆఫ్ మైండ్. అది కేవలం ప్రాక్టీసుతోనే వస్తుంది. నథింగ్ రుూజ్ ఇంపాజిబుల్. అది నువ్వు మాత్రమే చెయ్యగలవు. డోన్ట్ ఎక్స్‌పెక్ట్ సమ్ వన్ టు రిమూవ్ యువర్ పెయిన్ అన్నారు.
ననే్నం బాధిస్తోందని అడగలేదు. అందులో నీ పాత్ర ఎంత అని అడగలేదు. ఏం జరిగిందో, ఎవరు బాధించారో అడగలేదు. ఆయన చెప్పాల్సింది అయిపోయింది. కేవలం నేను అర్థం చేసుకోవాలి, అంతే!
వేడి వేడి కాఫీ రుచి చూచి హా! సౌత్ ఇండియన్ కాఫీ. యు గెట్ నో వేర్ ఇది వరల్డ్ లైక్ దిస్ అన్నారు.
నా మనసు చాలా ఆహ్లాదాన్ని పొందింది. ఏదో పెద్ద బరువును వంటిమీద పాకుతున్న చీమను తీసేసినట్టుగా అనిపించింది. ఆ సాయంత్రం ఇంటికి రాంగానే టేబుల్‌మీద వున్న రఘు ఫొటో, పెళ్లి ఆల్బం, రఘు దగ్గర నుండి వచ్చిన ఉత్తరాలు అన్నిటిని తీసి ఒక పెట్టెలో పెట్టి అటకమీద పెట్టాను. ఆ రోజునుంచి ఎప్పుడు పాత జ్ఞాపకం ముందుకు రాబోయినా, వెంటనే మరొక పనిని కలిపించుకోసాగాను. కానీ ఆ తరువాత జ్ఞాపకాలు రావడం మానలేదు. బాధించటం మానేశాయి. కాని వాస్తవంలో కనిపించేటప్పటికి, మళ్లీ కలవరం పెట్టడం మొదలైంది.
అసలు మళ్లీ అతను ఎందుకు కనిపించాల్సి వచ్చింది. అందులోనూ ఇలాంటి సందర్భంలోనా!
అశాంతిగా కళ్ళు మూసుకున్నాను. తలుపు తీసిన చప్పుడయింది.
లోపలకు వౌళి వచ్చాడు. వచ్చి మంచంమీద కూర్చున్నాడు. అంటే ఏదో మాట్లాడడానికి వచ్చాడన్నమాట. కొద్ది నిముషాలు వౌనంగా గడిచాయి.
‘‘రఘురాంగారి తాలూకు ఎవరో చచ్చిపోయారుట. ఇవాళే తెలిసిందట’’
విని ఊరుకున్నాను.
‘‘ఎవరయి ఉంటారో నీకు తెలుసా’’ అన్నాడు. తల వూగిస్తూ అన్నాను. తెలియదు. తెలుసుకోవాలని కూడా లేదు నాకు’’ అన్నాను.
మరికొన్ని క్షణాలు వౌనంగా గడిచాయి. నా చేతిమీద చెయ్యి వేసి బలంగా నొక్కాడు. లేచి బయటకు వెళ్లిపోయాడు. నేను మాట్లాడే మూడ్‌లో లేననిపించింది వాడికి.
బలవంతంగా కళ్లు మూసుకొన్నాను, నిద్రపోవాలని ప్రయత్నిస్తూ!
రెండు రోజులు గడిచాయి. ఇవాళ తేజా కాలుకు ఆపరేషన్ చేశారు. కాలు క్రింద భాగంలో చాలా చోట్ల విరిగింది. కొంత భాగం అయితే చితికినట్లు అయిపోయింది. కాలు ఎలా వస్తుందో ఏమీ చెప్పలేమన్నారు. కొంచెం హీలింగ్ మొదలయితే కాని ఏమీ చెప్పలేమన్నారు.
మొదట్లో అసలే తీసివేయాలనుకున్నది మాత్రం విరమించుకున్నారు.
సావిత్రి, మూర్తిగారు ఒకసారి డిట్రాయిట్ వెళ్లిరావాలని నిశ్చయించుకున్నారు. లతకి కూడా క్లాసులు మొదలయినాయి. వెళ్లానుకుంది. నేను హాస్పిటల్‌కు వెళ్లాను.
తేజా చాలా అప్‌సెట్‌గా వుంది. సావిత్రి, వౌళి మాటలు ఆ అమ్మాయిని ఏ విధంగానూ సమాధానపరచడం లేదు. పైగా కోపం కూడా వచ్చేస్తోంది. ఒక పక్క నొప్పి, మరోపక్క ఏం జరుగుతుందో అని భయం. విడిచిపెట్టని జ్ఞాపకాలు. హాస్పిటల్ వాతావరణం. అన్నీ తేజాని కృంగదీస్తున్నాయి.
నేను వచ్చానని నన్ను పలకరించలేదు. ఉష ఎలా వుందని అడగలేదు.
ఒకటే ఏడుస్తోంది. చాలా డిప్రెస్‌డ్‌గా వుంది. చాలాసేపు వౌనంగా చూస్తూ ఉండిపోయాను.
ఇంతలో మూర్తిగారు లేచి వెళ్లారు కాఫీ తీసుకువస్తానని.
నేను వెళ్లి తేజా పక్కన కూచున్నాను. ఎందుకనో నేను వచ్చి కూచున్నాక, అంతవరకూ అక్కడే కూర్చున్న సావిత్రి, లత లేచి వెళ్లారు. దాదాపు గంటనుంచి ఇదే విధంగా వున్న పరిస్థితికి ఏం చెయ్యాలో అర్థం కాకుండా వుంది వాళ్లందరికీ.
‘‘తేజా!’’
తల ఎత్తి కూడా నా వంక చూడలేదు. ‘‘అసలు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో నాకర్థం కావడంలేదు’’ కొంచెం సీరియస్‌గా!
‘‘ఇది సంతోషించాల్సిన సమయం, ఏడవాల్సిన సమయం కాదు’’ అన్నాను.
‘‘నాకు బ్రతకాలని లేదు అత్తయ్య! జీవితమంతా హాండికాప్‌తో నేను బతకలేను, చచ్చిపోతాను’’ అంటూ ఏడ్చేసింది. ‘ఐ విల్ కిల్ మైసెల్ఫ్’’.
‘‘ఎవరు చెప్పారు నువ్వు కుంటిదానివి అయిపోతున్నావని’’.
‘‘రుూ ఆపరేషన్ ఎంత సక్సెస్ అవుతుందో ఏమీ చెప్పలేమంటున్నారు’’. ‘‘ఎంతవరకు ఫెయిల్ అవుతుందో కూడా చెప్పలేదుగా!’’ అన్నాను.
తేజా మాట్లాడలేదు.
డాక్టర్స్ ఏమీ దేవుళ్లు కాదు, భవిష్యత్తు చెప్పడానికి అన్నాను.
‘‘తేజా మాట్లాడలేదు’’. ‘‘ఆపరేషన్ జరిగాక, పైవారం డాక్టర్ వచ్చి ఏం జరుగుతుందో అంతా చెప్పాక, ఒకవేళ నిజంగానే కుంటిదానివి అయిపోతే అప్పుడు ఏడుద్దువుగాని. అంతవరకు ఏడవకు’’ అన్నాను. -ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి