డైలీ సీరియల్

ట్విన్ టవర్స్-113

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తేజా మొహం తిప్పుకుంది. కొంచెం కోపం కూడా వచ్చిందేమో, నా మాటలకు.
‘‘ఔను తేజా! కన్నీళ్లు చాలా విలువైనవి. వాటిని భయాలకు, అనుమానాలకు వృధా చేయకూడదు.
తేజా! నేను భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేను. కాని ఒకటి చెప్పగలను. నువ్వేం చేయాలో చెప్పగలను అన్నాను. మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థించు. నీ కాలు పోకూడదని, ఏమీ జరగకూడదని. ఒకవేళ అదే జరిగితే ఎదుర్కోగలిగే మనోధైర్యం ఇవ్వమని ప్రార్థించు’’ అన్నాను.
‘‘్భగవంతుడే వుంటే నేనిలా మంచంలో పడి వుండేదాన్ని కాదు’’.
తేజా వంక చూచాను. సూటిగా నా చూపులు తట్టుకోలేనట్లు మొహం పక్కకి తిప్పుకుంది.
తేజా! క్రిందటివారం ఏం జరిగిందో నీకు గుర్తుంది కదా! 35వేలమంది పనిచేసే భవనాలు కూలిపోయాయి. 2 గంటల్లో 3 వేలమంది చచ్చిపోయారు. కూలిపోయిన రాళ్ల క్రింద వేలాదిమంది పడిపోయారు. 56మందిని మాత్రం ప్రాణాలతో బయటకు తీయగలిగారు. అందులో నువ్వు ఒక్కత్తెవు. ఆ విషయం నీకు తెలుసా!
స్టాటిస్టిక్స్ నేర్చుకున్నావుగా నీ మొగుడి దగ్గర. నీ బ్రెయినంతా కంప్యూటర్! లెక్కించి చూడు. నువ్వు బతికి బైటపడటానికి ప్రాబబిలిటీ ఎంతో కంప్యూట్ చేయ్యి. అపుడు చెప్పు భగవంతుడు ఉన్నాడో లేడో.
‘‘నాకు చాలా భయం వేస్తోంది. కళ్ళు మూసుకుంటే భయం. భవిష్యత్తు తలచుకుంటే భయం. రుూ భయంతో ఎలా బతకగలనా అనిపిస్తోంది’’ అంది గాద్గదికంగా.
‘‘్భవిష్యత్తును గురించి ఆలోచించకు. తలచుకోకు. నీ భయం ఒక నాచురల్ రియాక్షన్. దాన్ని గురించి ఎందుకు వర్రీ అవుతావు. ఇంట్లో కూచుని టెలివిజన్‌లో చూచిన నాకే కళ్ళు మూసుకుంటే అవే దృశ్యాలు వెంటాడుతున్నాయి. మరి నీకు? ప్రత్యక్షంగా చూచావు, అనుభవిస్తున్నావు. నీతో పనిచేసే తోటి ఉద్యోగులను కోల్పోయావు. నువ్వు భయపడటం సహజమయిన విషయం. రోజు రోజుకు అది సన్నగిల్లుతుంది. నీ భయంతోపాటు నిన్ను వెనకునుంచి ఒక అదృశ్యహస్తం ప్రొటెక్ట్ చేస్తోందని కూడా గుర్తుచేసుకో.’’
నా మాటలు తేజాకి పెద్దగా రుచించడం లేదని నాకు తెలుసు, కాని నేను ఆపదల్చుకోలేదు.
తేజా, నీ బాధ నాకర్థం కావడంలేదని అనుకోకు. గాలి దుమారానికి పెద్ద పెద్ద చెట్లు విరిగిపోతాయి. కాని గడ్డి మొక్కలు వంగిపోతాయి. క్రమంగా లేచి నిలబడతాయి. తాత్కాలికంగా తల వంచుతాయి. మనమంతా కేవలం గడ్డిపరకలం లాంటివాళ్లం. భయానికి తలవంచుకుంటాం, కష్టానికి ఏడుస్తాం. సంతోషాలకు సంబరపడిపోతాం. ఇవన్నీ అందరూ అనుభవించేవే!
తేజా, ఇక్కడ ప్రతిపూటా ఏం జరుగుతోందో నాకు తెలుస్తూనే వుంది. నిన్ను నువ్వు సమన్వయపరచుకోవడానికి కొంత సమయం కావాలి. భయంతో నిద్రపట్టకపోతే బలవంతంగా నిద్రపోవాలని ప్రయత్నించకు. స్లీపింగ్ పిల్స్ మింగకు. ఒక మంచి పాట విను. వౌళిని పక్కన కూచుని కబుర్లు చెప్పమని అడుగు. ఒక మంచి పుస్తకం చదువు. టీవీ చూడు. అంతేకాని నిద్ర ఎందుకు పట్టడంలేదని వర్రీ అవుతూ పడుకోకు. మనసు, శరీరం అలసిపోయినపుడు నిద్ర అదే వస్తుంది. రుూ రోజుల్లో డాక్టర్‌కి వేరే ఆలోచన లేదు. ఏ మాత్రం తేడా వచ్చినా, మందులు గుప్పించేస్తూ వుంటారు. వాళ్ల బాధ్యత తీరిపోయిందనుకుంటారు.
ఏడుపొస్తే ఏడ్చేయ్. వౌళి షర్ట్ తడిసేంతవరకు ఏడ్చేయ్. గుండెల్లో బరువు తగ్గుతుంది. అప్పుడు ప్రశాంతంగా ఆలోచించడానికి ప్రయత్నించు. చచ్చిపోవాలనుంది అని మాత్రం అనుకోకు. అది అంత తేలికయిన విషయం ఏమీ కాదు.
అసలు చావాల్సిన అవసరం ఏమిటో ఆలోచించు. మీ అమ్మా, నాన్న నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. మీ ఆయన నిన్నో ఆకాశానికి ఎత్తేస్తాడు. బాగా చదువుకున్నావు. మంచి ఉద్యోగం చేస్తున్నావు. బుర్రలో కావలసినంత తెలివితేటలు ఉన్నాయి. వీటన్నిటిని తీసి పెట్టే బ్యూటిఫుల్ బేబి వుంది. అన్ని అదృష్టాలను చేతిలో వుంచుకుని బతకాలని లేదంటావా! ఆలోచించు.
తేజా, ఓ మనిషి 80, 90 ఏళ్ళు బతుకితే- ప్రతి ఏడూ, ప్రతిరోజూ సుఖ సంతోషాలే వుండవు. మధ్య మధ్య కష్టాలు కూడా వస్తాయి. అప్పుడు నిలదొక్కుకున్నప్పుడే మనిషి స్థైర్యం తెలుస్తుంది. సంతోషాలు వస్తే ఎగిరి గంతేసి, కష్టం రాగానే కృంగిపోవడం కాదు జీవితమంటే!
ఇప్పుడిది నీ జీవితంలో చాలా కష్ట సమయం. మా అందరకు తెలుసు. ఇప్పుడే ధైర్యాన్ని కూడగట్టుకోవడం ముఖ్యం. అందుకు సహాయపడటానికి మేమందరం వున్నాం. కానీ నీకు కావలసింది మా సహాయం, సానుభూతి కాదు, మనోధైర్యం. అది మందు కాదు ప్రిస్కైబ్ చెయ్యడానికి. నీ భయభ్రాంతులు కొంతకాలం వెంటాడుతాయి.
పీడకలలు పీడిస్తూనే వుంటాయి. దుఃఖం కలుగుతూనే వుంటుంది. ఎవ్వరినీ ఆదుకోలేకపోయామే అన్న గిల్ట్ బాదర్ చేస్తూనే వుంటాయి. ఇవన్నీ నీ బలహీనతలు కాదు. సహజంగా ఉత్పన్నమయ్యే భావాలు. అవి అధిగమించడం నేను లెక్చర్ ఇచ్చినంత తేలిక కాదు. ఆ విషయం మా అందరికీ తెలుసు.
తేజాలో ఎటువంటిమార్పు రావడంలేదు. మళ్లీ నేను అన్నాను.
నువ్విలాగే వున్నావంటే డాక్టర్స్ వచ్చి ఏ మత్తుమందో ఇచ్చి వెడతారు. అది కేవలం తాత్కాలికంగా మభ్యపెట్టడానికే! నిద్రపుచ్చడానికే! బాధను నిరోధించలేదు, నిర్మూలించడంలేదు. అది కేవలం నీవల్లనే జరగాలి.
ఆ పూట నాకు చాలా కోపమనిపించింది. తేజాయే కాదు రుూ రోజుల్లో కుర్రతరం అంతా ఇంతే. వాళ్లకు జీవితం అంటే అంతా సుఖం అనుకుంటారు. కష్టాలు అనేవి కేవలం సినిమాల కోసం అనుకుంటారు.
పరీక్ష తప్పితే ఆత్మహత్య! ప్రేమ రిజెక్ట్ చేస్తే ఆత్మహత్య! తండ్రి కోప్పడితే ఆత్మహత్య! ఉద్యోగం వూడితే ఆత్మహత్య! మొగుడు తిట్టినా ఆత్మహత్యే! వాళ్లు చేసే పని వాళ్లను బంధ విముక్తులను చేస్తుందేమో, కాని ఎంత మందిని బాధపెడుతున్నారన్న విషయం వాళ్లకు తోస్తుందా! ప్రతి చిన్న విషయం ఒక పెద్ద సమస్యే! ఇండియాలో సైకియాట్రిస్టుల దగ్గర అప్పాయింట్‌మెంట్ దొరకడం కష్టమయిపోతోంది. నా చిన్నప్పుడు అసలు అలాంటి వైద్యులే ఉండేవాళ్లు కాదు’’ అనుకున్నాను మనసులో. -ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి