డైలీ సీరియల్

ట్విన్ టవర్స్ 114

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తేజా ఎదురుగా కూర్చున్న నాకు వౌళి కాఫీ తెచ్చి ఇచ్చాడు.
దాన్ని తీసుకుని తేజాకి ఇచ్చాను. ‘‘లే! లేచి కొంచెం కాఫీ తాగు. చాలా అలసిపోయావు’’ అన్నాను.
రుూ కాఫీ కూడా మన జీవితాల్లాంటిదే! ఇందులో పాలు, పంచదార, మనకు కావలసినవిధంగా మనం కలుపుకోవాలి. అప్పుడే రుచి వస్తుంది అంటూ బలవంతంగా తేజా చేతిలో కాఫీ వుంచాను.
తేజా కాఫీ అందుకుని రెండు చేతులలో వుంచుకుని నోటి దగ్గరకు తీసుకువెళ్లింది.
పక్కనే వౌళి నుంచుని ఉన్నాడు.
‘‘ఇంత బాధపడుతున్న నీ భార్యకి కనీసం వేడిగా ఓ కప్పు కాఫీ తెచ్చివ్వాలని కూడా నీకు తోచలేదా!’’ అన్నాను చిరాగ్గా.
వాడికి నా కోపానికి కారణం తెలుసు. అది వాడిమీద కాదు. తేజామీద కాదు. కేవలం నిస్సహాయత. అది వాడిమీదకు తిరిగిందని. అందుకే వౌనంగా ఉండిపోయాడు.
‘‘తను తెస్తాననే అన్నాడు, నేను వద్దన్నాను’’ అంది తేజా కళ్లు వాల్చుకుని. మొగుడికి చీవాట్లు తగలటం ఇష్టంగా లేదు. అందులోనూ తన మూలంగా! అంత కోపంలోను నాకు నవ్వు వచ్చింది. తల మీద చిన్నగా ముని వేళ్లతో కొట్టాను.
‘‘మీ ఆయన్ని ఏమీ అనడంలేదులే, బాధపడకు’’ అన్నాను. ‘‘అయినా, వౌళిని కోప్పడే అధికారం నేనింకా వదులుకోలేదు’’ అన్నాను.
అందరూ నవ్వారు. నేను, తేజా ఉలిక్కిపడ్డాం. ఆ రూమ్‌లో మేము ముగ్గురమే వున్నాం అనుకున్నాం. ఇందాటివరకు.
వెనక్కి తిరిగి చూశాను. డా.వాకర్, డా.మార్టిన్, రఘు అందరూ నుంచుని ఉన్నారు. నర్సు ట్రేలో ఒక ఇంజెక్షన్ పెట్టుకుని నుంచుని వుంది.
‘‘నేనే చెప్పాను. అక్క హిస్టీరిక్‌గా అయిపోతోందని, డాక్టర్‌ని వచ్చి ఒకసారి చూడమని’’ అంది లత.
క్షణం మాట్లాడలేకపోయాను. కొంచెం ఇబ్బందిగా మాట్లాడానేమో అనించింది.
డా.మార్టిన్ దగ్గరకువెళ్లి రెండు చేతులు జోడించాను. మై అపాలజీస్ టు యు. నేనెవరి ప్రొఫెషన్ని తక్కువగా మాట్లాడాలని కాదు నా ఉద్దేశ్యం. కేవలం తేజాకి ధైర్యం కలిగించడానికే అన్నాను.
ఆయన నవ్వుతూ నా చేతులు దింపాడు.
యు ఆర్ వెరీ కరెక్ట్. మేము మా నాలెడ్జి, అంతా ఇన్సూరెన్సుల రూల్స్, గైడ్‌లైన్స్, లీగల్ హద్దుల చట్రంలోనూ బిగిసిపోతున్నాము అన్నాడు. నర్స్ ఇంజెక్షన్ తీసుకుని వెళ్లిపోయింది.
అసహనంగా, చేతిని మెడ మీద వుంచుకుని తలను వెనక్కి వంచుకున్నాను. తేజాలో కొంచెం టెన్షన్ తగ్గిందేమో! నాకు మాత్రం చాలా అశాంతిగా అనిపించి-
‘‘నాకు బతకాలని లేదు. బతకాలని లేదు. ఐ విల్ కిల్ మైసెల్ఫ్’’ తేజా మాటలే చెవుల్లో మ్రోగుతున్నాయి.
లత నా దగ్గరగా వచ్చి రెండు చేతులు చుట్టూ వేసి ‘‘మీరు అమేజింగ్ ఆంటీ, మీ అంత సూటిగా, స్పష్టంగా నేనెప్పటికీ మాట్లాడలేను’’.
అమేజింగ్ ఏం లేదు లతా! ఇది 20 ఏళ్ళుగా చేస్తున్న కృషి. గెలుపులేని పోరాటం, యువతరం ఎంతమంది, అన్యాయంగా, ప్రాణాలు కోల్పోతున్నారో- ఎంతోమందికి అవగాహన లేదు. ఎలా నిరోధించాలో ఎవ్వరికీ తెలియడంలేదు. సక్సెస్ రుూజ్ ద గోల్ ఫర్ లైఫ్. కాని ఫెయిల్యూర్ ఈజ్ పార్ట్ ఇన్ ద పాత్ అని నమ్మించడానికి ఎంత కృషి జరుగుతుందో-
ఇప్పటికి నే సాధించగలిగింది మా కాలేజీలో ఒక్కటి’’ అంటూ నిట్టూర్చాను. నాలో సంఘర్షణ అక్కడున్నవాళ్లకి కనిపించిందేమో! రఘురామ్ తన చేతిలో వున్న కాఫీ లతకిచ్చి నాకిమ్మన్నట్లు సూచించాడు.
లత నావైపుకు వచ్చేలోగానే- వౌళి వచ్చి ఆ కాఫీ అందుకుని నా దగ్గరకు వచ్చాడు. చేతులు మారిన ఆ కాఫీ వంక చూస్తూ తల ఆడించాను వద్దన్నట్లు.
‘‘మంచినీళ్లు తేనా’’ అని అడిగాడు వౌళి.
‘‘వద్దు యిప్పుడు నాకేమీ వద్దు. ఇంటికి వెళ్లాలి. ఉషని చూస్తున్న తేజా సేస్నహితురాలిని పంపించెయ్యాలి. పాపం చాలాసేపటినుంచి మన ఇంట్లోనే వుంది ఉషకోసం’’ అన్నాను, వెళ్ళే ప్రయత్నం చేస్తూ!
‘‘అత్తయ్యా’’ మెల్లిగా వినిపించింది తేజా కంఠం. ఇందాకటి ఆవేశం చాలా తగ్గింది. గొంతు అలసిపోయినట్లుగా ఉంది.
‘‘వెనక్కి తిరిగాను. మీకు కోపం రావడం మొదటిసారిగా చూస్తున్నాను. ఐ యామ్ సారీ’’ అంది.
‘‘లేదు తేజా లేదు! నాకు కోపం రాలేదు. కేవలం బాధేసింది. సూయిసైడ్ ప్రివెన్షన్ కమిటీలో ఏళ్లగా పనిచేస్తున్నాను. ‘ఏ ఒక్కరి నోట నుండీ చచ్చిపోవాలని వుంది’ అన్నమాట రాకుండా కృషి చేస్తున్నాం. ఎందరికో మనస్థైర్యం కలిగించే ప్రయత్నంలో ఓడిపోతున్నాం’’.
‘‘నీనోట ఆ మాట రాంగానే, నా సహనం కోల్పోయింది. నిన్ను నేను అంత గట్టిగా కోప్పడి వుండకూడదు. ఒంట్లో బాగుండనిదానివి’’ అన్నాను నొచ్చుకుంటూ.
‘‘చూడు. ఇందాక నన్నో ప్రశ్న అడిగావు కదా! నువ్వు ఎందుకు బతకాలని!’’
ఇదిగో సమాధానం. ఇక్కడకు రాంగానే యిద్దామని మాటల్లో మరచిపోయాను. ఇవాళే పోస్టులో వచ్చింది అంటూ బాగ్‌లో వున్న ఒక కవరు తీసి తేజాకి ఇచ్చాను.
కవరులోంచి ఫొటో తీసి చూస్తూ ఉండిపోయింది. ‘‘తేజా! మీ అమ్మా నాన్న, చెల్లెళ్ళూ, ఎవరూ నీ జీవితంలోకి రావడానికి నీకు ఏ విధమైన ఛాయిస్ లేదు. కాని వీళ్ళిద్దరూ పూర్తిగా నీ ఛాయిస్. నువ్వు కావాలని నీ జీవితంలోకి తెచ్చుకున్నావు. భాగం పంచుకున్నావు. ఇపుడు నీ జీవితం నీ సొంతం కాదు. వాళ్ల బాధ్యత నీదే!
తేజా కళ్లలో నీళ్లు తిరిగాయి.
ఆ ఫొటో తేజాయే వేసింది. ‘‘వౌళి, ఉషల ఫొటో. ఓ ఉదయం తీసిన ఫొటో. స్నానం చేయిద్దామని ఉష బట్టలు విప్పేసింది తేజా. వౌళి దానిని ముద్దుగా ఎత్తుకుని ఉష చంపలను తన చంపలకు తాకించుకున్నాడు. పక్కపక్కన ఇద్దరి మఖాలతో ఎంత బాగుంది ఆ ఫొటో. వౌళి, ఉష ఇద్దరిలో మార్నింగ్ బద్ధకం తొంగి చూస్తోంది. వౌళి అప్పటికి షేవ్ కూడా చేసుకోలేదు.

-ఇంకా ఉంది

రమాదేవి చెరుకూరి