డైలీ సీరియల్

ట్విన్ టవర్స్-123

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావాలనే ప్రయత్నపూర్వకంగా, హాస్యంగా ఏం ప్రత్యేకత లేదన్నట్లు.
‘‘నీతో ఏమయినా మాట్లాడాడా!’’
‘‘లేదు వదినా! అతను ఇక్కడ చాలా పెద్దవాడు. చాలా పెద్ద డాక్టర్స్‌తో పరిచయం వుంది. తేజాకి సహాయం చేస్తున్నాడు అంతే’’ అన్నాను.
‘‘మంచిదేగా!’’ అంది.
‘‘తేజా కోలుకుంటుంది. ఇంతమంది పెద్ద డాక్టర్స్ చూస్తున్నారుగా. వౌళికి దైర్యం చెప్పు. వాళ్లముందు నువ్వు దిగాలు పడిపోకు’’ అంది.
వూరుకున్నాను.
అవకాశం దొరికినప్పుడు రఘరామ్‌తో మాట్లాడు కల్యాణీ!
‘‘లేదు వదినా. నాకా ఉద్దేశ్యం లేదు. అసలు మాట్లాడాల్సింది కూడా ఏమీ లేదు. తేజా ఇంటికి వచ్చేస్తే అతనిని మళ్లీ కలవాల్సిన అవసరం కూడా వుండదు’’ అన్నాను.
‘‘ఏమీ లేకపోవడమేం! మాట్లాడు’’.
‘‘ఎందుకు వదినా! గతం గతించిపోయింది. నేను మర్చిపోయాను. గతాన్ని వర్తమానంలో తలచుకోవడం అనవసరం. మాట్లాడినా, మాట్లాడకపోయినా, నా స్థిరత్వం దెబ్బతినదు’’.
‘‘నిజమే కల్యాణి. నిజంగా, నీలో స్థిరత్వం ఏర్పడితే, అది ఎటూ చెక్కుచెదరదు. కాని ఏమీ తెలుసుకోవాలని లేదని మాత్రం మభ్యపెట్టుకోకు. ఆ శేష ప్రశ్న నీలో అలా నిలబడిపోయిందని నీకు తెలుసు’’.
‘‘లేదు వదినా. నాకు పాత విషయాలు తెలుసుకోవాలని లేదు. అందుకోసం నేను ఎటువంటి ప్రయత్నాలు చెయ్యను. బంధాలు బంధనాలు కాకూడదు’’ అన్నాను.
‘‘అవునేమో’’ కల్యాణీ.
బంధాలు, భవనాలు శాశ్వతం కావేమో. కొన్ని సంవత్సరాలు పడతాయి నెలకొల్పడానికి. కాని కొద్ది నిమిషాలలో కూలిపోతాయి.
నేనూ వదిన చాలాసేపు మాట్లాడుతూనే వున్నాం. వదిన మాటలు మనసులో తిరుగుతూనే వున్నాయి. నా మనసులో నిజంగా శేష ప్రశ్నలు వుండిపోయాయా? అందుకేనా నాకీ అశాంతి- నాకు నిజంగా ఏమీ తెలుసుకోవాలని లేదు. కాని అంతర్గతంగా ఎక్కడో- ఏదో బాదర్ చేస్తోంది. నన్ను నేను నమ్మించుకోవాలని ప్రయత్నిస్తున్నానా? నిట్టూర్చాను. నిద్రపోవాలని ప్రయత్నించాను.నిద్ర లేచి పద్మ వెళ్లిపోయింది. కాని మళ్లీ భాస్కర్ మరో అమ్మాయితో తిరిగి వచ్చాడు.
భాస్కర్ బాగా దెబ్బతిన్నాడు. స్నేహితుడు చచ్చిపోయాడు. అతని భార్య ఇతనికి బాధ్యత అయింది. ట్విన్ టవర్ ట్రాజెడి మూలంగా మరో కొన్ని ఉద్యోగాలు పోయాయి. వయసులో చిన్నవాడు, నిలదొక్కుకుంటాడు. కాని చాలా వత్తిడి అనుభవిస్తున్నాడు.
‘‘పద్మ మీ సమక్షంలో చాలా ధైర్యం పుంజుకుంటోంది. ఈ కష్ట సమయంలో నిజంగా మిమ్మల్ని కలవగలగటం చాలా మంచి విషయం. అందుకే మీకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుకోవాలని వచ్చాను’’ అన్నాడు.
నవ్వి వూరుకున్నాను. ‘‘గడిచే ప్రతిరోజు గాయాన్ని మాన్పుతుంది’’ అంతే! అన్నాను.
‘‘నేను మీ సహాయం కోరి వచ్చాను’’ అన్నాడు. పద్మకి మీరిలాగే ఇంక కొంతకాలం సహాయం చెయ్యాలి’’ అన్నాడు రెండు చేతులు జోడిస్తూ.
మాట్లాడకుండా అతనివంకే చూస్తూ ఉండిపోయాను.
‘‘ఎవరయినా వర్కింగ్ గళ్స్‌తో పద్మ వుండేందుకు ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా కుదరడంలేదు. మామూలుగా అయితే నా ఇంటికే తీసుకువెళ్ళేవాడిని. నేను ఇంకా వంటరివాడినే’’ అన్నాడు.
‘‘ఆ అమ్మాయికి ఏదయినా పని చూపించగలరేమో చూడండి’’ అన్నాను.
ఆ అమ్మాయి వీసా అందుకుని పనికిరాదండి. అది భర్త ద్వారా వచ్చింది. కేవలం రుూనాటి పరిస్థితుల మూలంగా ఇక్కడ వుంచగలం కాని’’ అన్నాడు
‘‘మీకు ఆఫీసు వుందా’’ అన్నాను.
తల ఊగించాడు.
‘‘రోజూ కాకపోయినా వారంలో ఒకటి రెండు రోజులు మీ ఆఫీసుకు తీసుకువెళ్లండి. కనీసం కొంచెం నలుగురితో కలిసే అవకాశం వుంటుంది. ఏవైనా ఫైలింగ్ లాంటివి అవి చేయించండి’ అన్నాను.
‘‘మంచి సలహా ఇచ్చారు’’ అంటూ వెళ్లిపోయాడు.
తేజా కాలుకు మరో సర్జరీ చేశారు. యిప్పుడు డాక్టర్లు కొంచెం ఆశని రేకెత్తిస్తున్నారు. బాగా ఫిజికల్ థెరఫీతో కాలు మామూలు అయ్యేందుకు అవకాశం కనిపిస్తోందని.
ఒక రోజు ముందుగానే మూర్తిగారు వచ్చారు. సావిత్రి వెనక్కి వుండిపోయింది శశికోసం. వాళ్లిద్దరూ చెరోసారి వచ్చి చూచి వెడుతున్నారు. ప్రతిరోజు పొద్దున రాత్రి, ఫోను చేస్తూనే ఉన్నారు.
పొద్దునే్న మూర్తిగారు వౌళితోనే కలిసి హాస్పిటల్‌కి వెడుతున్నారు. రోజంతా అక్కడే వుండి సాయంత్రం వౌళీతోనే తిరిగి వస్తున్నారు. ఇంటికి రాగానే సావిత్రికి ఫోన్ చేసి పూర్తిగా ఆ రోజంతా ఏం జరిగిందో చెప్తూ వుంటాడు.
ప్రత్యేకించి వినకపోయినా, ఆ సంభాషణ నా చెవులలో పడుతూనే వుంటుంది. ఆ రోజంతా తేజాకి ఎలా జరిగిందో తెలుస్తూనే వుంది. అంతేకాదు రోజు హాస్పిటల్ కబుర్లుకూడా తెలుస్తున్నాయి.
మధ్యమధ్యలో రఘుతో లంచ్ చేస్తున్నారు. ఆయన మాటల్లో రఘుమీద ఎడ్మిరేషన్ తొంగిచూస్తూ వుంటుంది. హి హాజ్ సచ్ ఎ లవింగ్ పర్సనాలిటీ. సావిత్రి అసలు ఆయనతో మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఏ టాపిక్ మాట్లాడినా సరే! సంపూర్తి అవగాహనం వుంది. అలాంటి వ్యక్తులు చాలా కొద్దిగా వుంటారు. అలా రఘు గురించి చెప్పుకుపోతూనే వుంటారు.
నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. రఘుని ఎడ్మయిర్ చెయ్యనివాళ్లు ఎవరైనా వుంటారా! వున్నారంటే అది నేను, వౌళియేనేమో!
ఉష మూలంగా నేను తరచుగా హాస్పిటల్‌కి వెళ్లడంలేదు. ఉషని పద్మతో వుంచి హాస్పిటల్‌కి వెళ్లి వద్దామా అని అనిపించింది ఒకసారి. మళ్లీ అంతలోనే ఆ ఉద్దేశం విరమించుకున్నాను.
మానసికంగా, బలహీనంగా వున్న వాళ్లమీద ఎక్కువ వత్తిడి తేకూడదు. వాళ్లు ఏ క్షణంలో విచక్షణ కోల్పోతారో చెప్పలేము. పాపాయి బాధ్యత ఆ అమ్మాయిమీద పెట్టడం ఉచితమనిపించలేదు. తేజా తిరిగి వచ్చాక, ఎలా వుంటుందో- ఉషని రోజంతా చూస్తూంటే ఎలా వుంటుందో, నిట్టూర్చాను. కొంచెం ఆందోళనగా అనిపించింది. వౌళి ఒక హౌస్ కీపర్ కోసం చూస్తున్నాడు. తేజా ఇంటికి వచ్చేటప్పటికి ఆమెకోసం ఏర్పాట్లు చేయడానికి.-ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి