డైలీ సీరియల్

ట్విన్ టవర్స్-126

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఏమో బాబు ఎంత టెనాసిటీ వుంటే చదవగలరు పెద్దయ్యాక!’ అన్నాను.
వౌళి నా వంక గుచ్చి చూస్తూ! నీలో వుంది అమ్మ- నీకు తెలియదు అంతే! అన్నాడు.
వాడికి నామీద వున్న సదభిప్రాయానికి సంతోషించాను. వాడికి తెలుసు, నేను చిన్నప్పుడు పిహెచ్‌డి చేయాలని ఎంతగా అనుకున్నానో అని.
‘‘ఆంటీగారు’’ అంది పద్మ. ఒక్కసారి ఉలిక్కిపడి, నా ఆలోచనలోంచి బయటపడ్డాను.
‘‘మీ కాలేజీలో నాకు సీటు ఇప్పిస్తారా. మీ దగ్గర వుండి చదువుకుంటాను’’ అంది.
ఆశ్చర్యం అనిపించింది. సంతోషించాను కూడా! కొంచెం కొంచెం బయటపడుతుంది తన విషాదంలోంచి.
‘‘తప్పకుండా! కష్టపడితే నీకు ఏ కాలేజీనయినా సీటు వస్తుంది అని ధైర్యం చెప్పాను.
‘‘ఏ కాలేజీలోనూ కాదు, మీ కాలేజీలోనే చదువుతాను. ఏదైనా కాలేజీలో చదివితే చదువు ఒక్కటే వస్తుంది. మీ కాలేజీలో చదివితే చదువుతోపాటు లోకజ్ఞానం, ఆత్మస్థైర్యం వస్తాయి అంది. పైగా మీతో వుండి చదువుకోవచ్చు’’ అంది.
అమ్మో! తెలివైన పిల్లే! విషాదం మబ్బులా కమ్మేసింది కాని అనుకున్నాను.
ఆ రాత్రి భోజనం చేస్తుండగా, వౌళితో చెప్పాను పద్మతో నా సంభాషణ.
నవ్వాడు. అమెరికాలో కూడా స్టూడెంట్స్‌ని తయారుచేస్తున్నావన్నమాట.
నవ్వి వూరుకున్నాను.
‘‘నీకు హీలింగ్ టచ్ వుంది అమ్మా. ఆ సంగతి నీకు తెలియదు. నీతో మాట్లాడితే ఎవరికైనా ధైర్యం వస్తుంది. తేజాకు నీ మూలంగా ఎంత శక్తి లభిస్తుందో నీకు తెలియదు’’ అన్నాడు.
తల అడ్డంగా వూగించాను. వాడితో ఏకీభవించడం లేనట్లు.
‘‘తేజా శక్తి అంతా నీ కూతురు’’ అన్నాను. మురిపెంగా ఉష వంక చూచాడు. ఎదురుగా డైనింగ్‌టేబుల్ మీదే బేబి సీటులో కూర్చుని వుంది. అటూ ఇటు పెద్ద కళ్ళతో చూస్తోంది. ఇప్పుడు మనుషులు బాగా తెలుస్తున్నారు.
పలకరిస్తే నవ్వులు కబుర్లు వచ్చేస్తున్నాయి.
వౌళి రాత్రి ఇంటికొచ్చాక ఉషని ఒక్క క్షణం కూడా వదలి వుండడు. భోజనం చేటప్పుడు కూడా ఎదురుగా పెట్టుకుంటాడు. తనే నిద్రపుచ్చుతాడు.
ఇక వౌళి ఇంటికొచ్చాక నాకు కాస్త విరామం.
ఆ రోజంతా పద్మ మనసులో మెదులుతూనే వుంది. పాపం ఆ అమ్మాయికి ఎటువైపు మొగ్గాలో అర్థం కావడంలేదు. వంటరిగా వుండాలని లేదు. అలా అని ఇండియా వెళ్లాలని లేదు.
ఆ తరువాత రెండు రోజులు పద్మ వచ్చినపుడల్లా నా వెనక ఏదో పని చెయ్యాలని తాపత్రయపడుతూనే వుంది. తన భవిష్యత్తు గురించి మాట్లాడుతూనే వుంది. నేను కేవలం ప్రేక్షకురాలిగా మిగిలిపోయాను. అన్నిటికంటే రమేష్ మరణం- అందుమూలంగా రాబోయే డబ్బుతో తను జీవించబోతోందన్న సత్యం, ఒక ముల్లులా గుచ్చుకుంటోంది. ఏదో గిల్టీనెస్ వదలడంలేదు.
కొన్ని సమస్యలు సలహాలతో సరిపోవు. సలహాలతోపాటు సహాయం కూడా చెయ్యాలి. నేను ఇప్పుడా పరిస్థితిలో లేను.
తేజా ఇంటికి వచ్చే రోజు దగ్గరపడుతోంది. ఒక విధంగా సంతోషం. మరో విధంగా సంశయం నా చుట్టూ తిరుగుతున్నాయి.
తేజాని తన అనుభవాలను చెప్పమని పేపర్ల వాళ్లు అడుగుతున్నారు. చాలా సందేంచి, సందేహించి చివరకు ఒప్పుకున్నది. వౌళికి పెద్దగా ఇష్టం లేదు. నేను తేజాని నిరుత్సాహపర్చదల్చుకోలేదు. రుూరోజే తేజ విలేఖరులతో ఇంటర్వ్యూ. వౌళి హాస్పిటల్‌కి వెళ్లిపోయాడు. నేను తేజా స్నేహితురాలు మేరీ కోసం ఎదురుచూస్తున్నాను. మేరి తేజా ఆఫీసులోనే పనిచేస్తోంది. ట్విన్ టవర్స్ ట్రాజెడి, చాలామందితోపాటు మేరి ఉద్యోగం కూడా పోయింది. ఇంకా దొరకలేదు. ఉషని చూడటం కోసం వస్తోంది. తేజాకి ఈ మాత్రం సహాయం చేయగలిగితే, ఐ యామ్ థాంక్‌ఫుల్ అనేది.
మేరికి ప్రత్యేకంగా ఉషకోసం ఏమీ చెప్పక్కరలేదు. అన్నీ తెలుసు. మేరీ రాంగానే హాండ్‌బాగ్ తీసుకుని క్రింద వెయిట్ చేస్తున్న టాక్సీ ఎక్కను. నాతోపాటు పద్మని కూడా రమ్మనమని చెప్పాను. అక్కడి సంఘటనలు వినడం పద్మకు కూడా చాలా అవసరం. ఒక్కొక్కరి కష్టాలు తనకొక్కరికి కాదు పైవారికి కూడా వున్నాయంటే ఒకరకపు సపోర్టు వుంటుంది.
హాస్పిటల్‌లో మీటింగ్ హాల్‌లో చాలామంది అప్పుడే వచ్చి వున్నారు. అందులో డ్యూటీలో లేని హాస్పిటల్ స్ట్ఫా చాలామంది వున్నారు వారందరూ పోయిన కొద్దివారాలుగా బాధితులందరికీ సేవలు అందిస్తున్నవారే!
డాక్టర్స్ అడ్మినిస్ట్రేటర్ చాలామంది వచ్చారు. ముందు వరుసలో చాలామంది విలేకరులు కూడా వున్నారు. గుమ్మంలోకి వెళ్లంగానే తేజాకి వైద్యం చేస్తున్న డాక్టర్స్ కనిపించారు.
నన్ను చూడంగానే ముందువరుసలో కూర్చున్న డా. రఘురామ్ లేచి నుంచున్నాడు. అతనితోపాటు డా.వాకర్ వాళ్లు కూడా నుంచున్నారు.
నేను లోపలకు రాంగానే, రఘురాం తన పక్క కుర్చీలోకి జరిగి నాకు తన సీటు ఇచ్చాడు. నా పక్కనే పద్మ వుంది. తన పక్క కూచోవాలని అనుకున్నాను. క్షణం సందేహించి, వెనుకగా వున్న సీట్‌లో కూచోమని కళ్ళతోనే పద్మకు సూచించాన. తేజా ఇంకా బయటకు రాలేదు. నన్ను చూడంగానే సగౌరవంగా నిలబడిన డాక్టర్ల వంక చూచాను. అందరూ చిరునవ్వుతో పలకరించారు.
రుూ గౌరవం ఎలా వస్తోంది. డా రఘురాంగారి తరఫు వాళ్ళమనా? లేదా తేజా తాలూకు వారమనా? తేజాకి లభిస్తున్న ప్రత్యేకమైన సౌకర్యాలు, వైద్య సదుపాయాలు అంతా రఘురామ్ మూలంగానే అని తెలుసు.
నాకు తెలియకుండానే బలమైన నిట్టూర్పు వెలువడింది. రఘురామ్ ఖాళీ చేసిన కుర్చీలో కూర్చున్నాను. నేను సరిగ్గా కూచోడం జరిగిందనిపించాక, రఘురామ్ నాతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ హాల్‌లో అందరి సంభాషణల మధ్య నాకు సరిగ్గా వినిపించడంలేదు. అతనివైపు కొంచెం తల వంచాను. అతను ఏమంటున్నాడో వినడానికి, అతని మొహం నా చెవులకు దగ్గరగా వుంది.
‘‘ఆర్థోపెడిక్ సర్జన్ చాలా మంచి వార్త చెప్పాడు. ఇవాళ, తేజా కాలు బాగా నయం అవుతోందట. ఫిజియోథెరపీతో చాలా వరకు నార్మల్‌కి రావచ్చు అంటున్నాడు’’’ అన్నాడు. -ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి