డైలీ సీరియల్

ట్విన్ టవర్స్-127

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాకు చాలా సంతోషమనిపించింది. అసలు పూర్తిగా తీసివేయాల్సి వస్తుందేమోననుకున్న కాలు యధాస్థితికి రాబోతుందనుకుంటే చాలా సంతోషమనిపించింది. క్షణం కుంటిదాన్ని అయిపోతానన్న భయం గూడు కట్టుకున్న తేజా మొహం మెదిలింది. ఎంత స్వాంతన పొందుతుందో ఈ వార్త వింటే అనుకున్నాను.
‘‘తేజాకి తెలుసా?’’ అడిగాను.
‘‘ఇంకా లేదు. రుూ రిపోర్టు వాళ్లకి సాయంత్రం అందుతుంది. డాక్టర్ విల్సన్ ఇందాకే చెప్పాడు’’ అన్నాడు రఘురామ్.
నా మనసులో విప్పారిన ఆనందం, నా ముఖంలో స్ఫుటమయ్యి వుంటుంది. రఘురామ్ నావంకే చూస్తూ వుండిపోయాడు.
అప్పుడే తేజా కూర్చున్న వీల్‌చైర్ తోసుకుంటూ వౌళి హాల్‌లో అడుగుపెట్టాడు. వాడి కళ్లు కొద్ది క్షణాలు మా ఇద్దరిమీద నిలిచిపోయాయి. సంతోషంగా వున్న నేను, అది పంచుతున్న రఘు.
కొద్ది క్షణాలలో దృష్టి మరల్చుకుని తేజా కూర్చున్న కుర్చీని తోసుకుంటూ స్టేజిమీదకు తీసుకువచ్చాడు.
ఆ క్షణంలో వాడి మనసులో ఏం ఆలోచనలు తిరిగాయో అని అనుకున్నాను. వాడి చిన్నతనమంతా ఇలాంటి సంఘటనకోసమే తపించిపోయాడు.
ఎన్నోసార్లు అన్నయ్యతో అనేవాడు. మా అమ్మా, నాన్న ఎందుకు కలవాలని ప్రయత్నం చెయ్యరు మామయ్యా అని. నాన్నకి ఎందుకు ఇష్టం లేదు, అమ్మకిష్టంలేదా! మీరందరూ ఎందుకు ఏమీ అడగరు?
చంద్ర ‘‘మీ అమ్మా, నాన్న కలిసి వుండాలంటే ఇష్టం ఒక్కటే సరిపోదురా!’’ దానికి తోడు చాలా కలిసిరావాలి. మనం కావాలనుకున్నంత మాత్రాన పనులు నెరవేరవు. నువ్వు పెద్దవాడివయ్యాక నీకు అర్థం అవుతుంది’’ అని సమాధానపర్చాలని చూసేవాడు అన్నయ్య. అది వాడికి నచ్చే సమాధానం కాదు. చాలా కోపం వచ్చేది.
తరువాత తరువాత అసలు అడగడం మానేశాడు. ఒకసారి వాడి స్నేహితుడితో అన్నాడుట. ‘‘ఒక్కసారి మా అమ్మా, నాన్న ఒక్కచోట కనిపిస్తే బాగుండునురా! నేనే అడిగేస్తాను’’ అని.
నా మనసు గతంలోకి వెళ్లిపోతోంది. మనిషి హాల్లోనే వున్నా.
వారిద్దరిని చూడగానే హాల్‌లో వున్నవాళ్లంతా చప్పట్లు కొట్టారు తేజా విజయానికి. నేను వాస్తవంలోకి వూడిపడ్డాను.
అంతమందిని ఆశ్చర్యంగా చూస్తున్న తేజా కళ్లల్లో నీటి తెర కమ్మింది.
విలేకరి లేచి వెళ్లి తేజాకి వౌళికి షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. తేజాని వీల్‌చైర్‌లోనే కూర్చుని మాట్లాడవచ్చని సూచించాడు. కాని తల అడ్డంగా ఊపింది, వద్దన్నట్లు.
నర్సు, వౌళి సాయంతో చాలా కష్టంమీద లేచి నుంచుంది. వౌళి దగ్గరగా నిలబడి ఉన్నాడు. తేజా భుజం చుట్టూ చెయ్యి వేసి, సపోర్టుకోసం.
తేజా ఒక్కసారి హాలంతా చూసింది. ఎంతోమంది, వారి వారి ఉద్యోగాల్లో నిష్ణాతులు. చివరగా ఇద్దరు ఫైర్ ఫైటర్స్ కనిపించారు. వారిని చూడంగానే తేజా కళ్లు తడి అయిపోయాయి. సగౌరవంగా తలవంచింది వారి వంక.
ఒక్కసారి రెండు చేతులు జోడించి, హాలులో ముందువరుసలో కూర్చున్నవారికి, తదితరులకు నమస్కరించింది. ఎక్కడ పెరిగినా భారతీయత తనలోంచి బయటపడకుండా వుండలేదు.
విలేఖరి లేచి తేజాని ఆ హాలులో వున్న వాళ్లకు పరిచయం చేశాడు. తిరిగి తేజావైపు తిరిగి.
‘‘మిసెస్ తేజా మా కోరిక మన్నించి మీరీనాడు ప్రెస్‌ని కలలవడానికి అంగీకరించినందుకు మా కృతజ్ఞతలు. మీ ముప్ఫై గంటల అనుభవం మాకు తెలియపర్చడం, మీ బాధను మీరు పునశ్చరణ చేసుకోవడమే! అది ఎంత బాధాకరమయినదో మేమంతా వూహించగలము. కాని మీరు ఎదుర్కొన్న విధ్వంసాన్ని తాము కూడా ఎదుర్కొని, అందులో హతమయిన వేలమంది కుటుంబాలకు, మీ నోటి ద్వారా వినడం చాలా అవసరం. వారి వారి ఆప్తులు చివరి క్షణాలు ఎంత బాధాకరమయినవయినా వినాలన్న కుతూహలం మానవ సహజం.
మీరు మా కోరిక మన్నించినందుకు మరొకసారి కృతజ్ఞతలు. మీరు ఎంతసేపు మాట్లాడాలనిపిస్తే అంతే మాట్లాడండి. రుూ సమయం సంపూర్ణంగా మీ యిష్టాయిష్టాలమీద నడుస్తుంది’’ అన్నాడు.
జోడించిన చేతులతోనే ఒక్కసారి బలంగా నిట్టూర్చింది. కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి.
హాలులో పూర్తి నిశ్శబ్దం ఆవరించింది. కానీ ఎవరూ తేజా నిశ్శబ్దానికి భంగం కలిగించాలని ప్రయత్నించలేదు.
పక్కనే నుంచుని వున్న వౌళి వంక చూచింది చిరునవ్వుతో. ఆమె కళ్ళల్లోకి చూస్తూ తల పంకించాడు, నువ్వు చెయ్యగలవన్నట్లు.
తేజా కొద్ది క్షణాలు తన వేళ్ల వంక చూస్తూ వుండిపోయింది. మరికొద్ది క్షణాలు హాలులో వున్నవారందరినీ పరికిస్తూ ముందు సీటులో కూర్చున్న వౌళి దగ్గర ఆగిపోయాయి.
ఎందుకో సందేహిస్తోంది. లేదా ఎక్కడ మొదలుపెట్టాలా అన్న మీమాంసలో పడిపోయిందేమో!
విలేఖరి ప్రశ్నిస్తే, తాను సమాధానం చెప్పడంలాంటిది అనుకుందేమో! ఇక్కడ పూర్తిగా తనమీద వదిలేశారు.
మెల్లిగా తల ఎత్తి విలేఖరి చేతిలో వున్న మైక్ అందుకుంది. దానిమీద చేత్తో తట్టి చేసి, మెల్లిగా మొహానికి దగ్గరగా తెచ్చుకుంది.
‘‘మొదటిసారిగా మా అందరి ప్రాణాలను కాపాడటానికి, వారి ప్రాణాలనే ఫణంగా పెట్టిన వందలాది ఫైర్ ఫైటర్స్‌కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు, అక్కడ పనిచేసిన ఏ ఒక్క ఫైర్ ఫైటర్ దేశ రక్షణ కోసం, యుద్ధరంగానికి వెళ్లిన ఏ సోల్జరుకంటే ఏ విధంగానూ తక్కువ కాదు. అంతే ధైర్యం, పట్టుదలతో కృషి చేశారు. అవిరామంగా వారి శరీరంలో శక్తి పూర్తిగా హరించిపోయే వరకు పనిచేశారు. వారు చేసిన కృషికి జీవితాంతం రుణపడి ఉండాల్సిన వారిలో నేను ఒకరిని. వారికి నేను నా ప్రణామాలు అందిస్తున్నాను. నన్ను బతికించడానికి అన్ని విధాలుగా వైద్యం అందించిన నిపుణులకు, నన్నో మనిషిగా చెయ్యాలని సంపూర్ణ సహకారం ఇచ్చిన నా కుటుంబ సభ్యులకు నా కృతజ్ఞతలు’’ అంటూ ఆపింది. ముందు వరుసలో వున్న నా వంక చూచింది. చిరునవ్వుతో తలపంకించాను. చూపుడువేలు బొటనవేలు సున్నాగా చేసి చూపించాను ‘గుడ్’ అని చెప్పడానికి సంకేతంగా. రుూ పద్ధతి అమెరికా వచ్చాకే నేను నేర్చుకున్నాను.-ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి