డైలీ సీరియల్

ట్విన్ టవర్స్ 131

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్కొక్క ఫైర్ ఫైటర్ కనీసం ఓ వంద పౌన్ల పరికరాలన్నీ మోస్తున్నాడు. మొహాలు సీరియస్‌గా వున్నాయి. కాని వాళ్ళ కళ్ళల్లో ఒక భావం. అది ఏమిటో అర్థం కాలేదు. బహుశా వాళ్లందరికీ తెలిసే వుంటుంది. అసంభవాన్ని సంభవం చెయ్యాలని వెడుతున్నామని. ఆపలేని అగ్నికి ఆహుతి కాబోతున్నామని. తామందరూ తిరిగి వెనక్కి రావడం ఎంత స్వల్పమయిన అవకాశం వుందో అని?
కాని ప్రతి ఒక్క ఫైర్ ఫైటర్ మొహంలోనూ ఒక స్థిర నిశ్చయం, తన ప్రాణాలలో చివరి అంశంవరకు పనిచెయ్యాలనే!
వున్నట్లుండి- తలుపు తీసుకు ఒక వ్యక్తి ముందుగా వచ్చాడు. ఒక చెయ్యి పూర్తిగా తెగిపోయి రక్తం ధారలు అవుతోంది. మరొకరి గుండెలో పెద్ద అద్దం గుచ్చుకుపోయి వుంది. బాధతో విలవిలలాడుతున్నాడు. ఒకామె మొహం నిండా రక్తం ధారలై కారుతోంది. నాకు ఏమీ కనిపించడంలేదని. సర్లే పదా అంటోంది. అప్పటికే కొద్ది మంది ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరారు.
దిగుతున్నాం, దిగుతున్నాం. కృష్ణన్ నా చెయ్యి వదలడంలేదు. ధైర్యం చెబుతూనే వున్నాడు. ఇక బార్బరా నడవలేనంది. వదిలేసి వెళ్లిపొమ్మంది. పొగ ప్రయాస, ఆమె ఊపిరితిత్తులను బలహీనపరిచేస్తున్నాయి. మెట్లమీద చతికిలపడిపోయింది. నేను కృష్ణన్ మొహాలు చూసుకున్నాం, ఏం చెయ్యాలో అర్థంకాక. మా అందరితో మెట్టు దిగుతున్న అమెరికన్ మరొకతను, ఆమెను

అవలీలగా వీపుమీదకు ఎక్కించుకుని దిగడం ప్రారంభించాడు.
మరో రెండు అంతస్తులు దిగేటప్పటికి మెట్ల తలుపు పక్కన వున్న ఎలివేటర్ తలుపులమీద దబదబా బాదుతున్నట్లు వినిపించసాగింది. హెల్ఫ్, హెల్ప్ అన్న ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి.
మాతో దిగుతున్న జాన్ అనే వ్యక్తి గబబా, ఎలివేటర్ వైపు వెళ్లాడు. తలుపు తెరవడానికి ప్రయత్నిస్తానని. మీకు ఫైర్ ఫైటర్స్ ఎదురుపడితే ఇక్కడకు రమ్మనమని చెప్పమని.
మాకెవరికీ అతను సాయం చేయగలడని అనిపించలేదు. చేతిలో ఎటువంటి పనిముట్లు లేవు. ఎలివేటర్‌లో చిక్కుబడిన వాళ్లతోపాటు ఇతనూ చిక్కుబడిపోతాడేమో అనిపించింది.
మరి కొంచెం దిగేసరికి మైకులోనుండి గాడ్‌బ్లెస్ అమెరికా పాట వినిపిస్తోంది. ఎవరో పాడుతున్నారు. దాదాపు 16 మంది వున్నాం. అందరం ఒకరి మొహం ఒకరు చూసుకున్నాం. ఎందుకో, ఒక్క క్షణం ఒక ఆశాకిరణం మెదిలింది. కృష్ణన్ నా కళ్లలోకి చూచి అన్నాడు. వుయ్ విల్ మేక్. మనం తప్పించుకుంటాం. మనసులో దేముడినే తలుచుకో అని మెల్లిగా ఏవో మంత్రాలు చదివేస్తున్నాడు. అంత భయంలోనూ అతనిని ఎడ్మైర్ చెయ్యకుండా వుండలేకపోయాను. అతని నోటంబడి ధారావాహికంగా ప్రవహిస్తున్న స్తోత్రలు, నాకు ధైర్యాన్నిచ్చాయి. నాకు వచ్చినవి చాలా కొంచెం. వాటినే నెమరు వేసుకుంటున్నాను. కాని కృష్ణన్‌ని చూస్తుండగానే అనుకున్నాను, ఇక్కడనుండి బయటబడితే తప్పకుండా రెలిజియన్ గురించి క్షుణ్ణంగా నేర్చుకోవాలని.
దిగుతున్నాం. విండోలోంచి ‘మళ్లీ కిందకు చూచాను. కృష్ణన్ వద్దంటున్నా వినకుండా పైనుండి దూకిన చాలా ప్రాణాలు కనిపించాయి. కాని ఒక వ్యక్తి నా కళ్లముందు నుంచి దాటిపోలేదు. తెల్లని షర్ట్ కొద్ద్భిగం మాత్రం తెల్లగా వుంది. మిగిలినదంతా రక్తంలో తడిసిపోయింది. తలమీదించి ఇంకా రక్తం కారుతున్నట్లే వుంది. ఒక తెల్లని పదార్థం పగిలిన తలకు దూరంగా వుంది.
నా కళ్లు తిరిగాయి. పక్కకి పడిపోతానేమోననిపించింది. పక్కన కృష్ణన్ లేకపోతే పడిపోయేదానినే. నన్ను గట్టిగా పట్టుకున్నాడు. దిగుతున్నాం. అతని ధైర్య వచనాలు వినిపిస్తూనే వున్నాయి. అతని భగవత్ స్మరణ వినిపిస్తూనే వుంది.
రైట్ ఫుట్, లెఫ్ట్ఫుట్ ఒకదాని ముందు మరొకటి పడుతూనే వుంది.
అంతే మళ్లీ పెద్ద చప్పుడయింది. ఓ డజను పెద్ద పెద్ద ఐరన్ సేఫ్‌లు దొర్లించినట్లయింది.
క్రింద పక్కన పెట పెట విరుగుతున్నట్లు అనిపించింది.
మా కాళ్ళ క్రింద మెట్లు దిగిపోతున్నాయేమోననిపిస్తోంది. ఒక పెద్ద రైలు నీ వెనుక పరుగెడుతున్నట్లుంది అక్కడి చప్పుడు.
ఏదో పెద్ద ఆబ్జెక్ట్ పక్క గోడలోంచి దూసుకు మా మీదకు వస్తున్నట్లుగా అనిపించింది. అది కేవలం క్షణమాత్రమే! అంతే, ఏం జరుగుతోందో నేను గ్రహించేలోగానే కృష్ణన్ నన్ను ఒక్కసారి పక్కకు తోసేశాడు. తను రెండో పక్కకు దూకేశాడు. ఒక్కసారి ఫిరంగిలోంచి వచ్చిన గుండులాగా ఎగిరిపడ్డాను. ఆ పడటంలో ఎత్తుగా వున్న చెత్తా చెదారం వైపు పడ్డాను. తల వెళ్లి దేనికో కొట్టుకుంది. కళ్లు బైర్లు కమ్మాయి. స్పృహ కోల్పోయేనేమో!
అలా ఎంత సమయం గడిచిందో నాకు తెలియదు. నా కాలు కదలకుండా ఏదో బరువైన దానికింద ఇరుక్కుపోయింది. చాలా నొప్పిగా వుంది. తల బరువుగా వుంది. అసలు ఏమీ అవగాహన కావడంలేదు.
నేను చచ్చిపోయానేమో అనుకున్నాను కాని నొప్పి తెలుస్తోంది. దూరంగా హెల్ప్, ప్లీజ్ హెల్ప్‌మీ అన్న బలమైన కేకలు వినిపిస్తూనే వున్నాయి.
ఎక్కడున్నానో తెలియదు. కళ్లు తెరుద్దామనుకుంటే మొహంమీద వున్న ధూళి కళ్ళలోకి పడిపోతోంది. కాలు కదలడంలేదు. శరీరం దేనిమధ్యో ఇరుక్కుపోయింది. నోరు తెరచి హెల్ప్ అని అడుగుదామని వుంది. అరుస్తున్నాననే అనుకుంటున్నాను. శబ్దం బయటికి వస్తున్నట్లు. నా చెవులకు వినిపించడంలేదు.
ఒక కాలు కదలని పరిస్థితిలో వుండిపోయింది. రెండో కాలు క్రింద ఏదో వెచ్చగా, మెత్తగా తగులుతోంది. ఎవరైనా కాళ్లక్రింద పడ్డారేమో!
కళ్లు చీకట్లు కమ్మాయి. భయం గడ్డకట్టించేస్తోంది.
హెల్ప్ అని అరుస్తున్నాననే అనుకుంటున్నాను. కృష్ణన్ ఏడి, అతనుంటే బయటకు లాగుతాడు.
కళ్లు మంటలు భరిస్తూనే చుట్టూ చూడాలని ప్రయత్నించాను. తల కదలడంలేదు. ఎక్కడినుంచో వేడి తరుముకు వస్తోందనిపిస్తోంది.
అలాటి అచేతనమయిన స్థితిలో నాకు మళ్లీ స్పృహ తప్పింది. అలా ఎంతసేపు వుండిపోయానో నాకు తెలియదు. మళ్లీ తెలిసేటప్పటికి ఇందాక వినిపిస్తున్న ఎవరి కంఠాలు వినిపించడంలేదు. ఎవ్వరూ హెల్ప్ అడగడంలేదేంటీ. వాళ్లందరినీ రెస్క్యూ చేశారన్నమాట. అందరూ కాపాడబడ్డారు.

-ఇంకా ఉంది

రమాదేవి చెరుకూరి