డైలీ సీరియల్

ట్విన్ టవర్స్-132

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయ్యో, నేనెలా నిద్రపోయాను. నేనిక్కడున్నట్లు కూడా ఎవరికీ తెలియదు. చాలా భయం వేసింది.
ఇందాక కాలి క్రింద వెచ్చగా, మెత్తగా అనిపించినది ఇప్పుడు చల్లగా తాకుతోంది. మెత్తదనం గట్టిపడి పోతోంది. ఏమయి వుంటుందన్న అనుమానం మొదలయింది. ఎవరైనా నా కాళ్ళు క్రిందపడి చచ్చిపోయారా? భయంకరంగా ఏడుపు వచ్చేస్తోంది. కన్నీళ్లు అవిరామంగా కారిపోతున్నాయి. తుడుచుకునేందుకు వీలులేదు. చేతులు కదలడంలేదు. పక్కకు తిరగలేను. భయం ఎక్కువయిపోతోంది.
ఎక్కడా ఎటువంటి సంచలనం లేదు. అందరూ రక్షింపబడ్డారు. నేనొక్కత్తినే మిగిలిపోయాను.
నామీద నాకే కోపం వచ్చేస్తోంది. ఇలాంటిచోట అలా ఎలా నిద్రపోయానా అని మళ్లీ కళ్ళు మూసుకుపోతున్నాయి. అది నిద్రా, స్పృహ తప్పడమో కూడా తెలియడంలేదు. మళ్లీ మెలకువ వచ్చేసరికి చుట్టూ ఇందాక వున్న వెలుతరు లేదు. బాగా చీకటి కమ్ముకుంది.
అంటే, నేను చచ్చిపోయానన్నమాట. అయ్యో ఉష- చాలా చిన్నది, పాపం పాలకు ఏడుస్తుందేమో! వౌళి ఐయామ్ సారీ, జీవితాంతం నీకు తోడుగా వుంటానన్నాను. ఓ గాడ్! నేనెప్పడు ఏమీ కోరలేదు. నన్ను కాపాడు, రుూ విధ్వంసాన్ని ఎదుర్కొనే శక్తి ఇవ్వు.
మాటలు బైటికి వినిపించడంలేదు. మనసులోనే ప్రార్థించడం మొదలుపెట్టాను. ఎన్ని గంటలు గడస్తున్నాయో నాకు తెలియదు. తల కదల్చడానికి లేదు. ఏదో పక్కలో పొడుచుకుంటోంది. చేతులతో మెల్లిగా పరిసరాలు తడమడానికి ప్రయత్నించాను. చుట్టూ సిమెంట్ లాంటిది తగులుతోంది. అటు ఇటు కదులుతున్న చేతికి ఏదో తగిలి ఆగిపోయింది.
మళ్లీ నన్ను భయం ముంచెత్తింది. నా చేతికి తగులుతున్నదేమిటో తెలుస్తోంది. మరో మానవ శరీరం. మరో శరీరం. తనలాంటి మరో శరీరం. తనలో ఇంకా జీవుడున్నాడు. అతనిలో లేడు. అయితే బతికున్నానన్నమాట. అందాక నా కాలికింద మెత్తగా తగిలినది కూడా అతని శరీరంలో భాగమే అయి వుండవచ్చు.
కొద్ది సమయానికి ముందు అది సజీవమయిన శరీరం- ఇప్పుడొక మృతదేహం.
నేను పుట్టాక ఒక్క మృతదేహాన్ని చూడలేదు. ఇప్పుడు ఒక దేహంతో పడుకుని వున్నాను. ఆ ఆలోచన ఎంత భయంకరంగా అనిపించిందో వివరించలేను.
అలసిపోయిన మనసు, కదలలేకున్న శరీరం నన్ను మగతలోకి తీసుకువెళ్లిపోయాయి.
మరి ఇది కలో కాదో తెలియని స్థితిలోకి చేరిపోయాను చెత్తలో కదలకుండా పడి వుండటంవల్ల. హాల్లో కాన్ఫరెన్సు రూమ్‌లో కృష్ణన్ నేనూ కాఫీ తాగుతూ మాట్లాడుకోడం ఏం కలో నాకు తెలియడంలేదు. నా మనసు రెండిటిమధ్య వూగుతోంది.
సడెన్‌గా నా బేబీ ఏడవడం వినిపించింది. అయ్యో యిలా నిద్రపోతున్నానేమిటి? దానికి పాలివ్వాలి అనుకుంటున్నాను. లేవాలని ప్రయత్నం చేస్తున్నాను. మళ్లీ చీకట్లోకి జారిపోతున్నాను. ఎన్ని గంటలు గడిచాయో తెలియదు. మెలకువ వచ్చినపుడు మాత్రం ఇది తుడి ఘడియలు అని తెలిశాయి. నా నిద్రలో దేముడి లాంటి రూపం కనిపిస్తూనే వుంది. అతను చెయ్యి అందిస్తున్నాడు. నేను చేయి ఎత్తి అతని చెయ్యి అందుకుందామంటే నా చెయ్యి కదలడంలేదు. అమ్మ కనుపిస్తోంది, అన్నం తినలేదని కోప్పడుతూ! నాన్న, లత, శశి అందరి గొంతుకలు వినిపిస్తున్నాయి. కాని ఎవ్వరూ దగ్గరకు రావడంలేదు. వౌళి చేతులు నన్ను చుట్టేసి వున్నాయి. కాని లేవతీయడం లేదు. ఉష.. ఓ మై బేబీ! ఇక తిరిగి నిన్ను చూడను.
చుట్టూ ఏవో వలయాలు తిరుగుతున్నాయి. ఏవో రూపాలు కనుపిస్తున్నాయి. అప్పుడప్పుడు విన్న హిందూ లెక్చర్స్‌లో తప్పకుండా మాట్లాడే ‘జీవుడు’ అంటే ఇదేనా! శరీరం విడిచాయి. గాలిలో పరిభ్రమిస్తున్నాయి. అందులో నా జీవుడు వుందేమో. నేను చచ్చిపోయాను. అందుకు సందేహం లేదు. లేకుంటే నా మాటలు నాకు ఎందుకు వినిపించడంలేదు.
చుట్టూ చీకటి. ఎక్కడో దూరంగా వెలుతురు. ఒకటే వేడి. గొంతు మండుతోంది. అరవాలంటే గొంతు పైకి రావడంలేదు. ఇక రుూ ప్రపంచంతో నాకు సంబంధం లేదు. నాతో వచ్చిన వాళ్లందరూ వెళ్లిపోయారు. ఎక్కడనుండి హెల్ప్ అన్న మాట వినిపించడంలేదు. ఒంటరిగా, ఆ రాళ్లమధ్య ఎవరికీ తెలియని చోట.. కళ్ళు మూతలు పడిపోయాయి.
మళ్లీ నేను మగతలోకి వెళ్లిపోయాను. ఎన్ని గంటలు గడిచాయో నాకు తెలియదు. ఇప్పుడు కాలు నొప్పి పెట్టడంలేదు. తల మొద్దుబారిపోయింది. శరీరానికి కూడా ఏమీ గుచ్చుకోవడంలేదు.
గభాల్న కళ్లు తెరిచాను. చాలా ధూళి కళ్లల్లో పడింది. కాని ఎక్కడో దూరంగా గొంతుకలు వినిపించాయి. ఐ యామ్ హియర్ అని గట్టిగా అరిచాను. రుూసారి నా గొంతుక నాకు వినిపించింది. అడుగుల చప్పుడు వినిపించింది. నేనెవరికీ కనుపించడంలేదేమో!
నామీద పడి వున్నదాన్ని బలంగా కదిలించాలని మళ్లీ అరవాలని ప్రయత్నించాను.
ఓ జీసస్.. ఒక గొంతు పెద్దగా వినిపించింది. ఆ గొంతుకలో బ్రహ్మాండాన్ని ఛేదించిన ఆనందం వినిపిస్తోంది.
నాకు ఇక్కడేదో వినిపిస్తోంది. అంటూ గబగబా నడిచిన శబ్దం తెలుస్తోంది.
నన్ను బయటికి తీయాలని ప్రయత్నిస్తున్న వాళ్లు కాబోలు. వాళ్ల కంఠాలు చాలా మెల్లిగా వినిపిస్తున్నాయి. మాటలు వినిపిస్తున్నాయి. కాని అర్థం కావడంలేదు.
వాళ్లు ఎందుకు అంతసేపు చేస్తున్నారో నాకు అర్థం కావడంలేదు. వాళ్ళెవరూ నేను స్పృహలో వున్నానన్న విషయం కూడా గమనించలేదు. వాళ్ల ధ్యేయం ఒకటే! నన్ను ప్రాణాలతో బయటకు లాగడం.
నా కాలి క్రింద నడుం క్రింద, మెడ కింద వెచ్చటి చేతులు తగిలాయి.
నన్ను కొంచెం పైకి ఎత్తంగానే, మళ్లీ భయపూరితంగా ఓ జీసెస్ అని పెద్దగా వినిపించింది.
మైగాడ్ అని మరో గొంతు!
‘‘నువ్వు నోటీస్ చేశావా’’ ఓన్లీ బాడీ- నో హెడ్ అంటున్నాడు. నన్ను పైకి మోస్తున్న అతను. నాకు భయం పూర్తిగా ఆవహించింది. కళ్లు బైర్లు కమ్మాయి.
ఆ తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు. -ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి