డైలీ సీరియల్

ట్విన్ టవర్స్-133

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాని, తరువాత నేను తెలుసుకున్నదాన్ని బట్టి-
ఇక ఆ పూట ప్రాణం వున్నవారు దొరుకుతారన్న ఆశ వదిలేసుకున్నారు. ఇక మృతదేహాలను, శరీర భాగాలను ఏరుకుంటూ వెడుతున్నారు. ఆ సమయంలో వాళ్లకు నా గొంతు వినిపించింది. కాని ఎకరాల స్థలంలో కొండల్లా పడివున్న భవనపు ఛిన్నాభిన్నాలమధ్య నుండి నన్ను బయటకు తీయడం 20 నిమిషాలు పట్టిందిట.
ఆపింది తేజా! మొహంలో ఒక ప్రశాంతత ఆవరించింది.
ఒకరిద్దరు ఏదో అడగబోయి, తేజా మొహం చూచి ఆపేశారు.
తరువాత తనలో తను మాట్లాడుకుంటున్నట్లుగా తేజా అంది.
నన్ను చెయ్యి పుచ్చుకుని 70 అంతస్తులు నడిపించిన కృష్ణన్ బ్రతకలేదు. ఆ చివరి క్షణంలో నా చెయ్యి వదిలి పక్కకు తొయాయలని అతనికి ఎందుకు ప్రేరణ కలిగిందో ఎప్పటికీ తెలియని ప్రశ్న.
నేను పనిచేసే ఆఫీసు పూర్తిగా దగ్ధమయిపోయింది. ఎంతోమంది క్షణాల్లో ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ విఖ్యాతిగాంచిన రెండు బిల్డింగులు అనుకోనంత త్వరగా కూలిపోయాయి.
కాని, నేను మాత్రం బతికి వున్నాను. నాకు కారణం తెలియడంలేదు. అసలు ఎలా సంభవమన్నది తెలియడంలేదు.
ఏం నేర్చుకున్నాను రుూ సంఘటన నుంచి? శూన్యంలోకి చూస్తూ వుండిపోయింది.
తేజా ఇక మాట్లాడదనిపించి చాలామంది చప్పట్లు కొట్టారు.
తేజా అందరివంక చూచి చేతులు మళ్లీ జోడించింది.
నో నేను ఏమీ సాధించలేను. కేవలం బ్రతికాను. నా రుూ బ్రతకడంలో, నా కృషి చాలా తక్కువ. కాని ఎందుకు బ్రతికున్నది తెలుసుకోవాలి’’ అని ముగించింది.
వౌళి వెళ్లి తేజా భుజం చుట్టూ చెయ్యి వేశాడు. ‘‘ఇక ఆ ప్రశ్న మానేయి. నేనే నీకు సమాధానం. నాకోసమే నువ్వు బ్రతికావు’’ అన్నాడు గుండెలకు హత్తుకుంటూ!
గబగబా ఫ్లాష్‌లైట్స్ వెలిగాయి.
తేజా పూర్తిచేసింది. చివరగా అంది. నేను పనిచేసే ఆఫీసు పూర్తిగా దగ్ధమయిపోయి, చాలామంది అక్కడికక్కడే దగ్ధమయిపోయారు. కొద్దిమంది పనులమీద బయటకు వచ్చినవాళ్లు తప్ప.
నా ఆఫీసు కాలిపోయింది. నా కొలీగ్స్ చచ్చిపోయారు. నా పార్ట్‌నర్ నేను బతకడానికి పూర్తిగా కారకుడైన కృష్ణన్ చచ్చిపోయాడు. ఆ చివర క్షణంలో అతనికి నన్ను మరో పక్కకి తొయ్యాలని ఎందుకనిపించిందా- నాకు ఎప్పటికీ అర్థంకాని విషయం. రుూ ప్రశ్న జీవితాంతం నాకు ప్రశ్నగానే మిగిలపోతుందేమో! అంటూ ఆపింది.
అంత స్వచ్చంగా, వినేవాళ్లకు కళ్లకు కనిపించేంత వివరంగా వినిపించింది. తేజ భాషలో ఒక పరిపక్వత వుంది. ఆమె ఉచ్ఛారణలో స్వచ్ఛత వుంది. వినేవారిని ఆకట్టుకునే శక్తివుంది. అందుకే కృష్ణన్ తేజాని ఎన్నుకుని వుంటాడు.
తేజాకి తను బతికినందుకు సంతోషించటంకన్నా తను మాత్రమే బతికినందుకు గిల్టీగా వుంది.
ఒకసారి డాక్టర్స్‌ని అడిగింది కూడా- తనొక్కరే ఎందుకు సర్వైవ్ అయ్యానని.
‘‘నాట్ యువర్ టైమ్ యట్’’ అన్నాడు అమెరికన్ డాక్టరు.
ఎవరు ఏ మతస్థులయినా అందరిదీ ఒకే నమ్మకం.
తేజా మాత్రం తను బతికిపోవడానికి ఏదో కారణం వుండి వుండాలని మాత్రం అంటూ వుంటుంది.
‘‘నన్ను, ఉషని గైడ్ చేయడానికి’’ అంటాడు వౌళి హాస్యంగా.
తల అడ్డంగా వూపుతుంది. అదొక్కటే కాదని, ఆమె మనసు దేనికో శోధిస్తూనే వుంది.
విలేఖరి మరోసారి థాంక్స్ చెప్పి మీటింగ్‌ని పూర్తిచేశారు. ఇంతమందితో ఇంత పెద్ద మీటింగ్ అయ్యేటప్పటికి తేజా చాలా అలసిపోతుందనుకున్నాను. కానీ చాలా ఓపిగ్గా అందరికీ సమాధానాలు ఇచ్చింది.
వచ్చినవారిలో ఒక అతను అడిగాడు. మీరు, డా.కృష్ణన్ ప్రెజెంట్ చేయబోయే ప్రాజక్టుని గురించి ఏమైనా చెప్తారా అన్నాడు.
‘‘తల అడ్డంగా వూగించింది’’ లేదన్నట్లు.
‘‘్భవిష్యత్తులో వెలుగులోకి తీసుకువస్తారా!’’ తేజా కొద్ది నిముషాలు ఆలోచించి సమాధానం ఇచ్చింది.
‘‘నేను డా.కృష్ణన్ మా కంపెనీ తరఫున పనిచేశాం. దీనిమీదే హక్కులు అన్నీ ఆ కంపెనీవే! ప్రస్తుతం జరిగిన విధ్వంసంలో, కంపెనీ వ్యవహారాలు ఏ విధంగా నిర్వహించబడతాయో నాకు అవగాహన లేదు. అవన్నీ లీగల్ విషయాలు. నేను చర్చించగలిగినవి కావు’’ అంది. మరొకరు మరో ప్రశ్న వేయబోయారు.
వెంటనే తేజాఆపేసింది. ‘‘దయచేసి ఇక్కడితో వదిలేయండి. రుూ మీటింగ్‌లో ఆ విషయాలకు చోటు లేదు’’ అంది చాలా నిష్కర్షగా!
నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. తేజా అంత ప్రొఫెషనల్‌గా మాట్లాడుతుందని.
చాలామంది వెళ్లిపోయారు. కొద్దిమంది మాత్రం తేజా దగ్గరికి స్వయంగా వచ్చి పలకరించి గుడ్‌బై చెప్పారు.
నా వెనకనే నుంచుని వున్న పద్మని చూస్తూ ఎవరన్నట్లు వౌళి వంక చూచింది. ‘‘చెప్పానుగా! అమెరికాలో మా అమ్మ మొదటి విద్యార్థి’’ అని అన్నాడు నవ్వుతూ!
తేజా నా వంక చూచింది. నేను పద్మని పరిచయం చేస్తూ, మీ టవర్స్‌ని గుద్దేసిన విమానంలో ఒక ప్రయాణికుడు పద్మ భర్త. మన కాంప్లెక్స్‌లోనే వుంటారు’’ అన్నాను క్లుప్తంగా.
చెయ్యి పద్మవైపు చూస్తూ ‘ఐ యామ్ సో సారి’’ అంది.
ఏమనాలో తెలియక పద్మ ఒక్కసారి నమస్కరించి వూరుకుంది.
‘‘మీరు పోగొట్టుకున్నదాని ముందు నా బాధ చాలా స్వల్పం. కాని నేను అలా భావించలేకపోయాను’’ అంది బాధగా.
‘‘మీ మాటలు వింటుంటేనే మీరు ఎంత తెలివైనవారో అర్థమవుతోంది. మిమ్మల్ని కలవడం చాలా ప్రత్యకంగా భావిస్తున్నాను’’ అంది పద్మ. ఇంతలో వాళ్ళిద్దరికీ అంతరాయం కలిగిస్తూ గబగబా కేరళ నర్సు తేజా ముందుకు వచ్చింది. ఆవిడని మొదటిరోజు డ్యూటీలో చూశాను. చాలా అనుభవమున్న వ్యక్తిలా గోచరించింది. తరువాత తేజాతో చాలాసార్లు మాట్లాడిందిట. ఇవాళ, నర్సు యూనిఫారంలో లేదు, ఆఫ్ డ్యూటీ మూలంగా. -ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి