డైలీ సీరియల్

ట్విన్ టవర్స్-135

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తేజా ఇంటికి వచ్చింది. తేజాకోసం వచ్చిన విజిటింగ్ నర్స్ చెప్పే ప్రతి విషయం పద్మ చాలా శ్రద్ధగా వినడం మొదలుపెట్టింది. గబగబా ఒక పెన్ను కాగితం తెచ్చుకుని, అన్నీ రాసింది.
నాకు కొంచెం ఆశ్చర్యమనిపించింది పద్మ సమయస్ఫూర్తికి.
వౌళి ఆఫీసుకు వెళ్లిపోంగానే క్రిందకు వచ్చేది. మళ్లీ సాయంత్రం దాకా తేజాకి సహాయపడుతూనే వుంది.
చూడంగానే నాకు ఒక ఆలోచన వచ్చింది. పద్మ దగ్గిర సాయం తీసుకోవటానికి మొహమాటపడుతున్న తేజాతో అన్నాను.
‘‘తేజా పద్మకి బాగా ఇంగ్లీషులో మాట్లాడటం, కంప్యూటర్ వాడటం నేర్పించు’’ అన్నాను.
తేజా నా వంక చూచింది.
‘‘అవును తేజా! నీ టీచింగ్ పద్మ సాయానికి ఫీజు అన్నాను నవ్వుతూ! ఇంక అప్పుడు నువ్వు మొహమాటపడక్కర్లేదు’’ అన్నాను.
వాళ్ళిద్దరూ ఒకరి మొహం ఒకరు చూచి నవ్వారు.
అంతే! తేజా పద్మకి టీచర్ అయిపోయింది. ఒక్క తెలుగు ముక్క మాట్లాడేది కాదు. పద్మ ఇంగ్లీషులో అడగకపోతే ఒక్కసారి కూడా తేజా వినిపించుకునేది కాదు. సమాధానం ఇచ్చేది కాదు.
వాళ్లిద్దని చూస్తుంటే అనిపించేది ప్రతి పరిచయానికి వెనుక ఒక నిగూఢమైన కారణం వుంటుందేమోనని.
తేజా శారీరకంగా కోలుకుంటోంది కాని మానసికంగా కాదు. నిద్రలేని రాత్రిళ్లు, ఏ కాసేపయినా నిద్రపడితే వెంటాడే పీడకలలు. తేజా అలసిపోతోంది.
ప్రతి చిన్న విషయానికి ఆందోళన! ఆమెలో కలరవపాటు ఆమెని నిలవనీయకుండా చేస్తున్నాయి.
తను బతికి బయటపడ్డానన్న ఆనందం కలగటంలేదు ఆమెకు. ఏదో గిల్ట్ తనని వదలటంలేదు.
తేజా కృష్ణన్ చేతులు పట్టుకు నడుస్తున్నారు. చెరో పక్కన పడిపోయారు. అతను తలకి దెబ్బ తగిలి చనిపోయాడు. రెండోవైపు పడ్డ తేజా కాలు విరిగి ప్రాణంతో మిగిలింది.
ఒక్క క్షణంలో ఇలా ఎందుకు జరగాలి అన్న ప్రశ్న తేజా మనసును వీడిపోవడంలేదు. సమాధానం లేని ప్రశ్న.
తేజాకి ట్రీట్‌మెంట్, కౌన్సిలింగ్ జరుగుతున్నాయి.
కాని నేనే సందేహంలో పడిపోయాను. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి?
ఉష బాధ్యత తేజా ఇప్పట్లో చేపట్టగలిగేటట్లు కనిపించడంలేదు. ఒకవేళ తను చేయగలిగినా నా మనసు ఎందుకనో సందేహిస్తోంది.
వౌళి ఎంతకువరకు నెగ్గుకు రాగలడు? దేహికంగా, మానసికంగా ఆధారపడుతున్న భార్య, పసిపిల్ల, బాధ్యత గల ఉద్యోగం.
ఈ పరిస్థితుల్లో వాళ్ళను వదిలి వెళ్లి తను అక్కడ స్థిమితంగా ఉండగలదా?
నా మనసులో ఆలోచనలు అల్లుకుపోతూనే వున్నాయి. ఎన్నిసార్లు ఆలోచించినా చివరకు ఒక ప్రశ్న దగ్గరే ఆగిపోతున్నాయి. ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటన్న ప్రశ్న!
ఆ ప్రశ్నకు ఎక్కువ ఆప్షన్‌లు లేవు. అందుకే ఇంత ఆలోచన.
రోజూ ఇంత రొటీన్‌గా, ఏ మాత్రం నా ప్రమేయం లేకుండా గడుస్తాయని అనుకోలేదు. లేవడం, ఉష పనులు చూడటం, తేజాకి సాయపడటం. ఇంటి పనులు- జీవితంలో మొదటిసారిగా ఓ ఇంటి బాధ్యత తీసుకున్నాను. ఎన్నో ఏళ్లు నా అంతట నేను విడిగా వున్నా, ఏదో అవసరం తప్ప అది ఒక బాధ్యతగా భావించలేదు.
రోజు ఒకసారైనా వౌళి నా పిహెచ్‌డిని గురించి ప్రస్తావన తెస్తాడు. ఇదివరకు లాగా నేను నవ్వేసి వూరుకుంటే- వదిలేయడం లేదు. ఎక్కడెక్కడినుంచో, ఎన్నో చోట్లనించి సమాచారం తెప్పిస్తున్నాడు. వాటినన్నిటిని నేను చదివానో లేదో అని అడుగుతూనే వుంటాడు. ఎందుకు వౌళి, అవసరమైన ఖర్చు, వదిలెయ్’’ అంటూనే వున్నాను.
‘‘నువ్వే అంటావు కదమ్మా. చదువు కేవలం సంపాదనకోసం కాదు, జ్ఞానోపాసన కోసం అని. అదే చెయ్యి ఇప్పుడు’’.
‘‘చూడు, ఉష ఏం చెప్తే అది నేను చేస్తున్నాను కదా. ఎత్తుకోమంటే ఎత్తుకుంటున్నాను. నిద్రపోతానంటే నిద్రపుచ్చుతున్నాను. దాని మాటలు నేను వింటున్నాను కదా! నా మాటలు నువ్వు విను. ఇప్పుడు రోల్స్ రివల్స్ అయ్యాయన్నమాట. తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినడం కాదు. పిల్లల మాటలు, తల్లిదండ్రులు వినాలి’’ అంటాడు నవ్వుతూ.
వాడి మాటలు తలచుకుని నవ్వుకుంటూ, కాలేజెస్ నుంచి వచ్చిన కాటలాగ్స్ తిరగేస్తున్నాను. తమాషా ఏమిటంటే, వాడి వంక చూస్తూంటే తెలియకుండానే మనసు స్పందిస్తోంది. చదవాలన్న తృష్ణ తీరిపోలేదేమో!
డోర్ బెల్ మోగింది.
లేచి చూచాను. ఏవో పోస్టల్ డెలివరీలా వుంది. ఓ బరువైన కవరు చేతికిచ్చి సంతకం తీసుకున్నాడు.
కవరుమీద చేతిరాత పరిచయంగా కనిపించింది. ఆ చేతిరాతతో ఉత్తరాలు ఏనాడో ఆగిపోయాయి. ఆ పాత కవర్లన్నీ ట్రంకుపెట్టెలో శిథిలమయిపోయి వున్నాయి. చాలాసార్లు ఆ పెట్టె తెరిచి పాతవన్నీ చించి పారేయాలని అనుకున్నాను కాని ఆ పన్లకు మాత్రం ఎక్కడలేని బద్ధకం ఆవరించేది.
కవరు వంకే చూస్తూ వుండిపోయాను. పైన నా పేరే రాసి వుంది. తెరవాలనిపించలేదు.
చిన్నప్పటి వదిన మాటలు గుర్తుకు వచ్చాయి. తెరవకుండా వున్నంత మాత్రాన అందులో సంగతులు మారిపోవు కదా! నవ్వుకుంటూ ఓపెన్ చేశాను.
కల్యాణి!
ప్రస్తుతం నేను స్విట్జర్లాండ్ వెళ్ళే ఏరోప్లేన్‌లో వున్నాను.
మామూలుగా అయితే, రుూపాటికి హాయిగా ఒక స్కాచ్ తాగి, సుఖంగా నిద్రపోతూ వుండేవాడిని. అటువంటిది ఇవాళ ఒకటి కాదు, రెండు తాగినా నిద్ర రావడంలేదు.
ఏదో అలజడి మేలుకొన్న మనసు అలసిపోయిన శరీరాన్ని నిద్రపోనీయడంలేదు.
రుూ మధ్యాహ్నం తేజ మాటలు విన్నాక, ఆ అమ్మాయి అనుభవాలు నన్ను చాలా కలవరపెట్టాయి.
రుూ ట్విన్ టవర్స్ విధ్వంసం- ప్రతి ఒక్కరి జీవితంలో ఎంత స్పందించిందో తలచుకుంటే బాధ అనిపిస్తుంది. నా కళ్లముందు పెరిగిన సూజన్‌ని శిథిలమయిపోయింది.
ఎప్పుడూ తలచుకోని వౌళిని తొలిసారిగా చూచాను. రుూ రెండు సంఘటనలు నన్ను ప్రశ్నిస్తూనే వున్నాయి. ఇది యాధృచ్ఛికమా! లేక ఖర్మా?
నేను ఖర్మను మామూలుగా నమ్మలేను. మనం కృషి చేశాక ఫలితం రాకపోతే ఖర్మగాని, కృషి లేకుండా కలిసి వస్తే అది అదృష్టం. -ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి