డైలీ సీరియల్

యమహాపురి 38

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడతడికి ఆమె జడలో సంపంగి పూలు కనబడ్డాయి. ఆ పరిమళం గుప్పుమని ఉక్కిరిబిక్కిరి చేసిందతణ్ణి.
ఆమె ఆసక్తిగా వీడియో చూస్తోంది. ఆమె ముఖం చూస్తుంటే- ఆత్రంగా కాశీమజిలీ కథ చదువుతున్నట్లు అమాయకంగా వుంది.
మొబైల్‌లో వీడియో, పక్కనే అందాల భామ. అప్పూకి వళ్లు వేడెక్కింది. ఏమైతే అయిందని తన ఎడమ చేతిని ఆమె కుడిచేతిమీద ఉంచాడు.
వీడియో మత్తులో ఆమె ఆ స్పర్శని పసికట్టలేదు. ధైర్యం పెరిగి ఆ చేతిని నెమ్మదిగా పట్టుకుని నొక్కాడతడు.
చంద్రి ఉలిక్కిపడి, ‘‘ఏయ్, ఏమిటిది? పెద్దమనిషివనుకుంటే- నువ్వూ ఆ గుమస్తాగాడిలా..’’ అని కసిరి చెయ్యి వెనక్కి లాక్కుని మామూలుగా కూర్చుంది.
‘‘నాకూ వాడికీ తేడా ఉందని నువ్వే చెప్పావు’’ అన్నాడు అప్పూ.
‘‘ఉండేది. కానీ ఇప్పుడు పోయింది..’’
‘‘ఏం పోలేదు. వాడు నిన్నడిగి పుస్తకం చూపించాడు. నేను నువ్వడిగితే వీడియో చూపిస్తున్నా’’
‘‘ఔను కానీ- వాడేమో లైబ్రరీలో- నువ్వేమో పార్కులో.. ఛీ... ఎవరైనా చూస్తే..?’’ అంది చంద్రి.
‘‘ఎవరైనా చూస్తే?’’ అన్న మాట అప్పూకి వళ్ళంతా గిలిగింతలు పెట్టింది.
‘‘నాకో గది ఉంది. అక్కడికి ఎవరూ రారు, చూడరు, వెడదామా?’’ అన్నాడు.
‘‘ఏయ్, పల్లెటూరి పిల్లనని నాకేం తెలియదనుకోకు. నీ ఉద్దేశ్యం నాకర్థమైంది. నేను రాను’’ అంది చంద్రి.
‘‘ఏం తెలియకేం- కొన్ని ఆ గుమాస్తాగాడి పుస్తకంలో చూశావ్. మిగతావి ఇప్పుడీ మొబైల్లో చూశావ్’’.
‘‘‘చూసింది చాల్లే- ఇంక సెలవు’’ అంటూ లేవబోయిందామె.
‘‘ప్లీజ్ చంద్రీ! నన్నిలా రెచ్చగొట్టి వెళ్లిపోవడం న్యాయం కాదు. నీకేం కావాలో అడుగు, ఇస్తాను. రానని మాత్రం అనకు’’ అన్నాడు అప్పూ.
చంద్రి క్షణంపాటు వౌనం వహించి, ‘‘నా గురించి నువ్వేమనుకుంటున్నావ్?’’ అంది.
అప్పూ ఆలోచించాడు. ఆమెకి తనంటే ఇష్టమే. తనతో రావడమూ ఇష్టమే. కానీ బెట్టు చేస్తోంది. ఇలాంటప్పుడు మంచి చేసుకోవాలంటే పొగడ్తలు మినహా దారిలేదు.
‘‘అందంలో అప్సరవి. సొగసులో సినీతారవి. ఆకర్షణలో నీకు నువ్వే సాటి. ఒక్కసారి నువ్వు నన్ను కరుణిస్తే చాలు- ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు లేడనుకుంటాను’’ అన్నాడు అప్పూ.
‘‘నువ్వు కరుణించడం అంటున్నావు. కానీ అది తప్పు చెయ్యడం’’ అంది చంద్రి.
ఆమె గొంతులో సందిగ్ధాన్ని గ్రహించిన అప్పూ, ‘‘వయసులో కోరిక పుట్టడం తప్పు కాదు. పుట్టిన కోరిక తీర్చుకోవడం తప్పుకాదు. ఈ విషయం తెలియక- మన దేశం అధోగతిలో ఉంది. తెలుసుకున్న పాశ్చత్య దేశాలు ముందుకు దూసుకుపోయాయి’’ అన్నాడు.
చంద్రి అతడి మాటలు వింటూ, మధ్యమధ్య తన అనుమానాలు బయటపెడుతోంది. అప్పూ తనకు అనుకూలంగా బదులిస్తున్నాడు. క్రమంగా ఆమెలో ప్రతిఘటన బలహీనమైంది. అప్పూ చొరవ ఎక్కువైంది.
చివరికి, ‘‘ఇక్కడికి నీ గది ఎంత దూరం?’’ అంది చంద్రి.
‘‘నడిస్తే పదిహేను నిముషాలు. ఆటోలో ఐతే...’’
అప్పూ ఇంకా ఏదో అనబోతుండగా, ‘నాక్కాస్త టైం కావాలి. నడిచే వెడదాం’’ అంటూ లేచింది చంద్రి.
‘‘గది అంటే మామూలు గది అనుకున్నావ్. చాలా బాగుంటుంది. అటాచ్డ్ బాత్రూముంది. కూలరుంది. అక్కడ మనం ఫ్రెష్షవ్వచ్చు. ఫ్రెష్‌గా ఉండొచ్చు’’ అన్నాడు అప్పూ తనూ ఉత్సాహంగా లేచి.
‘‘ఏమో, నా మనసింకా ఊగిసలాడుతోంది. ఈ కాసేపటిలోనూ నా మనసు మారిపోవచ్చు. నువ్వే నీ తెలివితో, చొరవతో నన్నక్కడిదాకా తీసుకెళ్లాలి’’ అంది చంద్రి.
తెలివికంటే చొరవ అన్న పదాన్ని ఆమె ఒత్తి పలకడం అప్పూ గమనించాడు. ‘‘పిట్ట దారిలోకొచ్చింది. నాకు పవరాఫ్ అటర్నీ కూడా ఇచ్చేసింది’’ అనుకున్నాడు.
ఇద్దరూ పార్కులోంచి బయటపడి ముందుకెడుతుంటే చంద్రిలో మళ్లీ సందిగ్ధం. ఆమె ఆగిపోతే, అప్పూ విరుగుడు మాటలు. మళ్లీ ఆమె ముందడుగు. కాసేపు ఇద్దరి మధ్యా సరస భాషణలు.
మరి కాస్త దూరం నడిచేక మళ్లీ ఆమెలో సందిగ్ధం. మళ్లీ అప్పూ ప్రోత్సాహం. ఇద్దరిమధ్యా సరసభాషణలు.
అలా వెడుతుంటే అప్పూకి నిముషకమొగ యుగమై తన గది ఇంత దూరముందా అని కూడా అనిపించింది.
అప్పూ ఇల్లు దగ్గిరౌతున్నకొద్దీ చంద్రిలో ఉద్వేగం పెరిగిపోయింది. చివరికామె ఒక చోట ఆగి, ‘‘సారీ, నేను రాను’’ అనేసింది. అప్పూ హతాశుడైపోయాడు.
‘‘ఇంత దూరం వచ్చి రానంటే ఎలా? కనీసం నా రూం చూసి వెడుదువుగాని రా’’ అన్నాడు.
‘‘రూం చూసేక వెళ్లడముండదు. ఆగాలంటే ఇప్పుడే ఆగాలి’’ అంది చంద్రి.
‘‘ప్లీజ్- ఒక్కసారి నా రూం చూసి వెళ్లు’’ బ్రతిమాలాడు అప్పూ. చంద్రి తల అడ్డంగా ఊపితే, ‘‘ఏ ఒట్టు పడితే ఆ ఒట్టు, నేను నినే్నం చెయ్యను. నన్ను నమ్ము’’ అన్నాడు.
‘‘నువ్వేదో చేస్తావని కాదు. నేనే ఏదో చేస్తానని నా భయం. నీమీద నాకు నమ్మకముంది. కానీ నామీదే నాకు నమ్మకం లేదు. అర్థం చేసుకో’’ అంది చంద్రి.
ఆమె వశం తప్పుతోందని అప్పూకి అర్థమైంది. ఇలాంటప్పుడు వదలితే- ఈ జన్మకిక ఆమె తనకి దొరకదు.
‘‘అవసరమైతే పవరాఫ్ అటర్నీ ఉపయోగించుకోవాలి’’ అనుకున్నాడతడు.
ఇద్దరూ మరి నాలుగడుగులు వేశాక, ‘‘‘అదిగో, ఆ సందులోకి తిరిగితే వచ్చేది నా గదే! అదే మన గది’’ అన్నాడు అప్పూ ఉత్సాహంగా.
చంద్రి బ్రేకులు వేసినట్లు అక్కడ ఆగిపోయింది. ఇక ముందడుగేయనని మొండికేసింది.
అప్పూ చటుక్కున ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ‘‘రానంటే ఊరుకునేది లేదు. నువ్విప్పుడు నా రూం చూసి తీరాల్సిందే’’ అన్నాడు.

ఇంకా ఉంది

వసుంధర