డైలీ సీరియల్

సింధు నాగరికతలో ఓ ప్రేమకథ-13

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ మర్నాడు సాయంకాలం అజోడా నగర రంగస్థలానికి వెళ్ళాడు. అది ఊరి మధ్య చివర పచ్చిక బయలులో ఉంది. గోడలు, కప్పు లేవు.
వేదిక భూమి ఎత్తుగా, దాని చుట్టూ స్తంభాలకు పెట్టిన దివిటీలు వెలుగుతున్నాయి. జనం నేలమీద కూచుని కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. అజోడా ముందు వరుసలో కూచుని ఉన్నాడు.
ముగ్గురు స్ర్తిలు వేదికమీదకు వచ్చి డప్పు దరువుకు నర్తించసాగారు. వారి మోచేతి గాజులు కూడా చిందులకు అనువుగా శబ్దం చేస్తూంటే జనం తన్మయంతో తిలకిస్తున్నారు. ముగ్గురు యువతులు మెడల్లో హారాలు తప్ప ఏ వస్త్రం ధరించలేదు. ప్రేక్షకులు నర్తకిల కళను ఆస్వాదిస్తున్నారే కాని వాళ్ళ నగ్నతను పట్టించుకోవడంలేదు. నర్తకిలు కూడా తమ నృత్య కళ ప్రదర్శనలో లీనమై ఉన్నారే కానీ తమ నిర్వస్త్ర స్థితిని గమనించడంలేదు.
ఆ ప్రాచీన నాగరికతలో పామర జనానికి శృంగార భావం లేని అంతటి కళాపిపాస ఉండేదంటే ఈ కాలానికి చెందిన మనకు నమ్మశక్యం కాదు. కానీ ఇది వాస్తవం. దీనికి నిదర్శనం ఆ నాగరికతకు చెందిన నగ్న నృత్యకారిణి నల్ల కంచు బొమ్మ.
ఈ నృత్యం తర్వాత మోరీ పాట పాడుతుందని ప్రకటన చేశారు. జనం ఉత్సాహంతో కరతాళ ధ్వనులు చేసి ఈలలు వేశారు.
లోనుంచి ఏదో కాంతి ప్రసరిస్తుందన్న భావం కలిగించే అపురూప సౌందర్యంతో చక్కని వస్త్భ్రారణ ధారణతో కేశాలంకరణతో గాయని, నృత్యాంగన మోరీ వేదికపైకి రాగానే జనం నిలబడి స్వాగతం పలికారు.
ఆమె విశాలమైన కేశ సంపదను ఎతె్తైన శిరోవేష్ఠిగా ధరించింది. వెదురు చట్రంపై అల్లిన ఆ కేశరాశి నమూనా ఆ కాలపు కేశాలంకరణ నైపుణ్యానికి మచ్చుతునక. ఆ కేశ శిరోవేష్ఠి (తలపాగా)పై పూసల హారాలు, వలయాల ఆకారంలో చెక్కిన పగడాలు, దంతపు నక్షత్రాలు వనె్నలీనుతున్నాయి.
మెడలో ఆకుపచ్చ రాళ్ళ హారం, చేతికి రంగు పూసిన టెర్రా కొట్టా గాజులు, చెవులకి పెద్ద వలయాలు (రింగులు) లాంటి జుంకాలు, దూరం వరకు మెరుపులు వెదజల్లుతున్న రాయిగల ముక్కుపుడక- ఆమె సౌందర్యానికి నగిషీలు దిద్దుతున్నాయి.
ఆమె చిన్న చిన్న చిందులు వేస్తూ ‘‘ఎక్కడున్నాడో నా జతగాడు..’’ అని ఓ తీగల వాయిద్యాన్ని మీటుతూ శ్రావ్యంగా పాడుతూంటే పక్కన కూచున్న ఇద్దరు యువకులు మృదంగాన్ని వాయిస్తున్నారు.
మధ్యమధ్య సిగ్గుతో వయ్యారాలు ఒలకబోస్తూ ప్రియుడితో జరిపిన సరాగాలను అభినయిస్తూ పాడుతూంటే జనమంతా శిలాప్రతిమల్లా కనులను చెవులను నృత్యగానానికి అప్పజెప్పి తన్మయులవుతున్నారు.
ప్రేక్షకుల కోరికపై ఓ పాట తర్వాత మరో పాట అందుకుంటూ మోరీ చాలాసేపు నర్తిస్తూ పాడింది. జనం పాట అయాక ఉరకలేస్తున్న ఉత్సహంతో నినాదాలు చేస్తూ చప్పట్లు వాయిస్తూ ఈలలు వేస్తూ తమ మెప్పులను ప్రకటించి ఫలానా పాట పాడమని కోరేవారు.
అజోడా కూడా పాట అయాక లేచి పెద్దగా నినాదాలు చేస్తూ తన మెప్పుని వ్యక్తపరిచేవాడు. కాని అతడి గొంతు మిగతా అభిమానుల గొంతులో విలీనమైపోయేది.
కానీ అజోడా పరవశుడై చిందులు వేస్తూంటే మోరీ దృష్టి అతడిపై పడింది. ఆమె మందహాసంతో, కళ్ళ హావభావాలతో ముందు వరుసలోనున్న అతడిని పలకరించింది. దాంతో అజోడాకి నిలువెత్తు నిబ్బరం కలిగి ఆనందభరితుడయాడు.
కార్యక్రమం ముగిసింది. మోరీని చాలామంది అభినందించారు. కొంతసేపయాక మోరీ ముఖ్య నిర్వాహకులకు వీడ్కోలు చెప్పి బయలుదేరింది.
బైటకు రాగానే అజోడా ‘మోరీ, ఇంటికేనా?’’ అని పలకరించాడు.
‘‘చిత్తం చిన్నయ్యగారూ’’ అంది.
‘‘నీ పాటనీ, నృత్యాన్ని నేను పొగడకూడదనుకున్నా. అది అందరూ చేస్తున్న పనే. కానీ నీ ప్రదర్శనను ప్రశంసించకుండా ఉండలేను. నీ నృత్యం, పాట నన్ను నేనే మరిచిపోయేలా చేశాయి మోరీ. నువ్వు నా వాహనంలో వస్తావా? నిన్ను మీ ఇంటి వద్ద విడిచిపెడతాను.’’
‘‘నేను నడిచివచ్చా..’’
‘‘్ఫర్వాలేదు, నాతోరా. నీతో మాట్లాడాలి కూడా’’.
‘‘అమ్మగారు, పెద్దయ్యగారు నిర్ణయం తీసుకున్నారుగా. ఇంకేముంది మాట్లాడడానికి.’’
‘‘నా జీవిత భాగస్వామిని గురించి నా నిర్ణయం ముఖ్యమా, వాళ్ళ నిర్ణయం ముఖ్యమా?’’
‘‘అది నిర్ణయించవలసింది మీరు’’.
‘‘సరే, నేనే నిర్ణయించవలసిందని ఒప్పుకుంటా. ఆ నిర్ణయం తీసుకున్నా. నా నిర్ణయమే చెల్లాలని వాళ్ళతో పోరాడుతా. ఎందుకంటే ఇది నా జీవితానికి సంబంధించిన అంశం’’.
‘‘అది మీ ఇష్టం’’.
‘‘పద మోరీ, నీతో మాట్లాడాలి. నది ఒడ్డుకు వెడదాం. అక్కడ పౌర్ణమి చంద్రుడిని తిలకిస్తూ.. మత్తెక్కించే తమ్మెరలకు పులకిస్తూ నది ఒడ్డున ఉద్యానవనంలో విహరిద్దాం, ఊసులు చెప్పుకుందాం..’’
మోరీకి నవ్వు ఆగింది కాదు. ‘‘మీ కవిత్వం చాలా బాగుంది. కానీ అవన్నీ ప్రేమికులకు చెల్లుతాయి. మనం ప్రేమికులం కాదుగా. మీరు కావచ్చు అనుకోండి. నేను కాదుగా..’’
అజోడా నిస్పృహగా ‘‘మోరీ, నువ్వలా అంటే నేను మా అమ్మా నాన్నలతో ఎలా పోరాడగలను చెప్పు? నీకోసం నేను మాత్రం ఏ త్యాగమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా’’.
అతడి శోకాకుల కంఠం, మ్రాన్పడిన వదనం హృదయ లోతుల్లోంచి వచ్చే అతడి మాటలు అతడి ప్రేమ నిజమైనదని చెప్తున్నాయి. కానీ తాను స్ర్తిగా తన ఆత్మగౌరవం కాపాడుకోవాలిగా.
‘‘చూడండి, చిన్నయ్యగారూ, మన పెళ్లి కరారు కాకుండా మీతో తిరిగితే సమాజంలో నా పరువు ఏం గాను? అందులోనూ నర్తకి గాయనిగా నన్ను గుర్తుపట్టినవాళ్లు అనేకులున్నారు. మనని విహరిస్తూ ఎవరైనా గుర్తుపడితే తల ఎత్తుకు తిరగగలనా? మీరూ ఆలోచించండి.
అజోడా ఏ జవాబులు చెప్పలేకపోయాడు.
అందువల్ల మీ వాళ్ళూ మా వాళ్ళూ మన పెళ్లికి సరేనంటే కాబోయే దంపతులుగా మనం విచ్చలవిడిగా తిరగవచ్చు. అప్పటివరకు సెలవు’’ అంది మోరీ. - ఇంకాఉంది

-పులిగడ్డ విశ్వనాథరావు