డైలీ సీరియల్

సింధు నాగరికతలో ఓ ప్రేమకథ-33

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఎందుకు ఒప్పుకోరు? ఐతే కాస్త జాగు జరగవచ్చు. ముందు మనం వాళ్ళ వ్యవహారంలో ఎందుకు తలదూర్చడం అంటారు. తర్వాత నేను అలక కోపాల తాపం పుట్టించి మైత్రి సయోధ్యల జలం చిలికించి, నా వాక్పటిమజాలంతో ఆయన్ను బంధించి సరే అనేలా చేస్తా’’ అంది గోదా నవ్వుతూ.
అజోడా నవ్వుతూ ‘‘దేవాంతకురాలివి అక్కా! ఇంకేముంది- కూతురు, అల్లుడు కలిసి దాడి చేస్తే ఏ మామా అత్తలు తట్టుకోగలరు? నువ్వు విజయం సాధిస్తావని నాకు నమ్మకం ఉంది. నీకు మేమిద్దరం జన్మజన్మలకీ రుణపడి వుంటాం’’ అన్నాడు.
‘‘ఒరేయ్ ఓ మాట చెప్పేదా? నీకు కాబోయే పెళ్లాం మొహంలో నీకంటే నేనే ఎక్కువగా పడినట్టుంది. ఆమెను చూస్తుంటే ఆమెతో అలా మాట్లాడాలనే ఉంటుంది నాకు. కానీ నాకో సందేహం, నల్లజాతిలో అంతటి తెల్లటి అమ్మాయి ఎలా పుట్టిందిరా??’’
‘‘ఆమె కడుపులో ఉన్నపుడు వాళ్ళమ్మ పాలు, పెరుగు, పాయసం, నెయ్యి మాత్రమే తినేది కాబోలు’’ అన్నాడు అజోడా. మరి ఆమె అమ్మా నాన్నలకు చిన్నప్పుడు ఆమె దొరికిందని ఎవరికీ చెప్పనని మోరికి మాట ఇచ్చాడుగా!
‘‘బాగుందిరా. ఇంకా నయం సున్నం, పాలరాళ్ళు దూది మూటలు గట్రా మాత్రమే తినేదని చెప్పలేదు, నయమే’’ అంది గోదా నవ్వి.
***
కొండమీద ఉత్సవాలు ఆ రోజే జరుగుతున్నాయి. ఊళ్ళో సందడిగా ఉంది.
మేళతాళాలతో జనం కొండమీదకు వస్తున్నారు. ఎడ్ల బళ్ళమీద భక్త జనం కొండ వద్దకు చేరుతున్నారు. బళ్ళు నిలబడడానికి కొండ ఆవలివైపు జాగా కేటాయించారు. బండివాళ్ళ ఎద్దులను బండినుంచి వేరు చేసి వాటికి విరామం కల్పిస్తున్నారు.
కాలినడకన కూడాభక్తజనం వస్తున్నారు.
తెల్లవారు జామునే హనోడా ఇంట్లో అందరూ మేల్కొన్నారు. రెండు బండ్లు హనోడా కుటుంబాన్ని కొండ వద్దకు తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. రంగు రంగుల పట్టు పరదాలు కట్టి ఉన్న ఆ బండ్లు శోభాయమానంగా ఉన్నాయి. ఎద్దులకు కుంకుమ బొట్లు పెట్టారు. కొమ్ములకు పసుపు రాశారు. వాటి శరీరాలపై పట్టు దుప్పట్లు కప్పారు. మెడలకు కట్టిన గంటల గణగణలు, కాళ్ళ మువ్వల ఝణఝణలు వినసొంపుగా ఉన్నాయి.
పిల్లలు కూడా ఉల్లాసంగా లేచి సిద్ధమై బయలుదేరారు. ఓ బండిలో హనోడా, అజోడా, మాజా కూచున్నారు. రెండో బండిలో గోదా, ఆమె భర్త, పిల్లలు, మోరీ కూచున్నారు.
నవ్వుతూ, తుళ్ళుతూ బయలుదేరారు. స్నానానికి తుండుగుట్టలు, మార్చి కట్టుకోవడానికి బట్టలు కూడా పెట్టుకున్నారు. వీధులంట బళ్ళల్లో, కాలినడకనా జనం కొండవద్దకు వెళుతున్నారు. వీధుల్లో బండివాళ్ళు అదిలింపులతో, అరుపులతో కేకలతో కోలాహలంగా వుంది. బళ్ళు క్రిక్కిరిసిపోవడం వలన బండ్లను ఆపవలసి వచ్చేది. కొద్ది క్షణాల తర్వాత దారి సుగమం అయేది.
బళ్ళు దిగి హనోడా ఆయన కుటుంబం కొండమీదకు చేరారు.
దాన్ని కొండ అనే కంటే దిబ్బ అనాలి. అదేం ఎత్తుగా లేదు. కాని పూజారి వర్గం పట్ల గౌరవం, అక్కడ పూజార్లు నెలకొల్పిన దేవాలయం పట్ల భక్తితో అంతా కొండ అంటారు.
ఆ కొండమీద దాదాపు 36 అడుగుల పొడవు, 21 అడుగుల వెడల్పు, 7 అడుగుల లోతుగల కొలనుంది. దానికి ఉత్తరాన, దక్షిణాన కొలనులోకి దిగడానికి ఇటికల నేల ఉంది.
తూర్పున వరుసలో గదులున్నాయి. ఆ గదుల్లో ఓ గదిలోనున్న బావిలోనుంచి నీళ్ళు తోడి కొలనులో పోస్తారు. కొలను పక్కనున్న మార్గం ఓ వైపు విశాలమైన భవనం ఉంది. దాంట్లో అనేక గదులు, మూడు వరండాలు ఉన్నాయి.
ఓ విశాలమైన గదిలో అమ్మవారి వేషంలో ఓ కన్య కూచుని ఉంది. ఆ భవనంలోవనే ఆ ఊరిని పరిపాలించే పూజార్ల వర్గం కూడా నివాసం ఉంటోంది. ఆ విధంగా ఆ భవనం ఊరికి తలమానికమైనది. అక్కడే పరిపాలన విషయాలు, నగర సౌకర్యాలు, ఆర్థిక పరిస్థితుల గురించి పూజారి వర్గం నగర ప్రముఖులతో కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకుంటుంది.
హనోడా, అతడి కుటుంబం కొలనులో స్నానం చేసి పక్కనున్న గదుల్లో బట్టలు మార్చుకుని భవనంలో అమ్మవారి సందర్శించడానికి వెళ్ళారు. అక్కడి జనం సజీవ దేవుళ్ళ ఉపాసకులు. అందుకే మొహంజోదలో పెద్ద విగ్రహాలు కనబడవు.
అక్కడే ఓ ఎతె్తైన ఆసనంమీద ప్రధాన పూజారి కూర్చుని పూజా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నాడు. మధ్యమధ్యలో అర్చకులకు ఆదేశాలు ఇస్తున్నాడు. ప్రధాన పూజారి గుండుతో ఉన్నాడు. తెల్లని అధోవస్త్రం కట్టుకుని భుజాలమీద తెల్లని వాలువ కప్పుకున్నాడు. గంభీర వదనంతో రాచఠీవితో హుందాగా ఉన్నాడు. చేతిలో బంగారు పొన్నుగల అందమైన లావుపాటి పొడువైన కర్ర ఉంది.
తెల్లని ఛాయ, విశాల నేత్రాలు, తీక్షణదీర్ఘనాసిక, ఎతె్తైన విగ్రహంగల ఆ వృద్ధుని కనుచూపుమేరలో చూసినా, ఇతడెవడో విశిష్ట వ్యక్తి అనే అనిపిస్తాడు.
దైవదర్శనం చేసుకుంటున్న హనోడాని, కుటుంబాన్ని చూసి ప్రధాన పూజారి మందహాసం చేశాడు. హనోడా దైవదర్శనం చేసుకుని ఆయనకు వంగి నమస్కారం చేయగా, జనసమ్మర్దం మూలంగా హనోడాతో సంభాషణ అసంభవమని అతడి వద్దకు ప్రధాన పూజారి మనిషిని పంపించాడు.
ఆ మనిషి హనోడా వద్దకు వచ్చి వినయంగా ‘‘ఆయన్ను కుటుంబంతో సహా తమ వద్దకు తీసుకురమ్మనమని ప్రధాన పూజారివారు నాకు సెలవిచ్చారు. అన్నాడు.
ఆ మనిషే హనోడాని, కుటుంబాన్ని జనసందోహంలోంచి దారి కల్పించి ప్రధాన పూజారి వద్దకు తీసుకువచ్చాడు.
హనోడా, కుటుంబ సభ్యులు ప్రధాన పూజారికి పాదాభివందనం చేశారు. ‘‘తమని సందర్శించకుండానే వెళ్లిపోవలసి వస్తుందని భయపడ్డా. భక్తుల సందోహం అంతలా వుంది’’ అన్నాడు హనోడా.

-ఇంకా ఉంది

-పులిగడ్డ విశ్వనాథరావు