డైలీ సీరియల్

సింధు నాగరికతలో ఓ ప్రేమకథ-34

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదాకు మోరిని ఉపేక్షించడం నచ్చలేదు. ఆమె వెనుకనున్న మోరిని ముందుకు తీసుకువచ్చి ఈమె మోరీ. మంచి గాయని, నర్తకి అంది.
ప్రధాన పూజారి ‘‘ఆ.. గుర్తుందమ్మా. నేను మీ ఇంటికి వచ్చినపుడు నృత్యగానం చేసింది. ఈమె కళా ప్రదర్శనను చూశాక ఎవరు మాత్రం మరువగలడు’’ అన్నాడు.
మోరీ ఆయన కాళ్ళకు మొక్కగా ‘‘శభాష్, నీకు చాలా మంచి భవిష్యత్తు ఉందని నా మనసు అంటోంది’’ అన్నాడు ప్రధాన పూజారి మోరితో. హనోడా, మాజాకు మోరిని మెచ్చుకోవడం నచ్చలేదు, కానీ ఏమనగలరు?’’
‘‘వీళ్ళందరిని నాకు తెలియకపోవడమేమిటి హనోడాగారు. మళ్లీ చూడడం నాకు ఆనందదాయకంగా వుంది’’ అని ఓ అర్చకుడిని పిలిచి ‘‘వీరికి ప్రసాదం ఇప్పిచండి, మనకు కావలసినవారు’’ అనగా ఓ మేదరి బుట్టలో గోధుమ పిండి, ఘుమఘుమనాడే నెయ్యితో చేసిన మోదకలా, నేతిలో వేయించిన రొట్టెలు, మృష్టాన్నాలు, ఉప్ప పిండి వంటలు పెట్టి ఇచ్చాడు.
ప్రసాదాన్ని స్వీకరించి ప్రధాన పూజారిగారికి ధన్యవాదాలు చెప్పి హనోడా, కుటుంబం బయటికి వచ్చి అమృత సమానమైన ఆ అల్పాహారాన్ని అంతా ఆరగించారు.
కొద్దిసేపటికి ఊరేగింపు మొదలైంది. అమ్మవారిలా అలంకరించిన ఆ అమ్మాయినే ఊరేగిస్తున్నారు. ఆమెను పల్లకిమీద కూర్చోబెట్టి నలుగురు మనుషులు మోస్తున్నారు. బాజా భజంత్రీలతో భక్తిపాటలు పాడుతూ జనం ఊరేగింపులో పాల్గొంటున్నారు.
అత్యంత వైభవంగా కొనసాగిన ఊరేగింపు తర్వత సంతర్పణ జరిగింది. భోంచేసి హనోడా కుటుంబం బళ్ళల్లో కూచుని బయలుదేరేసరికి సూర్యాస్త సమయానికి రెండు మూడు గడియలుంటుంది. దారిలో బల్లలమీద రకరకాల బొమ్మలు అమ్ముతున్న విక్రేతలు కనబడ్డారు.
గోదా కొడుకుని చిన్న డప్పు ఆకర్షించింది. బొమ్మల విక్రేత దాన్ని చేతిలో కొడుతుంటే అది శబ్దం చేస్తోంది. గోదా భర్త బండి ఆపించి ఆ బొమ్మను కొని కూతురిని ‘నీకేం కావాలమ్మా?’ అని అడిగాడు. ఆమె పెళ్లికూతురు, పెళ్లికొడుకు బొమ్మలు కావాలంది. పలు రంగులతో మెలిసిపోతున్న ఆ మట్టిబొమ్మలు చూడముచ్చటగా ఉన్నాయి. అవే కాకుండా చాలా బొమ్మలు కొన్నారు.
ఇంటికి చేరేసరికి రెండు గడియల సమయం పట్టింది. బళ్ళు దిగి భవంతిలోకి వెళ్ళారు. భవంతి ముందు వసారాలో కూచుని అంతా ఉత్సవ ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. ఓ పరిచారిక తీపి పానీయం తెచ్చి అందరికీ అందించింది.
మోరి మన మధ్యనే వున్నా ఆమె చేత పాడించి వినకపడకపోవడం ఏమిటనే మాట గోదాకు గుర్తుకొచ్చింది.
‘‘మోరీ, ఓ పాట అందుకో. అందరికీ అలసట తీరుతుంది’’ అంది గోదా.
మాజా ఓ పరిచారికను వాయిద్యాలు తీసుకురమ్మని ఆదేశించింది. ఆమె, మరో పరిచారిక వాయిద్యాలు తెచ్చి పెట్టారు.
మోరీ తీగ యంత్రాన్ని నెమ్మదిగా మీటుతూ ఆలాపన మొదలుపెట్టింది. మోరి క్రమంగా గొంతెత్తి ఆలాపన నుంచి పాటలోకి మారింది. వెంటనే గోదా మృదంగాన్ని అందుకుని దరువు వేయసాగింది. అంతా మంత్రముగ్ధులై వినసాగారు. అజోడా ఆ పాట మాధుర్యానికి భావ విహ్వలుడై లేచి నిలబడి చిందులు వేయసాగాడు. అంతా చప్పట్లతో తాళం వేస్తూ అతడిని ప్రోత్సహించారు.
మోరీ అజోడాని నృత్యం చేస్తూ ఎప్పుడూ చూడలేదు. ఐతే ఆ సమాజంలో ప్రతి వ్యక్తి సామూహిక నృత్యాల్లో పాల్గొనడం సామాన్యమే. ఐతే అజోడా కుశలుడైన నర్తకుడిగా అడుగులు వేస్తూ భావభంగిమలు ప్రదర్శిస్తూంటే ఆమె ఆశ్చర్యపోయింది.
ఈ విషయం తనకు ఎన్నడూ చెప్పలేదే అని వాపోయింది. అవకాశం చిక్కినపుడు తప్పకుండా అతడిని నిలదీయలాని నిశ్చయించుకుంది.
అజోడా నృత్యం చేస్తుంటే చూసి గోదా, ఆమె భర్త కూడా లేచి నిలబడ్డారు. గోదా మృదంగాన్ని మెడలో వేసుకుని ఉన్నితమైన, పొడవాటి సొంపుగా వుండే వేళ్ళతో మృదంగన్నా తకిట ధోం, తకిట ధోం అని పలికించింది. ఆమె భర్త రెండో మృదంగాన్ని మెడలో వేసుకుని అదే తాళం అందుకున్నాడు.
మాజా అది చూసి ‘‘ఇక్కడ మనం అంత విచ్చలవిడిగా నర్తించలేం. వెనుక ఉద్యానంలో పచ్చిక బయలులో అంతా కలిసి నృత్యం చేద్దాం’’ అని ఓ పరిచారికుడిని పిలిచి వెనక పచ్చిక బయలులో రటలకు కాగడాలు ఏర్పాటుచేయమంది.
అందరూ ఉద్యానం వైపు బయలుదేరారు. ఇంతలో పరిచారకుల అరపులు వినబడ్డాయి. ఉద్యానంలోకి కోతులు వచ్చాయి. వాటిని తరుముతున్నారట. ఓ కోతి భవంతిలోకి వచ్చేసింది. కానీ అది లోపల మనుషుల్ని చూసి వెనుతిరిగింది.
దాన్ని చూసిన గోదా పిల్లలు ముందు భయంతో అరిచినా తర్వాత గోదా కూతురు ‘కోతి కోతి’ అని ఉల్లాసంగా అరిచింది. తమ్ముడు అమ్మమ్మ ఒడిలో చేరి భయంగా చూస్తున్నాడు.
పరిచారకులు వచ్చి కోతుల్ని తరిమేశాం, ఇక మీరు రావచ్చు అన్నారు. దాంతో అంతా ఉద్యానం వైపు నడిచారు.
పచ్చిక బయలులో సామూహిక నృత్యకేళి మొదలైంది. ఆ సమయమప్పుడు ప్రకృతి కూడా వాళ్ళతో సమంగా అడుగులు వేస్తూ నర్తిస్తున్నట్లు భాసించింది.
మధ్య మద్య మోరీ ఒంటరిగా హాస వదనంతో, అతి రమ్యంగా నర్తించేది. మృదంగ తాళానికి అనుగుణంగా సాగే ఆమె హస్త, పాద, కటి కదికల్లోంచి ఉట్టిపడే సొగసు, లావణ్యాన్ని చూసి మిగతా నర్తకీ నర్తకులు నృత్యం మాని మూర్త్భీవించి ఆనందించేవారు.
ఈ విధంగా నృత్యం కొంసేపు కొనసాగక హనాడో ఇంక నేను విరమిస్తాను బాబు, మా ఆవిడ కుర్రదవవచ్చు కానీ నేను కుర్రాడిని కాదుగా అన్నాడు నవ్వుతూ.

- ఇంకా ఉంది

-పులిగడ్డ విశ్వనాథరావు