డైలీ సీరియల్

వ్యూహం-15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిటీ బస్సులు పట్టుకుని సిటీ అంతా తిరగడం మాకు అలవాటే’’ అంది సావేరి.
‘‘నేను మిమ్మల్ని కారులో మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను’’ అన్నాడు నిశాంత్.
‘‘వొద్దులెండి, మీకు అనవసరమైన శ్రమ.. బస్సులో వెళ్తాం’’ అంది లోహిత.
సావేరి మాత్రం అతను తమతోపాటే వస్తే బాగుండుననుకుంది.
గ్యారేజ్‌లోనుంచి కారు తీశాడతను.. కార్లో కూర్చున్నారిద్దరూ.
‘‘స్కంద కూడా వుంటే బాగుండేది’’ అన్నాడతను కారు డ్రైవ్ చేస్తూ.
‘‘అవును స్కందగారిని చూస్తే మా అక్కకు కిక్ వచ్చేది’’.
‘‘నిజంగానే నేను డిజపాయింట్ అయ్యాను, ఇంట్లో ఆయన కన్పించకపోయేసరికి.. నువ్వు మాత్రం హరివిల్లులా మెరిసిపోతున్నావ్.. ఏ కిక్ తగిలిందో..’’ అంది చెల్లెలు చెవిలో.
వెంకటేశ్వరస్వామి ఆలయం దగ్గరకు రాగానే ‘‘వనస్థలిపురం వచ్చేశాం.. రెండు నిమిషాలు గుడి దగ్గర ఆపండి! స్వామి దర్శనం చేసుకుని వెళ్దాం!’’ అంది సావేరి.
కారు ఆపాడు నిశాంత్.
***
హాస్పిటల్‌లో పనిచేసే కొందరి ఫోన్లమీద నిఘా వుంది. కొత్తగా చేరిన వాళ్ళ కదలికలు, అనుమానిత వ్యక్తుల సంభాషణలు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారనే విషయాల ‘సర్వైలెన్స్’ విభాగం చూస్తూ వుంటుంది. ఆ విభాగానికి కాశి హెడ్. అన్నిచోట్లా సిసి టివి కెమెరాలు వున్నాయి.
డాక్టర్ అరవింద్ ఛాంబర్‌లోకి కాశీ, అతనితోపాటు పనిచేసే వ్యక్తి వచ్చారు. వీక్లీ రిపోర్టులు ఇస్తూ వుంటారు డాక్టరు అరవింద్‌కు.
‘‘ఏమిటి విశేషాలు?’’ రిలాక్స్‌డ్‌గా కూర్చుని అడిగాడు అరవింద్.
‘‘డాక్టర్ లోహిత టెలిఫోన్ టాక్స్, మూవ్‌మెంట్స్ అబ్జర్వ్ చేస్తూ వున్నాం సర్’’ అన్నాడు కాశీతోపాటు వచ్చిన వ్యక్తి.
‘‘గుడ్.. ఎనీ సస్పీషియెస్’’
‘‘నాట్ రియల్లీ సర్... ఆ అమ్మాయికి నెగెటివ్ నేచర్ ఏమీ లేదు.. మన హాస్పిటల్లో పనిచేయడం రిచ్ ఎక్స్‌పీరియెన్స్‌గానే భావిస్తూ వుంది.. ఈమధ్య ఇరవై ఎనిమిదేళ్ళ కుర్రాడితో తిరుగుతూ వుంది..’’
‘‘మొన్నీమధ్య మన హాస్పిటల్‌కు వచ్చాడు.. మెయిన్ గేట్ దగ్గ వున్న సెక్యూరిటీ వాళ్ళకు ప్రెస్ రిపోర్టర్‌నని చెప్పాడు. లోహిత గారిని ప్రేమిస్తూ ఆమె చుట్టూ తిరుగుతున్నాడేమోనని మా అనుమానం’’’.
అసహనంగా కదిలాడు కాశీ.
‘‘ఆ అమ్మాయికి ఎఫైర్స్ ఏమీ లేవు.. చాలా మంచి అమ్మాయి.. ఆ అమ్మాయి మీద నిఘా అనవసరం’’ అన్నాడు కాశీ.
‘‘నీతో వచ్చిన చిక్కు అదే కాశీ.. అందరిని నమ్మేస్తావ్... ఆడపిల్లలంటే సాఫ్ట్ కార్నర్ వుంది నీ హృదయం.. లోహిత అందంగా వుంటుంది కదా! నువ్వు ఫ్లాట్ అయిపోయావ్’’ అన్నాడు అరవింద్ నవ్వుతూ.
డాక్టర్ అరవింద్ మాటలు నచ్చక మొహం మరో ప్రక్కకు తిప్పుకున్నాడు.
‘‘డాక్టర్ లోహిత ఎవరెవరితో మాట్లాడుతూ వుంది.. ఎన్ని గంటలైనా ఉచితంగా మాట్లాడుకోవచ్చని ప్రొవైడ్ చేసిన లాండ్‌లైన్ నుంచి ఫోన్ కాల్స్ చేస్తూ వుందా?’’ ‘‘ఎక్కువగా వాళ్ళమ్మగారితో, చెల్లెలుతో మాట్లాడుతూ వుంది. ఆ సంభాషణలన్నీ రికార్డు చేశాం! మన హాస్పిటల్ గురించి నెగెటివ్‌గా ఒక్క మాట మాట్లాడలేదు. కానీ ఈమధ్య లాండ్‌లైన్ నుంచి మాట్లాడటం మానేసింది. సొంత సెల్‌ఫోన్ నుంచి మాట్లాడుతూ వుంది. ల్యాండ్‌లైన్ మనం టాప్ చేశామని ఆ అమ్మాయికి అనుమానం వచ్చిందేమో!’’ అన్నాడతను.
కాశీ వైపు తిరిగాడు డాక్టర్ అరవింద్.
‘‘నీతో ఆ అమ్మాయి చనువుగా మాట్లాడుతూ వుంటుంది గదా! ఆమె సెల్‌ఫోన్ తస్కరించు వీలు చూసి.. ఆమె ఫోన్‌లో మైన్సూట్ ఎలక్ట్రానిక్ డివైజ్ అమరుద్దాం.. ‘నీ ఫోన్ దొరికిందని’ వెంటనే ఆ అమ్మాయికి డివైస్ అమర్చిన ఫోన్ తిరిగి ఇచ్చెయ్యి.. ఆమె ఎవరితో మాట్లాడింది దాన్లో అమర్చిన చిప్ ద్వారా మనకు తెలిసిపోతుంది’’ అన్నాడు డాక్టర్ అరవింద్.
తలూపేడు కాశి బుద్ధిమంతుడిలా.
‘‘నౌ యు కెన్ గో!’ అన్నాడు డాక్టర్ అరవింద్.
***
హాస్పిటల్‌కు అవసరమైన సర్జికల్ ఎక్విప్‌మెంటు హైద్రాబాద్‌లో కొంటున్నారు. పర్చేజ్ అసిస్టెంటుకు తోడుగా డాక్టర్ లోహితను వెళ్ళమన్నారు. ఆ వివరాలు కనుక్కుందామని కాశి రూముకు వచ్చింది లోహిత.
ఏ ఏ పరికరాలు కొనాలో ఆ లిస్టు లోహితకు ఇచ్చాడు.
‘‘మీ సెల్‌ఫోన్ ఒకసారి నాకు ఇవ్వండి’’ అడిగాడు కాశి.
‘‘మీ ఫోన్‌లో ఛార్జ్ అయిపోయిందా?’’
‘‘మీ ఫోన్ నాకు కావాలి.. మీరు హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చాక మీ సెల్‌ఫోన్ తిరిగి ఇచ్చేస్తాను’’ అన్నాడతను.
‘‘ఎందుకు?’’
‘‘మా వాళ్ళకు మీ మీద పూర్తి నమ్మకం ఏర్పడలేదు. హాస్పిటల్లో జరిగే వ్యవహారాలు బయట ఎక్కడా పొక్కకూడదు. వాళ్ళ భయం వాళ్ళది.. మీరు ఇన్‌ఫర్మేషన్ ఎవరికన్నా చేరవేస్తున్నారేమోనని కొన్నళ్ళపాటు మీ మీద నిఘా వుంటుంది. మీ ఫోన్‌లో అత్యాధునికమైన ఎలక్ట్రానిక్ చిప్ పెడతారు. మీరు ఎవరితో మాట్లాడుతూంది వాళ్ళకు తెలిసిపోతుంది. మీ ఫోన్ పోయిందని అందరికీ చెప్పండి... ఎవరికన్నా దొరికితే తిరిగి ఇచ్చేయ్యమని కన్పించిన వాళ్ళకందరికి చెప్పండి.. మీరు హైదరాబాద్ నుంచి వచ్చేక మీ ఫోన్ నా రూములో దొరికిందని అందరికీ చెప్పి మీకు ఇచ్చేస్తాను.. మీరు గమనించకుండా మీ సెల్‌ఫోన్ తస్కరించానని మీ బాస్‌కు చెబుతాను’’.
‘‘నా ఫోన్‌లో చిప్ అమర్చబోతున్నట్లుగా నాకు ముందే చెప్పేశారు.. ఒకవేళ నేను సీక్రెట్స్ మాట్లాడాలనిపిస్తే ఆ ఫోన్ ఉపయోగించను కదా!’’ అందామె. - ఇంకా ఉంది

అలపర్తి రామకృష్ణ.. 9908587876