డైలీ సీరియల్

వ్యూహం-16

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘హాస్పిటల్లోని సీనియర్ డాక్టర్లు, వాళ్ళని తోలుబొమ్మలా ఆడించే పైవాళ్ళు అంతా డర్టీ రోగ్స్.. వాళ్ళకు నీ మీద అనుమానం కలగడం నేను సహించలేను. మీ జోలికి వస్తే సహించను. వాళ్ళ పని పడతా! నా సంగతి వాళ్ళకు తెలియదు..’’ అన్నాడు ఆవేశంతో ఊగిపోతూ.
‘‘నువ్వు ఎవరితో కుర్రాడితో రహస్యంగా మాట్లాడుతున్నావని వాళ్ళకు అనుమానం వచ్చింది?’’
వాళ్ళు ఉత్త ఇడియెట్స్ అని చెబుతూ వుంటావ్.. వాళ్ళతో తిరగడం ఎందుకు? మరోచోట ఉద్యోగంకోసం ప్రయత్నం చేయ్యెచ్చు గదా!’’ అందామె.
‘‘అదో గొప్ప కథ. తరువాత ఎప్పుడన్నా చెబుతాను.. దయచేసి మీరు ఆ కుర్రాడితో తిరగకండి.. మీరు అతనితో తిరిగితే నా మనస్సు కూడా గాయపడుతుంది.. మీ మనస్సులో నాకు ఒక్కడికే చోటువుండాలి!’’ అనేశాడు మనస్సులో ఏదీ దాచుకోకుండా.
తోడేళ్ళ గుంపు మధ్య చిక్కుకున్న గొర్రెలా కన్పించాడు ఆమెకు.
ఈ అమాయక చక్రవర్తి ఆసరా వుంటే తోడేళ్ళ గుంపును చెల్లాచెదురు చేయగలదు.
ఆమెకు ధైర్యం ఏర్పడింది.
కాశి తోడ్పాటు వుంటే హాస్పిటల్ రహస్యాలు స్కందకు అందించగలదు. పేద రోగులతో ఆడుకునేవాళ్ళను కటకటాల్లోకి తోసెయ్యాలి!
చేతిలోని సెల్‌ఫోన్ కాశికి ఇచ్చింది.
‘‘నువ్వు చెప్పినట్లే చేస్తాలే!’’ అందామె.
‘గుడ్ గర్ల్’ అన్నాడు సెల్ ఫోన్ తన చెంపలకు అద్దుకుని.
‘‘నువ్వు అప్పుడప్పుడూ నీ భార్య రోషిణిని అందగత్తె అని చెబుతూ వుంటావ్ గదా! ఆమె ఫొటో లేదా నీ దగ్గరా... ఎప్పుడూ చూపించలేదే!’’ అందామె.
‘‘పెళ్లిరోజు వీడియో, నేను రోషిణి తీయించుకున్న ఫొటోలు మొన్న మొన్నటిదాకా భద్రంగానే దాచుకున్నాను. అవి అరవింద్ కళ్ళల్లో పడ్డాయి. అన్నీ తగలపెట్టేశాడు. ‘‘పాత జ్ఞాపకాలు ఏవీ మనల్ని వెంబడించగూడదు. ప్రతిరోజూ కొత్త కొత్తగా జీవించాలి!’’ అంటూ హితబోధ చేశాడు నాకు.
‘‘ఒక్క ఫొటో కూడా లేదా?’’ అడిగిందామె.
‘‘ఎక్కడో అరవింద్‌గారి కంటబడకుండా ఒక్క ఫొటో దాచుకున్నాను.. వెతికి చూపిస్తాను మీకు’’ అంటూ టేబుల్ సొరగులన్నీ వెతికాడు.
పాత డైరీలో ఫొటో దొరికింది.
ఆ ఫొటో ఆమెకు ఇస్తూ, ‘‘నేనూ మా శ్రీమతి రోషిణి, డాక్టర్ అరవింద్, ఆయన భార్య గోల్కొండ ఫోర్ట్‌కు వెళ్లినపుడు తీయించుకున్న ఫోటో’’ అన్నాడతను.
ఆ ఫొటోకేసి చూసింది.
డాక్టర్ అరవింద్ ప్రక్కన నిలబడ్డ యువతిని చూసి ఆశ్చర్యపోయింది.
‘‘ఈవిడ డాక్టర్ అరవింద్ భార్యేనా?’’ అడిగిందతన్ని.
‘‘అవును.. ఆవిడ కూడా డాక్టరే! ఆవిడ పేరు మానస.. వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు.. ఇపుడు ఎక్కడ వుందో తెలియదు.. మానసగారు అమెరికా వెళ్ళిందని విన్నాను’’ అన్నాడు కాశి.
అంటే స్కంద డాక్టర్ కొడుకా?
కళ్ళు చిట్లించి మానస ఫొటోకేసి చూసింది.
‘‘.. ఆవిడే! అనుమానం లేదు.. స్కంద అరవింద్ కొడుకని కాశీకి చెప్పకూడదు. స్కందకు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఈవిషయం చెప్పాలి. అతని స్పందన ఎలా వుంటుందో?!
‘‘రోషిణిగారు చాలా అందంగా ఉన్నారు.. మిమ్మల్ని వదిలి వెళ్ళడం దురదృష్టకరం!’’ అంది లోహిత కాశీతో, ఆ ఫొటో తన బ్యాగ్‌లో పెట్టుకుంటూ.
***
నాంపల్లిలో సర్జరీకి ఉపయోగపడే పరికరాలు కొనడం పూర్తి అయ్యింది.
‘‘మనం కొన్నవన్నీ ప్యాక్ చేయించుకుని ట్రక్‌లో జాగ్రత్తగా తీసుకెళ్ళు! నేను మా అమ్మగారింటికి వెళ్తున్నాను.. రేపు హాస్పిటల్‌కు వస్తానని కాశీగారికి చెప్పు’’ అంది లోహిత, తనతోపాటే వచ్చిన అసిస్టెంట్‌తో.
ఆటో ఎక్కి వనస్థలిపురం వెళ్లింది.
‘‘ఏమిటే చెప్పాపెట్టకుండా హఠాత్తుగా వచ్చావ్... అక్కడ ఉద్యోగం మానేశావా? మంచి పనిచేశావ్’’ అంది అన్నపూర్ణమ్మ.
‘‘అక్కా నీ ఫోన్‌కి రెండుమూడుసార్లు ఫోన్ చేశాను ఉదయంనుంచి రెస్పాన్స్ రావడంలేదు’’ అంది సావేరి.
‘‘నా సెల్ ఫోన్ పోయిందిలే’’
చెల్లెలు చేతిలోని కొత్త ఫోన్ చూసింది.
‘‘కొత్త ఫోన్ ఎక్కడిదే! కొన్నావా?’’ అడిగింది చెల్లెల్ని.
‘‘నిశాంత్ ఇచ్చాడు గిఫ్ట్‌గా.. నిన్న నా బర్త్‌డే! మర్చిపోయావు గదూ! నీ దగ్గరనుంచి ఫోన్ వస్తుందని నిన్నంతా ఎదురుచూశాను’’ అంది సావేరి.
చెల్లెల్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని బుగ్గమీద ముద్దుపెట్టుకుని ‘‘ఒక్క రోజు ఆలస్యంగా నీ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నాను.. మెనీ హాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే’’’ మొత్తంమీద లవ్ ట్రాక్‌లో పడ్డావన్నమాట.
‘‘లేదు.. లేదు.. అతనే నా ట్రాక్‌లోకి చొరబడ్డాడు’’ అంది సావేరి నవ్వుతూ.
‘‘సరే! నీ ఫోన్ ఓసారి ఇవ్వు.. స్కందతో అర్జెంటుగా మాట్లాడాలి’’
స్కందకు కాల్ చెయ్యంగానే లైన్‌లోకి వచ్చాడు.
‘‘హైదరాబాద్ వచ్చాను.. మనం అర్జెంటుగా కలవాలి... ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి నీకు’’ అంది లోహిత.
‘‘ఏమిటది? మీ ఇంటికి నన్ను రమ్మంటావా.. నువ్వు మా ఇంటికి వస్తావా?’’
‘‘మీ ఇంటి దగ్గర మాట్లాడే విషయం కాదు.. పంజాగుట్ట పివిఆర్ మాల్ దగ్గర కలుద్దాం! సాయంత్రం ఆరింటికి అక్కడ వుంటాను’’ ఏదన్నా పిక్చర్ చూద్దాం అందామె.
‘‘ఓకె’’ అన్నాడతను.
***
సాయంత్రం ఐదింటికి పివిఆర్ మాల్ దగ్గర కలిశారు.
‘‘మీ నాన్నగారి పేరు తెలుసా?’’ అడిగింది లోహిత.
‘‘డాక్టర్ అరవింద్..’’ ఎందుకు అలా అడిగావ్?
‘‘మీ నాన్నగారిని నువ్వు ఎప్పుడూ చూడలేదు గదూ!’’ - ఇంకా ఉంది

అలపర్తి రామకృష్ణ.. 9908587876