డైలీ సీరియల్

వ్యూహం-18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదిహేనేళ్ళ తరువాత కన్నకూతుర్ని చూశానన్న సంతోషం ఓవైపు, కుటుంబ సభ్యులకు దూరమయ్యానన్న బాధ మరో ప్రక్క అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది.
‘‘నువ్వు డాక్టరయ్యావా తల్లీ?’’ నోరు పెగల్చుకుని అన్నాడతను.
‘‘ఈ హాస్పిటల్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు?’’
‘‘పదిరోజులయ్యిందమ్మా’’ సమాధానమిచ్చాడు శేషగిరి.
‘‘రోజూ నేను నార్త్ బ్లాక్‌కు వస్తూనే వున్నాను కదా! నాకు ఎప్పుడూ మీరు కన్పించలేదేం?’’
‘‘స్పెషల్ వార్డ్‌లో వుంచారమ్మా! మూడు రోజుల క్రితం ఆపరేషన్ చేశారు.. అక్కడనుంచి నార్త్ బ్లాక్‌కు మార్చారు డాక్టర్’’ అంది నర్సు.
‘‘ఏం ఆపరేషన్ చేశారు?’’
‘‘ఆ వివరాలు నాకు తెలియవు డాక్టర్.. పోస్ట్ ఆపరేటివ్ కేర్ కోసం ఈ వార్డకు మార్చారు పేషెంటుని’’ కేస్‌షీట్ డాక్టర్‌కు చూపిస్తూ అంది నర్సు.
కేస్‌షీట్‌లో వివరాలు ఏమీ లేవు.
‘‘మరేం జబ్బుతో ఆస్పత్రిలో చేరారు?’’ అతనే్న అడిగింది.
‘‘నాకేం రోగాలు లేవమ్మా! నిక్షేపంగా తిరుగుతూ వుండేవాడిని.. భద్రాచలం నుంచి నడుచుకుంటూ వస్తున్నాను.. రెండ్రోజులనుంచి భోజనం చేయకపోవడంతో నీరసం వచ్చి తూలి రోడ్డుమీద పడిపోయాను.. ఎవరో తీసుకువచ్చి ఈ హాస్పిటల్లో చేర్చారు. స్పృహ వచ్చి చూస్తే హాస్పిటల్లో వున్నాను.. డాక్టర్ గారు వచ్చి ‘‘నీకు బంధువులు వున్నారా? తెలిసినవాళ్ళు ఎవరన్నా ఈ చుట్టుప్రక్కల గ్రామాలలో వున్నారా?’’ అని అడిగారు. నాకేదో పెద్ద రోగం వచ్చిందేమో.. చివరి చూపుల కోసం బంధువులకు కబురు పెట్టడానికి అడుగుతున్నారేమోనని అనుకున్నాను.. ‘ఎవరూ లేరు బాబు!’ అని సమాధానం ఇచ్చారు. బలమైన ఆహారం పెట్టారు.. ‘కడుపులో కంతి వుంది.. తీయాలి’ అంటూ ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లి ఆపరేషన్ చేశారు’’ చెప్పుకుపోయాడు శేషగిరి.
‘‘ఇక్కడకు రాకముందు కడుపులో నొప్పి, వాంతులు రావడం, ఏదన్న తిన్న తరువాత కడుపులో మంట తగ్గినట్లు అన్పించడం జరిగేదా?’’ అడిగింది లోసిత.
‘‘ఆ లక్షణాలు నాకేం లేవమ్మా’’
అతనికి వాడుతున్న మందులు చూసింది.. అన్నీ ఆపరేషన్ తరువాత ఇన్‌ఫెక్షన్‌కు రాకుండా వుండటానికి, ఆపరేషన్ చేసిన ప్రాంతం హీల్ కావడానికి ఇచ్చిన మందులే.!
ఆపరేషన్ చేయకముందు తీసిన ఎక్స్‌రేలు ఎక్కడ వున్నాయి?’’ నర్సును అడిగింది.
‘‘డాక్టర్ ఫణిగార్ని అడగండి మేడమ్.. వివరాలన్నీ ఆయన చెబుతారు. ఆపరేషన్ చేసింది ఆయనే!’’
నర్సు ఆపరేషన్ చేసిన డాక్టరు పేరు చెప్పగానే వౌనంగా వుండిపోయింది లోహిత. డాక్టర్ ఫణి సంగతి ఆమెక్కూడా తెలుసు..
ఆయన సీనియర్ డాక్టర్.. చూపులకు మొరటుగా కన్పించడమే కాదు మాటలు, చేతలు కూడా మొరటుగానే వుంటాయి. ఆయన చెప్పింది చెయ్యల్సిందేగాని ఎదురు ప్రశ్నలు వేయకూడదు.. ఆయనతో మాట్లాడటమంటే కొరివితో తలగోక్కోవడమే! ఆయన్ని అడిగే బదులు కాశిని అడిగితే రికార్డులు చూసి తండ్రికి చేసింది ఏ ఆపరేషనో వివరాలు చెబుతాడు అనుకుంది లోహిత.
‘‘ఇప్పుడు దాకా నొప్పులని గోల చేశావ్.. డాక్టరుగారు రాగానే సైలెంట్ అయిపోయావ్.. ఎప్పుడూ ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తూ కన్పించే డాక్టరమ్మగారిని చూడగానే చాలామంది రోగులు ‘సగం జబ్బు తగ్గిపోయిందమ్మా’ అంటూ వుంటారు’’ అంది నర్సు.
‘‘వీరు మా నాన్నగారు.. చాలా సంవత్సరాల తరువాత కలిశాం.. ఈ విషయం అందరికీ చాటింపు వెయ్యకు’’ అంది లోహిత నర్సుతో.
నొప్పులు తగ్గడానికి ఇంజెక్షన్ చేసింది శేషగిరికి.
లోహిత ఆప్యాయంగా నుదురు నిమురుతూ వుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి శేషగిరికి.
‘‘మీ అమ్మ బాగా వుందా? నన్ను పెళ్లి చేసుకుని అన్నీ కష్టాలే అనుభవించింది. చీరలు, నగలు కొనిపెట్టమని ఎప్పుడూ అడిగేది కాదు.. ‘ఎక్కువ సమయం పిల్లలతో గడపండి!’ అదొక్కటే నా కోరిక అంటూ వుండేది.. ఆ ముచ్చటా తీర్చలేకపోయాను అంటూ ఏడ్చేశాడు.
సముదాయించే ప్రయత్నం చేసింది.
‘‘మీరు త్వరలోనే కోలుకుంటారు.. మనింటికి వెళ్దాం. అమ్మకు చెబితే ఎంతో సంతోషపడుతుంది’’ అంది లోహిత.
‘‘వద్దు తల్లీ, ఎవరికీ చెప్పొద్దు నేను కన్పించానని... మళ్లీ మీ ఇంటి గడప తొక్కే అర్హత నాకు లేదు.. రాలిపోయే రోజులు దగ్గర పడ్డాయి.. నేను ఎవరో ఎవరికీ తెలియకుండా రాలిపోదామనుకున్నాను... భగవంతుడు నిన్ను చూసే అదృష్టం కల్పించాడు.. ఇంతకంటే నేను ఏమీ కోరుకోను’’ అన్నాడు శేషగిరి.
తండ్రి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడని అర్థం చేసుకుందామె.
‘‘ప్రశాంతంగా పడుకోండి.. గతం తవ్వుకోకండి’’ మీరు కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు.. ఆ జీవితాన్ని అందుకోవడానికి తొందరగా కోలుకోవాలి!’’ అనుకుంది మనస్సులో.. మిగిలిన విషయాలు నాకు వదిలెయ్యండి అందామె.
గతం తవ్వుకోవద్దని కూతురు చెప్పినా శేషగిరి మనస్సు గతంలోకి జారుకుంది....
***
జీవితంలో పాసయ్యింది ఒకే ఒక టెస్ట్..
అది డ్రైవింగ్ టెస్ట్.. వాహనాలు నడిపే ఆసక్తి చిన్నప్పటినుండి వుండేది. ఎనిమిదేళ్ళ వయసులో సైకిల్ తొక్కడం మొదలుపెట్టాడు. అందరికంటే స్పీడ్‌గా సైకిల్ తొక్కడం నేర్చుకున్నాడు. పదో తరగతికి వచ్చేసరికి స్నేహితుల దగ్గర మోటార్ సైకిల్ తీసుకుని బైక్ నడపడం నేర్చుకున్నాడు.
పదో తరగతి పాస్ కాలేదు గాని మోటార్ బైక్ రేస్‌లో పాల్గొన్నాడు. ఆరుగురు మగ పిల్లల్లో చిన్నవాడు శేషగిరి. అన్నలందరికి పెళ్లిళ్ళు అయ్యేయి. వాళ్ళనాన్నతో పోట్లాట పెట్టుకున్నాడు, తనక్కూడా పెళ్లి చెయ్యమని. ‘‘ఉద్యోగం సద్యోగం లేదు.. పెళ్లికి ఎందుకురా తొందర!’’ అని తండ్రి అంటే వినే్లదు. శేషగిరికి పెళ్లి చేశాడు. భార్య అనుకూలవతి. అన్నపూర్ణ ఓర్పు, సహనం గలది. - ఇంకా ఉంది

అలపర్తి రామకృష్ణ.. 9908587876