డైలీ సీరియల్

వ్యూహం-22

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసక్తిగా అతని వైపు చూసింది చెప్పమన్నట్లుగా.
ఐదేళ్ళ క్రిందట జరిగిన సంఘటన చెప్పుకుపోయాడు కాశి.
‘‘ఐదేళ్ళ క్రిందట ఓ రోజు అరవింద్‌గారి ఛాంబర్‌లోకి వెళ్ళాను. అక్కడ స్మగుల్డ్ గూడ్స్ అమ్మే జాన్ కన్పించేడు. అతన్ని అంతకుముందు చాలాసార్లు అరవింద్‌గారితోపాటు చూశాను.
అరవింద్‌గారు, ఓ పిస్టల్ నా చేతిలో వుంచి ‘‘కాల్చు.. జాన్‌కు గురిపెట్టి కాల్చు.. పిస్టల్‌లో డమీ బుల్లెట్స్ వున్నాయిలే!
సైలెన్సర్ కూడా వుంది. నువ్వు పేల్చినా శబ్దం రాదు’’ అన్నాడు.
పిస్టల్ పట్టుకోవడం అదే మొదటిసారి. ట్రిగర్ నొక్కాను. ‘సర్’మన్న శబ్దం వచ్చింది పిస్టల్ నుంచి.. ఎదురుగా వున్న జాన్ ఓ ప్రక్కకు ఒరిగిపోయాడు.
‘‘అదేమిటి? తమాషాకు అంటే నిజంగానే కాల్చేశావ్.. అన్యాయంగా మనిషిని చంపేశావ్’’ అన్నాడు అరవింద్ లేచి నిలబడి.
నాకు చెమటలు పట్టాయి.. గుండె దడదడ కొట్టుకుంది.. భయపడిపోయి అరవింద్‌వైపు చూశాను, ఎలాగైనా ఆ గండం నుంచి గట్టెక్కించమని.
‘‘వారం రోజులు నీ రూములోనే వుండు.. బయటకు రాకు.. జాన్ శవాన్ని మాయం చేస్తాను. జాన్ హత్య చేయబడ్డాడన్న విషయం ఎవరికీ తెలియనివ్వను.
వెంటనే ఇక్కడనుంచి వెళ్లి నీ రూములో వుండిపో’’ అన్నాడు అరవింద్.
ఆయన చెప్పినట్లే చేశాను.. అప్పటినుంచి అరవింద్‌గారు నాకు దేవుడయ్యాడు.
ఈరోజు అరవింద్‌గారి ఛాంబర్‌లో మళ్లీ జాన్‌ను చూశాను.. నేను ఎవరిని హత్య చేయలేదన్న ఆనందం ఓవైపు, నన్ను మోసం చేసి భయపెట్టారన్న కోపం మరోవైపు.. ఐదు సంవత్సరాలపాటు నన్ను బ్లాక్‌మెయిల్ చేసి నన్ను తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు అరవింద్.
లోహిత నవ్వింది.
‘‘నాక్కూడా ఓ అవకాశం తప్పకుండా వస్తుంది.. డాక్టర్ అరవింద్‌ను కోలుకోని దెబ్బ కొడతాను. నన్ను తక్కువ అంచనా వేస్తున్నాడు. నేనేమిటో వాళ్ళకు తెలిసేటట్లు చేస్తాను.. నా తడాఖా చూపిస్తాను’’ అన్నాడు కోపంతో పళ్ళు పటపట కొరుకుతూ.
‘‘నాకో చిన్న హెల్ప్ చెయ్యాలి! నార్త్ బ్లాక్‌లో వున్న శేషగిరి అనే పేషెంట్‌కు ఏం ఆపరేషన్ జరిగిందో రికార్డులు చూసి చెబుతారా?’’ అడిగింది లోహిత.
కంప్యూటర్‌లో పేషెంటు వివరాలు, జరిగిన ఆపరేషన్స్ వున్న ఫైల్ చూశాడు కాశి.
‘‘కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేష్ జరిగింది.. అతని కిడ్నీని హైదరాబాద్‌కు చెందిన బిజినెస్‌మాన్‌కు మార్పిడి చేశారు. శేషగిరి అంగీకారంతో జరిగిన ఆపరేషన్ కాదది.్ప. దిక్కు మొక్కు లేని వాళ్ళ శరీర భాగాలు తీసి ఇతరులకు అమర్చడం ఈ హాస్పిటల్లో జరిగే మామూలు కార్యక్రమమే!
నా దగ్గర వున్న వివరాలు పోలీసులకు ఇచ్చానంటే అరవింద్, అతని బాస్ కటకటాల పాలవుతారు’’.
కోపంతో ఆ మాట అన్నాడేగాని మరుక్షణంలో తమాయించుకున్నాడు కాశి.
****
‘‘సార్.. పంజాబ్ నుంచి మన్విత్‌సింగ్ వచ్చాడు. మిమ్మల్ని కలవాలంటున్నాడు.. పంపించమంటారా’’ అడిగాడు కాశి ఇంటర్‌కామ్ నుంచి.
‘‘చిన్నా చితకావాళ్ళను నా గదిలోకి పంపొద్దు.. అతనేం చేస్తున్నాడో, ఎవరి రిఫరెన్స్‌తో వచ్చాడో కనుక్కున్నావా?’’ విసుగ్గా అడిగాడు డాక్టర్ అరవింద్.
‘‘మన్విత్‌సింగ్ బిగ్‌షాట్.. జలంధర్‌లో ఆటోమొబైల్ ఇండస్ట్రీ వుందట.. ఆరిఫ్ రిఫరెన్స్ చెబుతున్నాడు’’.
ఆరిఫ్ పేరు వినగానే ఎలర్ట్ అయిపోయాడు. ‘‘ఆరిఫ్ పంపితే నీ దగ్గర ఎందుకు కూర్చోపెట్టుకున్నావ్? వెంటనే పంపించు.. అతను నా గదిలోకి వచ్చేక కూల్‌డ్రింక్స్ పంపించు’’ అన్నాడు అరవింద్.
ఆరడుగుల పొడుగున్న మన్విత్‌సింగ్ దర్జాగా నడుచుకుంటూ డాక్టర్ అరవింద్ ఛాంబర్‌లోకి వచ్చాడు. అతని నీలం రంగు టర్బన్, బూడిద రంగు సూట్, నీలం రంగు నెక్ టైతో హుందాగా కన్పించాడు. ఇరవై ఎనిమిదేళ్ళు ఉంటాయేమోననుకున్నాడు.
‘‘ఆయియే.. మన్విత్‌సింగ్ సాబ్.. ఆప్ కైసాహై?’’ లేచి నిలబడి మన్విత్‌సింగ్‌కు షేక్‌హ్యాండ్ ఇస్తూ పలకరించాడు డాక్టర్ అరవింద్.
హిందీలో మాట్లాడుకున్నారు ఇద్దరూ.
‘‘మా నాన్న హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. గుండెకు సంబంధించిన జబ్బుతో బాధపడుతున్నాడాయన.. గుండె నాళాలు కావాలి అర్జెంటుగా.’’
‘‘అదేమన్నా రెడీమేడ్‌గా దొరికే వస్తువా? ఉయ్ డోంట్ హావ్ ఎనీ హార్ట్ లైన్ బ్యాంక్ విత్ అజ్.. మా దగ్గర గుండె నాళాలు దొరకవ్. బ్రెయిన్ డెడ్ పేషెంటు నుంచి అప్పటికప్పుడు గుండెనాళాలు తీసి గుండె జబ్బుతో బాధపడుతున్న పేషెంట్‌కు అమర్చాలి! ఇట్స్ నాట్ ఎ ఈజీ టాస్క్’’ అన్నాడు డాక్టర్ అరవింద్.
‘‘ఆరిఫ్‌గారు అన్నీ చెప్పారు.. మీరు కోరినంత డబ్బు పే చేస్తాను.. ఎవరన్నా పేద పేషెంటును బ్రెయిన్ డెడ్‌గా చెయ్యండి.. అతని గుండె నాళాలు మా ఫాదర్‌కు మార్చండి.. ఎవ్రీథింగ్ ఈజ్ పాజిబుల్ ఇన్ యువర్ హాస్పిటల్.. అందుకే మీ దగ్గరకు వచ్చింది’’ అన్నాడు మన్విత్‌సింగ్ డాక్టర్ వైపు సూటిగా చూస్తూ.
అతను పదే పదే ఆరిఫ్ పేరు చెప్పేసరికి కాదనలేకపోయాడు.
‘‘సర్లేండి.. అన్నీ కుదిరేక మీకు ఫోన్ చేస్తాను.. మీ విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళండి’’ అన్నాడు డాక్టర్. మన్విత్‌సింగ్ వెళ్లిపోయాక ఏదో అనుమానం వచ్చింది.. విజిటింగ్ కార్డులోని నెంబర్లకు ఫోన్ చేశాడు.. ఒక్కటీ కరెక్టు కాదు.
జలంధర్‌లో విజిటింగ్ కార్డులో వున్న ఇండస్ట్రీ లేనే లేదని తేలింది.. ఒక నెంబరు కర్నూలులో వున్న చెప్పుల షాపుది.. మరో నెంబర్ జలంధర్‌కు చెందినదేగాని అది పోలీస్ స్టేషన్‌ది.
****
- ఇంకా ఉంది

అలపర్తి రామకృష్ణ