డైలీ సీరియల్

వ్యూహం-23

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాఫియా గ్యాంగుకు సొంతంగా గూఢచారి బృందం వుంది. వాళ్ళు హాస్పిటల్ పరిసరాల్లో తిరుగుతూ ఎన్నో వివరాలు సేకరిస్తూ వుంటారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గమనించి ఆ ఇన్‌ఫర్‌మేషన్ డాక్టర్ అరవింద్‌కు అందిస్తూ వుంటారు. వాళ్ళ బాస్ ముంబాయిలో వుంటాడు ఎక్కడ ఏం జరిగినా నిమిషాల్లో అరిఫ్‌కు ఆ వివరాలు అందుతాయి.
డాక్టర్ అరవింద్ దగ్గరకు వచ్చారు వాళ్ళు.
‘‘ఏమిటి విశేషాలు?’’ అడిగాడు అరవింద్.
‘‘మీ దగ్గర పనిచేస్తున్న డాక్టర్ లోహిత ఓ యువకుడితో తరచుగా మాట్లాడుతూ వుంది’’ అన్నాడు అరిఫ్ మనిషి.
‘‘వయసులోవున్న అమ్మాయి యువకుడితో మాట్లాడక ముసలాడితో మాట్లాడుతుందా?’’ నవ్వుతూ అన్నాడు అరవింద్.
‘‘ఆ అబ్బాయి పోలీస్ ఆఫీసర్ అని మాకు తెలిసింది. మన జాగ్రత్తలో మనం ఉండాలి.. మిమ్మల్ని హెచ్చరించమని అరిఫ్‌గారు చెప్పారు’’.
‘‘పోలీస్ ఆఫీసర్ అని తెలిసి కూడా అరిఫ్ వౌనంగా వుండిపోయాడా? అతన్ని లేపేసే ప్రయత్నాలు చేయడంలేదా?’’
‘‘బాస్ అంత తెలితక్కువ మనిషి కాదు. ఒక ఐపియస్ ఆఫీసర్ని చంపేస్తే రాష్ట్రంలోని పోలీసు బెటాలియన్లు అన్నీ వచ్చేసి మనమీద పడతాయి. ముంబాయిలోని బాస్‌ను చుట్టుముట్టేస్తారు. అందరం దొరికిపోతాం. మనమీద వాళ్ళ కన్ను పడింది. ఇక్కడ హాస్పిటల్లో జరుగుగతున్న ‘కిడ్నీ రాకెట్’ గురించి వాళ్ళకు తెలిసిపోయింది. త్వరలోనే బాస్ ఈ హాస్పిటల్‌ను అమ్మేసి మరోచోట హాస్పిటల్ పెట్టే ఆలోచనలో వున్నాడు. నెలరోజుల్లో అరిఫ్‌గారు ఇక్కడకు వొస్తున్నారు. మీతో అన్ని విషయాలు మాట్లాడుతారు. ఈలోపు మన జాగ్రత్తలో మనం ఉండాలి! ఆ పోలీసు ఆఫీసర్ని ఇక్కడనుంచి మరో ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్ చేయించే ప్రయత్నాలు సాగుతున్నాయి’’ అన్నాడతను.
‘‘ఆ పోలీస్ ఆఫీసర్‌తో తిరగొద్దని డాక్టర్ లోహితను హెచ్చరిస్తాను’’ అన్నాడు అరవింద్.
కవరులోనుంచి ఓ ఫోటో తీసి అరవింద్‌కు ఇచ్చాడు.
అది స్కంద, లోహిత పక్కన నిలబడి భుజంమీద చెయ్యి వేసి నిలబడ్డ ఫొటో అది.
ఎక్కడో చూసినట్లు అన్పించింది. పంజాబీ యువకుడి వేషంలో వచ్చి తనను కలిసింది అతనే! అనుమానం లేదు ఆ కుర్రాడే!
వాళ్ళు వెళ్లిపోయేక ఆ ఫోటోకేసి చూస్తూ వుండిపోయాడు.
పెద్ద నుదురు, చురుకైన కళ్ళు, మెడ మీద పుట్టుమచ్చ.
అప్రయత్నంగా తన మెడ తడిమి చూసుకున్నాడు.
తన మెడమీద కూడా పుట్టుమచ్చ వుంది.. తన పోలికలు వున్నాయి.. వయస్సులో వున్నపుడు అచ్చంగా అలాగే వుండేవాడు.
‘‘తన రూపం అతనికి ఎలా వచ్చింది? అంతా విచిత్రంగా ఉందే!’’ ఆలోచనలలో మునిగిపోయాడు డాక్టర్ అరవింద్.
****

శేషగిరి కోలుకున్నాడు.
అన్నపూర్ణకు ఫోన్ చేసింది డాక్టర్ లోహిత.
‘‘అమ్మా.. మిమ్మల్ని చూడాలని వుంది.. వెంటనే కారు మాట్లాడుకుని రండి’’
‘‘‘కారు ఎందుకే? బస్సులో వస్తాం..’’ అంది అన్నపూర్ణ.
‘‘కాదు.. కాదు.. కార్లోనే రండి.. మీరు తిరిగి వెళ్ళేటప్పుడు మీతోపాటు మరో వ్యక్తి కూడా వస్తున్నాడు’’.
‘‘ఎవరు? మీ హాస్పిటల్‌కు సంబంధించిన మనిషా?’’
‘‘మీరు ఇక్కడకు వచ్చేక అన్ని విషయాలు చెబుతాగా’’ అంది లోహిత ముందే అన్ని విషయాలు చెప్పడం ఇష్టంలేక.
అన్నపూర్ణ, శరణ్ కార్లో వచ్చారు. సావేరికి జ్వరం రావడంతో రాలేదు.
హాస్పిటల్ గేటు దగ్గరే ఆ కారును ఆపింది లోహిత. తనూ కార్లో కూర్చుంది. కారు కొంచెం ముందుకు వెళ్ళేక చెట్టునీడలో కారును ఆపమంది.
‘‘అమ్మా.. నేను చెప్పేది శ్రద్ధగా విను.. మిమ్మల్ని హాస్పిటల్ చూపించడానికి పిలిచానని మా హాస్పిటల్ స్ట్ఫాకు చెబుతాను.. మీరు తిరిగి వెళ్ళేటప్పుడు గేటు దగ్గర నాన్నగారు మీ కార్లో ఎక్కి కూర్చుంటారు. ఆయనకు జబ్బు చేసి హాస్పిటల్లో చేరారు. ఇపుడు కోలుకున్నారు. ఆయన మునుపటి మనిషి కాదు. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారు. మీ ప్రశ్నలతో ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోండి’’.
ఏవేవో అడగబోయింది అన్నపూర్ణ.
‘‘ఇప్పుడేం వివరాలు అడగవద్దు.. మనింటికి వచ్చినపుడు వివరంగా మీకు అన్నీ చెబుతాను.. నాన్నకు ఏం లోటు రాకుండా చూసుకోండి’’ అంది లోహిత.
దగ్గర వుండి హాస్పిటల్ బిల్డింగ్స్ అన్నీ చూపించింది. తను వుండే కాటేజ్‌కు తీసుకెళ్లింది. అక్కడే భోజనం చేశారు అందరూ కలిసి.
కాశీకి ఫోన్ చేసింది.
‘‘నార్త్‌బ్లాక్‌లో శేషగిరిని డిశ్చార్జ్ చెయ్యండి. అతను ఇంటికి వెళ్ళాలని గోల చేస్తున్నాడు. వీల్ చైర్‌లో గేటు దాకా తీసుకెళ్ళమని వార్డు బాయ్ చెప్పండి.. అతని బంధువులు కార్లో తీసుకువెళ్తారు’’ అంది లోహిత.
‘‘మీరు ఆర్డర్ వేశాక అమలుపర్చకుండా వుండగలనా? మీరు చెప్పినట్లే చేస్తాను.. డాక్టర్ ఫణిగారు కూడా సంతోషపడతారు. ఆపరేషన్ అయ్యేక అతన్ని ఎక్కువ రోజులు మన దగ్గర ఉంచుకోవడం ఎందుకు? పంపించెయ్యండి! అని మొన్ననే నాతో అన్నాడు’’ అన్నాడు కాశి.
గేటు దగ్గర వీల్‌చైర్‌లో వున్న శేషగిరిని చూడగానే అన్నపూర్ణ కళ్ళు చెమ్మగిల్లాయి. కార్లో శేషగిరిని వార్డు బోయ్, శరణ్ జాగ్రత్తగా కూర్చోబెట్టారు.
చేతులు ఎత్తి భార్యకు నమస్కరించాడు శేషగిరి.
అతని చేతులు పట్టుకుని వారించింది అన్నపూర్ణ.
కారు కదిలింది.
***
హాస్పిటల్‌కు వెనుకవైపు దట్టంగా పచ్చని చెట్లు వున్నాయి. ఆ చెట్లమధ్య పాత్‌వే వుంది. నాలుగు మూలల్లో సిమెంటు బెంచీలు వున్నాయి. హాస్పిటల్ డాక్టర్లకు తప్పితే ఇతరులకు ప్రవేశం లేదు.

- ఇంకా ఉంది

అలపర్తి రామకృష్ణ