డైలీ సీరియల్

వ్యూహం-24

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెట్లమధ్య సాయంత్రం పూట వాకింగ్ చేస్తూ వుంటారు డాక్టర్లు. ఒకళ్ళ్దిదరు సిమెంటు బెంచీమీద కూర్చుని మెడికల్ జర్నల్స్ తిరగేస్తూ ఉంటారు. నాలుగు మూలలా ఐరన్ పోల్స్ వున్నాయి. వాటికి స్పీకర్లు అమర్చి వున్నాయి. వాటిల్లోంచి మంద్ర స్థాయిలో ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్ వినిపిస్తూ వుంటుంది.
‘ఎంత సుందరంగా వున్నాయి పరిసరాలు! స్కంద ప్రక్కన వుంటే ఎంత బాగుండేది’ అనుకుంది లోహిత. ఎదురుగా అతనుంటే సంధ్యా సమయం మరింత రమణీయంగా వుండేది! గోదావరి ఒడ్డున చెట్టాపట్టాలేసుకుని సరదాగాగా తిరగొచ్చు!
వెనుకగా ఎవరో వచ్చి భుజంమీద చెయ్యివెయ్యడంతో ఉలిక్కిపడి వెనుక్కు తిరిగింది.
‘‘్భయపడ్డావ్ గదూ!’’ అన్నాడు డాక్టర్ అరవింద్ నవ్వుతూ.
‘‘లేదండి’’ అందామె.
దడ దడ కొట్టుకుంటున్న హార్ట్‌బీట్‌ను గమనిస్తూ ‘‘రిలాక్స్.. నథింగ్ హేపెన్డ్’’ అనుకుంది.
‘‘సిమెంటు బెంచీమీద కూర్చుందాం పదా! నీతో పది నిమిషాలు మాట్లాడాలి!’’ అన్నాడాయన.
.. చుట్టూ చూసింది. దూరంగా ఓ చెట్టు కింద కూర్చుని వున్న ఇద్దరు డాక్టర్లు కన్పించారు... కొంచెం కుదుటపడింది.
‘‘్భయపడాల్సిన పనేం లేదు. నీకు తండ్రిలాంటివాడిని.. నీలాంటి అమ్మాయి ఉండబట్టే హాస్పిటల్ కొంత వెలుగు సంతరించుకుంటూ వుంది.. లేకపోతే అంతాచీకటే! ఈ హాస్పిటల్‌కు నువ్వు ఆడపడుచువి.. నువ్వు సంతోషంగానే వుంటేనే హాస్పిటల్ కళకళలాడుతూ వుండేది’’ అన్నాడు అరవింద్.
లిలాక్స్‌డ్‌గా కూర్చుంది.
జేబులోనుంచి ఓ కవర్ బయటకు తీశాడు.
‘‘కవర్లో ఏముందో చూడు’’ అన్నాడు కవర్ ఆమెకు ఇస్తూ.
కవర్లో వున్న ఫొటో బయటకు తీసింది.
తను, స్కంద- పి.వి.ఆర్ మాల్ దగ్గర నిలబడి వున్నపుడు ఎవరో చాటుగా తీసిన ఫొటో అది.
‘‘ఎవరు తీశారు ఈ ఫొటో?’’
‘‘ఎవరు తీశారన్నది కాదు పాయింట్.. ఎలా తీశారన్నదే ముఖ్యమైన విషయం.. మీరిద్దరూ రతీ మన్మథుల్లా ముచ్చటగా ఉన్నారు. రతీదేవి అమాయకురాలే! కానీ ఆ మన్మథుడే తుంటరివాడు.. శివుడికి కోపం తెప్పించి భస్మం అయ్యాడు. నీకు ఎవరూ దొరకలేదా తల్లీ! ఐపియస్ ఆఫీసర్‌ను ప్రేమించావ్? అతను క్రైమ్‌బ్రాంచ్‌లో వున్నాడు. మాఫియా గ్యాంగులను మట్టుబెట్టడం అతని డ్యూటీ. పోయి పోయి ఆరీఫ్ బృందంతో పెట్టుకుంటున్నాడు.. బూడిద అయిపోతాడు. అందుకు నువ్వు మరో కుర్రాడిని పెళ్లిచేసుకుని హాయిగా వుండు.. లేదా అతన్ని ట్రాన్స్‌ఫర్ చేయించుకుని మరో ప్లేసులో హాయిగా ఉండమని చెప్పు!’’
డాక్టర్ అసలు రూపం బయటకు వచ్చిందనుకుంది.
‘‘అతను పోలీసు అఫీసరని నాకు తెలియదండి’’’ అందామె.
‘‘నువ్వు మా రహస్యాలు తెలుసుకుని బయటపడటం, ఇక్కడ ఉద్యోగం మానేసి మరోచోట ఉద్యోగం చెయ్యడం జరగని పని.. అసంభవం! బుద్ధిగా నీ పని నువ్వు చేసుకోవాలి! పైవాళ్ళు చెప్పింది తు.చ తప్పకుండా తలొంచుకుని పని చేసుకుపోవడమే నీకు వున్న ఒకే ఒక్క ఆప్షన్.. మరోదారి లేదు! మేం చెప్పినట్లు నడుచుకున్నావంటే నీ జీతం రెట్టింపు అవుతుంది. నెలకు నాలుగు లక్షలు.. ఫస్ట్ తారీకున నీ బ్యాంక్ అకౌంట్‌లో ఆ మొత్తం డిపాజిట్ అవుతుంది. నీ చెల్లిలికి మంచి మొగుడు వస్తాడు. నీ తమ్ముడిని అమెరికా పంపుకోవచ్చు.. పెద్ద భవనం కట్టించుకోవచ్చు.. ప్రతి సంవత్సరం కారు మార్చేసి కొత్త బ్రాండ్ కారు కొనుక్కోవచ్చు’’ అన్నాడతను.
‘‘మీ రహస్యాలు నాకు తెలియడం ఏమిటి సార్!’’ అంది లోహిత.
‘‘డోంట్ ప్లే గేమ్స్ విత్‌మి. నువ్వు మా అమ్మాయివి.. నువ్వు, నీ కుటుంబ సభ్యులు క్షేమంగా వుండటమే నేను కోరుకునేది.. నువ్వు చెయ్యాల్సినదేమిటంటే స్కందకు దూరంగా వుండు.. అతని పేరు మాకు ఎలా తెలిసిందానని ఆశ్చర్యపోతున్నావా? మీ నాన్న కిడ్నీ తీసేసి మరొకరికి అమర్చిన విషయం నీకు తెలిసిందని మాకు తెలుసు.. అతన్ని క్షేమంగా మీ ఇంటికి చేర్చావని కూడా మాకు తెలుసు.. అతని చేత పోలీసులకు స్టేట్‌మెంట్ ఇప్పించడం, కిడ్నీ తీసేశారని కంప్లెయింట్ ఇవ్వడం జరిగితే జరగబోయేది తెలుసా..?’’
అతని మొహంలో వచ్చిన మార్పును గమనించింది లోహిత.
‘‘మీ చెల్లెల్ని ఎవరో రేప్ చేస్తారు, మీ తమ్ముడు ఇంజనీరింగ్ కాలేజీకు వెళ్తుంటే లారీ వచ్చి గుద్దేస్తుంది.. మీ నాన్నని ఎవరో హత్య చేస్తారు.. అరిఫ్ నిన్ను వదలడు.. ముంబై రెడ్‌లైట్ ఏరియాకు నువ్వు చేరిపోతావ్.. ఒక్కసారి జరగబోయే ఆ దృశ్యాలను ఊహించుకో!’’
మొదటిసారి లోహిత భయపడిపోయింది.
అమ్మ చెబుతూనే వుంది.. హాస్పిటల్లో చేరొద్దని! తనే అమ్మ మాట వినకుండా చేరింది.. ఫలితం అనుభవిస్తూ వుంది...
‘‘్భయపడాల్సిన పనేం లేదు.. మేం చెప్పినట్లు నడుచుకుంటే నిన్ను సొంత బిడ్డలాగే చూస్తాను.. నేనున్నాను గదా! నీకేం భయం లేదు.. అరిఫ్ దృష్టి నీ మీద పడనివ్వను’’ అంటూ ఆమె తల నిమిరేడు డాక్టర్ అరవింద్.
డాక్టర్ ఫణి ఈవెనింగ్ వాక్ చేస్తూ అటుకేసి వచ్చాడు.
అరవింద్‌ను చూసి విష్ చేశాడు
‘‘యు హేవ్ నాట్ ఫైనలైజ్‌డ్ మై ఇష్యూ.. స్టిల్ పెండింగ్.. ఎన్నాళ్లని నాన్చుతారు’’ అన్నాడు డాక్టర్ ఫణి.
‘‘ఇట్ ఈజ్ నాట్ ఇన్ మై హేండ్స్.. నేను ఈ హాస్పిటల్‌కు మాత్రమే హెడ్‌ని.. అన్ని హాస్పిటల్స్‌కు హెడ్ అరిఫ్.. అతను సెటిల్ చెయ్యాల్సిందే!’’
‘‘దెన్ యు టాక్‌టు అరిఫ్ అండ్ సెటిల్ ద ఇష్యూ’’
‘‘సర్టెన్లీ’’ అన్నాడు డాక్టర్ అరవింద్.
వాళ్ళిద్దరి మధ్య ఏదో సీరియస్ మాటర్ నలుగుతూ వుందని గ్రహించింది. పొడి పొడిమాటలు మాట్లాడుకుంటున్నా ఏదో కోట్ల వ్యవహారంలా వుంది. బాగా జూలు వున్న రెండు పెద్ద సింహాలు ఎదురుపడినప్పుడు వుండే గంభీరత అక్కడ చోటు చేసుకుంది. - ఇంకా ఉంది

అలపర్తి రామకృష్ణ.. 9908587876