డైలీ సీరియల్

వ్యూహం-25

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డాక్టర్ లోహిత ఫణికి నమస్కరించినా పట్టించుకోలేదు. ఆమె వైపు చూడను కూడా చూడలేదు.
డాక్టర్ ఫణి వెళ్లిపోయాడు.
‘‘వీడు మ్యాడ్ ఫెలో.. ఏది అనుకుంటే అది జరిగిపోవాలి!’’ మనస్సులో అనుకుంటున్న మాటలు పైకి అనేశాడు డాక్టర్ అరవింద్.
ఏ విషయం గూర్చి డాక్టర్ ఫణి అడిగాడో చెబుతాడేమోనని ఎదురుచూసింది లోహిత.
‘‘ఓకె తల్లీ.. చీకటి పడుతుంది.. నీ క్వార్టర్‌కు వెళ్ళు.. డ్యూటీ వుంటే హాస్పిటల్‌కు వెళ్ళు.. ఆఖరిసారిగా నేను నీకు చెప్పేది ఒక్కటే.. వర్క్ వర్క్.. వర్క్.. ఆ విషయం తప్పితే మరొకటి ఆలోచించకు.. ఎవడితోనూ బంధాలు పెట్టుకోకు! అన్నట్లు మర్చిపోయాను.. ఆ కాశీగాడితో ఎక్కువగా మాట్లాడినా టైమ్ వేస్ట్.. వేస్ట్ ఫెలో’’ అనేసి వెళ్లిపోయాడు అరవింద్.
మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ క్వార్టర్ వైపు నడిచింది. గోదావరి నది మీద నుంచి వస్తున్న చల్లటిగాలి ఆమె మనస్సును ఆహ్లాదపరిచింది. ఈ హాస్పిటల్ మీద మాఫియా గ్యాంగుల నీడ పడకుండా వుండినట్లయితే ఎంత బాగుండేది?
కోట్లు, కోట్లు సంపాదించి ఏం చేసుకుంటారు?
అమాయకుల అవయవాలు అమ్ముకోవడం ఎందుకు?
ఏ హాస్పిటల్లోనూ ఇటువంటి సంఘటనలు జరగవు.. మానవుడు దానవుడైతే ఇలాగే జరుగుతూ వుంటుంది.
స్నానం చేసి అలసటను పోగొట్టుకుంది లోహిత.
***
‘‘స్కందతో మాట్లాడాలి!’’ వందోసారి అనుకుంది లోహిత.
తండ్రి కిడ్నీ తీసేసి మరొకరికి అమర్చిన సంగతి చెప్పాలి!
..ఎలా చెప్పాలి! ల్యాండ్ లైన్ టాప్ చేశారు.. తనేం మాట్లాడినా డాక్టర్ అరవింద్‌కు తెలిసిపోతుంది. సెల్‌ఫోన్‌ల చిప్ పెట్టారు.. ఆ విషయం కాశీకి తనకు చెప్పాడు.. సెల్‌ఫోన్‌లో మాట్లాడటానికి వీల్లేదు..
హాస్పిటల్ బయట టెలిఫోన్ బూత్ వుంది. అక్కడికి తను వెళ్లి మాట్లాడితే అందరూ గమనిస్తారు.. సెక్యూరిటీ స్ట్ఫా చూస్తే కొంప మునుగుతుంది.. తనేదో గూడుపుఠాణి చేస్తున్నట్లు అరవింద్‌కు వార్త చేరవేస్తారు.
ఎలా మాట్లాడాలి?
తోటమాలి సయ్యద్ కన్పించాడు. అతను మంచి మనిషి. తనతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతాడు. రంజాన్, బక్రీద్ పండగలప్పుడు బిరియాని, డబుల్‌కామీటా, షీర్, కూర్మా తెచ్చి ఇస్తాడు.. పనివాళ్ళ క్వార్టర్స్ క్యాంపస్‌లోనే ఓ మూల ఉన్నాయి.
‘‘సయ్యద్ బాబా! నువ్వు నాకో సహాయం చేయాలి’’ సయ్యద్‌ను అడిగింది.
‘‘మొక్కలకు పాదులు తీసి నీళ్ళు పోయటం తప్పితే నాకేం పనిరాదు.. నేనేం సహాయం చేస్తాను బంగారు తల్లి’’ అన్నాడు సయ్యద్.
‘‘మీ అమ్మాయి బుర్కా తెచ్చిపెట్టు.. సరదాగా వేసుకుని తిరగాలని వుంది’’.
‘‘అందరి కళ్ళు నీమీదే.. ఆ దిష్టి పోవాలంటే కాసేపు బుర్కా వేసుకుని తిరుగు తల్లీ!’’ అన్నాడు సయ్యద్.
బురఖా తెచ్చి ఇచ్చాడు లోహితకు. అది వేసుకుని మెయిన్ గేట్ దగ్గరకు వెళ్లింది.. ఎవరూ పట్టించుకోలేదు ఆమెను. సెక్యూరిటీ వాళ్ళు ఆమెకేసి అసలు చూడనే లేదు.
పబ్లిక్ టెలిఫోన్ బూత్‌లోకి వెళ్లి స్కందకు ఫోన్ చేసింది.
‘‘హాయ్ లోహితా డియర్.. ఎలా వున్నావ్? ఎవ్వరిథింగ్ ఓకేనా?’’- అవతలివైపునుంచి స్కంద పలుకరించాడు.
‘‘మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. మా నాన్నగారు హాస్పిటల్లో కన్పించారు.. ఆయనకు తెలియకుండా, అనుమతి తీసుకోకుండా ఆయన కిడ్నీలలో ఒకటి తీసేశారు. మా అమ్మ వచ్చి తీసుకువెళ్లింది మా నాన్నను.. మా ఇంటికి వెళ్లి ఆయన్ని కలవండి.. మరో విషయం మీతో తిరగొద్దని నా మీద గట్టి వత్తిడి తీసుకువస్తున్నారు.. ఉద్యోగం మానేస్తే మా కుటుంబ సభ్యులను వేధిస్తారట.. ఆ మాటలు వింటుంటే నాకు భయం వేసింది’’ అందామె.
‘‘్భయపడితే మనం సాధించేది ఏమీ ఉండదు.. ఏదైనా కోల్పోవచ్చు గాని ధైర్యాన్ని కోల్పోగూడదు.. వాళ్ళ మాటలు వింటున్నట్లు నటించు.. మరో నెల రోజులు చాలు వాళ్ళ ఆటలు కట్టించడానికి.. మీ వాళ్ళ భద్రత గురించి నువ్వేం కంగారు పడద్దు! ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్!’’ అన్నాడతను.
ఎవరో తెలిఫోన్ బూత్ దగ్గరకు వచ్చి నిలబడటంతో ఫోన్ పెట్టేసింది.
***
పాతికేళ్ళ కుర్రాడు వచ్చి లోహిత దగ్గరకు వచ్చాడు, ఆమె ఔట్ పేషెంట్స్‌ని చూస్తున్న సమయంలో. అతని పేరు లెనిన్.
పేషెంట్ అనుకుంది. ‘‘ఏమిటీ నీ ప్రాబ్లమ్.. పక్క రూములో డాక్టర్ హరీష్ ఉన్నాడు.. అతని దగ్గరకు వెళ్ళు.. నేను ఆడ పేషెంట్లను చూస్తున్నాను’’ అంది లోహిత.
జేబులోంచి ఉత్తరం తీసి ఇచ్చాడు ఆ అబ్బాయి.
‘‘ఈ ఉత్తరం తెచ్చి ఇచ్చిన అబ్బాయి మా డిపార్టుమెంటులో పనిచేస్తున్నాడు. అతను కానిస్టేబుల్.. అతనికి ఎలక్ట్రికల్ పనులు వచ్చు. మీ హెచ్.ఆర్ వింగ్‌తో మాట్లాడి అతనికి ఎలక్ట్రీషియన్ ఉద్యోగం ఇప్పించు.. అక్కడ అతను పనిచేస్తూ మనకు సహాయపడతాడు. ప్రాణాలకు తెగించి అప్పగించిన పని చేస్తాడు.. నీకు హెల్ప్‌ఫుల్‌గా వుంటాడు.. ఉత్తరం చదివేక చించెయ్యి..’’
ఆ ఉత్తరాన్ని ముక్కలు ముక్కలుగా చించి డస్ట్‌బిన్‌లో పడేసింది. ఓ.డి డ్యూటీ అయ్యేక ఆ కుర్రాడిని వెంటబెట్టుకుని కాశీ దగ్గరకు వెళ్లింది.
‘‘ఈ అబ్బాయి నాకు బాగా తెలుసు.. బంధువుల కుర్రాడు.. పేరు లెనిన్. ఎలక్ట్రికల్ పనులు చేస్తాడు.. ఉద్యోగం కోసం వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చాడు.. మీరే ఇతనికి ఉద్యోగం ఇచ్చి సహాయం చెయ్యాలి’’ అంది లోహిత.
‘‘నీ పేరు మార్చుకోవాలబ్బాయ్.. కనీసం మా దగ్గర పనిచేసినంత కాలం వరకు.. మా హాస్పిటల్ యాజమాన్యానికి లెనిన్, స్టాలిన్, గోర్కి పేర్లు నచ్చవ్. నువ్వు దావూద్ ఇబ్రహీం, లాడెన్, జార్జి బుష్ పేర్లు పెట్టుకున్నా ఫర్వాలేదు.. - ఇంకా ఉంది

అలపర్తి రామకృష్ణ.. 9908587876