డైలీ సీరియల్

వ్యూహం-27

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనను ఫూల్ చెయ్యడానికి ఏవేవో నెంబర్లు కాగితంమీద రాసిచ్చాడా? ఒకసారి హైదరాబాద్ వెళ్లి నిజంగానే అతనికి స్విస్ ఎకౌంట్ వుందో లేదో చెక్ చేసుకోవాలి.
అరవింద్ ఇచ్చిన పేపర్లు, బ్యాంక్ అకౌంట్ డాక్యుమెంట్లు భద్రంగా తన షెల్ఫ్‌లో పెట్టుకున్నాడు కాశి.
****
హాస్పిటల్ దగ్గర వున్న హెలిపాడ్ దగ్గర హడావుడి మొదలంది. ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు ఆ ప్రాంతమంతా చుట్టుముట్టేశారు.
అరిఫ్ అక్కడకు ఎప్పుడు వచ్చినా వుండేది ఓ గంట మాత్రమే! హాస్పిటల్‌కు సంబంధించి కీలకమైన నిర్ణయాలు అతనే తీసుకుంటాడు. అతను తిరిగి వెళ్లిపోయేంతవరకు డాక్టర్ అరవింద్‌కు టెన్షన్.
సొంత హెలికాప్టర్‌లో వచ్చాడు అరిఫ్
హాస్పిటల్‌లో వున్నంతసేపు డాక్టర్ అరవింద్‌ను తప్పితే మరొకరిని కలవడు. అతి ముఖ్యమైన విషయం వుంటే తప్పితే మరొకరికి ఇంటర్వ్యూ ఇవ్వడు.
డాక్టర్ ఫణి ఫోన్ చేశాడు ఇంటర్‌కం నుంచి డాక్టర్ అరవింద్‌కు.
‘‘అరిఫ్‌గారితో మాట్లాడాలి.. మీ ఛాంబరుకు వచ్చేయ్యమంటారా?’’’
‘‘దుబాయ్ కాల్ అటెండ్ అవుతున్నారు.. చాలా బిజీగా ఉన్నారు.. వెంటనే వెళ్లిపోవాలట! ఆయన వస్తున్నారని లంచ్ అరేంజ్ చేశాం! లంచ్ చేసే సమయం కూడా లేదట.. హైదరాబాద్ తిరిగి వెళ్లిపోవాలట!’’ సమాధానమిచ్చాడు అరవింద్.
‘‘నేను కూడా అర్జెంట్ విషయం మాట్లాడాలి.. నా విషయం ఆయనతో మాట్లాడాలి.. టెన్‌మినిట్స్ కంటే ఎక్కువగా మాట్లాడను’’ అన్నాడు ఫణి.
‘‘దుబాయ్ కాల్ అయ్యేక మీకు ఫోన్ కనెక్షన్ ఇస్తాను.. మాట్లాడుతారా?’’
‘‘నో.. నో.. ఐ వాంట్ టు టాక్ పర్సనల్లీ...’’
‘‘సరే.. వచ్చేయండి నా ఛాంబర్‌కు’’
డాక్టర్ ఫణి ఛాంబర్‌లోకి అడుగుపెట్టేసరికి ఏదో చిరాకుపడుతూ అరుస్తున్నాడు అరిఫ్.
‘‘ప్లీజ్ బీ సీటెడ్’’ అన్నాడు డాక్టర్ అరవింద్ డాక్టర్ ఫణిని చూసి.
‘‘ఏమిటి నాతో మాట్లాడాలన్నారట.. మీ మంత్లీ పేమెంట్స్ రెగ్యులర్‌గానే మీ బ్యాంక్ ఎకౌంట్‌లో జమ అవుతున్నాయి కదా!’’ డాక్టర్ ఫణి వైపు తీక్షణంగా చూస్తూ.
‘‘శాలరీ ప్రాబ్లమ్ కాదు’’
‘‘మరేమిటి?’’’ మీకేం ఇబ్బందులు వున్నాయి?
వాళ్ళిద్దరిమధ్య సంభాషణ హిందీలో జరుగుతూ వుంది.
‘‘ఈ హాస్పిటల్లో నాకు అపాయింట్‌మెంట్ ఇచ్చినపుడు మనిద్దరిమధ్య ఓ ఒడంబడిక జరిగింది.. ఆ సంభాషణలు జరిగినపుడు డాక్టర్ అరవింద్ గారు కూడా ఉన్నారు.. ఈ హాస్పిటల్లో చేరేక రిజైన్ చేసి మరో హాస్పిటల్‌లో చేరకూడదు.. అది మొదటి కండిషన్.. డెడికేటెడ్‌గా పనిచేయాలి. రెండో కండిషన్.. హాస్పిటల్లో జరిగే ఆపరేషన్స్ సంగతి ఎవరికీ లీక్ చెయ్యకూడదు.. పదేళ్లు కంపల్సరీగా పనిచెయ్యాలి! అవి మూడు, నాల్గవ కండిషన్స్.. ఆ కండిషన్స్ నేను ఫుల్‌ఫిల్ చేశాను’’ అన్నాడు డాక్టర్ ఫణి, ఒక్క నిమిషం ఆగి అరిఫ్ మొహంలోకి చూస్తూ.
‘‘ఓ.కె.. గుడ్.. దెన్ వాట్? ఇప్పుడు మీ ప్రాబ్లమ్ ఏమిటి?’’’ అడిగాడు అరిఫ్ కుర్చీలో నుంచి లేచి నిలబడి.
‘‘పదేళ్లు కంప్లీట్ అయ్యేక నాకు మీ చైన్ ఆఫ్ హాస్పిటల్స్ బిజినెస్‌లో పార్ట్‌నర్‌షిప్ ఇస్తానన్నారు. పనె్నండేళ్ళు పూర్తి అయింది నేను మీ హాస్పిటల్లో చేరి.. ఐ వాంట్ మై పార్ట్‌నర్‌షిప్!’’ మనస్సులోని మాట స్పష్టంగా చెప్పాడు.
‘‘పార్ట్‌నర్‌షిప్ ఇస్తానని మీకు చెప్పానా?’’ అడిగాడు అరిఫ్.
అవును.. స్పెసిఫిక్‌గా చెప్పారు. ఆ సమయంలో డాక్టర్ అరవింద్‌గారు కూడా మనం అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు ఉన్నారు.. విట్‌నెస్ సంతకం కూడా పెట్టారు. అగ్రిమెంట్ పేపరులో పదేళ్ళ తరువాత పార్ట్‌నర్‌షిప్ ఇస్తానని మెన్షన్ చేశారు’’ అంటూ కోటు జేబులోని అగ్రిమెంటు పేపరు బయటకు తీసి అరిఫ్‌కు చూపించాడు.
‘‘మీ మాట మీద నమ్మకం ఉంది.. పేపరు చూడాల్సిన అవసరం లేదు..తప్పకుండా మీకు పార్ట్‌నర్‌షిప్ ఇస్తాం!’’
‘‘ఎప్పుడు?’’
అరిఫ్ నవ్వాడు.
‘‘అంత తొందరపడితే ఎలా? మీకు ఫ్యామిలీ లేదు.. బంధువుల్ని దూరం చేసుకున్నారు.. పార్ట్‌నర్‌షిప్ అంటే కోట్లలో వుంటుంది.. వందల కోట్లు ఏం చేసుకుంటారు?’’
‘‘డాక్టర్ అరవింద్‌గారిక్కూడా ఫ్యామిలీ లేదు.. భార్యకు విడాకులు ఇచ్చారు.. ఒంటరిగానే వుంటున్నారు.. మరి ఆయనకు పార్ట్‌నర్‌షిప్ ఇచ్చారుగా?’’
అరిఫ్ అసహనంగా అటూ ఇటూ తిరిగేడు, విండో ప్లేన్ నుంచి దూరంగా కన్పిస్తున్న గోదావరి నదిని చూస్తూ.
‘‘మీ ఇష్యూ తొందరగా సెటిల్ చేస్తాం... నో ప్రాబ్లమ్’’
‘‘ఎప్పుడు? నెల రోజుల్లోనా? పది రోజుల్లోనా?’’ అడిగాడు డాక్టర్ ఫణి.
‘‘మీరు మరీ తొందర పడుతున్నారు.. రెండు రోజుల్లోనే మీ పని పూర్తవుతుంది.. ఓ.కె!’’ అన్నాడు అరిఫ్.
ఛాంబర్‌లోనుంచి బయటకు వెళ్లిపోయాడు డాక్టర్ ఫణి.
అతనికి ఎంతో ఆనందంగా వుంది.. తను అనుకున్నది రెండు రోజుల్లోనే జరగబోతున్నదని.
తనిప్పుడు వందల కోట్ల రూపాయలకు అధిపతి!
తన జీవిత ధ్యేయం నెరవేరబోతూ వుంది..
తనుండే విల్లాకు వెళ్లాడు.
ఆ లివింగ్ రూములోనే ఓ ప్రక్కన ఏర్పాటుచేసిన బార్ దగ్గరకు వెళ్లాడు. షెల్ఫ్‌నుంచి మాల్ట్ స్కాచ్ విస్కీ బాటిల్ కొత్తది తీసి మూత తిప్పాడు.
స్కాట్‌లెండ్‌లో తయానైన ఆ విస్కీబాటిల్‌ను చెంపకు ఆనిచ్చుకున్నాడు రెండు క్షణాలు.
మనస్సులో ఏదో తెలియని ఆనందం గోదావరి వరదలా ఉప్పొంగింది.
ఆ విజయం సాధించడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు.. అయినవాళ్ళను దూరం చేసుకున్నాడు.
గుండెల్లో గుచ్చుకున్న బాణాలు గుర్తుకువచ్చాయి. - ఇంకా ఉంది

అలపర్తి రామకృష్ణ.. 9908587876