డైలీ సీరియల్

వ్యూహం-42

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమెకు బ్యాగ్ భుజాన తగిలించుకుని లోపలికి వస్తున్న నిశాంత్ కన్పించాడు.
‘‘మావాడు తీసుకువస్తుంది నీ బ్యాగేనా?’’ అడిగింది రాధమ్మ.
తలూపింది సావేరి.
‘‘ఇప్పటినుంచే మా వాడి చేత నీ బ్యాగులు మోయిస్తున్నావా?’’ అందామె సావేరి మొహంలోకి చూస్తూ.
సిగ్గుపడిపోయింది.
‘‘నిశాంత్ తీసుకొస్తాడులేనన్న భరోసాతో లోపలికి వచ్చేశావ్ కదూ!’’
భయపడిపోయంది సావేరి. తన చిన్న పొరపాటును ఆమె ఎత్తిచూపిస్త్తున్నదా? తన నడవడికను ప్రతిక్షణం గమనిస్తూనే వుంటుందేమో! అటువంటి వాతావరణంలో తను ఇమడగలదా? పెళ్లికాక ముందే అతనితో రావడం పొరపాటేనేమో!
‘‘పెళ్లిచేసుకోబోయేవాడి మీద ఆ మాత్రం భరోసా వుండాలి! నీకు ఇబ్బంది కల్గించకూడదన్న భావన నిన్ను చేసుకోబోయే వాడికి వుండాలి! పెళ్లికాకముందే మా వారు మా ఇంటికి వచ్చారు.. నా అవసరాలు గమనిస్తూ వుండేవారు.. ఏది కావాలన్నా సెంటరుకు వెళ్లి తెచ్చిపెట్టేవారు.. మాకు పెళ్ళై ముప్పైయ్యేళ్ళు అవుతోంది. పెళ్లికి ముందు ఎంత ప్రేమ అనురాగం వొలకబోసేవారో ఇప్పటికీ అంత అనురాగంతో అల్లుకుపోతారు.. ఆయన పేరు మాధవ.. నా పేరు రాధ.. పేర్లు కూడా బాగా కుదిరాయి. నిశాంత్ కూడా అంతే! మనస్సుకు నచ్చితే పెనవేసుకుపోతాడు.. తెల్లవారి వెలుగులా నీ జీవితంలోకి వచ్చాడు.. నిశాంత్ అంటే వేకువ.. నువ్వు సావేరి రాగంలా మావాడి హృదయాన్ని రంజింపచేసి వుంటావ్... అందుకే నిన్ను వదలడంలేదు వాడు’’ చెప్పుకుపోయింది.
నిశాంత్ వచ్చాడు వాళ్ళిద్దరు నిలబడ్డచోటుకి.
‘‘స్నానం చేసి వొచ్చేయ్యి.. కాఫీ కప్పుతో రెడీగా వుంటానని చెప్పావ్.. ఆ అమ్మాయిని బాత్‌రూములోకి వెళ్ళనివ్వకుండా రాగాలాపన చేస్తూ వున్నావు. నెల రోజులు మనింట్లోనే వుంటుంది.. నీ ఇష్టం వచ్చినట్లు వాయించెయ్యి! భరిస్తుంది.. తప్పదు కదా!’’ అన్నాడు నిశాంత్.
కొడుకు చెవి మెలిపెట్టి కిచెన్ రూములోకి వెళ్లింది రాధమ్మ.
టవల్ తెచ్చి ఇచ్చాడు సావేరికి.
బాత్‌రూములోకి వెళ్ళబోతూ నిశాంత్ బుగ్గమీద ముద్దుపెట్టి ‘నిజంగా నేనెంతో అదృష్టవంతురాల్ని!’’ అంది సావేరి.
***
మాధవ, రాధమ్మగారు ఎంతో అన్యోన్యంగా వుండటం గమనిస్తూనే వుంది.
రాధమ్మ రోజూ తల్లో పూలు పెట్టుకోవాల్సిందే! ఏ రోజన్నా పూలు పెట్టుకోకపోతే మాధవ తల్లడిల్లిపోతాడు. ‘‘రాధా వొంట్లో బాగోలేదా? డాక్టర్ దగ్గరకు వెళ్దామా?’’ అంటూ పదిసార్లు అడుగుతాడు. యాభైయ్యేళ్ళు మీద పడ్డా రాధమ్మకు పూలంటే మక్కువెందుకో అర్థం కావడానికి ఎన్నో రోజులు పట్టలేదు సావేరికి.
మాధవ తలకి నూనె రాయించుకుంటూ రాధమ్మ కుచ్చిళ్ళు లాగడం, ఆమె చీర కొంగుతో మొహం తుడుచుకుంటూ తల ఆమె ఎతె్తైన రొమ్ములకు సుతారంగా రుద్దుతూ అల్లరిగా నవ్వడం చూసి మెలికలు తిరిగిపోయింది సావేరి.
కంగారుగా అక్కడినుంచి వెళ్లబోయింది.
ఆమె చేయి టేబుల్ మీద వున్న రాధాకృష్ణుల పాలరాతి విగ్రహానికి తగిలింది.
ఆ విగ్రహం టేబుల్ మీద నుంచి గచ్చుమీద పడి నాలుగు ముక్కలైంది. ఆ పాలరాత్రి విగ్రహం అంటే భార్యాభర్తలిద్దరికి ఎంతో ఇష్టం! ఆ విగ్రహంకేసి చూస్తూ గంటల కొద్దీ కాలక్షేపం చేస్తారు.
సావేరికి చెమటలు పట్టాయి.
రాధమ్మ కోప్పడుతుందనుకుంది. బిక్కుబిక్కుమంటూ ఆమె వైపు చూసింది.
‘‘పిచ్చిదానా! ఏమిటా బేలచూపులు! ఆ బొమ్మ విరిగిపోతే కొత్తవి మరో నాలుగు కొనుక్కుంటాం! మనుషులే శాశ్వతం కాదు.. పాలరాతి బొమ్మ వనె్న తగ్గకుండా, విరిగిపోకుండా వుంటుందా? రేపటికల్లా మరో కొత్త విగ్రహం కొనుక్కొచ్చి అక్కడ పెట్టేస్తారు మాధవగారు.. నువ్వే కంగారుపడాల్సిన అవసరం లేదు!’’ అంది రాధమ్మ సావేరి తల ఆప్యాయంగా నిమురుతూ.
‘‘అందమైన భవంతి కట్టుకుని పాలరాతి విగ్రహాలతో నింపేసినా అది ప్రేమ మందిరం కాదు.. ఏ ప్రేమ మందిరానికైనా అనురాగం, ప్రేమ పునాదిగా వుండాలి! అలంకరణలు కాదు. అన్యోన్యంగా వుండేవాళ్ళకు రెల్లు గడ్డి ఇల్లు అనా ఇంద్రభవనంలా వుంటుంది’’ అన్నాడు మాధవ.

అలపర్తి రామకృష్ణ