డైలీ సీరియల్

వ్యూహం-51

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎదుటివాడు మాట్లాడింది నచ్చకపోతే ఎగిరిపడతాడు. అతను చెప్పింది వినడం, చెయ్యమన్న పని చెయ్యడం ఉత్తమం!
వౌనంగా వుండిపోయాడు అరవింద్.
‘‘మీ ఏరియాలో పెట్టిన హాస్పిటల్లో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాను. లాభాలకు బదులు నష్టాలు వస్తున్నాయి. కోర్టు కేసుల్లో ఇరుక్కుంటున్నాం! పోలీసు అధికారుల కళ్ళు మన మీద పడ్డాయి. నువ్వు సమర్థుడవని ఆ హాస్పిటల్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమిస్తే సమస్యలను పరిష్కారం చెయ్యలేకపోతున్నావ్.. ముఖ్యమైన డాక్యుమెంట్స్ పోగొట్టుకున్నావ్..’’ చిటపటలాడుతూ వున్నాడు అరిఫ్.
ఏదో ఒకటి చెప్పి అతన్ని చల్లబర్చాలి!
సమాధానం చెప్పేందుకు సిద్ధమయ్యాడు అరవింద్.
అదే సమయంలో ఆ భవనం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పరిగెత్తుకుంటూ అక్కడకు వచ్చాడు.
‘‘సార్... నాలుగు వ్యానులనిండా పోలీసులు వచ్చి మన భవనాన్ని చుట్టేశారు. భవనంలో వున్న వాళ్ళందరిని బయటకు వెళ్ళమంటున్నారు. ఒక్కరు కూడా లోపల ఉండటానికి వీల్లేదట! మన సిటీ పోలీసు కమిషనర్‌గారు కూడా వచ్చారు’’ అన్నాడు సెక్యూరిటీ ఆఫీసర్ కంగారుగా.
‘‘మన బిల్డింగ్ మీద రెయిడ్ చెయ్యడానికి వచ్చారా? వాళ్ళ దగ్గర పర్మిషన్ ఉందా?’’ అడిగాడు అరిఫ్.
‘‘బిల్డింగ్ మీద రెయిడ్ కాదట.. సెర్చ్ చేస్తారట!’’
‘‘సెర్చ్ వారంటు వుందా?’’
‘‘అవసరం లేదంటున్నారు వాళ్ళు’.
‘‘ఇడియెట్స్.. ఇప్పుడే సియంతో మాట్లాడి వీళ్ళకు బుద్ధి చెబుతాను’’ అన్నాడు అరిఫ్ సెల్‌ఫోన్‌మీద నెంబరు నొక్కుతూ.
సెల్‌ఫోన్ పనిచెయ్యలేదు. అరవింద్ దగ్గరున్న ఫోన్ తీసుకుని మాట్లాడాలని ట్రై చేశాడు.. సెల్‌ఫోన్స్ పనిచెయ్యడంలేదు.’’
‘‘వాళ్ళదగ్గర జామర్ వుంది సార్! పవరఫుల్ ఎలక్ట్రానిక్ డివైజ్ ఆన్ చేస్తే రెండొందల గజాల మేరకు సెల్‌ఫోన్లు పనిచెయ్యవు. లాండ్ లైన్ కనెక్షన్ కూడా తీసేశారు. మీరు బయటకు వచ్చి పోలీసు కమిషనర్‌గారితో మాట్లాడండి సార్’’ అన్నాడు సెక్యూరిటీ ఆఫీసర్.
బయటకు వచ్చాడు అరిఫ్.
అతనితోపాటు బయటకు వచ్చి పక్కనే నిలబడ్డాడు అరవింద్.
‘‘వాట్ ద హెల్ గోయింగ్ ఆన్ హియర్?’’ పోలీస్ కమిషనర్‌ను కోపంగా అడిగాడు.
‘‘ఇక్కడో ప్రమాదం జరుగబోతున్నది. మిమ్మల్ని అప్రమత్తం చెయ్యాలనే బిల్డింగ్‌లో వున్నవాళ్ళందరిని బయటకు రమ్మని మైక్‌లో అనౌన్స్ చేస్తున్నాం’’ అన్నాడు పోలీసు కమిషనర్ హిందీలో.
‘‘ఏం జరుగబోతున్నది? ఏమిటా ప్రమాదం?’’
‘‘మీరు బయటకు వచ్చారు.. చాలా సంతోషం! లోపల ఇంకా ఎవరన్నా ఉన్నారేమో బయటకు తీసుకు వచ్చేయ్యండి’’ సబ్ ఇన్స్‌పెక్టర్‌కు చెప్పాడు.
పోలీసు హెచ్చరికలకు భయపడి అందరూ బయటకు వచ్చేశారు.
అందరూ వచ్చేశాక బాంబ్ స్క్వాడ్ లోపలకు వెళ్ళింది. వాళ్ళకు సహాయంతో మరికొంతమంది పోలీసులు లోపలికివెళ్లారు. డాగ్ స్క్వాడ్ కూడా వచ్చేసింది.
లోపలి గదుల్లో డ్రగ్స్, గన్స్, కట్టలకొద్దీ క్యాష్ వున్నాయి. అవి పోలీసు కళ్ళల్లో పడతాయేమోనని అరిఫ్ ఆదుర్దా పడ్డాడు.
‘‘మీ బిల్డింగ్‌లో టైం బాంబులు పెట్టామని కొంతమంది మాకు ఫోన్ చేశారు. వెంటనే మేము అప్రమత్తమయ్యాం! ప్రజల ప్రాణాలు, ఆస్తినష్టం కలుగకుండా చూడాల్సిన బాధ్యత మా మీద వుంది కదా!’’ అన్నాడు గోయల్.
‘‘గోయల్ సాబ్.. మీకు వచ్చినవి ఫేక్ ఫోన్ కాల్స్ అయివుంటాయ. ఏదో ఫోన్ కాల్ వచ్చిందని మా బిల్డింగ్‌లోకి మా అనుమతి లేకుండా జొరబడితే ఎలా?’’ పోలీసు కమిషనర్‌ని అడిగాడు.
సంభాషణ అంతా హిందీలోనే జరిగిపోతున్నది.
‘‘బాంబులు పెట్టకపోతే మంచిదే! కానీ మా డ్యూటీ మేం చెయ్యాలి! ఈమధ్య రైల్వే స్టేషన్, మెట్రోరైల్లో, బస్‌స్టాండ్‌లో బాంబులు పెట్టి అమాయకుల ప్రాణాలు టెర్రరిస్టులు తీశారు గదా! వాళ్ళ దాడులను అరికట్టాలనేదే మా ధ్యేయం! మీరు మాకు సహకరించాలి!’’ అన్నాడు గోయల్.
‘‘మీ దగ్గర సెర్చ్ వారంట్ వుందా?’’
‘‘ఐ డోంట్ నీడ్ ఎనీ సెర్చ్ వారంట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఆపరేషన్.. వారెంటులు, పర్మిషన్స్ అంటూ టైమ్ వేస్ట్ చేస్తే ఎంతోమంది ప్రాణాలు పోతాయి.. మీరు ఎన్నో ప్రాంతాల్లో హాస్పిటల్స్ కట్టించి ప్రజలకు సేవ చేస్తున్నారు.. మీ ప్రాణాలు మాకు ముఖ్యమే గదా!’’
తలపట్టుకున్నాడు అరిఫ్.
అసహనంతో ‘‘అనుమతి లేకుండా ఒక్క పురుగును కూడా లోపలికి రానివ్వద్దని మా సెక్యూరిటీ గార్డులకు ఆర్డర్స్ వేశాను.. వాళ్ళను తప్పుకుని మీరు లోపలికి రాగలిగారు?’’ అగాడు అరిఫ్.
‘‘సెక్యూరిటీ గార్డులు కూడా మనుషులే గదా! మీ ప్రాణాలకు ముప్పు ఏర్పడింది.. ప్రక్కకు తప్పుకోవాలి! లేకపోతే మిమ్మల్ని అరెస్టు చేసి జైల్లో తోస్తాం!’’ అనేసరికి వౌనంగా వుండిపోయారు!
పోలీసు కమిషనర్ ప్రక్కన నిలబడ్డ వ్యక్తి చూడగానే డాక్టర్ అరవింద్‌కు అనుమానమొచ్చింది. అన్నీ తన పోలికలే!
వయసులో వున్నపుడు తను ఎలా వుండేవాడో అలాగే వున్నాడు.

అలపర్తి రామకృష్ణ