డైలీ సీరియల్

వ్యూహం-66

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటో దిగి గేటు దగ్గరకు వచ్చి సెక్యూరిటీ వాళ్ళకు తన పేరు చెప్పాడు నాగరాజు.
అతని జేబులు, బ్రీఫ్‌కేసు ఓపెన్ చెయ్యమని చెప్పి అన్నీ చెక్ చేసేక లోపలికి పంపించారు.
స్కంద రూములోకి వెళ్లాడు నాగరాజు.
బ్రీఫ్‌కేసులో వున్న విలువైన సమాచారం చూసి ఎంతో ఆనందపడ్డాడు. డాక్టర్ అరవింద్‌కు ఫోన్ చేసి కృతజ్ఞతలు చెబుదామనుకున్నాడు.
ఎన్నిసార్లు ప్రయత్నించినా అరవింద్ ఫోన్ నుంచి రెస్పాన్స్ రాలేదు. నాగరాజుకు ఎంతో సంతోషమేసింది. అంత పెద్ద ఐపిఎస్ ఆఫీసరు తనను ఎదురుగా కూర్చోబెట్టుకోవడం, కాఫీ తెప్పించడం చూసి ‘మంచి మనసున్న పోలీసు ఆఫీసరు’ అనుకున్నాడు.
అదే సమయంలో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది.
నాగరాజును కొట్టి కారు దొంగిలించుకున్న వ్యక్తులు సిటీలో అటుఇటూ తిరుగుతూ రవీంద్రభారతి దగ్గరకు వచ్చారు.
‘‘అటు పోనివ్వకురోయ్.. లక్డీకాపూల్ సెంటర్ దగ్గర డిఐజి కార్యాలయాలు పోలీసు కళ్ళల్లో పడతాం!’’’ అన్నాడు కార్లో కూర్చున్న వ్యక్తి.
‘‘కారు మన సొంతం అన్నట్లు ఫోజు పెడితే మనల్ని ఎవడూ పట్టుకోలేడు! పోలీసులకు భయపడితే ఎలారా బాబూ!’’ అన్నాడు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి.
కారును లక్డికాపూల్ వైపే పోనిచ్చాడు. మిగతా ముగ్గురు వద్దని వారిస్తున్నా వినకుండా!
కారు డిఐజి కార్యాలయం ముందుకు రాగానే సడెన్‌గా ఆగిపోయింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా కారు కదల్లేదు. పెట్రోల్ టాంక్‌లో సగంకుపైగానే వుంది. కారు బాయినెట్ ఎత్తిచూపాడు.
ఏం ప్రాబ్లమ్ వచ్చిందో డ్రైవర్‌కు అర్థం కాలేదు.
కారులో బాంబులు వుంచి పోలీసు స్టేషన్ దగ్గర వదిలేసి దూరంగా వెళ్లి రిమోట్‌తో పేల్చేస్తారేమోనని మామూలుగానే పోలీసులు వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు వుంటారు. డిజపి కార్యాలయం గేటుకు ఎదురుగా కారు ఆగితే ఊరుకుంటారా?
పోలీసులు కారును చుట్టుముట్టి యక్షప్రశ్నలు వేశారు.
అప్పుడే నాగరాజు స్కంద రూమునుంచి బయటకు వచ్చాడు. రోజూ తను డ్రైవ్ చేసే డాక్టర్ అరవింద్‌గారి కారును గుర్తుపట్టాడు. పరుగెత్తుకుంటూ లోపలికి వెళ్లి స్కందకు చెప్పాడు.
కారును, ఆ నలుగురిని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు పోలీసులు.
‘‘వాడిని కొట్టి కారు సిటీకి తీసుకొచ్చాం! డైరెక్టుగా గ్యారేజీకివెళ్లి అమ్మేసుకోకుండా సరదాగా సిటీలో తిరగడం మొదలుపెట్టాం! మన ఖర్మ కాలి కారు డిజిపి ఆఫీసు ముందే ఆగిపోయింది. ‘ప్రారబ్దం’ అంటే ఇదే!’’ గొణుక్కున్నాడు ఆ నలుగురిలో ఒకడు.
***
ధవళేశ్వరం దగ్గర బోటుమీద గోదావరి నదిమీద వేటకు వెళ్లిన సింహాద్రికి వొక్క చేపకూడా దొరకలేదు.
ఒక్కోరోజు అంతే! చేపల అదృష్టం.. తన దురదృష్టం!
బోటును ఒడ్డుకు చేర్చే ప్రయత్నంలో వున్నాడు.
రెల్లు దుబ్బల మధ్య నీటి మడుగులో మూటలా కన్పించింది.
ఏం మూటో అది! తన అదృష్టం బాగుండి ఆ మూటలో విలువైన వస్తువులు వుంటే, కొంతమంది భక్తులు తమకు లాభాలు వొస్తే కొంత సొమ్ముపెట్టి వెండి, రాగి వస్తువులు కొని మూటగట్టి గోదావరి తల్లికి అర్పిస్తూ వుంటారు.. అటువంటి మూటేమో!
బోటులో వున్న గడకర్రతో ఆ మూటను నెట్టి చూశాడు.
మూటలో సగం భాగం శరీరం, బయటకు సగం కన్పించింది వో శవం. శవాన్ని చూసి భయపడ్డాడు.
బోటు నది నీటి ప్రవాహానికి కొట్టుకుపోకుండా తాడుతో ఒడ్డునవున్న చెట్టుకు కట్టి ఊళ్లోకి పరుగెత్తాడు సింహాద్రి.
ఎవరికీ చెప్పకూడదనుకున్నాడు.
.. మరుసటి రోజు అక్కడ శవం కన్పించదు.. నీళ్ల ప్రవాహానికి కొట్టుకుపోయి ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర తేలుతుంది..
.. అలా వొదిలెయ్యగూడదు.. శవం పూర్తిగా చితికిపోతుంది.. గుర్తు పట్టలేనంత స్థితికి చేరుతుంది రెండు మూడ్రోజులు ఆగితే.. శవం తాలూకు బంధువులకు ఆఖరి చూపు దక్కదు..
పోలీసులకు చెబితేనే మంచిది!
పోలీస్‌స్టేషన్‌కు పరుగెత్తి తనకు శవం కన్పించిన విషయం చెప్పాడు.
‘‘నువ్వే ఎవడినో చంపేసి నదిలో పడేసి శవం దొరికిందంటూ మా దగ్గరకు వొచ్చి నాటకాలు ఆడుతున్నావా దొంగ నాకొడకా! నిజం చెప్పు! మక్కలు విరుగుతాయి..’’ సింహాద్రిని నాలుగుబాదేడు లాఠీతో హెడ్‌కానిస్టేబుల్.
‘వాడెవడో దిక్కుమాలిన వాడిలా వున్నాడు.. చచ్చిపోయి కూడ జనాలను ఇబ్బంది పెడుతున్నాడు!’ అనుకున్నాడు మనస్సులో.
‘‘నాకేటి తెలియదు బాబోయ్.. ఏటికాడ శవం కన్పిస్తే మీకు చెప్పానంతే!’’ వాపోయాడు సింహాద్రి.
సింహాద్రితోపాటు ఇద్దరు కానిస్టేబుల్స్ నది ఒడ్డుకు వొచ్చారు. వాడిచేతే శవాన్ని బయటకు తీయించారు. రిక్షావాడిని పిలుచుకురమ్మన్నారు సింహాద్రిని.
రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ని పిలిపించి పంచనామా జరిపించారు.
శవాన్ని పోస్ట్‌మార్టంకు పంపించాడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్.
రిక్షావాడు శవాన్ని నది ఒడ్డు నుండి తీసుకువొచ్చినందుకు రిక్షా చార్జీలు అడిగితే సింహాద్రినే ఇవ్వమని గదమాయించారు.
‘‘ఏ జన్మలోనో వీడికి ఋణపడి వుంటాను.. ఆ బాకీ ఇలా తీర్చుకుంటున్నాను’’ అనుకున్నాడు సింహాద్రి.
శవం ప్యాంటు జేబులో వున్న పర్సులో కొన్ని క్రెడిట్ కార్డులు దొరికాయి. లెదర్ పర్సులో వుండటంతో వాటిమీద వున్న నెంబర్లు, పేరు చెరిగి పోలేదు. బ్యాంకు వాళ్లను కన్సల్ట్ చేశారు పోలీసులు.
శవం డాక్టర్ అరవింద్‌దని తేలింది.
అతను ఎక్కడ పనిచేస్తున్నది, ఎంత వయస్సు తదితర వివరాలు తెలిశాయి.

ఇంకాఉంది

అలపర్తి రామకృష్ణ