డైలీ సీరియల్

వ్యూహం-70

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లి మండపాన్ని పూలమాలలతో అందంగా అలంకరించింది.
ఆ ప్రాంతమంతా కమ్మటి పూలవాసనతో ఎదురుగా కూర్చున్నవాళ్ళకి ఆహ్లాదాన్ని కలిగిస్తూ వుంది.
ఓ ప్రక్కన సన్నాయి మేళం, మరోప్రక్కన బ్యాండ్ మేళం వాళ్ళు పోటీపడి శ్రావ్యంగా సంగీత స్వరాలు విన్పిస్తూ వున్నారు.
కన్యాదానం సమయంలో వేదిక మీదకు వొచ్చి అన్నపూర్ణమ్మ పక్కన కూర్చున్నాడు. అతనికి ఉన్నది వొక్క చెయ్యే! ఆ చేత్తోనే కార్యక్రమం నడిపించాడు.
బంగారు బొమ్మల్లా వున్న ఇద్దరు కూతుళ్లను చూసి ఆనందపడిపోయాడు. ఎంతోమంది పెద్దలు, అధికార్లు వొచ్చారు పెళ్లి వేడుక చూడడానికి. వాళ్లందరి సమక్షంలో ఆడ పిల్లల తండ్రిగా వేదికమీద కూర్చోవడం ఎంతో గొప్పగా అన్పించిందతనికి.
కన్యాదానం అయ్యేక వేదికమీదే వో ప్రక్కన నిలబడ్డాడు.
ఇద్దరమ్మాయిల పెళ్లిళ్లూ ఒకే లఘ్నంలో.
వధూవరులు ఒకరి తలమీద మరొకరు జీలకర్ర, బెల్లం పెట్టేక అక్షింతలు చల్లి వేదిక దిగి వో ప్రక్కన కుర్చీలో కూర్చున్నాడు శేషగిరి.
అతని ప్రక్కన పాతికేళ్ల యువకుడు కూర్చున్నాడు.
అతిని చేతిలో గిఫ్ట్ ప్యాకెట్ వుంది.
ఫోన్లో ఎవరితోనో మాట్లాడేడు.
‘‘అంకుల్! అర్జెంటుగా ఇంటికి వెళ్లాలి.. మా అమ్మగారు మెట్లమీద కాలుజారి క్రింద పడ్డారట.. వెంటనే ఇంటికి వెళ్లాలి! మీరు ఈ గిఫ్ట్ ప్యాకెట్ నా తరఫున మీరు స్కందగారికి ఇవ్వండి!’’
‘‘మీరెవరు?’’ అడిగాడు శేషగిరి.
‘‘నేను పోలీస్ డిపార్ట్‌మెంటులోనే పనిచేస్తున్నాను.. నా పేరు రాంబాబు!’’
‘‘మా అల్లుడుగారు గిఫ్ట్‌లు తీసుకోడు బాబూ!’’
‘‘పోనె్లండి... మీ అమ్మాయికి ఇవ్వండి! ఇద్దరూ షేర్ చేసుకుంటారు’’
తటపటాయించేడు శేషగిరి.
‘‘ఏముంది ఆ ప్యాకెట్‌లో?’’
‘‘కాస్ట్లీ గిఫ్ట్ ఏం కాదు అంకుల్! తమాషా గిఫ్ట్.. ఈ గిఫ్ట్ స్కందగారికో మీ అమ్మాయికో ఇవ్వండి.. ఇచ్చే ముందు ప్యాకెట్ మీద వున్న ఎర్ర బటన్ నొక్కండి! రంగురంగుల పూలు వధూవరుల మీద పూలజల్లులా పడతాయి!’’
‘‘నువ్వే గిఫ్ట్ ఇచ్చేసి వెళ్లరాదూ!’’
‘‘టైం లేదు అంకుల్ .. ప్లీజ్’’ అన్నాడా కుర్రాడు శేషగిరి చేతిలో ఆ గిఫ్ట్ ప్యాకెట్ ఉంచుతూ..
ఆ కుర్రాడు వెళ్లిపోయాడు హడావిడిగా.
అన్నపూర్ణమ్మ వొచ్చింది శేషగిరి దగ్గరకు కంగారుగా.
‘‘అమ్మాయిలకు చేయించిన నల్లపూస గొలుసులు మన సూట్‌కేసులో ప్లాస్టిక్ డబ్బాలో పెట్టాను.. తీసుకురండి అర్జెంటుగా!’’ అందామె.
‘‘ఈ గిఫ్ట్ ప్యాకెట్ పట్టుకో’’ ఆమెకు ఇవ్వబోయాడు. అతని మాటలకు ఆమె పట్టించుకోకుండా వేదిక మీదకు వెళ్లిపోయింది.
మాధవ ఇంటి ముందున్న పొలాల్లోనే పెళ్లి వేదిక, తాటాకు పందిళ్లు వేసింది. మాధవ ఇంట్లోనే శేషగిరి లగేజ్ వుంది.
ఆ ఇంట్లోకి వెళ్లాడు.
గడప దాటి లోపలికి వెళ్తుంటే తూలిపడ్డాడు.
(ఇంకా ఉంది)

అలపర్తి రామకృష్ణ