డైలీ సీరియల్

యమహాపురి 58

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఒకసారి మా ముఠా కన్నుపడితే- ఏ అమ్మారుూ తప్పించుకోలేదు. నువ్వు కాకపోతే మరొకడు- ఆ లక్షా దక్కించుకుంటాడు’’ అన్నాడు మద్దూ.
తేజ డబ్బుకి ఆశ పడలేదు. తులసికి ఏవౌతుందోనని భయపడ్డాడు. మద్దూ ముఠా గురించి ఎంతోకొంత తెలుసుకుని పోలీసులకి ఫిర్యాదు చెయ్యాలనుకున్నాడు. ‘‘నేనేం చెయ్యాలో చెప్పు’’ అన్నాడు.
‘‘జయదేవ్ టిఫిన్ సెంటర్‌కి వెళ్లు. డబల్ స్పెషల్ ఛాయ్ ఆర్డరియ్యి. డెలివరీ అడ్రస్ చెప్పు. వాళ్లిచ్చిన రసీదు తీసుకో. తులసి నువ్విచ్చిన అడ్రసుకి వచ్చేలా చెయ్యి. అంతే నువ్వు చెయ్యాల్సింది’’ అన్నాడు మద్దూ.
తేజ ఒప్పుకున్నాడు. యాభై వేలు అడ్వాన్స్ తీసుకున్నాడు. వాళ్లు చెప్పినట్లు చేస్తూనే చివరి క్షణంలో తులసికి ఉప్పందించాడు.
వ్యవహారం అంతవరకూ వచ్చేక వాళ్లు తులసిని వదలరు. అందుకని తేజ తులసిని వేరెక్కడికైనా వెళ్లమన్నాడు. ఆమె ఎవరికీ చెప్పకుండా తన తాతగారింటికి వెళ్లిపోయింది.
తులసి దొరక్కపోతే మద్దూ ముఠా తనని వేటాడుతుందని తేజకి తెలుసు. అందుకని అతడు ఎవరికీ కనపడకుండా మాయమయ్యాడు.
తులసి తండ్రి తేజని అనుమానించాడు. సుందరానికి ఫిర్యాదు చేసి రహస్యంగా దర్యాప్తు చెయ్యమని కోరాడు. సుందరం తేజ కోసం వేట ప్రారంభించాడు.
‘‘మద్దూకి దొరికితే ప్రాణాలు పోతాయి. సుందరానికి దొరికితే జైల్లో రక్షణ దొరుకుతుంది’’ అని ఆశపడి తేజ సుందరానికి దొరికిపోయాడు...
***
‘‘ఎక్కడా పొల్లుపోకుండా నా కథ మీకు తెలిసింది సార్! ఇంకా మీరు నేను తులసిని కిడ్నాప్ చేశాననుకోవడం అన్యాయం సార్!’’’ అన్నాడు తేజ.
‘‘నువ్వు చెప్పాల్సినవి మరికొన్ని ఉన్నాయి. మద్దూ తులసికోసం నీ దగ్గరికొచ్చాడంటే- నీకు అతడితో కానీ, వాళ్ల ముఠాతో కానీ ముందే పరిచయముండి ఉండాలి. నా అనుమానం- నువ్వు తులసి చెయ్యి పట్టుకున్నానన్నావే- అది కూడా ఆ ముఠా ప్రోద్బలంమీదనే అని. ఆమెని ముగ్గులోకి దింపి వాళ్లకి అప్పగించాలనుకున్నాను. కానీ ఆ అమ్మాయి ప్రవర్తన నీలో కొంత మార్పు తెచ్చి వుంటే ఉండొచ్చు. అందుకని చివర్లో తులసికి నువ్వు సాయపడి ఉండొచ్చు. నువ్వామెని మద్దూకి అప్పగించలేదని ఇంకా నాకు నమ్మకం కుదరడంలేదు’’ అన్నాడు శ్రీకర్.
ముందు కాసేపు ప్రతిఘటించినా- శ్రీకర్ ఊహ కొంతవరకూ నిజమేనని తేజ ఒప్పుకున్నాడు.
‘‘నేను తులసికి ఉపకారం చేసిన మాట మాత్రం నిజం సార్! ఆమె మద్దూకి దొరకలేదు. లేకుంటే నాకిప్పుడు ప్రాణభయం ఉండేది కాదు’’ అన్నాడు.
‘‘తులసి ఇప్పుడు తన తాతగారింట్లోనే ఉంది సార్! వెరిఫై చేసుకున్నాను’’ అన్నాడు సుందరం.
‘‘అంటే తేజ మద్దూకి దొరికితే- తులసి ఎక్కడుందో చెప్పిస్తాడు. కాబట్టి తులసి రక్షణ కోసం తేజకి మన లాకప్‌లో ఆతిథ్యం ఇవ్వాలి’’ అన్నాడు శ్రీకర్.
‘‘ఆతిథ్యమంటే?’’ అన్నాడు తేజ అనుమానంగా, భయంగా.
‘‘మా ఆతిథ్యం పలు రకాలు. నీకే రకం ఆతిథ్యం లభిస్తుందీ అన్నది, నువ్వు మద్దూ గురించి అందించే వివరాలు మాకెంత ఉపయోగపడ్డారుూ అన్నదానిమీద ఆధారపడి ఉంటుంది’’ అన్నాడు శ్రీకర్.
తేజ ముఖంలో భావోద్వేగం- ‘‘తులసి పరిచయం అయ్యాక ఆడపిల్లల మీద నా అభిప్రాయం మారిపోయింది సార్! నేను పనిచేసే బస్సులో రోజూ చాలామంది అమ్మాయిలుంటారు సార్! వాళ్లలో ఎవరికన్యాయం జరిగినా తట్టుకోలేను. మద్దూ ముఠాని పట్టుకుందుకు మీకు నేను శాయశక్తులా సహకరిస్తాను సార్!’’ అన్నాడు.
శ్రీకర్‌కి అతడి ముఖంలో నిజాయితీ కనిపించింది.

12
‘‘నరకపురిలో ఏదో జరుగుతోంది. అది మంచో చెడో తెలియడంలేదు. కానీ దాంట్లో జగదానందస్వామి పాత్ర ఉంది. నరకపురి వివరాలు తెలుసుకుందుకు మనకిప్పుడు ఒకే ఆధారం రాణి. ఇక ఆమెతో మామూలుగా వ్యవహరిస్తే ప్రయోజనం లేదు. ఎలాగో ఆమెని ఒకసారి స్టేషన్‌కి రప్పించాలి’’ అన్నాడు శ్రీకర్ భార్యతో.
‘‘ఇది చాలా బాగుంది. తాళికట్టిన మగడు నోరు విడిచి అడిగాడు కదా అని ఎప్పుడైనా ఒప్పుకుని మీ డ్యూటీ నేను చెయ్యొచ్చు. అస్తమానూ అంటే కుదరదు’’ అంది వసంత.
‘‘నేను నోరు విడిచి అడిగానా, నువ్వు సరదాపడి అడిగావా? నిజం చెప్పు’’’ అన్నాడు శ్రీకర్.
‘‘అడిగానే అనుకోండి. ఆడదానివి, ఇలాంటివాటిలో తలదూరిస్తే ప్రమాదం- అంటారుగా! మీకిష్టమైనప్పుడే ఇలాంటివి చేయాలని మీరంటే- నాకిష్టం లేనప్పుడు చెయ్యనని నేనంటాను. మీ చేత తాళి కట్టించుకున్నది మీ పోలీసు డ్యూటీ చెయ్యడానిక్కాదు’’ అంది వసంత గోముగా.
‘‘కాదు కానీ- నీకో విషయం తెలుసా? నా డ్యూటీ నువ్వు నాకంటే బాగా చేస్తావు. ఒకటి రెండుసార్లయితే పెళ్లామే కదా అని ముద్దుపడతాను కానీ- అస్తమానూ నువ్వు నన్ను మించిపోతుంటే అసూయతో కుళ్లిపోతాను కూడా. అందుకే అప్పుడప్పుడే, అదీ తప్పనప్పుడే నేను నీ సాయం తీసుకుంటున్నా..’’ అన్నాడు శ్రీకర్.
వసంత ముఖం ఎర్రబడింది. ‘‘ఉబ్బేసి పని చేయించుకోవడం మీకు బాగా తెలుసు. కానీ నేను పొగడ్తలకి లొంగేదాన్ని కాను’’ అంది.
‘‘ఐతే నువ్వు నాకోసం ఇంకొక్కసారి రాణివి కలుసుకోవా?’’ అర్థిస్తున్నట్లు అడిగాడు శ్రీకర్.
‘‘ఉహూ’’ ‘‘ఐతే వేరే మనిషిని చూసుకుంటానే్ల- నీకంటే ఎర్రగా, బుర్రగా ఉన్న పాపని కలుసుకుని..’’
శ్రీకర్ మాట సగంలో ఉండగానే, ‘‘ఆ పాప నరకపురి వెళ్లగలదా మరి..?’’ అంది వసంత.
‘‘నరకపురి ఎందుకు? లేడీస్ హాస్టల్‌కి కదా, వెళ్లాల్సింది..’’ అన్నాడు శ్రీకర్ అనుమానంగా.
‘‘రాణి నరకపురి వెళ్లింది. ఇప్పట్లో వెనక్కి రాదుట. హాస్టల్ వార్డెన్ చెప్పింది’’ అంది వసంత తాపీగా.

ఇంకా ఉంది

వసుంధర