డైలీ సీరియల్

ఎప్పుడె ప్పుడు? -- 3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఎలాగూ మెలకువగా వుంటాం కదా?’’ ఆమె నుదురు మీద ముద్దుపెట్టుకుని అన్నాడు.
అతని చేతులు ముందుకు కదులుతున్నా ఆలోచనలు మాత్రం వెనక్కి వెళ్తున్నాయి.
కిరణ్ అన్న మాటలు అతనికి గుర్తొస్తున్నాయి.
నిశ్చల పరిస్థితి కూడా అలానే వుంది.. వెళ్తూ వెళ్తూ తనను పక్కకు పిలిచి పావని చెప్పిన మాటలే పదే పదే గుర్తొస్తున్నాయి.
ఇద్దరి పరిస్థితీ అలానే వుంది.
***
ఆ మాటలు..
నిశ్చలతో పావని అన్న మాటలు..
నిహార్‌తో కిరణ్ చెప్పిన మాటలు...
ఈ కథను మారుస్తుందని ఆ నిమిషం వారిద్దరికీ తెలియదు.
రెండు జీవితాలను ప్రశ్నించే వైవాహిక జీవిత సత్యం, ఒక సరికొత్త నాటకానికి తెరతీస్తుందని ఆ క్షణం వారిద్దరికీ తెలియదు.
వాళ్ళిద్దరూ ఈ ఇద్దరితో ఏం చెప్పారు?
2
బద్ధకంగా కళ్ళు తెరిచాడు నిహార్.. రొమాంటిక్ ఫ్లేవర్ తాలూకూ హ్యాంగోవర్ నుంచి ఇంకా బయటపడలేదు. రాత్రి అంతా ఒక కలలా అనిపిస్తుంది. బ్రహ్మచారి లైఫ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టేశాడు. సింగల్‌కాట్ డబుల్‌కాట్ అయ్యింది. ఈ మార్పు చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. తన గదిలోని సింగల్ కాట్‌ను స్టోర్‌రూమ్‌లోకి తరలిస్తుంటే ఒక విధమైన ఫీలింగ్ కలిగింది. అప్పగింతల్లో అమ్మాయి తల్లిదండ్రులు పెట్టుకున్నట్టు తను కన్నీళ్ళు పెట్టుకోవాలా?
‘‘ఇన్నాళ్లు నన్ను నిద్రపుచ్చిన మైడియర్ సింగల్ కాట్.. గుడ్‌బై ఫరెవర్. మళ్లీ నీ అవసరం నాకు రాదు.. రాకూడదు’’ అనుకున్నాడు.
తల తిప్పి చూసాడు... వాడిన సన్నజాజులు, వాడిపోని తన పరిమళాలతో తనకు గుడ్‌మార్నింగ్ చెబుతున్నట్టు వుంది. పరుపుమీద కుదురుగా వుండవలసిన బెడ్‌షీట్ ఇష్టమున్న డైరెక్షన్‌లోకి మారింది.. ఎప్పుడూ తనను పలకరించే దిండు.. మరో దిండుతో కలిసి ముచ్చట్లు చెబుతోంది. ఆ దిండును చేతిలోకి తీసుకున్నాడు. తన నిశ్చల తల పెట్టి పడుకున్న దిండు.. దాన్ని గట్టిగా తన గుండెలకు హత్తుకున్నాడు.
పెళ్ళైతే ఇంత బావుంటుందా? పెళ్లిలో ఇంత మ్యాజిక్ వుందా?
అతనికి కళ్ళు తెరవాలనిపించడంలేదు. సరిగ్గా అప్పుడే తనకు సుపరిచితమైన చప్పుడు.. అడుగుల శబ్దంతోపాటు పట్టీల శబ్దం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లా వినిపిస్తోంది.
ఒక్క క్షణం చిత్రంగా అతనికి సిగ్గు ముంచుకు వచ్చింది.. నవ్వొచ్చింది. తాను సిగ్గుపడడమేమిటి?
అతని ఆలోచనకు చిన్న అంతరాయంలా వినిపించింది గొంతు.
‘‘శుభోదయం శ్రీవారికి..’’ అన్న మాటలు అమృతతుల్యంగా వినిపించాయి. ప్రతీ భార్య భర్తకు ఇలాగే గుడ్‌మార్నింగ్ చెబుతుందా? జీవుడిలో చిన్న సందేహం. మెల్లిగా కళ్ళు తెరిచి చూసాడు.
ప్రకృతి తలంటుకున్నట్టు వుంది.
‘‘వెరీ వెరీ గుడ్‌మార్నింగ్’’ అంటూ రెండు చేతులు చాచాడు. మంచంమీదికి వచ్చి అతని గుండెలో ఒదిగిపోయింది నిశ్చల. గట్టిగా హత్తుకున్నాడు. మత్తుగా చుట్టుకున్నాడు. అతనికి లేవాలనిపించలేదు. అది కోరిక తాలూకు వైబ్రేషన్ కాదు.. ఇష్టం తాలూకు టెంటేషన్.
‘‘నిశ్చలా.. నిన్ను వదలాలని అనిపించడంలేదు’’ అన్నాడు ఆమె వీపును చుట్టేసి.
‘‘వదలడానికా నన్ను పెళ్లిచేసుకున్నారు?’’ అడిగింది నిశ్చల.
‘‘్ఛ ఛ నా ఉద్దేశం అది కాదు.. ఇప్పుడు..’’
‘‘ఇప్పుడే కాదు ఎప్పుడూ కాదు ఎప్పుడెప్పుడూ కాదు..’’ అతని పెదవులను తన పెదవులతో మూస్తూ అంది.
‘‘ప్రెషప్ అయి వస్తాను..’’ అంటూ లేవబోయాడు.
‘‘ఇప్పుడు ఫ్రెష్‌గా వున్నారుగా.. మళ్లీ ఎందుకు ప్రెష్‌అప్’’ అంది తన జుట్టును ముద్దుగా చెరిపేస్తూ.
‘‘అది కాదు నిశ్చల నువ్వు ప్రెష్‌గా ఉన్నావు.. నేను పాచి మొహంతో వున్నాను’’ కాస్త ఇబ్బందిగా అన్నాడు నిహార్.
‘‘ఏం పాచిమొహంతో మొగుడిని కౌగిలించుకోకూడదని చట్టం ఏమైనా ఉందా?’’
ఒక్క క్షణం స్థాణువయ్యాడు నిహార్. భర్త ప్రేమగా దగ్గరికి తీసుకుంటే.. అబ్బా వేళాపాళా లేదా అని విసుక్కునే భార్యల గురించి విన్నాడు.. కానీ ఇక్కడ..?
‘‘హలో మిస్టర్ శ్రీవారు..’’ ముద్దుగా పిలిచింది నిశ్చల. ఆమె కళ్ళల్లోకి అలాగే చూస్తూ ఆమె కనురెప్పలమీద ముద్దుపెట్టుకుని లేచాడు.
నిశ్చల లేచి వాష్‌రూమ్‌వైపు నడిచింది క్షణాల్లో పేస్ట్ బ్రష్‌తో వచ్చింది.. బ్రష్‌మీద పేస్టు వేసి భర్తకు ఇచ్చింది.
అలాగే అపురూపంగా భార్య వైపు చూస్తున్నాడు. బ్రహ్మచారి బ్రతుక్కి, పెళ్ళైనవాడి లైఫ్‌కు ఇంత డిఫరెన్స్ ఉంటుందా? మామూలుగా అయితే తాను పేస్ట్ ఎక్కడుందో.. బ్రష్ ఎక్కడుందో వెతుక్కోవాలి.. కానీ ఇపుడు రెడీమేడ్‌లా..
‘‘ఐ లవ్ యు’’ అన్నాడు బ్రష్ చేసుకుంటూ నిహార్.
‘‘పేస్ట్ బ్రష్ ఇస్తే ఇలా చేసేస్తారా?’’ నవ్వుతూ అడిగింది నిశ్చల.
‘‘అందుక్కాదు..’’ అని ఆగాడు ఏం చెప్పాలో తోచలేదు.
‘‘స్నానానికి వేడి నీళ్లు రెడీ..’’ అంది నిశ్చల.
‘‘మరి స్నానం చేయించడానికి..?’’ అని అల్లరిగా అడగాలనుకున్నాడు నిహార్... కానీ అప్పుడే తొందరపడితే ఫ్యూచర్ టెస్స్ వరెస్డ్‌గా మారే అవకాశం ఉంటుందేమోనన్న భయం కలిగింది.
‘‘స్నానం చేయించడానికి రెడీ..’’ అంది నిశ్చల.
ఒక్కక్షణం బ్రష్‌మీద వున్న పేస్ట్ మింగేసిన ఫీలింగ్ కలిగింది. తన ఫీలింగ్స్‌ను చదివేసి డబ్బింగ్ చెబుతుందా? అనుమానంగా భార్య కళ్ళలోకి చూసాడు.
‘‘అదీ మీకు ఓకే అయితే.. లేదంటే నా స్నానం నాది.. మీ స్నానం మీది.. నో బలవంతం’’ చిన్నగా అంది.
అక్కడ నిశ్చల లేకుండా ఉండి ఉంటే మంచంమీదికి గెంతి కుప్పిగంతులు వేయాలన్న కోరికను బలవంతంగా అణుచుకున్నాడు.
‘‘డబుల్ బొనాంజా అంటే ఇదేనా’’ అనుకున్నాడు.
భార్యాభర్తలమధ్య వుండే సాన్నిహిత్యాన్ని ఇలాంటివి ఊపిరి పోస్తాయి. కీ ఇచ్చినట్టుగా ఎవరికివారు యాంత్రికం, అయిన దాంపత్య జీవితాన్ని గడిపేవారికి నిశ్చలానిహార్‌లు స్ఫూర్తిగా ఉండాలి..
***
డైనింగ్ టేబుల్ దగ్గర కూచొని భార్య వంకే చూస్తున్నాడు. కీ ఇచ్చిన బొమ్మలా కిచెన్‌కు డైనింగ్ హాల్‌కు తిరుగుతోంది.
వేడి వేడి పొగలు కక్కే ఇడ్లీలు. కారప్పొడి నెయ్యి.. వేరుశెనగ చట్నీ అల్లం చట్నీ... దోసెలు..
అతనికి అబ్బురంగా వుంది, ఒక టిఫిన్ చేయడానికే నానా కుస్తీలు పడాలి. పక్కింటివాళ్ళు రాళ్ల పోలికతో వుండే చల్లారిన రెండు ఇడ్లీలు చట్నీ లేకుండా ఇస్తే ఆవకాయతో బ్రహ్మాండం అని తిన్న రోజులు గుర్తొచ్చాయి. కళ్ళ ముందు ఒక గొప్ప రొమాంటిక్ మూవీ హార్ట్‌టచ్ అనే సబ్‌టైటిల్స్‌తో చదువుతున్నట్టు వుంది.
ప్లేట్‌లో ఇడ్లీ వడ్డిస్తుంటే పక్కన మరో ప్లేట్‌లో దోసెలు బౌల్‌లో చట్నీ ప్లేట్‌లో ఓ పక్కన కారప్పొడి కరిగించిన నెయ్యి..
నిశ్చల దగ్గరికి లాక్కుంది. అతని తల ఆమె నడుం వంపును పలకరిస్తుంది.
‘్థంక్యూ సోమచ్.. నాకు ఇదంతా ఓక కలలా వుంది’ అన్నాడు మనస్ఫూర్తిగా.
అతని తలలోకి చేయి పోనిచ్చి ‘‘కల నిజమైంది.. నిజమైన కల. ఇలా కళకళలాడుతూ ఉండాలి.. అన్నట్టు మీకు ఇడ్లీ దోసె కాంబినేషన్ ఇష్టం కదూ’’ అంది.
‘‘అవును నీకెలా తెలుసు?’’ అడిగాడు కాసింత ఆశ్చర్యంగా నిహార్. తన గురించి చెప్పాడు కానీ తన ఆహారపు అలవాట్లు చెప్పలేదు.
‘‘ఇష్టమైన వ్యక్తి గురించి తెలుసుకోవడం కష్టం కాదు. మా ఫ్రెండ్ పావనికి గోకితే అది వాళ్ళాయన్ని గీకింది. కిరణ్‌కు పావనికి రెండు పావ్‌బాజీలు తినిపిస్తే మూడు గంటలపాటు నాన్‌స్టాప్‌గా మీ ఫుడ్ హాబిట్స్ చెప్పారు. అప్పుడప్పుడు నువ్వుల పొడి బెల్లం కలిపి తినేవరకూ..’’ కూల్‌గా చెప్పింది.
-సశేషం

-తేజారాణి తిరునగరి