డైలీ సీరియల్

ఎప్పుడె ప్పుడు?-4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిహార్‌కు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తపసు చేయకుండానే దేవుడు వరమిచ్చాడు. ఆ వరమేమిటా అని చూసుకోకుండానే ఆ వరం తన నిశ్చల అని చెప్పకనే చెప్పాడు. థాంక్యూ గాడ్.. అనుకున్నాడు.
ఆ దేవుడు తమతో ఓ గేమ్ ఆడుతాడని తెలియని నిహార్.
***
మనసుకు ఆనందం కలిగినపుడు గంటలు క్షణాలుగా అనిపిస్తాయి. మనసుకు కష్టం కలిగినపుడు, మనసులో ఆందోళన వున్నపుడు క్షణమొక యుగంలా అనిపిస్తుంది.
అదేకాలం అదే సమయం అదే వర్తమానం..
గోడ గడియారం వంక చూడ్డానికే భయం వేసింది.. చూస్తే టైం పది అయినట్టు.. తాను వెంటనే ఆఫీస్‌కు వెళ్ళాలని గుర్తుచేస్తున్నట్టు అనిపిస్తుంది. తాను నిశ్చల కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేయడం.. ఇవాళ తనకు కొసరి కొసరి మరీ తినిపించడం. వేడి వేడి ఫిల్టర్ కాఫీ.. అంతకన్నా వేడెక్కించే తన స్పర్శ.. తన జీవితంలోకి వార్మ్ వెల్‌కమ్‌లా వచ్చింది.. నులివెచ్చని సూర్యోదయం ప్రతీక్షణం తనని వెన్నంటి వున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇది అతనివైపు ఫీలింగ్.. మరి ఆమె వైపు ఫీలింగ్స్ ఏమిటి?
***
‘‘అప్పుడే వెళ్ళాలా? అతని తెల్లటి పాదాలమీద ముద్దుపెట్టి సాక్స్ వేస్తూ అడిగింది’’ నిశ్చల. ఆమె నేలమీద కూచొని వుంది. అతను సోఫాలో వున్నాడు.
‘‘పోనీ ఈరోజు ఉండిపోనా?’’ వెంటనే అడిగేశాడు క్షణం ఆలస్యం చేయకుండా.. స్కూల్‌కు వెళ్ళే పిల్లాడు ఉత్సాహంగా స్కూల్‌కు వెళ్లడం మానేయనా? అని అడిగినంత ఉత్సాహంగా.
‘‘వద్దొద్దు... సాయంత్రం వరకే కదా.. ఆ తర్వాత అంతా మనదే కదా’’ అంది.
‘‘అది కాదు నిశ్చలా, ఈ రోజు శ్రావణ బుధవారం కదా.. ఆప్షనల్ హాలీడే తీసుకోవచ్చు..’’ నోటికి వచ్చిన అబద్ధం చెప్పాడు.
‘‘హలో శ్రీవారు.. శ్రావణ శుక్రవారాలుంటాయి కానీ శ్రావణ బుధవారాలు ఉండవు..’’ నవ్వుతూ అంది సాక్స్ వేసి షూ తొడుగుతూ.
‘‘అలాగా.. మరి మా కిరణ్ అలా చెప్పాడేమిటి..? వాడు మాథ్స్‌లో కాస్త వీక్ అనుకుంటాను..’’ అన్నాడు.
షూ వేసి లేచి నిహార్ పక్కన కూచొని అతని భుజంమీద తలపెట్టి..
‘‘్థంక్యూ’’ అంది.
‘‘ఎందుకు?’’ ఆమె తల మీద చేయి వేసి అడిగాడు నిహార్.
‘‘ఏమో తెలియదు.. ఎందుకంటే ఎందుకని చెప్పను.. మిమ్మల్ని నాకు ఇచ్చినందుకు అని చెప్పనా? ఏమో..’’ సన్నటి కన్నీటి పొర అడ్డుతగులుతుండగా చెప్పింది.
అలాగే ఆమెను చుట్టేశాడు.
‘‘ఎప్పుడెప్పుడు ఆఫీస్‌నుంచి తిరిగివస్తానా? అని నాకు నేను ఎదురుచూస్తున్నాను. ఎపుడూ ఇల్లు బోర్ కొట్టేది.. ఎందుకో తెలుసా.. ఒంటరితనం.. గోడలు కుర్చీలు నేను.. ఒక గొంతు తప్ప నేనూ అవీ ఒక్కటే అనిపించేది.. కానీ నువ్వు ఎడారిలో మంచు తుఫాన్‌లా చుట్టేశావు’’.
ఆమె అతని మాటలు వింటోంది.. గుడిలో శ్లోకంగా వుంది.
మదిలో జోలపాటలా వుంది.
నిహార్ లేచాడు. నిశ్చల గుమ్మం వరకూ వచ్చి అతని బైక్ గేటు దాటేవరకూ వుండి లోపలికి వచ్చింది.
ఒక్కసారిగా బోరుమన్నట్టు అనిపించింది ఇల్లు.
***
కిరణ్ మాటిమాటికి రోడ్డు వంక చూస్తున్నాడు. సోఫాలో కాళ్ళు బార్లా చాపుకుని టీవీలో ప్రోగ్రాం చూస్తోంది.. సౌండ్ వాల్యూమ్ పెంచి.
‘‘అబ్బా కాస్త సౌండ్ తగ్గించు.. నేను ఆఫీసుకు వెళ్ళాక నువ్వు చేసే పని ఏముంటుంది.. టీవీ మెడకు కట్టుకుని చూడు’’ విసుగ్గా అన్నాడు.
‘‘మీరు ఆఫీస్‌కు వెళ్ళాక చేసేది ఏముంటుంది.. సొల్లువాగుడు.. కాంటీన్‌లో కబుర్లు.. కామెంట్స్..’’ రిటార్టిచ్చింది పావని.
‘‘అవునవును.. నేను సొల్లు వాగుడు వాగితేనే జీతం ఇస్తారు.. కాంటీన్లో కబుర్లు చెబితేనే శాలరీ ఇస్తారు.. నెలంతా గొడ్డుచాకిరీ చేస్తేనే మీ పెళ్లాల సోకులకు డబ్బులిస్తారు’’ అక్కసుగా అన్నాడు.
‘‘ఇదిగో సంబంధం లేకుండా మాట్లాడితే నాకు ఒళ్ళు మండుతుంది’’ కోపంగా అంది టీవీ వాల్యూమ్ కావాలనే పెంచి.
‘‘టీవీ వాల్యూమ్‌ను పెంచొచ్చు.. తగ్గించవచ్చు.. నీ గొంతు వాల్యూమ్ తగ్గించడం కష్టం.. అయినా ఆఫీస్‌కు వెళ్ళే మొగుడికి టిఫిన్ చేయాలన్న ఇంగిత జ్ఞానాన్ని మీ టీవీ సీరియల్స్‌లో చూపించడంలేదా? బ్రెడ్ జామ్... ఇదో బ్రేక్‌ఫాస్ట్.. దేవుడు భార్యని ఇమ్మంటే బండరాయిని ఇచ్చాడు.. స్వగతంగా గొణుక్కున్నాడు కిరణ్.
ఇది వాళ్ళింట్లో సర్వసాధారణం.. ఇద్దరూ ఒకరికొకరు బద్ధశత్రువులే...
ఒక్కరివల్ల మరొకరు తమ జీవితం నాశనం అయ్యిందని గొడవ పడుతూ వుంటారు.
వాళ్ళ మధ్య గొడవలకు కారణం ముందు ముందు తెలుస్తుంది.
టైం చూసుకున్నాడు పది దాటుతుంది. రాత్రి తాను నిహార్‌ను అడగడం మర్చిపోయాడు. పెళ్లికి ముందు రోజు ఇద్దరూ ఒకే బైక్‌లో ఆఫీసుకు వెళ్ళేవాళ్ళు. పెట్రోల్ వేస్ట్.. అని, అదీకాక కలిసి వెళ్లొచ్చని వాళ్ళ ఫీలింగ్. ఇద్దరూ పనిచేసేది ఒకే ఆఫీస్, కిరణ్ ఇల్లు దారిలోనే... ఎప్పటిలానే ఈ రోజు కూడా ఎదురుచూశాడు. కానీ నిన్న వాళ్ళ ఫస్ట్‌నైట్ అన్న విషయం మర్చిపోయాడు.
‘‘పోనీ ఫోన్ చేస్తే?’’ అనుకున్నాడు.
‘‘అయినా పెట్రోల్‌కు కక్కుర్తి కాకపోతే ఎవరి బైక్‌లో వాళ్ళు వెళ్ళొచ్చుగా.. అందరు మీలా జడపదార్థాల్లా వుంటారా? పెళ్లాన్ని అపురూపంగా చూసుకుంటారు.. పెళ్లాలకు అన్ని సేవలు చేసి వస్తారు.. పెళ్ళానికి బోల్డు హెల్ప్ చేస్తారు.. పక్కింటి మంజులకైతే వాళ్ళాయన నీళ్లు కూడా తోడిపెడతాడు. బాత్‌రూమ్‌లో కాళ్లు స్లిప్ అయిందని మోసుకువెళ్ళాడు’’ రుసరుసగా అంది పావని.
‘‘వాళ్ళాయనకు అభ్యంతరం లేకపోతే నేనూ ఎత్తుకెళ్తాను’’ ఒళ్ళు మండి అన్నాడు కిరణ్.
‘‘అలానా.. ఇంతవరకు ఎంతమందిని ఎత్తుకెళ్లారేంటి?’’’ అనుమానంగా అడిగింది పావని.
‘‘అదొక్కటే తక్కువ.. నాకు అంత అదృష్టం కూడానా? చెప్పా పెట్టకుండా నా అబ్బ ఈ సంబంధం ఫిక్స్ చేశాడు.. నాకూ యావజ్జీవ శిక్ష వేసాడు’’.
‘‘నాకైతే చచ్చేవరకూ చావమని శిక్ష వేశారు మా ఇంట్లో’’ తానూ తక్కువ తినలేదన్నట్టు అంది పావని.
‘‘అవునవును.. ఎవరికి శిక్షో.. ఎవరిమీద ఆ దేవుడికి కక్షో తెలుస్తూనే వుంది..’’ కౌంటర్ ఇచ్చాడు కిరణ్.
ఇప్పుడే ఇంటి ముందు బైక్ ఆగిన శబ్దం.. నిహార్ ఇంటిముందుకు వచ్చి హారన్ కొట్టాడు. అప్పుడు స్పృహలోకి వచ్చాడు కిరణ్.
బైక్ దిగకుండానే ‘వెళదామా?’ అన్నట్టు చూశాడు నిహార్.
‘‘అదేమిట్రా ముందు లోపలికి రా. నీకు బొత్తిగా సభా మర్యాద లేకుండాపోతోంది’’ అన్నాడు.
నిహార్ నవ్వి బైక్ స్టాండ్‌వేసి కిరణ్ దగ్గరికి వచ్చాడు.
‘‘రోజూ మా ఆవిడ ఇచ్చే కాఫీలాంటి పదార్థం తాగివెళ్ళేవాడివి కదా.. ఇపుడేమిటి.. ప్రొటోకాల్ మర్చిపోయావు?’’ అన్నాడు లోపలికి నడుస్తూ కిరణ్
‘‘అది.. నిశ్చల పొద్దునే్న రెండు టిఫిన్‌లు చేసింది.. ఇడ్లీ, దోసెలు కారంపొడి నెయ్యి.. పల్లీ చట్నీ.. వేడి వేడి ఫిల్టర్ కాఫీ.. పొట్టలో గ్యాప్ లేదురా..’’ చెప్పాడు నిహార్.
*
-సశేషం

-తేజారాణి తిరునగరి