డైలీ సీరియల్

ఎప్పుడె ప్పుడు?-5

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కాస్త గట్టిగా చెప్పరా.. కొందరికి వినపడి చావదు.. రెండు టిఫిన్స్.. ప్చ్ ఇక్కడ మాకు ఒక టిఫిన్‌కి గతిలేదు.. అక్కడ వేడి వేడి ఫిల్టర్ కాఫీ.. ఇక్కడ టీ నీళ్ళకే మోక్షం లేదు.. ఏదో నువ్వొస్తే నిన్ను తిట్టుకుంటూ అయినా కాఫీ నీళ్ళు ఇస్తుంది కదానని లోపలికిరమ్మన్నా’’.
‘‘నిహార్ మీ ఫ్రెండ్ మాటలేమీ పట్టించుకోను.. భార్యను ఎలా చూసుకోవాలో చెప్పు మీ ఫ్రెండ్‌కు..’’ అంటూ కిచెన్‌లోకి వెళ్లింది కాఫీ తీసుకురావడానికి.
‘‘ఇదిరా వరుస.. నీకు అనుభవంలోకి రావడానికి కాస్త టైం పడుతుంది. అప్పటివరకూ ఎంజాయ్’’ అన్నాడు.
పావని కాఫీ తెచ్చి ఇద్దరికీ ఇచ్చింది. తనూ తెచ్చుకుంది.
‘‘నిహార్ నువ్వు నీ ఫ్రెండ్‌లా తయారవ్వకు.. భార్యను బాగా చూసుకోవాలి. కొందరికీ ఇంట్లో భార్య ఉందన్న స్పృహనే ఉండదు. ఎప్పుడు పక్కింటావిడ బాత్‌రూమ్‌లో కాలు జారిపడుతుందా? ఎప్పుడు ఆవిడను ఎత్తుకుని వెళదామా అని ఉంటుంది.. అసయ్యంగా...’’ ఇందాకటి కిరణ్ మాటలను దెప్పిపొడుస్తూ రిపీట్ చేసింది.
‘‘్ఛఛ.. కిరణ్ అలాంటివాడు కాదు పావని..’’ కిరణ్‌ను వెనకేసుకొస్తూ అన్నాడు నిహార్.
‘‘మరి ఎలాంటివాడు?’’ దీర్ఘాలు తీస్తూ అడిగింది పావని.
‘‘మీ వార్ ఇప్పట్లో తెమిలేలా లేదు.. ఒరే కిరణ్.. పద.. ఆఫీస్‌కి లేట్ అవుతుంది’’ అన్నాడు.
కిరణ్ లేచి బయటకు నడిచాడు.. పావని కనీసం కిరణ్ వైపు చూడను కూడా చూడలేదు.
నిహార్‌కు తనను నిశ్చల టాటా చెప్పిన సీన్ గుర్తొచ్చింది. గుండెలో గడియారం అలారంలా మోగింది. జ్ఞాపకం గుర్తుచేస్తూ..’’
3
రిజిస్టర్‌లో సంతకం చసాక ఇద్దరూ కాంటీన్‌కు వచ్చారు. కిరణ్ కౌంటర్ దగ్గరికి వెళ్లి రెండు టీ తీసుకుని వచ్చాడు. ఇద్దరూ చెట్టుక్రింద నిలబడ్డారు.
‘‘ఇంట్లో ఫినాయిల్‌తో చేసిన టీ, కాఫీలు తాగి నోరంతా పాడైపోయింది’’ టీ సిప్ చేస్తూ అన్నాడు కిరణ్.
‘‘అదేమిఅటా నువ్వు మరీ రోజురోజుకు పాడైపోతున్నావు. పావనిని తిట్టకపోతే తచదులా వుంది’’ చిన్నగా మందలిస్తున్నట్టు అన్నాడు.
‘‘అవునవును మరి నాకేం పనిరా.. నీకలాగే అనిపిస్తుంది. ఇంట్ల దెయ్యం నాకేం భయం అనుకోవడానికి నేనేమైనా అల్లరి నరేష్‌నా.. నాదేమైనా రెండున్నర గంటల సినిమానా.. ఇంకా దాదాపు యాభై ఏళ్ళ శేషజీవితం..ఎలా భరించాలో... అయినా నీకు పెళ్ళైందిగా, తెలుస్తుందిలే’’ అన్నాడు కిరణ్.
‘‘అదేమిట్రా అలా భయపెట్టేస్తున్నావ్.. మొన్నటికి మొన్న బ్యాచిలర్ పార్టీలో పీకల్దాకా తాగి కంగ్రాట్స్ చెప్పావు కదరా..’’ అయోమయంగా అడిగాడు.
‘‘నాతోపాటు మరో బక్రా పెళ్లాం బాధితుడు చేరుతున్నాడని కంగ్రాట్స్ చెప్పి వెల్‌కమ్ చెప్పాను.. అయినా బ్యాచిలర్ పార్టీ అంటే స్వేచ్ఛకు గుడ్‌బై చెప్పే పార్టీ అని అర్థం...’’
‘‘నువ్వు తాగుతుంది టీనే కదా.. పొరపాటున వాళ్ళు టీలో మందు కలపలేదు కదా..’’ అనుమానంగా అడిగాడు నిహార్.
‘‘నీకు ఇప్పుడు అలానే అన్పిస్తుందిరా.. పోను పోను తెలుస్తుంది.. కొత్త కదా.. సమ్మగానే వుంటుంది.. ఆ తర్వాత కీమోథెరపీలా మండుతుంది.. ఎందుకంటే కాన్సర్ రావడం.. పెళ్లాం మన జీవితంలోకి రావడం రెండు బ్యాడ్ సింప్టమ్స్.. రిమెంబర్’’ చెప్పాడు కిరణ్.
‘నీకివ్వాళ ఏదో అయిందిరా.. రాత్రి నిద్రలో చిన్నమెదడు చితికిపోలేదు కదా’’
‘‘అసలు నాకు మెదడంటూ ఉంటే పెళ్ళెందుకు చేసుకుంటానురా.. జపాన్ వెళ్లి రోబోను కొనుక్కొచ్చుకుంటాను.. చెప్పినట్టు వింటుంది.. తిడితే పడుతుంది.. కొడితే నోరుమూసుకుంటుంది..’’
‘‘సర్లే.. లంచ్‌లో మాట్లాడుకుందాం.. ఇప్పటికి స్మాల్ బ్రేక్.. అన్నట్టు.. నేనో విషయం మర్చిపోయానురా’’ నిహార్ అన్నాడు.
ఏమిటన్నడు చూశాడు...
‘‘రోజులానే ఈ రోజూ లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు.. కాంటీన్‌లో తినే అలవాటు కదా.. నువ్వైతే తెచ్చుకోవడం ఎప్పుడో మానేసావు’’ అన్నాడు నిహార్.
‘‘చిన్న కరెక్షన్‌రా.. తెచ్చుకోవడం మర్చిపోలేదు.. నా పెళ్ళాం రాక్షసి నాకు లంచ్ బాక్స్ ఇవ్వడం మానేసింది.. అయినా ఇదేమిట్రా. ఈ విషయంలో నా పెళ్ళాం రాక్షసి కొద్దిగా బెటర్.. కనీసం ఓ ఆరు నెలలైనా లంచ్ బాక్స్ కట్టింది. మీ ఆవిడ ఇప్పటినుంచే అడ్వాన్స్ అయింది. ఇదీ ఒకందుకు మంచిదేలే.. అలవాటయ్యాక బాధపడ్డంకన్నా ఇలానే బాధలు కంటిన్యూ చేసుకోవడం బెటర్’’ ఊరడిస్తున్నట్టు అన్నాడు కిరణ్.
‘‘నిశ్చల అలాంటమ్మాయి కాదురా.. ప్యూర్ గోల్డ్..’’
‘‘అబ్బా అయితే మణప్పురంలో తాకట్టు పెట్టుకో.. ఓ ఇల్లు కొనుకోవచ్చు.. కొత్తగా పెళ్ళైన మగాడికి మొగుడికి భార్య బంగారం.. భార్యకు భర్త డైమండ్.. కొన్నాళ్ళు పోయాక స్టేట్‌మెంట్స్ మారుతూ వుంటాయి..’’ ఫిలాసఫీ మొదలుపెట్టాడు కిరణ్.
‘‘చాలురా.. ఇంకా వింటే నా పేరు మర్చిపోయేలా వున్నాను.. ఏదో హడావుడిలో తను మర్చిపోయి వుంటుంది..’’ అన్నాడు.
తర్వాత ఆ టాపిక్‌కు బ్రేక్ పడింది.. లంచ్‌లో స్టార్ట్ అయ్యింది.
***
లంచ్ టైం..
ఇద్దరూ కాంటిన్‌కు బయల్దేరారు.
వెంటనే నిశ్చలకు ఫోన్ చేయాలనీ అనిపించింది. అప్పటికి మూడుసార్లు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. కానీ తన లంచ్ బాక్స్ ప్రస్తావన తీసుకురాలేదు నిహార్. ఒకవేళ తను గుర్తుచేస్తే.. తను లంచ్ బాక్స్ పెట్టలేదన్న విషయం గుర్తొచ్చి గిల్టీగా ఫీల్ అవ్వొచ్చు. నిశ్చల అలా ఫీలవ్వడం ఇష్టంలేదు.
నిశ్చల లంచ్ చేసిందో లేదోనని కనుక్కోవాలి..
‘‘ఎలా? ఆలోచిస్తూ ఓ నిశ్చయానికి వచ్చి ఫోన్ చేశాడు..’’
కిరణ్ నిహార్‌నే గమనిస్తున్నాడు. కొత్తగా పెళ్ళైనవాళ్లకు ఇలాంటి రుగ్మతలు సహజమే అన్నది కిరణ్ ఫీలింగ్.
నిశ్చల సెల్ రింగ్ అవుతుంది.. ఫోన్ లిఫ్ట్ చేయలేదు.. కానీ తన పక్కనే మాట్లాడుతున్నట్టు.. ‘హలో’ అన్న కంఠం వినిపించింది.
‘‘హు తన భ్రమ కాకపోతే తనకు నిశ్చల గొంతు ఇక్కడ వినిపించడం ఏమిటి? అనుకున్నాడు. అదే విషయాన్నీ పక్కనే వున్న కిరణ్‌తోచెప్పాడు... ‘‘ఒరే నాకు నిశ్చల నా పక్కనే నిలబడి హలో అన్నట్టు వినిపిస్తుందిరా’’ అన్నాడు.
‘‘వినిపించడం కాదు.. సరిగా చూడు నీ పక్కనే కనిపిస్తుంది’’ అన్నాడు. అక్కడికి నిశ్చల రావడం.. నిహార్ పక్కనే నిలబడి హలో అనడం గమనించి.
షాకింగ్‌గా తల తిప్పి చూశాడు.. పెద్ద స్టీల్ క్యారేజీతో తన పక్కనే నిలబడి వుంది నిశ్చల.
సర్‌ప్రైజింగ్‌గా చూసాడు- నిశ్చలా నువ్విక్కడ? అంతకుమించి ఇంక ఏం మాట్లాడాలో తెలియలేదు నిహార్‌కు. అతనింకా ఆశ్చర్యంలోనుంచి తేరుకోలేదు. ఊహించని విషయం. అంతకన్నా ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేసిన విషయం.. నిశ్చల క్యారేజ్‌తో రావడం.
‘సారీ... చెప్పకుండా వచ్చాను’ తలొంచుకుని అంది నిశ్చల.
‘‘నువ్వు సారీ చెప్పడం కాదు నేనే నీకు థాంక్స్ చెప్పాలి. నిజానికి ఆకలిగా వుంది. కాంటిన్‌లో ఏదో ఓ గడ్డి తినడం అలవాటు. నువ్వొచ్చావు.. డబుల్ హ్యాపీ..’’ అన్నాడు ఆఫీస్‌లో దూరంగా వున్న చెట్టు దగ్గరికి తీసుకువెళ్తూ..

-సశేషం

-తేజారాణి తిరునగరి