డైలీ సీరియల్

ఎప్పుడె ప్పుడు?-6

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నిజం నిశ్చలా చాలా షాకింగ్ న్యూస్..’’ అన్నాడు కిరణ్.
‘‘అప్పుడప్పుడు ఇలా షాకింగ్‌లు ఇస్తే థ్రిల్‌గా వుంటుంది’’ అంది చిన్నగా నవ్వి నిశ్చల.
‘‘థ్రిల్ కరెంట్ బల్బ్ లాంటిది.. వెలిగించాలి తప్ప బల్బ్ తీసి హోల్డర్‌లో చేయి పెట్టకూడదు’’ కిరణ్ అన్నాడు.
‘‘నువ్వు వాడి మాటలు ఏం పట్టించుకోకు నిశ్చలా. వాడి చిన్న మెదడు చితికిపోయింది’’ నవ్వుతూ అన్నాడు నిహార్.
‘‘అవునవును’’ ఓ వెర్రి నవ్వు నవ్వి అన్నాడు కిరణ్.
‘‘నేను వెళ్తాను.. ఈవెనింగ్ లేట్ అవుతుందా?’’ అడిగింది నిశ్చల.
‘‘లేదు లేదు.. షార్ప్ సిక్స్‌కల్ల నీతో వుంటాను..’’ చెప్పాడు నిహార్.
‘‘ఓకె బై అంది.. అని కిరణ్ వైపు చూసి అతనికీ బై చెప్పి’’ బయటకు నడిచింది.
వెంటనే ఆమె వెనుకే వెళ్లిన నిహార్ ‘‘ఆగు నిశ్చలా.. ఎలా వెళ్తావు? క్యాబ్ బుక్ చేస్తాను’’ అంటూ ఆమె సమాధానం కోసం ఎదురుచూడకుండా క్యాబ్ బుక్ చేశాడు. రెండు నిమిషాల్లో క్యాబ్ వచ్చింది. క్యాబ్ కదిలే వరకూ వుండి లోపలికి నడిచాడు నిహార్. ఇదంతా గమనిస్తూనే వున్నాడు కిరణ్.
***
క్యాబ్ దిగి ఇంట్లోకి అడుగుపెట్టగానే ఒక్క క్షణం ఒంటరితనం ఫీల్ అయ్యింది. ఇన్నాళ్లు నిహార్ లేకుండా తనెలా వుంది? ఈ ఆలోచన రాగానే నవ్వొచ్చింది. ఒక మనిషితో పెళ్లి అనే అనుబంధం ఇంత గొప్పగా వుంటుందా? మరి పావని ఎందుకలా మాట్లాడింది?
ఉదయం పావని రావడం.. పావని తనతో మాట్లాడ్డం అన్నీ గుర్తొచ్చాయి.
***
భర్త వెళ్ళగానే ఇల్లు బోసిపోయినట్టు.. అనిపించింది నిశ్చలకు. అమ్మవాళ్లకు ఫోన్ చేయాలని కూడా అనిపించడంలేదు. అమ్మే ఫోన్ చేసింది. ‘నేను ఓకె.. ఫస్ట్ నైట్ ఓకె.. ఫోన్ పెట్టేయవే.. మా ఆయనకు లంచ్ తీసుకెళ్లాలి’’ తల్లిని ముద్దుగా విసుక్కుంది. ఫ్రిజ్‌లో కాయగూరలు లేవు. పాపం నిహర్ కూడా లంచ్ ప్రిపేర్ చేయమని అడుగలేదు. ముందు అర్జెంట్‌గా మార్కెట్‌కు వెళ్లి కూరలు తెచ్చుకోవాలి. పనె్నండుకల్లా వంట ఫినిష్ చేసి క్యారియర్‌లో సర్దేయాలి. సడెన్‌గా తాను ఆఫీస్‌కు వెళ్లి సర్‌ప్రయిజ్ చేయాలి.. ఆలోచన నచ్చింది.. ఆచరణ మిగిలింది.
ఒక్కోసారి చిన్న చిన్న ఆలోచనలు చిన్న చిన్న సర్‌ప్రయిజ్‌లు అందంగా అద్భుతంగా ఉంటాయి. మరుపురాని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.
చీరె కట్టుకుని బయటకు వెళదామని అనుకుంటుండగా పావని వచ్చింది.
‘‘పావని వాటే సర్‌ప్రయిజ్’’ అంది ఎదురెళ్లి గట్టిగా పట్టుకుని.
‘‘కొంపదీసి ఇంకేంటి సంగతులు’’ అని అడగవు కదా.. భయం నటిస్తూ అంది పావని.
‘‘నువ్వొచ్చింది మా ఆయన లేని టైంలో.. అందులోనూ డే టైం’’ నిశ్చల అంది.
‘‘రాక్షసి.. కాస్త కూడా సిగ్గూ బిడియం లేవు..’’ అంది ముద్దుగా పావని.
‘‘నేనేమైనా రేప్‌లు గట్రా చేస్తున్నానా.. సిగ్గుపడటానికి’’ నిశ్చల నవ్వుతూ అంది.
‘‘నీకో నమస్కారం.. నిన్ను కదిలిస్తే.. ట్రంప్‌ను కదిలించినట్టే.. సరేగానీ ఎక్కడికి వెళ్తున్నావు? మార్నింగ్ షోకా, నేనూ వస్తాను’’ ఉత్సాహంగా అంది పావని.
‘‘మార్కెట్ షోకి.. కూరలు తెచ్చుకుందామని’’ చెప్పింది నిశ్చల.
‘‘సాయంత్రం వచ్చేటప్పుడు నిహార్‌ను తెమ్మంటే సరి.. తగుదునమ్మా అంటూ నువ్వెందుకు.. ఇలా అలవాటు చేస్తే.. పాల ప్యాకెట్‌కు కూడా నినే్న పంపిస్తాడు.. అసలు నీకు ఈ మగవాళ్ల ఫిలాసఫీ తెలియదే’’ అంది నిశ్చల భుజాలు పట్టుకుని సోఫాలో కూచోబెడుతూ..
‘‘మార్కెట్‌కు వెళ్తూ మాట్లాడుకుందాం.. మార్కెట్ వెళ్లొచ్చాక వంట చేసుకుంటూ మాట్లాడుకుందాం.. ప్లీజ్ నాతోపాటు రావే’’ అంది నిశ్చల.
‘‘ఈ ఒక్కసారికి వస్తాను.. మరోసారి మొగుడికి సేవలు చేసే ఇలాంటి పనులకు రానుగాక రాను’’ అంటూ బయల్దేరింది పావని.
ఇద్దరూ మార్కెట్‌కు వెళ్లి కూరలు తెచ్చుకున్నారు.
నిశ్చల చాలా ఫాస్ట్‌గా వంట చేస్తుంది. బియ్యం కడిగి కుక్కర్‌లో పెట్టింది. సాంబార్‌కోసం పప్పు ఉడకబెట్టింది. వంకాయలు ప్రెష్‌గా కడిగింది. ప్రతీ పని నిపుణుడైన సర్జన్ ఆపరేషన్‌చేసినట్టు చకచకా వంట అనే ఆపరేషన్ పూర్తిచేసింది.
అలా చేస్తూండగానే పావని మాట్లాడింది.
***
‘‘నిశ్చలా లైఫ్‌లో పెళ్లి స్వీట్ మెమెరీ అనుకుంటారు.. ఏ కొందరి విషయంలో అలా ఉంటుందేమో.. చాలామంది విషయాల్లో అలా ఉండదు. భర్త అంటే అజమాయిషీ చెలాయించేవాడు. భార్యలను ఫిజికల్ నీడ్‌కు మాత్రమే ఎక్కువ శాతం ఉపయోగించునేవాడు. తన అవసరాలకు భార్య ఓ పనిముట్టు అనుకుంటాడు మగడు.. భర్త చూపించే కొద్దిపాటి ప్రేమకే ఐస్‌క్రీంలా కరిగిపోయి తన జీవితాన్నో ఒట్టి పుల్లగా మిగల్చుకుంటుంది’’ చెబుతూనే వుంది పావని.
‘‘నీకు తోటకూర దొంగ కథ తెలుసుగా.. తోటకూర దొంగతనం చేసినప్పుడే నా చెంపలు వాయించి ఉంటే నేను ఈ రోజు హంతకుడిని అయ్యేవాడినా అంటాడట.. ఆ కథ గురించి పూర్తిగా తెలియకపోయినా ఈ మగాళ్ల సైకాలజీ గురించి, ఈ మొగుళ్ళ సైకాలజీ గురించి బాగా తెలుసు. చిన్న మెప్పు ఒకటి మన మొహాన పడేస్తారు. చిన్న పొగడ్తతో మనల్ని కట్టుబానిసను చేస్తారు.. అసలు ఒక్క ముక్కలో పెళ్లి అంటే వన్ ఇయర్ సంతోషం.. రెస్ట్ ఆఫ్ లైఫ్ విషాదం..
ఇంగ్లీషులో సెవన్ ఇయర్ ఇచ్.. అని వినే వుంటావు. కొందరు మగాళ్లకు పెళ్ళైన ఏడేళ్లకు భార్యమీద ఆకర్షణ తగ్గుతుందిట.. వేరే అమ్మాయిల కోసం వెంపర్లాట మొదలవుతుందిట..
మనకు మాత్రం వన్ ఇయర్ ఆనందమే.. ఆ తర్వాత బ్రతుకంతా వెట్టిచాకిరీనే.. నీకు లత తెలుసుగా.. పెళ్ళైన సంవత్సరం వరకు బాగానే వున్నారు. కొత్త మోజు కదా.. తర్వాత వాళ్లాయన వెర్రి వేషాలు మొదలయ్యాయి. ఇంటికి ఆలస్యంగా రావడం.. గొడవలు.. అది రోజుకోసారి నాకు ఫోన్ చేసి ఏడుస్తూ ఉంటుంది..
ఒక ఫ్రెండ్‌గా నేను నీకు ఇచ్చే సలహా ఏమిటంటే..
‘‘ప్రేమను పొదుపుగా వాడు.. వందేళ్ల ప్రేమను ఒక సంవత్సరంలో చూపిస్తే.. ఇంక నీ దగ్గర చూపించడానికి ఏమీ ఉండదు.. మరో అమ్మాయి దగ్గర ఆ ప్రేమను చూడ్డానికి వెళ్తాడు మగాడు అనబడే మొగుడు.. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో...’’ నాన్‌స్టాప్‌గా మాట్లాడుతూనే వుంది. పావని చెప్పిన మాటల్లో ఒకే ఒక్క వాక్యం ఆమెను ఆలోచింపచేసింది.. ఈ కథను కొత్త మలుపు తిప్పేసింది.
4
మనసు తొందర చేస్తున్నపుడు గడియారం ఒయ్యారాలు పోతూ ఉడికిస్తుంది. నిహార్ ఎప్పటిలా కాకుండా గడియారం వంక దీనంగా చూస్తున్నాడు..
-సశేషం

-తేజారాణి తిరునగరి