డైలీ సీరియల్

ఎప్పుడె ప్పుడు?-7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఒసే గడియారమా.. తొందరగా ముందుకు వెళ్ళవే... అమ్మా ముల్లూ నువ్వు కదులూ.. చిన్న ముల్లూ నువ్వు పరుగెత్తు.. సెకన్ల ముల్లు ఒలంపిక్ రేస్‌లా పరుగెత్తు.. అలా గడియారాన్ని వచ్చీ రాని భాషలో రిక్వెస్ట్ చేస్తున్నాడు.
ఇదంతా గమనిస్తూనే వున్నాడు కిరణ్. ఆఫీసులో అందరూ పార్టీ అడిగారు. రిసెప్షన్ లాంటిది ఏమీ ఏర్పాటు చేయలేదు. ఎందుకో పదిమందిని పిలిచి ఈమె నా భార్య అని పరిచయం చేసి రిసెప్షన్ పేరుతో జరిగే తతంగం ఇష్టంలేదు. కాకపోతే అందరికీ పార్టీ ఇస్తానన్నాడు. పార్టీ ఆ రోజే ఇవ్వాలని పట్టుబట్టారు కొలీగ్స్.
ఓ పక్క ఎప్పుడు అయిదవుతుందా అని ఎదురుచూస్తుంటే మధ్యలో పార్టీ గొడవేంటి? అని తనలో తానే విసుక్కున్నాడు. పైగా అయిదుకల్లా ఇంటిముందు వాలిపోతానని మిసెస్‌కు ప్రామిస్ చేసాడు. ఇపుడు ప్రామిస్ మిస్ చేసుకోవాలా? పార్టీని మిస్ చేయాలా?
వెంటనే కిరణ్ దగ్గరికి వెళ్లి చొక్కా పట్టుకుని క్యాంటీన్ వరకు లాక్కొచ్చి ఏం చేయాలిరా’ అని అడిగాడు.
‘‘ముందు నా చొక్కా వదిలి ఈ రౌడీయిజం మానేయాలి’’ నవ్వుతూ అన్నాడు కిరణ్.
‘‘కుళ్ళు జోకులేస్తే పీకపిసికి మర్డర్ చేస్తా’’ కోపంగా అన్నాడు.
‘‘హమ్మయ్య వచ్చే జన్మలో బ్రహ్మచారిగా పుట్టి లైఫ్‌ని ఎంజాయ్ చేస్తా’’
‘‘ఒరే ఏదైనా ఐడియా ఇవ్వరా? అవతల పాపం నిశ్చలరా..’’
‘‘నిశ్చలకు ఏమయిందిరా.. ఎనీ గుడ్ న్యూస్.. కంగ్రాట్యులేషన్స్.. అప్పుడు నువ్వు తండ్రివి కాబోతున్నావా? గట్టిగా నిహార్‌ను కౌగిలించుకుని అన్నాడు.
‘‘ఒరే చంపేస్తాను.. వెధవ జోకులేస్తే.. ఇక్కడ టెన్షన్‌తో బీపీ రెయిజవుతోంది..’’
‘‘సర్లే.. పోనీ ఓ పనిచేయి.. నిశ్చలకు పార్టీ సంగతి చెప్పు..’’ కిరణ్ అన్నాడు.
‘‘ఇంట్లో తానొక్కతే వుంటుందిరా.. పైగా షార్ప్ ఫైవ్‌కల్లా ఉంటానని ప్రామిస్ చేశాను’’.
‘‘పోనీ పార్టీని క్యాన్సిల్ చేయ్..’’
‘‘ఫెవిక్విక్‌లా పట్టుకున్నారు.. ఐనా తనని తీసకువచ్చి పరిచయం చేయమని ఒక్కటే గొడవా’’ చెప్పాడు నిహార్.
‘‘పోనీ నిశ్చలను రమ్మను’’
‘‘తనకు ఇలా పార్టీలు ఇష్టం లేదు.. నీకో విషయం తెలుసా.. లంచ్ తీసుకుని వచ్చినపుడు తనను పరిచయం చేయొద్దని చెప్పింది.. లక్కీగా ఎవరూ తనను గుర్తుపట్టలేదు.. పెళ్లి సింపుల్‌గా అలా జరిగిపోయిందని చెప్పాను.. ఇపుడు పార్టీ ఇవ్వనంటే గొడవ చేస్తారు’’.
‘‘పోనీ నిశ్చలకు పార్టీ ఇస్తున్నాను.. ఇంటికి రావడం లేట్ అవుతుందని చెప్పు’’
‘‘అలా చెబితే ఫీల్ అవుతుంది.. నాకోసం ఎదురుచూస్తూ వుంటుంది కదా పాపం’’.
నిహార్ వంక చూసి చెప్పాడు ‘‘పోనీ ఆఫీసులో పని ఎక్కువగా వుంది. ఆలస్యమవుతుంది అని చెప్పు’’.
‘‘అబద్ధమా?’’ గట్టిగా అరిచి అన్నాడు.
‘‘అదేమిట్రా నేనేమైనా మర్డర్ చేయమన్నానా? అంతలా అరిచావు.. నా గుండె గుండ్రాయి కాబట్టి తట్టుకుంది’’.
‘‘నిశ్చలతో అబద్ధమాడనని మాటిచ్చానురా’’
నిహార్ వంక అదోలా చూసి.. ‘‘మధ్యయుగానికన్నా ముందు పుట్టాల్సింది..’’- ఈ ప్రపంచంలో భార్య దగ్గర అబద్ధమాడని వాడిని ఒక్కడిని చూపించరా? అసలు అబద్ధమాడని మనిషి భూమీద ఉంటాడన్న భ్రమలో ఎలా బ్రతుకున్నావురా? అయినా పాతికేళ్ల క్రిందట పాతికేళ్లకు పైగా వయసున్న ఓ రచయిత ఓ కథలో ఇలా రాసాడురా... ‘‘మగాళ్లు పెళ్లయ్యాకే అబద్దాలాడ్డం మొదలెడుతారుట.. ఐ మీన్ అబద్దాలాడే అవసరం మొదలవుతుందిట...’’
‘‘తప్పుకదరా’’ అన్నాడు.
‘‘నీ ఖర్మరా... ఏదో ఒకటి చేసి చావు... అవతల పార్టీకోసం కొలీగ్స్‌ఈగల్లా ఈగర్లీ వెయిటింగ్... ఏంటో ప్రాసలు తన్నుకొచ్చేస్తున్నాయిరా’’ అన్నాడు కిరణ్.
నిహార్‌కు ఏం చేయాలో తోచలేదు. తనలాంటి పరిస్థితి ట్రంప్‌కు రావద్దని అనుకున్నాడు.
కిరణ్ ఇదంతా గమనిస్తూనే వున్నాడు. మెల్లిగా గొంతు విప్పాడు. ‘‘నిహార్ నువ్వు కాస్త ఎక్కువగా ఆలోచిస్తున్నావు? భార్యకు రీజన్ చెప్పడానికి రీజన్ వెతుక్కునే ఒకే ఒక మొగుడివి.
‘‘అది కాదురా...ఇంట్లో ఒక్కర్తే ఉంటుంది. నేను తొందరగా వస్తానని ఎదురుచూస్తూ ఉంటుంది. పాపం కదరా... వీళ్ళు చూస్తే రాత్రి తొమ్మిదయినా వదిలేలా లేరు.’’
‘‘మరీ ఇంతలా ఆలోచిస్తే చిన్న మెదడు చితికిపోతుందిరా... పార్టీ సెవన్‌కల్లా పూర్తిచేద్దాం... సెవెన్ థర్టీకల్లా నిన్ను నీ హెవెన్‌లో దింపిస్తాను.. ఇంకేమీ ఆలోచించకు... పద... పక్కనే ఊర్వశి బార్ వుంది. అక్కడ వెయిట్రెస్ పేరు మేనక... ’’ చెప్పాడు నిహార్‌వంక నవ్వుతూ చూస్తూ.
‘‘సరే అయితే వుండు తనకు ఫోన్ చేస్తాను’’ అన్నాడు జేబులో నుంచి మొబైల్ తీసి
‘ఎవరికీ రంభకా’ నవ్వుతూనే అడిగాడు కిరణ్.
‘‘కాదు నిశ్చలకు’’ అంటూ ఫోన్ చేసాడు భార్యకు.
‘‘నిశ్చలా అయామ్ సారీ... ఆఫీసులో పార్టీ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. నాకేం చేయాలో తోచలేదు. సరేనని అన్నాను. ఊర్వశి బార్‌లో పార్టీ... రావడానికి లేటవుతుంది. సెవన్ థర్టీకల్లా వచ్చేస్తాను... నీకేం ప్రాబ్లెమ్ లేదు కదా’’ అడుగుతున్నాడు నిహార్.
‘‘అయిపోయావురా... అంతా చెప్పేసావుగా ఈ రాత్రి నీ లైఫ్ మాడిపోయిన పెసరట్టే...’’స్వగతంగా అనుకున్నాడు కిరణ్.
‘‘్థంక్యూ నిశ్చల... నువ్వు ఎక్కడ ఫీల్ అవుతావేమో అనుకున్నాను... నేను తొందరగా వస్తాను బై’’ అంటూ మొబైల్ ఆఫ్ చేసాడు.
‘‘ఏమందిరా! అనుమానంగా అడిగాడు కిరణ్.
‘‘వచ్చేప్పుడు జాగ్రత్త... ఎందుకైనా మంచిది క్యాబ్‌లో వచ్చేయండి. చికెన్ సిక్స్టీఫైవ్ కన్నా పంజాబీ చికెన్ బావుంటుంది. వేయించిన కాజు తినండి... బీర్ మాత్రమే తీసుకోండి’’ అని చెప్పిందిరా.
కిరణ్ చొక్కాపైకెత్తి కళ్ళు తుడుచుకుంటుంటే ‘‘ఏమయిందిరా’’అడిగాడు నిహార్.
‘‘సెంటిమెంట్ సీన్ ఆయింట్మెంట్‌లా సమ్మగా ఉందిరా... ఆనంద భాష్పాలు చీర్స్ అంటున్నాయిరా’’ అన్నాడు.
‘‘వద్దురా నీకు మందు పడకముందే కిక్కు ఎక్కువైంది... పద తొందరగా వెళ్దాం. అందరినీ ఊర్వశి బార్ దగ్గరికి రమ్మను... నా పెళ్ళాంతో హాయిగా గడపకుండా ఉగ్రవాదుల్లా అడ్డుపడ్డ వీళ్లకు కళ్లకలక వస్తుందిరా... ఇదే నా శాపం’’ ఉక్రోషంగా అన్నాడు నిహార్...
‘‘ఒరే నీ శాపం నాకు తగలదు... నేను పార్టీ అడగలేదు’’ నవ్వుతూ అన్నాడు కిరణ్.
రాత్రి ఏడుగంటల పది నిమిషాలు
ఊర్వశి బార్ నుంచి అందరూ బయటకు వచ్చారు. కిరణ్ నిహార్ వైపు చూసాడు.
‘‘అదేమిత్రా అలా చూస్తున్నావు... నేనేదో స్వర్గంలో వున్నా మిమ్మల్ని నరకానికి తీసుకువచ్చినట్టు... హాయిగా తాగారు కదరా...’’ అడిగాడు నిశ్చల్
‘‘ఒరే పాపీ... ఒక్కసారి మన ఆఫీసులో కొలీగ్స్ మొహాలు విజువలైజ్ చేసుకోరా... నా లైఫ్‌లో ఇలాంటి పార్టీ చూడలేదురా... అరవై నిమిషాల్లో మందు పార్టీని ఫినిష్ చేసిన నిన్ను గిన్నీస్‌బుక్‌లోకి ఎక్కించాలిరా... ఇంటికెళ్లాలన్న నీ ఆత్రాన్ని ఫొటో ఫ్రేమ్ తీసి మన ఆఫీసులో పెట్టుకోవాలిరా... ఒక్కసారి ఊహించుకోరా... నువ్వెలా ఇచ్చావో పార్టీ... ‘‘ఏడుపొక్కటే తక్కువైంది అన్నాడు కిరణ్

-సశేషం

-తేజారాణి తిరునగరి