డైలీ సీరియల్

ఎపుడెపుడు -- 9

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అబ్బబ్బ నీ గొడవేంటి?’’ విసుక్కున్నాడు కిరణ్.
‘‘నాకు నిజం కావాలి?’’ ముక్కు ఎగబీలుస్తూ అంది.
‘‘సరే రేపు ఆఫీసునుంచి వచ్చేటపుడు తీసుకువస్తాను...’’ అన్నాడు కిరణ్.
అంతే పావనికి కోపం నషాళానికి అంటింది. కిచెన్‌లోకి వెళ్లి ఫ్రిజ్‌లో పెద్ద వాటర్ బాటిల్ తీసుకువచ్చి కిరణ్ నెత్తిమీదుగా ఒంపేసింది. డీప్ ఫ్రిజ్‌లో పెట్టిన వాటర్ కావడంవల్ల చల్లగా ఉన్నాయి.
ఒక్కసారిగా వణికిపోయాడు- ‘ఒసే రాక్షసి’ గట్టిగా అరిచాడు.. వణుకు వచ్చేస్తుంది..
‘‘ఇప్పుడు చెప్పు.. ఎక్కడినుంచి వచ్చావు? అడిగింది.. అక్కడితో ఆగకుండా నిశ్చలకు ఫోన్ చేసింది.
5
నేల మీద కూచోని మంచంమీద కూచోని వున్న నిశ్చల ఒడిలో తలపెట్టి ‘సారీ నిశ్చలా నాకు గిల్టీగా వుంది’ అన్నాడు.
నిశ్చల చప్పున లేచి తను కింద కూచొని భర్తను మంచంమీద కూచోబెట్టి అతని ఒడిలో తల పెట్టి ‘ఎందుకు?’ అని అడిగింది.
‘‘మొదటిరోజే ఆలస్యంగా వచ్చినందుకు.. నిన్ను తీసుకువెళ్లకుండా పార్టీ ఇచ్చినందుకు.. నిజం చెప్పాలంటే అక్కడ మనిషిగా వున్నాను.. నా మనస్సంతా నీదగ్గరే వుంది’’ సిన్సియర్‌గా అన్నాడు.
‘‘మనకు ఇది మొదటిరోజే.. ఇలాంటిమొదటిరోజులు ఎన్నో వున్నాయి.. అందులో ఒక రోజు దీనికోసం ఖర్చు చేసినంత మాత్రాన నష్టం ఏమీ లేదు.. దాని గురించి ఆలోచించడం ఎందుకు? అయినా మందు పార్టీకి నేను బార్‌కు వస్తే ఏం బావుంటుంది. అంతగా అవసరమైతే మనమే ఇంట్లో.. అని ఆగి భర్తవైపు చూసి నవ్వింది.
ఒక్క క్షణం భార్య తనను ఆట పట్టిస్తుందా.. సీరియస్‌గా అంటుందా? అన్న విషయం తేల్చుకోలేకపోయాడు.
‘‘నిశ్చలా మన ప్రైవసీని డిస్ట్రబ్ చేసి పార్టీ అడిగినవారిని శపించాను’’ నవ్వుతూ చెప్పాడు నిహార్.
ఆ తర్వాత పార్టీలో జరిగింది మొత్తం డీటైల్డ్‌గా చెప్పాడు నిహార్.
‘‘హా.. ఆవులిస్తున్నట్టు అంటూ ఇక పడుకుందామా? అప్పుడే పనె్నండు దాటింది..’’ అంది గోడగడియారం వంక చూసింది.
‘‘నిద్రపోదామా? చిన్నపాటి సంశయంతో అడిగేసాడు.. అప్పుడేనా..’’ చిన్నపాటి నిస్పృహతో అన్నాడు
‘‘నిద్రపోదామా అనలేదు.. తన చేత్తో భర్త జుట్టును చెరిపేస్తూ అల్లరిగా అంది.
‘‘మరేమన్నావ్.. నువ్వే కదా పనె్నండు దాటింది.. అని, ఆగి క్షణం భార్య కళ్ళలోకి చూసాడు. భార్య కళ్లలో అందమైన అల్లరి కనిపించింది.
భార్య భుజాలు పట్టి లేపి తన పక్కనే కూచోపెట్టుకుని ‘ఐ లవ్ యు’ అన్నాడు.
‘‘అంతేనా? అంతకుమించి ఇంకేమీ లేదా?’’ అంది.
నిహార్ ఏదో చెప్పబోతుండగా నిశ్చల మొబైల్ రింగ్ అయింది.
‘‘చిన్నపాటి షాక్’’ ఈ టైంలో ఫోన్ చేసేదెవరు? కొంపదీసి బామ్మకు ఏమైనా కాలేదు కదా? అనుకుంటూ ఫోన్ తీసి డిస్‌ప్లే మీద వున్న పేరు చూసింది- ‘పావని’-
ఈ టైములో పావని ఎందుకు ఫోన్ చేసింది? అనుకుంటూనే లిఫ్ట్ చేసి ‘‘చెప్పు పావని.. ఎనీ ప్రాబ్లెమ్?’’ అని అడిగింది కాసింత ఆదుర్దాగా.
‘‘నా మొగుడే నా ప్రాబ్లెమ్.. సారీనే.. ఈ టైంలో డిస్ట్రబ్ చేసినందుకు’’ అంది అటువైపు నుంచి పావని.
‘‘పర్లేదు.. విషయమేమిటి? ఏమైంది?’’ నిశ్చల అడిగింది.
‘‘సాయంత్రం ఆఫీస్ నుంచి కిరణ్‌ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేసింది నిహారే కదా?’’ అడిగింది పావని.
‘‘తెలియదే కనుక్కుంటానుండు..’’ అని నిహార్ వైపు చూస్తూ ‘‘కిరణ్‌ను ఇంటి దగ్గర మీరే కదా డ్రాప్ చేసింది?’’ అని అడిగింది.
‘‘అవును.. ఏం.. ఇంటికి రాలేదా?’’ కంగారుగా అడిగాడు.
అదే ప్రశ్న నిశ్చల పావనిని అడిగింది.
‘‘వచ్చి చచ్చాడు కానీ.. ఈ రోజు ఆఫీసులో లేటయిందా? ఓసారి ఫోన్ నిహార్‌కు ఇవ్వు’’ అంది.
ఫోన్ నిహార్‌కు ఇచ్చి ‘‘పావని మీతో మాట్లాడుతుందిట..’’ అంది.
‘‘చెప్పు పావని ఏమిటీ? కిరణ్‌కు ఏమైనా అయ్యిందా? ఫుడ్ పాయిజనింగ్ లాంటిది’’ కంగారుగా అడిగాడు.
‘‘అదేం లేదు గుండ్రాయిలా ఉన్నాడు కానీ.. మీరు సాయంత్రం ఆఫీస్ అయ్యాక ఎక్కడికి వెళ్లారు?’’ అటువైపునుంచి అడిగింది పావని.
‘‘ఊర్వశి బార్‌కు.. ఏం?’’ అడిగాడు.
‘‘ఓహో.. ఎందుకేమిటి?’’
‘‘నువ్వు మరీ పావని.. బార్‌కు ఎందుకు వెళ్తారు.. ఈ రోజు మా కొలీగ్స్ పార్టీ ఇవ్వాల్సిందేనని బలవంతం చేశారు.. అందుకే పార్టీ ఇచ్చాను.. నేను తీసుకోలేదు.. వాడు మాత్రం లైట్‌గా తీసుకున్నాడు’’.
‘‘ఎంత లైట్‌గా తీసుకున్నాడో తెలుస్తూనే వుంది. అయినా నువ్వు కిరణ్‌తో ఇలానే తిరిగితినే నిన్ను చెడగొట్టేస్తాడు.. సరే.. ఎనీవే డిస్ట్రబ్ చేసినందుకు సారీ.. ఫోన్ ఓసారి నిశ్చలకివ్వు’’ అంది.
సైలెంట్‌గా నిశ్చలకు ఫోన్ ఇచ్చాడు.
‘‘నిశ్చలా... ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో.. కాస్త నిహార్‌ను నీ కంట్రోల్‌లో పెట్టుకో.. లేకపోతే కిరణ్‌లా చెడిపోతాడు.. ఈ మగాళ్ళకు ఎక్కువ చనువు ఇవ్వకూడదు.. అయినా ఈ పార్టీ విషయం మీకు చెప్పాడా?’’
‘‘చెప్పాడు..’’
‘‘చెప్పాక ఎలా ఒప్పుకున్నావే.. సర్లే ఇపుడే నీ మూడ్ పాడు చేయడమెందుకు.. రేపు కలిశాక చెబుతాలే.. గుడ్‌నైట్’’’ అని ఫోన్ పెట్టేసింది.
‘‘ఏంటి నిశ్చలా.. పావని ప్రాబ్లెమ్ ఏమిటట..’’ అడిగాడు అయోమయంగా నిహార్.
‘‘రేపు మార్నింగ్ క్లియర్‌గా చెబుతుందిట’’ అంది నిహార్ భుజంమీద తలపెట్టి.
అలానే పొదివి పట్టుకున్నాడు అపురూపంగా నిహార్...
***
ఫోన్‌లో పావని మాట్లాడేది అంతా వింటూనే వున్నాడు కిరణ్.
‘‘సిగ్గుండాలి.. పెళ్లాన్ని వదిలి తాగిరావడానికి’’ అంది పావని.
‘‘సిగ్గుండాలి.. మొగుడితో బార్‌కు వచ్చి మందుకొడతానని అనడానికి’’ తానూ తక్కువ తినలేదన్నట్టు అన్నాడు కిరణ్.
‘‘నేనేం మందు కొడతాననలేదు.. ఇంటి దగ్గర పెళ్లాం ఎదురుచూస్తుందన్న కామెన్‌సెన్స్ ఉండాలి’’.
‘‘తప్పనిసరిగా పార్టీ కదా.. అని అడ్జెస్ట్ అవ్వాలనే సెన్స్ ముందు పెళ్లానికి ఉండాలి.. అయినా మొగుడి తలమీద ఐస్ నీళ్లు గుమ్మరించే నీ ప్రేమకు రెండు చేతులెత్తి మొక్కాలి’’.
‘‘అబద్ధమాడటానికి సిగ్గనిపించడంలేదూ’’
‘‘నిజం చెబితే అర్థం చేసుకోని భార్యకు అబద్ధం చెప్పడమే కరెక్ట్’’
‘‘పెళ్ళయినా ఒక అచ్చటా లేవు ముచ్చటా లేదు’’ ముక్కు చీదింది పావని.
‘‘నాకు అచ్చటా ముచ్చటా లేకపోయినా పర్లేదు... కనీసం మనశ్శాంతి కూడా లేదు’’.
-సశేషం

-తేజారాణి తిరునగరి