డైలీ సీరియల్

యమహాపురి -66

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యురేనియంలో మెరుపు ఎండవల్ల వచ్చిందనుకున్న రూథర్‌ఫర్డ్‌కి ఓ రోజు ఎండ రాకపోయినా మెరుపు రావడంతో రేడియో ధార్మిక శక్తి గురించి తెలిసింది. అంత గొప్ప గొప్ప విశేషాలకే అదృష్టం అవసరపడింది. నువ్వెంత, నేనెంత?’’ అన్నాడు శ్రీకర్.
‘‘ఐతే అదృష్టం కలిసిరావడానికి నేనేం చెయ్యాలంటారు?’’’
ఓ క్షణం ఆలోచించి, ‘‘ఒక పని చెయ్యి. ఒకసారి మా కాలనీకి వెళ్లి కెజె రావుని కలుసుకుని మాట్లాడు’’ అన్నాడు శ్రీకర్.
‘‘మీరు నిజంగా అంటున్నారా? జోక్ చేస్తున్నారా?’’ అన్నాడు యోగి తెల్లబోయి.
‘‘ఏంటీ- ఇలా జోకులెయ్యడానికి నేను కెజె రావునా?’’ అని నవ్వి- ‘‘ఒకసారి ఓ డిటెక్టివ్ ఏజెన్సీకి- పెద్ద క్రిమినల్ ఫైలొకటి పెన్‌డ్రైవర్‌లో దొరికింది. ఓపెన్ చెయ్యాలంటే పాస్‌వర్డ్ కావాలి. ఎంత ప్రయత్నించినా ఆ పాస్‌వర్డ్ ఏమిటో పట్టుకోలేకపోయారు. ఆఖరికి ఓ డిటెక్టివ్‌కి విసుగొచ్చి యూ షిట్ అని టైప్ చేశాడట. అంతే- ఫైల్ ఓపెనయింది. పరిశోధనల్లో ఎక్కడ అదృష్టం తలుపుతడుతుందో చెప్పలేం’’ అన్నాడు శ్రీకర్.
‘‘నిజమే- మీరన్నాక ఇప్పుడే వెళ్లి ఆయన్నోసారి కలవాలనిపిస్తోంది’’ అన్నాడు యోగి.
‘‘అది నీ ఇష్టం కానీ- ప్రస్తుతానికి నీతో పని ఐపోయింది. ఎక్కడ దిగుతావో చెప్పు, దింపేస్తాను’’ అన్నాడు శ్రీకర్.
యోగి చెప్పాడు.
యోగి ఆటో దిగిపోయాక, ‘‘నువ్వు డ్రైవింగ్ కంటిన్యూ చెయ్యి. మనం మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి’’ అన్నాడు శ్రీకర్ సుందరంతో.
‘‘కానీ ఇలా డ్రైవ్ చేస్తూండగా- మాట్లాడ్డం నాకూ, వినడం మీకూ కూడా వీలుగా ఉండదు సార్! స్టేషనుకైనా వెళ్లిపోదాం, లేదా...’’.
అతణ్ణి మధ్యలో ఆపి, ‘‘స్టేషన్లో వద్దు. హాయిగా ఏ పార్కులోనో మాట్లాడుకుందాం’’ అన్నాడు శ్రీకర్.
‘‘ఎందుకు సార్?’’ కుతూహలంగా అడిగాడు సుందరం.
‘‘చేస్తున్నది డ్యూటీయే ఐనా- సెలవులో ఉన్నామన్న ప్లెజంట్ ఫీలింగుంటుంది బయటైతే’’ అన్నాడు శ్రీకర్.
‘‘నేనొప్పుకోను సార్! మీకు సెలవుకంటే డ్యూటీయే ప్లెజంటని నాకు తెలుసు. ఇంకేదో ఉంది.. చెప్పండి’’ అన్నాడు సుందరం.
‘‘నాకు తెలిసింది నేను చెప్పాను. ఇంకేదైనా ఉంటే అది నువ్వే తెలుసుకుని చెప్పాలి. సరేనా?’’ అన్నాడు శ్రీకర్.
***
అది ఒక పెద్ద పార్కు. మఫ్టీలో ఉన్న శ్రీకర్, సుందరం మనుషులాట్టే లేని ఒక మూల కూర్చున్నారు.
‘‘చెప్పండి సార్!’’ అన్నాడు సుందరం.
‘‘గోపాల్ చెప్పింది విన్నావ్. యోగి చెప్పింది విన్నావ్. నీకేమనిపించింది?’’
‘‘అనిపించడం కాదు. అనిపిస్తోంది- యోగి నరకపురి వెడతాడని..’’ అన్నాడు సుందరం.
‘‘ఔనా- అదెలా?’’ అన్నాడు శ్రీకర్ ఆశ్చర్యంగా.
‘‘చాలా సింపుల్! రాజా ఇప్పుడు నరకపురిలో ఉన్నాడని తెలిసింది. రాణి కూడా నరకపురి వెళ్లినట్లు తెలిసింది. బహుశా అవినాష్, సుధాకర్, ఉష కూడా నరకపురే వెళ్లారు. అంతా జగదానందస్వామి దీవెన పొందినవాళ్లే! ఇక మిగిలింది యోగి ఒక్కడు. తను మాత్రం నరకపురి ఎందుకు వెళ్లడు?’’ అన్నాడు సుందరం.
‘‘పాయింటే!’’ అన్నాడు శ్రీకర్. ‘‘కానీ- అవినాష్, సుధాకర్, ఉష- ఈ ముగ్గురూ నరకపురి వెళ్లారని నీకెందుకు అనిపిస్తోంది?’’ అన్నాడు.
‘‘నరకపురి ఎలా వెళ్లాలా అని నేను చాలా వాకబు చేశాను సార్! నరకపురికి చెక్‌పోస్టు ఉంది. గ్రామస్థులు కానివారికి అది దాటి ఊళ్లోకి వెళ్లడం సాధ్యం కాదు. ఐతే నెలకి రెండు మూడుసార్లు- ఆ ఊరికి వోల్వో బస్ ఒకటి వెడుతుందిట సార్! అది బహుశా ఉత్తరాదినుంచి వస్తుంది. అందులో జనముంటారు కానీ టికెట్ ఎలా కొన్నారో ఎక్కడ కొన్నారో తెలియదు. అదెక్కితే నేరుగా నరకపురి ఊళ్లోకి వెళ్లిపోవచ్చు. కానీ అదెక్కడ బయల్దేరుతుందో, ఎక్కడెక్కడ ఆగుతుందో, ఎవరెవర్ని ఎక్కించుకుంటుందో మనకి తెలియదు. ఆ బస్సుకి మన మిలిటరీకున్నంత ప్రైవసీ ఉంది. పోలీస్ చెకింగ్‌కి పర్మిషన్ లేదు. కనీసం మూడేళ్లనుంచి ఆ బస్సు తిరగడం తనకు తెలుసని నా ఫ్రెండొకడు చెప్పాడు సార్! దానిమీద ఆంక్షలు లేనట్లే. ఇంతవరకూ ఒక్క ఫిర్యాదుకూడా లేదుట. దాని గురించి మీడియా కూడా పట్టించుకోవడంలేదు. ఎవర్నడిగినా- దేశంలో ఎన్ని వోల్వో బస్సులు ఎన్ని ఊళ్లకి వెళ్లడం లేదు అంటున్నారు. అన్నీ ఇలాగే వెడుతున్నాయా అంటే- అన్నీ ఎలా వెడుతున్నాయో నీకు తెలుసా అంటున్నారు. ఈ బస్సు కథ చిత్రంగానే ఉంది కానీ- ఆ బస్సు మాత్రం వివాదాస్పదం కాదు’’ అన్నాడు సుందరం.
‘‘అన్నట్లు రచయిత్రి ఉష కూడా వోల్వో బస్సెక్కి వెళ్లిందని కదూ- యోగి చెప్పాడు..’’ అన్నాడు శ్రీకర్.
‘‘ఔను సార్! ఆమె వెళ్లిన రోజునే అవినాషూ, సుధాకరూ కూడా చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్లారు. ఇంట్లో వాళ్లకి అంతా ఒకేలా చెప్పడాన్ని బట్టి- అంతా ఒకే బస్సులో ఒకే చోటికి వెళ్లారనిపించింది. వోల్వో బస్సు నరకపురికి వెడుతుందని తెలుసు. వాళ్లంతా స్వామి దీవెన పొందినవాళ్లేనని తెలుసు. అందుకే అంతా నరకపురి చేరారని అనుకుంటున్నాను. యోగి కూడా అక్కడే తేలతాడానుకుంటున్నాను’’ అన్నాడు సుందరం.
‘‘యు ఆర్ రైట్! ఆ వోల్వో బస్సు గురించి నా ఇనె్వస్టిగేష్లో కూడా ఇంచుమించు నువ్వు చెప్పిన విశేషాలే తెలిశాయి. నీ సర్కిల్ గొప్పదే కాదు- నమ్మతగింది కూడా!’’ అని సుందరాన్ని అభినందించి, ‘‘ఆ బస్సు సమాచారం ఉషకెలా అందిందా అన్నది ఊహకందడంలేదు. ఏదేమైనా ఎవరు పడితే వాళ్లు అవలీలగా నరకపురి వెడుతున్నారు. మనం మాత్రం ఎలా వెళ్లాలో తెలియక కొట్టుకు చస్తున్నాం, పోలీసులమయుండీ’’ అన్నాడు శ్రీకర్ బాధగా.
సుందరం వెంటనే, ‘‘మనం చేసేది డ్యూటీ సార్! అందుకు రూల్సు పాటించాలి. అందరిలా మనం ఎక్కడపడితే అక్కడికి వెళ్లలేం. మరి నరకపురి మీద మనకేం కంప్లయింట్ లేదు. ఉంటే మనమూ ఎలాగో అలా వెళ్లి ఉండేవాళ్లం’’అని- ‘‘నిజానికా రాజా నరకపురి వెళ్లి ఉండేవాడు కాదు సార్! మనమే అతణ్ణి నరకపురి వైపు తరిమాం.

ఇంకా ఉంది

వసుంధర