డైలీ సీరియల్

ఎప్పుడె ప్పుడు?-12

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘పెళ్లికి ముందు మనం ఏం చెప్పినా అలాగా అంటారు.. కనీసం కారణం కూడా అడగరు.. అది తినండి.. ఇది తినండి అంటూ కొసరి కొసరి వడ్డిస్తారు. ఏదైనా కొనిపెడదామని సరదా పడినా.. ‘‘అబ్బే వద్దండీ’’ అంటూ చిలక పలుకులు పలుకుతారు. అర్థరాత్రి ఇంటికి వస్తే అలసిపోయామని కాళ్ళు పడతారు.. మనం ఏం చెప్పినా ఊ కొడుతారు.. ఒకప్పటి గర్ల్‌ఫ్రెండ్ గురించి చెప్పినా నవ్వి ఊరుకుంటారు..
మనం ఆ భ్రమలో నుంచి తేరుకోకముందే మొదలవుతుంది.. మెయిన్ పిక్చర్.. ఇంటికి ఆలస్యంగా వస్తే ఆరాలు.. జీతం రాగానే కాబూలీవాలా కన్నా అధ్వాన్నంగా దోచుకుంటారు. పొరపాటున మన షర్ట్‌మీద మరక పడినా.. యాడ్ లిప్‌స్టిక్ మరకా? అని ఫోరెన్సిక్ పరీక్షలు కూడా చేయిస్తారు... చెప్పుకుంటూ పోతే టీవీ సీరియల్ కన్నా ఎక్కువే..’’ కాసేపు ఆగి ఊపిరి తీసుకున్నాడు.
‘‘ఇప్పుడు నేనేం చేయాలిరా?’’ కిరణ్ బాధ భరించలేక అడిగాడు.
‘‘నువ్వేం చేయకు.. నా అంచనా కరెక్ట్ అయితే ఈ పాటికి పావని మీ ఆవిడ దగ్గరకి వెళ్లి ఉంటుంది తనేం చేయాలో గీతోపదేశం చేస్తూ వుంటుంది.. నువ్వు చేయవల్సిందల్లా నీ భార్య చెప్పింది చేయపోవడమే.. సాటి మగవాడిగా, నేను నీకు ఇచ్చే సలహా.. ఈ క్షణం నుంచి నిజాలు చెప్పడం మాను.. ఆఫీస్ వదగాలనే ఇంటికి వెళ్ళే అలవాటు మొదలెట్టేవు అనుకో.. రేపు పొరపాటున ఆలస్యంగా వెళ్తే నీ బ్రతుకు హాలులోనే.. పెళ్ళైన కొత్తలో భార్య చూపించే ప్రేమకు బెండ్ అయితే.. నీ బెండు తీసేస్తుంది..’’ కిరణ్ చెబుతూనే ఉన్నాడు.
నిహార్‌కు బుర్ర తిరిగిపోయింది.
ఒక్కసారి నిశ్చలతో మాట్లాడితే కానీ మైండ్ ఫ్రెష్ అవదని భార్యకు ఫోన్ చేశాడు.
నిశ్చల ఫోన్ లిఫ్ట్ చేసింది.
‘‘నేను పావనితో మాట్లాడుతున్నాను.. కాసేపాగి చేయనా?’’ అటువైపు నుంచి నిశ్చల గొంతు.
కిరణ్ నిహార్ వంకే చూస్తున్నాడు.
‘‘నా అంచనా కరెక్ట్ అయితే ఈ పాటికి పావని మీ ఆవిడ దగ్గరికి వెళ్లి ఉంటుంది. తనేం చేయాలో గీతోపదేశం చేస్తూ వుంటుంది’’ కిరణ్ అన్న మాటలు గింగురుమంటున్నాయి.
అంటే కిరణ్ చెప్పిందంతా నిజమేనా?
7
నిశ్చల పావని ఎదురుగా కూచుంది. పావని సీరియస్‌గా ఏదో చెప్పబోతుందని అర్థమైంది.
పావని నిశ్చలవంక చూసి ‘ఎలా వుందే లైఫ్’ అని అడిగింది.
‘‘అప్పుడే ఎలా తెలుస్తుంది..? అయినా ఎలా ఉండడానికి ఏముంది.. నిహార్‌తో బాగానే ఉంటుంది..’’ అంది నిశ్చల.
‘‘అక్కడే పొరపాటుపడుతున్నావు.. నువ్వే కాదు, నీలాంటి చాలామంది అమ్మాయిలు నాతో సహా.. పొరపాటు పడతారు.. పడుతూనే వున్నారు.’’
‘‘అదేంటే ఒకేసారి అలా అనేసావు?’’ అడిగింది నిశ్చల.
‘‘అనుభవం నిశ్చలా.. అనుభవం.. చాలా పాఠాలు నేర్పుతుంది. అనుభవం మన భ్రమలను వేలెత్తి చూపిస్తుంది’’.
‘‘బహుశా నువ్వు ఏదో బాధల్లో వున్నావు.. చెప్పు.. ఏమిటి ప్రాబ్లెమ్?’’
‘‘నా మొగుడే నా ప్రాబ్లెమ్.. నాకే కాదు నిశ్చలా.. చాలామంది భార్యల బాధలకు మొగుళ్ళే కారణం’’.
‘‘అంటే ఎలాంటి బాధలు? అర్థంకాక అడిగింది...’’
పావని నిశ్చల వంక చూసి చెప్పడం మొదలుపెట్టింది.
‘‘పెళ్లికి ముందు మనలో క్యూరియాసిటీ కావచ్చు.. కొత్త జీవితం పట్ల ఆకర్షణ కావచ్చు.. చాలా ఉత్సాహంగా ఉంటుంది. దానికి తగ్గట్టు మొగుడు కూడా చాలా ప్రేమగా చూసుకుంటాడు. పొద్దునే్న గుడ్ మార్నింగ్‌లు చెప్పడం.. భార్యకు వంటలో సాయం చేయడం.. ఆఫీస్ అయిపోగానే పెందరాళే ఇంటికి రావడం.. వస్తూ పూలు స్వీట్స్ తీసుకురావడం.. నువ్వే నా ప్రాణం లాంటి డైలాగ్స్ చెప్పడం ఉంటాయి. మనం మురిసిపోతాం. ఆడాళ్ళు, పిల్లలు అల్ప సంతోషులు కదా.. తర్వాత్తర్వాత ఆలస్యంగా ఇంటికి రావడం, అబద్ధాలు చెప్పడం.. చిన్నపనికి కూడా విసుక్కోవడం.. షాపింగ్‌లకు తీసుకువెళ్లకపోవడం.. అసలు భార్య అనే ప్రాణి ఒక్కర్తీ ఉందన్న స్పృహ లేకపోవడం.. ఇవన్నీ పెళ్ళైన సంవత్సరం తర్వాత మొగుళ్ళల్లో మొదలయ్యే సింటమ్స్...’’ చెప్పడం ఆపి నిశ్చల మొహంలోకి చూసింది.
నిశ్చల మొహంలో ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అలా అని నిశ్చలా పావని చెప్పేది వినడంలేదని కాదు. వింటుంది.. కాకపోతే పావని చెప్పే విషయాల గురించి ఆలోచిస్తుంది.
కొన్ని తెలిసిన విషయాల్లానే అనిపిస్తాయి. కానీ తెలియవు.. తెలిసినట్టే ఉంటాయి. అయితే అందులో నిజాలు ఎన్ని? నిజాలుగా భావించే భ్రమలు ఎన్ని? అన్నది తెలుసుకోవాలి.
‘‘నేను చెప్పేది వింటున్నావా?’’ అడిగింది పావని.
‘‘వినడమే కాదు.. ఆలోచిస్తున్నాను’’ అంది నిశ్చల.
‘‘ఇప్పుడు ఆలోచించి ఏం లాభం? అయినా కొంతవరకు నువ్వు నయం.. ఇప్పటినుంచే నిహార్‌ను కంట్రోల్‌లో పెట్టుకుంటే.. జాలిగా చూడగానే కరిగిపోవడం.. ఆలస్యంగా వచ్చినా సర్దుకుపోవడం లాంటివి ఎవాయిడ్ చేస్తే నీ కాపురం సేఫ్‌గా వుంటుంది. ఎంత వున్నా ఒకటి మాత్రం నిజం నిశ్చలా.. మొగుడు అనే ప్రాణికి భార్య శరీరం అవసరం.. కొందరికి సంపాదించాడని.. మరికొందరికి పని చేయడానికి.. ఇంకొందరికి పచ్చిగా చెప్పాలంటే వాళ్ల కోరిక పుట్టినపుడల్లా సంసారం చేయడానికి.. పిల్లల్ని కని వంశోద్ధారకులను తయారుచేయడానికి..’’ అలా చెబుతున్నపుడు పావని మొహం ఎర్రబడడం గమనించింది.
నిశ్చల లేచి పావని భుజంమీద చేయి వేసి ‘‘అందరు మొగాళ్ళు... మొగుళ్ళు ఒకేలా వుండరు కదా పావనీ.. మనం ప్రేమిస్తే వాళ్ళూ ప్రేమిస్తారు.. ఒకవేళ వాళ్ళు ప్రేమించకపోయినా ప్రేమించేలా చేయొచ్చు. నాకు తెలిసి కిరణ్ మంచోడే.. కాకపోతే మరీ మంచివాడు కాకపోవచ్చు. నాకు తెలిసి చాలా సమస్యలు కూచొని మాట్లాడుకుంటే పరిష్కరింపబడతాయి.. ఎట్‌లీస్ట్.. ఒకరితో మరొకరు తమ బాధలు షేర్ చేసుకుంటే చాలు..’’ అంది.
పావని నవ్వింది...
‘‘బహుశా నీకు అనుభవంలోకి రాకపోవడమే సమస్య. అనుభవంలోకి వచ్చేక మనకేమీ మిగలదు.. నా అనుభవం నీకు కలుగకూడదని చెబుతున్నాను.. నీకు అంతకుముందొకసారి తోటకూర దొంగ కథ చెప్పాను. తోటకూర దొంగతనం చేసినపుడే తల్లి మందలించి వుంటే ఆ కొడుకు హంతకుడిగా ఉరికంబం ఎక్కేవాడు కాదు.. అలాగే పెళ్ళైన రోజునుంచే భార్య కఠినంగా వుండి మొగుడికి అలుసు ఇవ్వకుండా కంట్రోల్‌లో పెట్టుకుంటే లైఫ్ అంతా బావుంటుంది.. నాలాంటి పరిస్థితి నీకు రాకూడదని ఒక ఫ్రెండ్‌గా నీకు చెబుతున్నాను.. నిహార్ ఎంత మంచోడు అయినా మగాడే కదా.. మొగుడే కదా.. ఆలోచించు.. భర్తను కొంగున ముడివేసుకోవడమనే పాలసీ ఎప్పట్నుంచో వుంది. దాన్ని అమలులోకి తెచ్చుకో’’ చెప్పింది పావని.
ఆ క్షణం పావనితో ఆర్గ్యూ చేయాలనుకోలేదు.. పావని మాటలో నిజం కన్నా అనుభవం ఎక్కువ కనిపిస్తోంది.
అప్పటికే రెండుసార్లు నిహార్ ఫోన్ చేశాడు. నిశ్చలతో మాట్లాడాలన్నా కోరిక ఒక వైపు, కిరణ్ మాటలు విన్నాక, పావని నిశ్చల దగ్గరికి వెళ్లిందన్న విషయం తెలిసాక చిన్నపాటి భయం..
***
ఎప్పుడెప్పుడు అయిదు అవుతుందా అని ఎదురుచూస్తున్నాడు నిహార్.
-సశేషం

-తేజారాణి తిరునగరి