డైలీ సీరియల్

ఎప్పుడె ప్పుడు? -- 13

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతని ఎదురుచూపులు గోడ గడియారం అయిదు గంటలను చూపించడంలో అంతమయ్యాయి.
‘‘ఒరే కిరణ్.. త్వరగా పద..’’ అన్నాడు.
‘‘నిహార్ నన్ను ఊర్వశి దగ్గర వదిలేసి వెళ్ళు’’ అన్నాడు కిరణ్.
అర్థం కానట్టు చూసాడు.
‘‘ఊర్వశి బార్ దగ్గర.. ఊర్వశి దగ్గర అంటే కనీసం ఊర్వశికి దగ్గరైన ఫీలింగ్ అయినా ఉంటుంది. ఏంటో.. విశ్వామిత్రుడు తపస్సు చేస్తే వస్తుంది, కానీ నేను తపస్సు చేస్తే వస్తుందా.. నా పిచ్చిగానీ..’’ గొణుక్కున్నాడు కిరణ్.
‘‘ఇపుడు బార్‌కు ఎందుకురా.. హాయిగా ఇంటికి వెళ్ళాక..’’
‘‘ఇంట్లో హాయి లేకనే బార్‌కు వెళ్తున్నానురా..’’ కిరణ్ అన్నాడు.
‘‘అది కాదురా..’’ ఏదో చెప్పబోయాడు నిహార్.
‘‘క్లాస్ వద్దురా.. క్లాష్ తప్ప మరేమీ మిగలదు.. పెళ్ళైతే మొగుడి లైఫ్ యాష్ మాత్రమే.. పెళ్లనేది ట్రాష్...
‘‘పెళ్ళం యాష్ ట్రే.. మొగుడు యాష్.. బూడిద’’
‘‘నీకు తాగకుండానే కిక్కు ఎక్కిందిరా.. నా మాట విని ఇంటికి వెళ్దాం పద’’ నిహార్ అన్నాడు.
‘‘వద్దు మిత్రమా.. నన్నిలా వదిలెయ్.. మరో విషయం హరిశ్చంద్రుడా.. నా పెళ్లాం రాక్షసి ఫోన్ చేస్తే ఊర్వశి దగ్గరున్నాడు.. మేనక దగ్గరున్నాడు అని చెప్పకు... ఎందుకైనా మంచిది, నువ్వెళ్ళరా.. నేను ఆటోలో గుడికి వెళ్తాను’’ అన్నాడు కిరణ్.
‘‘ఎందుకురా అబద్ధాలు.. నువ్వు గుడికి వెళ్ళే మొహమా?’’ అన్నాడు.
‘‘అవున్రా.. నేను దేవుడిని ఎక్కువగా నమ్మను. ఆ కచ్చతో దేవుడు దెయ్యాలను నమ్మేలా చేసాడు.. ఇంట్లోనే దెయ్యాన్ని చూపించి..’’ అన్నాడు.
కిరణ్ గురించి తెలిసిన నిహార్ మరింక రెట్టించలేదు. ‘జాగ్రత్తరా’ అని చెప్పి ఇంటికి బయల్దేరాడు. వెళ్ళేటప్పుడు పూలు తీసుకుపోవడం మర్చిపోలేదు.
***
బైక్ ఇంటి ముందు పార్క్ చేసేసరికి ఎదురుగా నిశ్చల.. ఎప్పుడూ కొత్తగా అనిపించే ఫీలింగ్.. నిహార్ చేతిలోని హెల్మెట్, క్యారేజీ తీసుకుంది. నిహార్ ఫ్రెష్‌అప్ అయి వచ్చేసరికి వేడిగా ఫిల్టర్ కాఫీ తీసుకువచ్చింది. పుట్టింటినుంచి తెచ్చిన కజ్జికాయలు, మిక్చర్ ప్లేట్ తెచ్చింది. నిహార్ నిశ్చలను తన పక్కనే కూచోబెట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి తిన్నారు, కాఫీని షేర్ చేసుకున్నారు.
రాత్రి తొమ్మిది ముప్పయి.
కిటికీ దగ్గర కూచొని కిటికీ బయట ఆకాశంలో కనిపించే చందమామను చూస్తోంది నిశ్చల.
‘‘చందమామ కావాలా? వెనకనుంచి వచ్చి ఆమె భుజంమీద తలపెట్టి అడిగాడు.
‘‘నా మామ పక్కన ఉండగా ఆకాశంలో అందనంత దూరంలో వున్న ఆ చందమామతో నాకు పనేమిటి? అంది అతనికి అభిముఖంగా తిరిగి.
‘‘సీరియస్‌గా ఆలోచిస్తున్నావేమిటీ? అడిగాడు నిహార్. అతనికి ఉదయం పావని వచ్చి వెళ్లిన విషయం గుర్తొచ్చింది.
‘‘ఉదయం పావని వచ్చింది.. మీకు తెలుసు కదా.. అప్పుడు మీతో ఫ్రీగా మాట్లాడలేకపోయాను. సారీ...’’ తర్వాత చేస్తాను అన్నాను కదా.. అలా అన్నందుకు తర్వాత చాలా బాధేసింది.. అతని గుండెల్లో తల పెట్టుకుని చెప్పింది. అతని చాతీ ఆమె కన్నీళ్లతో తడిసింది.
‘‘ఏయ్... ఏమిటిది చిన్నపిల్లలా... ఫ్రెండ్ పక్కన వున్నప్పుడు మొగుడితో ఎలా ఫ్రీగా మాట్లాడగలవు? అయినా నువ్వు తర్వాత చేస్తానంటే దానికో రీజన్ ఉంటుందని నాకు తెలుసు... ఈ మాత్రానికే నువ్వు కంట తడిపెడితే చూడలేను...’’ చేత్తో కళ్ళుతుడుస్తూ అన్నాడు.
ఉదయం పావనికి, తనకు జరిగిన సంభాషణ అంతా చెప్పింది.
నిహార్ కూడా తనకు కిరణ్‌కు జరిగిన ఆర్గ్యుమెంట్ చెప్పాడు.
నిహార్ నిశ్చల ఎదురెదురుగా కూచున్నారు.
‘‘అంటే ఇద్దరూ ఒకరిమీద ఒకరు అపనమ్మకంతో ఉన్నారన్నమాట’’ అంది నిశ్చల.
‘‘అపనమ్మకంతో కాదు భార్యాభర్తల సంబంధంపట్ల విరక్తిగా వున్నారు. భర్తలదే తప్పని పావని, భార్యలంతా సాధించేవాళ్లేనని కిరణ్... దృఢమైన నమ్మకంతో వున్నారు’’ నిహార్ చెప్పాడు.
‘‘దీనికి కారణం నిజంగా వాళ్లకు ఒకరిమీద ఒకరికి ప్రేమలేకపోవడమా? లేదంటే వాళ్ళు చెప్పిందే నిజం కావడమా? నిశ్చల అడిగింది.
‘‘వాళ్ళు చెప్పిందే నిజమైతే ఏ ఒక్కరిదే నిజం కావాలి... రెండువైపులా నిజం ఉండదు కదా.. అంటే కొన్ని సందర్భాల్లో కొందరిది, మరికొన్ని సందర్భాల్లో మరికొందరిది నిజమై ఉండాలి.’’
‘‘కానీ ఒక్కటి మాత్రం నిజం.. కిరణ్ చెప్పినా, పావని చెప్పినా...’’ నిశ్చల అంది.
ఏమిటా నిజం? అడిగాడు నిహార్.
‘‘పెళ్ళైన తర్వాత సంవత్సరంలోపే ఒకరిమీద ఒకరికి ప్రేమ తగ్గిపోవడం...’’ అంది నిశ్చల
‘‘తగ్గిపోవడమని మనం అనుకుంటున్నాం... కానీ తగ్గిపోవడం కాకపోవచ్చు.’’
‘‘వచ్చు..కానీ ఎందుకు తగ్గిపోతుందో ఆలోచించాలి.’’
‘‘మనమా?’’
‘‘అవును మనమే.. ఎందుకంటే పావని చెప్పిన ఒకే ఒక మాట నన్ను ఆలోచింపజేసింది... సంవత్సరంపాటు సంతోషంగా ఒకరి పట్ల మరొకరు ప్రేమగా వుంది. ఆ తర్వాత గొడవలతో మిగిలిన లైఫ్‌ను గడపడం కన్నా సంవత్సరంపాటు గొడవపడి ఆ తర్వాత జీవితమంతా హ్యాపీగా వుండొచ్చుగా...మనం’’
‘‘మనమా... మనం గొడవ పడడమా?
‘‘అవును...గొడవలకు అవకాశం ఉండే విషయాల్లో గొడవ పడుదాం... గొడవ పడకుండా ఎలా ఉండగలమో తెలుసుకుందాం... మనకు మనమీద కాదు గొడవలమీద కోపం రావాలి..గొడవలను ద్వేషించాలి... కేవలం ఒక సంవత్సరం.. పావని కానీ కిరణ్ కానీ చెప్పినట్టు సంవత్సరం తర్వాత ఏ విషయాల్లో గొడవలు వస్తాయో, వాళ్ళు కానీ చాలామంది దంపతులు కానీ ఏ విషయాల్లో అసంతృప్తితో గొడవ పడుతారో మనం చూద్దాం.. అదే అసంతృప్తితో మనం గొడవ పడుదాం... ఈ ఒక్క సంవత్సరం ఎప్పుడెప్పుడు గడుస్తుందా అని ఎదురుచూద్దాం...’’
నిశ్చలవంక అలానే చూస్తూ వుండిపోయాడు తామిద్దరం జీవితాంతం కలిసి ఉండాలని నిశ్చల ఎంత తాపత్రయపడుతుందో అర్థమైంది. అతని మనసు ఆర్ద్రమైంది.
అంటే మనం ఏంచేద్దాం? అడిగాడు నిహార్.
‘‘అసలు పెళ్ళైన సంవత్సరం వరకు హ్యాపీగా ఉండడానికి కారణం ఏమిటి? సంవత్సరం తర్వాత జీవితాంతం గొడవలుపడ్డానికి రీజన్ ఏమిటి? నిశ్చల నిహార్‌వైపు చూస్తూ అంది...’’ నాకు సింపుల్‌గా కనిపించే రీజన్ ఒక్కటే... పెళ్ళైన కొత్తలో దగ్గరితనం ఉంటుంది. కాని బాధ్యతలను పక్కనపెట్టి మరీ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. కానీ ప్రతిరోజు బాధ్యతలు వదిలివేయడం కుదరదు. అలాగే పెళ్ళైన కొత్తలో ఆఫీస్‌నుంచి పెందరాళే వచ్చే మొగుళ్ళలో ఒక విధమైన నిర్లక్ష్యం కావచ్చు, పని ఒత్తిడి కావచ్చు.. బాధ్యతలు పెరగడం కావచ్చు... ఈ కారణాలతో ఆలస్యంగా వస్తారు.
-సశేషం

-తేజారాణి తిరునగరి