డైలీ సీరియల్

పంచతంత్రం-12

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘వెళదాం పద!’’అంటూ ఠక్కున సీట్లోంచి లేచాడు బాల్‌రాజ్. పఠాన్ అతడిని అనుసరించాడు. ఇద్దరూ పరుగులాంటి నడకతో వెళ్ళిపోసాగారు. దారిలో ఎదురుపడిన వెయిటర్ చేతిలో నాలుగు ఐదు వందల రూపాయలు పెట్టాడు బాల్‌రాజ్.
వాళ్ళు కదలగానే తను కూడా సీట్లోంచి లేచి వాళ్ళను ఫాలో అవసాగాడు కార్తీక్. అతడు కూడా దారిలో ఎదురుపడిన వెయిటర్ చేతిలో, నడుస్తూనే రెండువంద నోట్లుపెట్టాడు.
అదే సమయంలో వేగంగా వెళ్లిపోతున్న బాల్‌రాజ్, పఠాన్‌లను గమనించాడు మహేంద్ర. అతడు సగం తాగిన కాక్టైల్‌గ్లాసు కౌంటర్ మీద పెట్టి వాళ్ళను ఫాలో అవసాగాడు. మహేంద్ర ఎస్‌ఐగా పనిచేస్తున్నాడు అని ఆ బార్‌లో పనిచేసే వర్కర్స్‌కి తెలుసు. వాళ్ళు ఎప్పుడూ మహేంద్రను డబ్బులు అడగరు.
అకస్మాత్తుగా వీళ్ళు తినకుండా, తాగకుండా వెళ్లిపోవటంతో ఆశ్చర్యపోయాడు వెయిటర్. అదే సమయంలో అటు మూల కూర్చున్న వ్యక్తి వెయిటర్‌వైపు చూస్తూ
‘‘లెగ్ పీసులు... ఇంకా ఎంతసేపు?’’అంటూ అడిగాడు. అతడు అంతకుముందే లెగ్‌పీసులు ఆర్డర్ చెప్పాడు. అప్పటికే అతడు బాగా తాగి ఉన్నాడు. వెయిటర్ వెంటనే బాల్‌రాజ్, పఠాన్‌లు కూర్చున్న టేబుల్ వైపు నడిచాడు. ఓరకంటితో ఆ వ్యక్తివైపు చూసాడు. అతడు తనను గమనించటం లేదు అని గ్రహించాడు. అక్కడ రెండు ప్లేట్లల్లో ఎంగిలి చేసిన చికెన్ లెగ్గులు ఉన్నాయ్. వాటిని అన్నిటినీ ఒక ప్లేట్‌లోకి సర్దాడు. లెగ్గులని కొరికిన చోట ఉల్లిపాయ ముక్కలతో కప్పాడు. తర్వాత ఆ ప్లేట్ తీసుకుని వెళ్లి ఆ వ్యక్తిముందు పెట్టాడు.
అంతలో మరోవైపు నుంచి ‘జింజర్ చికెన్’ అంటూ వినపడటంతో.. వేగంగా బాల్‌రాజ్, పఠాన్ల టేబుల్ వైపు నడిచి జింజర్ చికెన్ ప్లేట్ అందుకున్నాడు వెయిటర్.
బార్ బయట ఓపెన్ టాప్ జీప్‌లోకి దూకారు బాలరాజ్, పఠాన్. అదే సమయంలో ఒక యమహా ఎస్‌జడ్ అక్కడికి దూసుకువచ్చింది. దానిమీద ముఖం కనిపించకుండా హెల్మెట్ పెట్టుకుని కూర్చుని ఉన్నాడు హరీష్. అతడికి అప్పుడే బైక్ స్టార్ట్ చేస్తున్న కార్తీక్ కనిపించాడు. దాంతో కార్తీక్ పక్కన బైక్ ఆపాడు హరీష్. అప్పటికి మరో వైపు పార్క్ చేసి ఉన్న బుల్లెట్ దగ్గరకు చేరుకొని కిక్ కొడుతున్నాడు మహేంద్ర.
హరీష్‌తో- ‘‘ఆ బుల్లెట్ నడిపేవాడిని నువ్వు ఫాలో అవ్వు.. నేను.. ఆ బాల్‌రాజ్‌గాడిని పాలో అవుతా’’ అని చెపుతూ అప్పటికే ముందుకు కదిలిన బాల్‌రాజ్ జీప్ వైపు బైక్‌ని పోనించాడు కార్తీక్. కార్తీక్ వెనకే బుల్లెట్ మీద వస్తున్నాడు మహేంద్ర. అతడిని ఫాలో అవుతున్నాడు హరీష్.
అలా కొంత దూరం వెళ్లాక మెడలో వేళ్ళాడుతున్న సెల్‌ఫోన్‌ని ఎడం చేత్తో అందుకుని స్పీడ్ డయల్ చేశాడు మహేంద్ర. అతడు సెల్‌ఫోన్‌కి కనెక్ట్ అయి వున్న ఇయర్ ఫోన్స్‌ని చెవుల్లో పెట్టుకుని ఉన్నాడు. ఐదారు సెకన్ల తర్వాత లైన్‌లోకి వచ్చిన డిఎస్‌పి దుర్గారావుతో చెప్పాడు.
‘‘సర్.. ఆ బాల్‌రాజ్‌గాడిని ఫాలో అవుతున్నా..! నన్ను వాడు పసికట్టాడు అనే అనుమానంగా ఉంది...!’’
సమాధానంగా-
‘‘వాడిని ఫాలో చేయడం వెంటనే ఆపేయ్. వాడికి అనుమానం రాకూడదు’’ అంటూ చెప్పాడు దుర్గారావ్.
సమాధానంగా ‘ఓకె సర్..!’ అని చెప్పి బుల్లెట్‌ను మరోవైపు తిప్పాడు మహేంద్ర.
హరీష్ కూడా బైక్‌ను టర్న్ తీసుకుని మహేంద్రను ఫాలో అవసాగాడు.
అప్పటివరకూ మహేంద్రను గమనిస్తున్నాడు డ్రైవింగ్ సీట్లో వున్న ఠాకూర్. అతడు తన పక్కన కూర్చున్న బాల్‌రాజ్‌తో...
‘‘అన్నా! మనం అనవసరంగా భయపడ్డాం. వాడు మరోవైపు వెళ్లిపోయాడు..’’ అంటూ చెప్పాడు.
బాల్‌రాజ్ రిలీఫ్‌గా నిట్టూర్చాడు. అంతలో బాల్‌రాజ్‌కి గుర్తుకువచ్చింది. తన దగ్గర డైలీ ఫైనాన్స్ కింద వడ్డీకి అప్పు తీసుకున్న ఆంజనేయులు అనే వ్యక్తి ఆ రోజు కట్టాల్సిన వడ్డీ ఇంకా కట్టలేదు అని. వెంటనే అతడు సెల్‌ఫోన్ తీసి ఆంజనేయులు అనే వ్యక్తి సెల్‌కి రింగ్ చేశాడు. అదే సమయంలో జీప్ పక్కనే బైక్‌మీద ఫాలో అవుతున్న కార్తీక్ బాల్‌రాజ్‌ని గమనించాడు. వెంటనే యాక్సిలేటర్ రైజ్ చేశాడు. బైక్ బాల్‌రాజ్‌కు బాగా దగ్గరగా వచ్చింది. మెరుపు వేగంతో బాల్‌రాజ్ చేతిలోని సెల్‌ఫోన్ చటుక్కున లాక్కుని, బైక్‌ను ముందుకు దూకించాడు కార్తీక్.
అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకు బాల్‌రాజ్ బిత్తరపోయాడు.
అంతలోనే తేరుకుని-
‘‘రేయ్! ఆడెవడో నా సెల్‌ఫోన్ కొట్టేశాడు... పోనీ’’
అంటూ కార్తీక్ డ్రైవ్ చేస్తున్న బైక్ వైపు చూపుడువేలు చూపిస్తూ బిగ్గరగా అరిచాడు బాల్‌రాజ్. ఆ మాటవింటూనే జీప్ వేగం పెంచాడు పఠాన్. వాళ్ళు తనను ఫాలో అవుతారు అని కార్తీక్‌కి తెలుసు. అతడు యాక్సిలేటర్ ఫుల్‌గా రైజ్ చేసి రయ్యిన దూసుకుపోయి క్షణంలో ట్రాఫిక్‌లో మాయం అయిపోయాడు. బాల్‌రాజ్, పఠాన్‌లు ట్రాఫిక్‌లో కార్తీక్ కోసం ముందుకు చూస్తూ ప్రయాణించసాగారు. ఆ లోపు కార్తీక్ ఠక్కున యు టర్న్ తీసుకుని, ఓ వంద గజాల దూరం ప్రయాణించిన తర్వాత మళ్లీ చటుక్కున మరో యు టర్న్ తీసుకున్నాడు.
ఇప్పుడు అతడు బాల్‌రాజ్ ప్రయాణిస్తున్న జీప్‌కి వెనక వైపున ఉన్నాడు. అదే సమయంలో అతడికి తన తండ్రిని ‘గాడు!’ అన్న బాల్‌రాజ్ మాటలు గుర్తుకువచ్చాయి. అంతలో రోడ్డువారగా ఎత్తుగా పేర్చి ఉన్న ఇటుకల మీద కార్తీక్ దృష్టిపడింది. వెంటనే అతడు బైక్ స్లో చేశాడు. చటుక్కున ఒక ఇటుక అందుకుని గురిచూసి బలంగా విసిరాడు.
గాలిలో వేగంగా దూసుకువెళ్లి బాల్‌రాజ్ నెత్తిమీద పడి ముక్కలు అయిపోయిందా ఇటుక. వెంటనే బాల్‌రాజ్ పెద్దగా అరిచి స్పృహతప్పి పడిపోయాడు. ఆ దృశ్యం చూసి చిరునవ్వు నవ్వుకుంటూ పక్కవీధిలోకి బైక్‌ను పోనిచ్చాడు కార్తీక్.
***
ఎస్‌ఐ మహేంద్రను జాగ్రత్తగా బైక్‌మీద ఫాలో అవసాగాడు హరీష్.
మహేంద్ర ఒక బేకరీ దగ్గర బుల్లెట్ పార్క్ చేసి లోపలకు వెళ్ళాడు.
హరీష్ కూడా తన బైక్ పార్క్ చేసి బేకరీలో ఒక పక్కగా నిలబడ్డాడు.
కౌంటర్‌లోని వ్యక్తిని కలిసాడు మహేంద్ర.
‘‘మహేంద్ర అన్నా! కూచోండన్నా..! టు మినిట్స్!’’ అన్నాడు క్యాష్ కౌంటర్‌లోని వ్యక్తి.
మహేంద్ర పక్కనే ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నాడు.
ఈలోపు ఒక ట్రేలో చికెన్ బర్గర్, ఒక కూల్‌డ్రింక్ బాటిల్, ఒక చిప్స్ ప్యాకెట్ పెట్టకుని వచ్చిన వెయిటర్ ఆ ట్రేని మహేంద్ర ముందు ఉంచాడు.
అంతలోనే తనవైపు వచ్చిన మరొక వెయిటర్‌ని, మహేంద్ర వైపు కనుబొమ్మలు ఎగరేసి చూపుతూ అడిగాడు హరీష్.
‘‘ఎవరతను...?’’
‘‘ఈ ఏరియా ఎస్‌ఐ’’ అంటూ చెప్పాడు వెయిటర్.
ఆ తర్వాత మహేంద్ర ఆ ఏరియాలో ఉన్న వ్యాపారుల దగ్గర డబ్బులు కలెక్ట్ చేశాడు.
కాని పెద్ద నోట్లురద్దు అవటంతో లంచం డబ్బు తగ్గింది.
చివరగా ఒక సూపర్ మార్కెట్‌లోకి ప్రవేశించి అక్కడి మేనేజర్‌ను కలిశాడు మహేంద్ర.
-సశేషం

-జి.వి.అమరేశ్వరరావు