డైలీ సీరియల్

యాజ్ఞసేని-111

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తర గోగ్రహణం.. సైరంధ్రి బృహన్నలను సారథిగా చేయుట
దుర్యోధనుడు తన సేనతో, భీష్మద్రోణ కృపాచార్యాశ్వత్థామ కర్ణ శకుని దుశ్శాసనాదులతో కలిసి విరాట నగరంవైపు ఉత్తర గోగ్రహణార్థమై సాగాడు. పాండవులు విరటుని నగరంలో ఉండవచ్చునని, అదే నిజమైతే వారిని బయల్పడజేసి మరలా పండ్రెండు సంవత్సరాలు అరణ్యవాసానికి పంపవచ్చునని తలపోసి ఉత్సాహంతో ఉత్తర గోగ్రహణానికి పాల్పడ్డాడు. అంతకుముందు త్రిగర్త దేశాధీశుడైన ‘సుశర్మ’ విరాట నగరంపై దక్షిణ గోగ్రహణానికి పాల్పడగా, విరాట రాజు కొలువులో మారువేషంలో వున్న ధర్మరాజు భీమ నకుల సహదేవులతో కలిస విరాటునికి అండగా సుశర్మను ఎదుర్కొనడానికై వెళ్ళాడు. నగరంలో విరాటుని కొడుకైన ఒక్క ‘ఉత్తర’కుమారుడు తప్ప యోధులెవ్వరూ లేరు. విరాటుడు సుశర్మను పాండవుల సహాయంతో జయించాడు. ఇంకా నగర ప్రవేశం చేయలేదు.
కురుసైన్యం విరాట నగరానికి దగ్గరలోవున్న విరటుని ఆవుల మందలను చుట్టుముట్టింది. పట్టుకొన్నది. అప్పటికి అక్కడ వున్న స్వల్ప సైన్యం కురుసేనను ఎదిరించలేకపోయింది. అప్పుడు గవాధ్యక్షుడు వచ్చేది కురసేనగా గమనించి, కొంతమంది సైన్యాన్ని వెంటబెట్టుకొని వేగంగా నగర ప్రవేశం చేసి ‘ఉత్తరునికి’ విషయాన్ని విన్నవించుకొన్నాడు. వెంటనే మంద ను మళ్లించటానికి ప్రయత్నించాలని కోరాడు. రాజు నగరంలో లేనందున గోవులను రక్షించే పని ఉత్తరుని భుజ స్కంధాలపై పడింది. అప్పుడు ఉత్తరుడు ఆ గవాధ్యక్షుని చూచి-
‘‘కౌరవులు ఎదిరిస్తే చిటికెలో వారిని జయిస్తాను. క్షణంలో ఆవులను మళ్లిస్తాను. అయితే నాకిప్పుడు సరైన సారథి లేకపోవడంతో మనస్సు కలత చెందుతున్నది. ‘‘నేను రథాన్ని సమర్థంగా నడుపుతాను’’ అనేవాడు ఇప్పుడు నాకు ఎవరు దొరుకుతారు. తగిన సారథి దొరితే శత్రువులను జయించడం ఎంతపని. నగరంలో ఎక్కడైనా మంచి సారథి దొరుకుతాడేమో చూడండి. భీష్మద్రోణ కృపాచార్య దుర్యోధన కర్ణశకుని మొదలైన వారంతా యుద్ధంలో నా పరాక్రమాన్ని చూచి ‘అర్జునుడేనని భ్రమించి బెదిరిపోయేటట్లు ఎదిరించి, వారిని జయించి, ఆవుల మందలను మళ్లించుకొని రాకపోతే నన్నురాజు, స్నేహితులు, పరివారము మెచ్చుకుంటారా’’ అని అన్నాడు. ఉత్తరుడు అట్లా మాట్లాడుతున్నపుడు అక్కడనే వున్న ద్రౌపది ఉత్తరుడు తనను అర్జునునితో పోల్చుకొనేసరికి కోపం, అసహనం కలిగింది. ద్రౌపది వెంటనే పోయి అర్జునికి విషయాన్ని చెప్పింది. అర్జునుడు ద్రౌపదితో నాటికి అజ్ఞతవాస సంవత్సరం ముగిసినట్లుగా నిర్ణయించి ఆమెతో-
‘‘మన బృహన్నలకు సారథ్యం చేసే నేర్పువున్నదనీ, ఇంతకుముందు ఖండవ వనాన్ని దహించటంలో అర్జునుడికి సారథియై అతడి మెప్పును బడసినవాడనీ, ఇంకా ఎన్నో సమయాలలో అతడి రథానికి సారథిగా ఉన్నాడనీ, ఆ విషయం నాకు తెలుసుననీ, అతడి సహకారం వుంటే కురు సైన్యాన్ని గెలవటానికి అనుమానం లేదనీ, నీవు వెళ్లి వాళ్ళతో చెప్పుము. ఇంకా వాళ్ళేమైనా అంటే తగినట్లుగా మాట్లాడి ఎట్లానైనా నన్ను పిలిపించేటట్లు చేయుము’’ అని చెప్పి ఆమెను పంపాడు.
అప్పుడు ద్రౌపది ఉత్తర (కన్య) దగ్గరకు వెళ్లి ఆమెతో ‘‘తామర వంటి అందమైన ముఖం కలిగిన ఓ ఉత్తరా! ఇపుడు రాజకుమారుడైన ఉత్తరుడు తగిన సారథి కొరకు వెదకుచున్నాడు. తెలిసిన విషయాన్ని చెప్పాలి గనుక చెపుతున్నాను. అర్జునుడు మెచ్చుకునే నేర్పు, బహుబలంతో పాటు ప్రావీణ్యం, యుద్ధంలో మచ్చలేని పరాక్రమమూ మన బృహన్నలకు వున్నాయి. ఓ ఉత్తరా! ఖాండవవనం కాల్చటం మొదలైన సమయాలలో బృహన్నల ఉపాయమూ, బలమూ మాత్రమే అర్జునుడికి జగప్రసిద్ధమైన విజయాన్ని కలిగించాయి. దీనిని ఉత్తరుడికి తెలియచేద్దాము’’ అని చెప్పి సైరంధ్రి ఉత్తరను వెంట నిడుకొని ఉత్తరుడి వద్దకు వెళ్లింది. బృహన్నల విషయాన్ని ఉత్తరుడికి సైంధ్రి ఉత్తర కలిసి చెప్పారు. ఆ మాటలకు ఉతరుడు నవ్వి-
‘‘సైరంధ్రీ! నన్ను ఎందుకు యిట్లా హేళన చేస్తావు? బాగా కండ్లు తెరిచి పేడిని చూడటానికి కూడా అసహ్యించుకొంటావే? అలాంటప్పుడు యుద్ధంలో సారథిగా ఎట్లా నియమిస్తాననుకొంటున్నవు? అదీగాక ఆవులను పట్టుకొనడానికి కురుబలం వచ్చిందట.

..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము