డైలీ సీరియల్

పంచతంత్రం-13

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కడి మేనేజర్ మహేంద్రతో..
‘‘సర్! కరెన్సీ ప్రాబ్లమ్..! రేపు ఎడ్జెస్ట్ చేస్తా!’’ అంటూ చెప్పాడు.
మహేంద్ర ఏదో ఆలోచించి..
‘‘డబ్బులకి బదులు సరుకులు తీసుకుంటా!’’ అంటూ చెప్పి ఆ పక్కనే వున్న బాస్కెట్ తీసుకుని సరుకులు ఉన్న స్టాండ్ వైపు కదిలాడు.
మహేంద్ర అటు వెళ్ళగానే-
‘‘పూర్వం కరెన్సీ లేని రోజుల్లో బార్టర్ సిస్టం, అంటే వస్తు మార్పిడి పద్ధతి అమలులో ఉండేది. వీడు లంచానికి కూడా ఆ పద్ధతి ఉపయోగిస్తున్నాడు’’ అంటూ తన పక్కన నిలబడి వున్న సేల్స్‌బాయ్స్‌తో అన్నాడు సూపర్ మార్కెట్ మేనేజర్.
ఒక ర్యాక్ దగ్గర నిలబడి బాస్కెట్‌లో సరుకులు నింపసాగాడు మహేంద్ర. హరీష్ ఆ ర్యాక్‌కు మరోవైపు నిలబడి తనకు కావలసిన వస్తువుల కోసం వెతుకుతున్నట్టు నటించసాడు. ఆ సమయంలో మహేంద్ర దగ్గర ఫోన్ మోగింది. అవతల దుర్గారావు లైన్‌లో ఉన్నాడు.
‘‘సర్! కలెక్షన్ కోసం తిరుగుతున్నా.. వస్తున్నా సర్.. వెంటనే స్టేషన్‌కి వస్తున్నా..!’’
అంటూ బాస్కెట్ తీసుకుని హడావుడిగా కౌంటర్ వైపు వెళ్ళాడు. కౌంటర్ ముందు జనం ఉన్నారు. క్యూలో వెయిట్ చేయకుండా నేరుగా కౌంటర్‌లోవున్న సేల్స్ బాయ్‌కి బాస్కెట్ ఇచ్చి ‘‘త్వరగా.!’’ అంటూ తొందర చేశాడు.
సేల్స్‌మాన్ మహేంద్ర కొన్న వస్తువులను ఒక క్యారీ బ్యాగ్‌లో వేసి ఇచ్చాడు. దాన్ని తీసుకుని బయటకు పరిగెత్తాడు మహేంద్ర.
అతడు డబ్బులు చెల్లించలేదు. అయినా జనం ఈ విషయం పట్టించుకోలేదు. మహేంద్ర ప్రయాణిస్తున్న బైక్ పోలీసు స్టేషన్ ముందు ఆగింది. అతడు పోలీసు స్టేషన్‌లోకి పరుగు తీశాడు.
అప్పటివరకూ మహేంద్రని పాలో అవుతూ వెళ్లిన హరీష్ స్టేషన్ బయటే ఆగిపోయాడు. ఏం చెయ్యాలో అతడికి అర్థం కాలేదు.
అంతలో పోలీస్ స్టేషన్ బయట-
ఒక బోర్డుమీద ఆ పోలీస్ స్టేషన్ ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్లు, అక్కడ పనిచేసే ముఖ్యమైన సెల్ నెంబర్లు వేసి ఉన్నాయి. వాటిల్లో దుర్గారావ్, మహేంద్రల పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి.
వెంటనే ఆ నెంబర్ల బోర్డుని తన సెల్‌తో ఫొటో తీసుకున్నాడు హరీష్. ఆ సమయంలో ఆ పక్కనే నిలబడి ఉన్న ఒక కానిస్టేబుల్ హరీష్ వైపు చూశాడు.
‘‘ఏం లేదు సర్! ఎప్పుడన్నా పనికివస్తాయేమోనని!..’’ అంటూ నవ్వాడు హరీష్.
ఆ కానిస్టేబుల్ వౌనంగా తల తిప్పుకున్నాడు.
***
రవి తమ ఏరియాలో వున్న ఒక గిఫ్ట్ షాప్‌లోకి ప్రవేశించాడు. ఆ షాప్‌లో వున్న బైనాక్యులర్స్‌లోంచి ఒక మంచి బైనాక్యులర్ కొన్నాడు. దాన్ని గిఫ్ట్ ఫ్యాక్ చేయించాడు. తర్వాత దాన్ని తన దగ్గరున్న షోల్డర్ బ్యాగ్‌లో పెట్టుకుని బయలుదేరాడు.
ఆ ఏరియాలో ఉంది నిర్మాణంలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్. అది బాల్‌రాజ్ ఇంటికి దగ్గరలోనే ఉంది. ఆ అపార్ట్‌మెంట్‌లో నిలబడితే అక్కడినుంచి బాల్‌రాజ్ ఇల్లు స్పష్టంగా కనపడుతుంది. కానీ బయటవాళ్లకు మాత్రం ఆ అపార్ట్‌మెంట్‌లో ఉన్నవాళ్లు కనపడరు. ఆ సమయంలో బాగా చీకటి పడింది. ఆ అపార్ట్‌మెంట్‌కి ఇంకా కరెంటు కనెక్షన్ ఇవ్వలేదు. కాకపోతే రోడ్డుమీద వెలుగుతున్న వీధి దీపాల వెలుగు, రోడ్డుమీద వెడుతున్న వాహనాల హెడ్‌లైట్ల వెలుగు ఆ అపార్ట్‌మెంట్‌లోకి కొద్దిగా ప్రసరిస్తోంది.
ఎవరూ తనను గమనించటం లేదు అని నిర్ణయించుకుని, నిర్మానుష్యంగా ఉన్న ఆ అపార్టుమెంట్‌లోకి నడిచాడు రవి. నేరుగా మెట్లమీదుగా ఆ అపార్టుమెంట్ మూడో అంతస్తులోకి చేరుకున్నాడు. అప్పటికే అక్కడ అతనికోసం ఎదురుచూస్తున్నారు కార్తీక్, హరీష్, జైరాం. వాళ్ళ భుజాలకు షోల్డర్ బ్యాగ్స్ వేలాడుతున్నాయి. వాళ్లతో రవి కూడా జాయిన్ అవగానే మీటింగ్ ప్రారంభం అయింది.
వాళ్ళు ఆరోజున జరిగిన డవలవప్‌మెంట్స్ గురించి చర్చించుకున్నారు.
పోలీస్‌లు ఎందుకనో నిరంజన్ మీద దృష్టిపెట్టారు. మామూళ్లదగ్గర తేడా వచ్చి ఉంటుంది అని అనుకున్నారు. ‘‘వాళ్ళ సంగతి అలా ఉంచుదాం... మనం ఏంచేద్దాం?’’ అన్నాడు హరీష్ కార్తీక్‌తో.
‘‘ముందు ఆ నిరంజన్‌గాడి నెంబర్ తెలుసుకుందాం.’’
అంటూ తన దగ్గరున్న బాల్‌రాజ్ సెల్‌ఫోన్ ఆన్‌చేసాడు. అందులో అతడికి నిరంజన్‌కు చెందిన రెండు ఫోన్ నంబర్లు కనిపించాయి. ఆ నంబర్లను కార్తీక్ అతడి ఫ్రెండ్స్ తమ ఫోన్లలోకి ఫీడ్ చేసుకున్నారు. తర్వాత ఆ ఫోన్‌లోని మెమోలో ఉన్న మేటర్ చదివాక కార్తీక్ ముఖంలో చిరునవ్వు ప్రత్యక్షం అయింది.
‘‘వాట్.. నెక్స్ట్?’’ అన్నాడు రవి.
‘‘ఇంకా పూర్తిగా స్పష్టతరాలేదు. మీరూ ఆలోచించండి. నేనూ ఆలోచిస్తా’’ అన్నాడు కార్తీక్.
‘‘ఓకే!... నువ్వు కొట్టిన ఇటికె రాయి దెబ్బకు ఆ బాలరాజ్‌గాడు ఎలా ఉన్నాడో పోయాడో!?’’ అన్నాడు జైరాం.
‘‘అందుకేగా మనం ఇక్కడ మీట్ అయింది...’’అంటూ జైరాంతో చెప్పి, రవి వైపు చూసి.
‘‘తెచ్చావా?’’ అని అడిగాడు కార్తిక్.
రవి తల ఊపి షోల్డర్ బ్యాగ్‌లోనుంచి గిఫ్ట్ ప్యాకెట్ బయటకు తీసి, దాన్ని కార్తీక్‌కి అందించాడు. కార్తీక్ ఆ ప్యాకెట్‌కు చుట్టి ఉన్న రేపర్‌ను చించి ఆ రేపర్‌ను మడతపెట్టి జేబులో పెట్టుకున్నాడు. తర్వాత ప్యాకెట్‌ను తెరిచి, లోపలినుంచి బైనాక్యూలర్‌ను తీసి, కళ్ళముందు ఉంచుకుని చూశాడు.
అతడికి హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్న బాల్‌రాజ్ ఇల్లు కనపడింది.
* * *
ఇటుక రాయి దెబ్బ తగిలి బాల్‌రాజ్ స్పృహ తప్పి పడిపోగానే పఠాన్‌కు ఏం చెయ్యాలో అర్ధంకాలేదు.
నగరంలో బాల్‌రాజ్‌కు చాలామంది శత్రువులు ఉన్నారు. వాళ్ళల్లో ఎవరో దాడిచేసి ఉండవచ్చు. ఇప్పుడు వాళ్ళు మరిన్ని ఇటుక రాళ్లు విసరవచ్చు... అవి తన మీద కూడా పడవచ్చు... తన బుర్ర కూడా పగలవచ్చు అని ఆలోచించుకుంటూ జీప్‌ను టర్న్‌తీసుకుని బాల్‌రాజ్ ఇంటివైపు బయలుదేరాడు పఠాన్. అంతలోనే మళ్లీ ఏదో ఆలోచించుకుని, తనకు తెలిసిన డాక్టర్ దగ్గరకు బాల్‌రాజ్‌ని తీసుకుపోయాడు. అక్కడ ట్రీట్‌మెంట్ చేశాక బాల్‌రాజ్ కొంచెం స్పృహలోకి వచ్చాడు.
‘‘్ఫర్వాలేదు! కాసేపటికి పూర్తి స్పృహవస్తుంది...!!’’ అని డాక్టర్ చెప్పిన తర్వాత బాల్‌రాజ్ జీప్‌లో వేసుకుని బయలుదేరాడు పఠాన్.

-సశేషం

-జి.వి.అమరేశ్వరరావు