డైలీ సీరియల్

పంచతంత్రం--14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బైనాక్యూలర్స్‌లోంచి చూస్తూ అన్నాడు కార్తీక్.
‘‘ఇంకా ఆ బాల్‌రాజ్‌గాడు ఇంటికి చేరలేదు....’’
‘‘వాడు... పైకి పోయాడేమో...’’ అనుమానంగా అన్నాడు రవి.
సరిగ్గా అదే సమయంలో బాల్‌రాజ్, పఠాన్‌లు ప్రయాణిస్తున్న జీప్ విశాలమైన బాల్‌రాజ్ ఇంటి ఆవరణలోకి ప్రవేశించింది. బాల్‌రాజ్ మూలుగుతూ మెల్లిగా జీప్‌లోనుంచి దిగాడు. బైనాక్యూలర్స్‌లో అది గమనించిన కార్తీక్ అన్నాడు.
‘‘ఆ బాల్‌రాజ్‌గాడు పైకి పోలేదు. నెత్తిమీద కట్టుతో ఇప్పుడే జీప్ దిగాడు’’.
బాల్‌రాజ్‌ను చూడగానే ఒక అనుచరుడు పరిగెత్తుకుంటూ కుర్చీ తీసుకువచ్చి వేసాడు. ఆ అనుచరుడి పేరు బైరాగి.
ఈలోపు ఆవరణలోని లైట్లు వెలిగించాడు పఠాన్.
‘‘వేడివేడిగా చాయ్ పెట్టు!’’అంటూ కుర్చీలో కూర్చుంటూ బైరాగితో చెప్పాడు బాల్‌రాజ్. వాడు ఆ పనిమీద వెళ్లిపోయాడు.
బాల్‌రాజ్ పెళ్లిచేసుకోలేదు. జీవితాంతం ఒకే ఆడమనిషితో ఉండటం అతడికి ఇష్టంలేదు.
* * *
తన షోల్డర్ బ్యాగ్‌లో నుంచి కొన్ని అరటి పళ్ళు తీసి తలా ఒకటి ఇచ్చాడు జైరాం.
అంతా అరటిపళ్ళు తిని తొక్కలు హరీష్‌కి ఇచ్చారు. వాటిని హరీష్ జాగ్రత్తగా తన దగ్గర ఉన్న క్యారీ బ్యాగ్‌లో వేసుకున్నాడు. తర్వాత హరీష్ తన షోల్డర్ బాగ్‌లోనుంచి పెద్దసైజ్ సరికొత్త కొబ్బరి నూనె సీసా బయటకు తీసి, దాని మూత ఓపెన్‌చేసి, కొంచెం కోకోనట్ ఆయిల్ చేతిలోవేసుకుని తలకు పూసుకున్నారు.
అది చూసి హరీష్ అన్నాడు.
‘‘ఆయిల్ జాగ్రత్తగా వాడాలి... వేస్ట్ చేసుకోకూడదు.’’
వెంటనే హరీష్ కోకోనట్ ఆయిల్ బాటిల్ బ్యాగ్‌లో పెట్టుకుని.... ‘‘ఏం ఫర్వాలేదు.. ఇంకా... రెండు ఫుల్‌బాటిల్స్ ఆయిల్ ఉంది’’ అంటూ చెప్పాడు.
అంతలో కార్తీక్ తన దగ్గరఉన్న షోల్డర్‌లోంచి ఒక ప్లాస్టిక్ సంచీ తీసి జైరామ్‌కి ఇచ్చాడు. ఆ బ్యాగ్‌నిండా గాజుపెంకులు ఉన్నాయి..
బాల్‌రాజ్ ప్యాంటు జేబులోంచి ఒక సెల్‌ఫోన్ తీశాడు. తన నెంబర్‌కి రింగ్ చేశాడు.
బాల్‌రాజ్ ఫోన్ చేయటం బైనాక్యులర్స్‌లో చూస్తున్నా కార్తీక్ కనబడింది.
వెంటనే కార్తీక్ దగ్గర ఉన్న సెల్ రింగ్ అయింది. కార్తీక్ విషయం అర్థం అయింది. అతడు ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు, అవతలి వైపు నుంచి బాల్‌రాజ్ ‘హలో’ అనే లోపే...
‘‘ఏంట్రా?.. ఫోన్ కావాలా?’’ అంటూ అడిగాడు.
తను ‘హలో!’ అనే లోపే అవతలి వ్యక్తి తానే మాట్లాడుతున్నాడని ఎలా తెలుసుకున్నాడో బాల్‌రాజ్‌కి అర్థం కాలేదు. ఐనా కోపంతో-
‘‘రేయ్! ననే్న రా అంటావురా? నా ఫోనే కొట్టేస్తావురా? నేను ఈ ఏరియా గూండాని!’’ అంటూ అరిచాడు బాల్‌రాజ్.
‘‘నేను ఈ ప్రపంచానికి గూండాన్రా.. అంతేకాదు రోయ్ ఇటికరాయితో నీ డిప్ప పగలగొట్టింది కూడా నేనేరా..! ఫోన్ పెట్టేయ్‌రా చెత్తనా...!’’ అన్నాడు కార్తీక్.
‘‘రేయ్!’’ అంటూ బాల్‌రాజ్ అరుస్తుండగా, మగ్గులా కనపడుతున్న పెద్ద కప్పు నిండా వేడి వేడి చాయ్ తీసుకుని అక్కడకు వచ్చాడు బైరాగి.
‘‘రేయ్! పిచ్చికుక్కలా అరవటం మానేసి.. ముందు గేదె లాగా చాయ్ తాగరా.. అయినా ఆ కప్పు.. సైజ్.. ఏంట్రా.. అంతుంది!?’’ అన్నాడు కార్తీక్.
ఆ మాటతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు బాల్‌రాజ్. తనను వాడెవడో గమనిస్తున్నాడు.
‘‘ఎవడు వాడు..?’’
బాల్‌రాజ్‌కి భయం వేసింది.
అతడు తల తిప్పి పరిసరాలను పరిశీలిస్తున్నాడు.
‘‘రేయ్! నువ్వు ఎప్పుడు, ఎక్కడ ఏం చేస్తూంటావో నాకు తెలుసురా.... నీ లైఫ్ హిస్టరీ అంతా నాకు తెలుసురా! నీ అంతు చూస్తా.. బద్మాష్ ఎదవ!’’ అన్నాడు కార్తీక్.
బాల్‌రాజ్‌కి ఏం చెప్పాలో అర్థం కాలేదు.
‘‘రేయ్! ఇప్పుడు నీ ఫోన్ నా దగ్గర ఉంది.. ఈ ఫోన్‌తో ఏం చేస్తానో నీకు తెలుసా?’’
‘‘‘తెలియదు..!’’ అన్నాడు భయంగా బాల్‌రాజ్.
‘‘ఐతే తెలుసుకో..! పోలీసు కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసి.. కమిషనర్ కుర్చీ కింద టైం బాంబు పెట్టాను అని చెపుతా..!’’ అని చెప్పి, హ..హ్హ..హ్హ..హ్హ’’ అంటూ విలన్‌లాగా భయంకరంగా, వికటంగా నవ్వాడు కార్తీక్.
బాల్‌రాజ్ వేగంగా ఆలోచించాడు. ప్రస్తుతం తనకు ప్రతి నిమిషమూ విలువైనది.. వాడు ఫోన్ చేశాక పోలీసులు నెంబర్ చూసి అది తన ఫోన్ అని కనిపెట్టి తనమీద దాడి చేసి తనను అరెస్టు చేస్తారు. తర్వాత.. తన ఫోన్ ఎవడో కొట్టేశాడు అనీ, వాడే ఆ బెదిరింపు ఫోన్ చేశాడు అని తాను ప్రూవ్ చేసుకోవచ్చు. కానీ తను బయటపడటానికి టైం పడుతుంది. తనకు అంత టైం లేదు. పైగా ఇదంతా తెలిస్తే నిరంజన్ ఊరుకోడు. నిర్లక్ష్యంగా ఉన్నందుకు తోలు తీస్తాడు.
కాళ్ళబేరానికి వస్తూ కార్తీక్‌తో చెప్పాడు బాల్‌రాజ్.
‘‘ప్లీజ్..! వద్దన్నా.. వద్దు..! పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చెయ్యవద్దు! నన్ను ఏం చెయ్యమంటావో చెప్పు!’’ తన తండ్రినీ, తన స్నేహితుల తండ్రులనీ బాల్‌రాజ్ భయపెట్టి, బూతులు తిట్టిన విషయం గుర్తుకు తెచ్చుకుంటూ అన్నాడు కార్తీక్.
‘‘ఐతే నేను తిట్టే తిట్లు అన్నీ జాగ్రత్తగా వినాలి!’’
‘‘అలాగే అన్నా!’’
‘‘ఐతే విను!’’ అని చెప్పి ‘‘సోంబేరి ఎదవ..! దొంగ బాడకావ్.’’ అంటూ మొదలుపెట్టి దేశంలో వున్న తిట్లు అన్నీ తిట్టసాగాడు కార్తీక్. ఆ తిట్లు వింటూ, కోపాన్ని అణచుకుంటూ తల నాలుగువైపులా తిప్పుతూ ఆ చుట్టుప్రక్కల పరిసరాలను గమనించసాగాడు బాల్‌రాజ్. అతడికి కొంచెం దూరంలో రోడ్డుకు అటుపక్కన నిర్మాణంలో వున్న అపార్ట్‌మెంట్స్ కనిపించాయి. అనుమానంగా అటువైపే చూడసాగాడు బాల్‌రాజ్. అది గమనించిన కార్తీక్-
‘‘మొత్తానికి కనిపెట్టావురా! ఇక్కడే.. నువ్వు చూస్తున్న అపార్ట్‌మెంట్స్‌లోనే థర్డ్ఫో్లర్‌లో ఉన్నాను.. రారా!’’ అన్నాడు.
‘‘వస్తున్నాను అక్కడే ఉండరా!’’
‘‘ఉంటాను! దమ్ముంటే రారా!’’ అంటూ ఫోన్‌లో అరిచాడు కార్తీక్.
-సశేషం

--జి.వి.అమరేశ్వరరావు