డైలీ సీరియల్

యూజ్ఞసేని--118

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజయుడు వెళ్ళగానే ధర్మరాజు భీమార్జున నకుల సహదేవులను, విరాట, ద్రుపద, కేకయ మహారథులను కలిసి వారితో
‘‘మనం శంఖచక్రగదాధారి అయిన శ్రీకృష్ణుని దగ్గరకుపోయి అతడిని కౌరవ సభకు వెళ్ళిరమ్మని ప్రార్థించుదాం. భీష్మద్రోణ బాహ్లిక కురువీరులతో మనం యుద్ధం చేయవలసిన అవసరం రానట్లు ఆయన ప్రయత్నిస్తాడు. ఇదే మన మొదటి మార్గం. ఇదే ఉత్తమమూ. మనకు శ్రేయోదాయకముగూడా’’ అని అన్నాడు. యుధిష్ఠిరుని ఆ మాటలు విన్న వారంతా శ్రీకృష్ణుడున్న చోటికి వెళ్ళారు.
పరివారమంతా తనను సేవిస్తుండగా, తగిన పరిజనంతో ద్రౌపది ఒక ప్రక్కనుండగా, ధర్మరాజు కృష్ణుడితోపాటు కూర్చున్నాడు. అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుని చూచి
‘‘మహానుభావా! వాసుదేవా! కష్టాలను తొలగించటానికి, శుభాలను సమకూర్చటానికి సమర్థుడవైన నిన్ను ఈ జన్మకు మాకు దిక్కుగా చూపి మా తండ్రి పాండుమహీపతి వెళ్ళిపోయాడు. కృష్ణా! మిత్రులమైన మా పనిని చక్కదిద్దటానికి నీకిది తగిన సమయం. నీవు మా పక్షాన రాయబారిగా వెళ్ళితే అయోగ్యుడైన ఆ దుర్యోధనుడితో మేము యుద్ధం చేయవలసిన అవసరముండదు. మాపాలికి వచ్చే రాజ్యాన్ని మేము అనుభవింపగలము. మేము నీ కుమారులతో సాటివారము. మాకు పాపాలు సోకకుండునట్లు ఆలోచించి మమ్ములను కాపాడుము.’’అని అనగా శ్రీకృష్ణుడు.
‘‘రాజా! నీవు యేమిచేయమని ఆదేశిస్తావో అట్లే చేస్తాను. నీ అభిప్రాయమేమిటో చెప్పుము.’’అని అన్నాడు.
‘‘కృష్ణా! నీవు హస్తినాపురానికిపోయి కౌరవులతో తగు మాటలాడి ఒక దారిని యేర్పరచాలి’’అని ధర్మరాజు అనగా శ్రీకృష్ణుని అంగీకరింపజేసి.
‘‘నిన్న సంజయుడి మాటలనవలన మా తండ్రి ధృతరాష్ట్రుడి వుద్దేశమేమిటో, అతడి కుమారుడైన దుర్యోధనుడి తీరు యెటువంటిదో నీకు తెలిసిందిగదా? ఆ తండ్రి కొడుకుల చిత్తవృత్తులు యెటువంటివో సంజయుడికి బాగా తెలుసును. జూద నియమం ప్రకారం మేము పదమూడేండ్లు అరణ్యాజ్ఞాత వాసాలు చేసి వచ్చియుండగా ధృతరాష్ట్రులు వంశధర్మం పాటించకున్నాడు. కౌరవులు మేము కలసిమెలసి జీవించేటటువంటి మార్గంతెలియక యిట్లా బ్రతకటం మాకు మగతనంగాదు. మాకు అర్థరాజ్యం యివ్వకపోయినా అవిస్థలం, వృకస్థలం, మాకంది, వారాణాసతంగాక మరొకటి చాలును. అందుకూ యిష్టపడకపోతే మేము తలదాచుకొనటానికి ఐదూళ్ళిచ్చినా చాలునని యింతకు ముందే సంజయుడితో చెప్పిన మాట యదార్థం.
వాసుదేవా, నేను యేవిధంగా రాజ్యాన్ని కోల్పోయానో, రోజులు యెంత కష్ఠంగా గడుపుతున్నానో యిదంతా నీవు ప్రత్యక్షంగా చూస్తూనే వున్నావు. అటువంటి మేము పైకృతమైన సంపత్తిని విడిచి పెట్టటం యుక్తంగాదు. సాధించుకొనే ప్రయత్నంలో మేము మరణించినా అది తగినదే. మేము కౌరవులను సంహరించి ఆ రాజ్యాన్ని చేజిక్కించుకొనటం అనేది అంతిమ లక్ష్యం. మేము యుద్ధాన్ని కోరుకొనటం లేదు. సామదాన బేధోపాయాలతో రాజ్యాన్ని పొందాలనుకుంటున్నాము. ఒకవేళ మా వన్నపాలు విఫలమయితే యుద్ధం చేయక తప్పదు.
మాధవా! ఈ స్థితిలో యేం చేస్తే బాగుంటుందని నీవు అనుకొంటున్నావు? మేము ధర్మార్థాలను కోలుపోకుండా నిలువగల మార్గమేది? పురుషోత్తమా! ఇటువంటి తీవ్ర సంకట స్థితిలో నీతోగాక మరెవరితో నేను సంప్రదించగలను? కృష్ణా! నీవు మాకు యిష్టుడవు. శ్రేయోభిలాషివి. సమస్త విషయాల నిశ్చితబుద్ధి కలవాడవు. నీవంటి మిత్రుడు మాకెవరున్నారు?’’ అని అనగా వాసుదేవుడు
ధర్మరాజా! నేను మీ ఉభయపక్షాల క్షేమంకోసం కురురాజసభకు వెళ్తున్నాను. అక్కడకు పోయి మీ ప్రయోజనాలకు దెబ్బతగలనీయకుండా సంధిని చేయగలిగితే నేనెంతో గొప్ప ఫలితాన్ని సాధించినట్లు. సమస్త భూమండలాన్ని కూడా మృత్యువుపాశం నుండి విడిపించగలిగినట్లే’’ అని అనగా యుధిష్ఠిరుడు-
‘‘కృష్ణా! నీవు కౌరవుల వద్దకు వెళ్ళాలన్నది నా అభిమతం గాదు. నీవెంత మంచి మాటలను చెప్పినా దుర్యోధనుడు వాటిని వినడు. అంతేగాక దుర్యోధనుని ఆధీనమైన సకల రాజలోకం అక్కడ చేరింది. వారి మధ్యకు నీవు వెళ్ళడం నాకు యిష్టం లేదు. మాధవా! దుర్యోధనుని కారణంగా నీకేమైనా ద్రోహం కలిగినట్లయితే ధనమూ, దివ్యత్వమూ, సుఖమూ, ఐశ్వర్యమూ మాకు అవసరం లేదు’’ అని అనగా శ్రీకృష్ణుడు‘‘మహారాజా! ధార్తరాష్ట్రుడైన దుర్యోధనుడు యెంత దుర్మార్గుడో నాకు బాగా తెలుసును. కానీ సంధికి ప్రయత్నిస్తే లోకంలోని యేరాజు కూడా మనలను తప్పుపట్టే అవకాశం ఉండదు. నాకు కోపాన్ని కలిగించిన తరువాత రాజులందరూ ఒకటై యెదురు నిల్చినా నాసరిపోరు. కౌరవులు నాతోడ అనుచితంగా ప్రవర్తిస్తే వారినందరినీ బూడిదచేస్తాను. ఇది నా నిర్ణయం’’ అని అన్నాడు.
..........................ఇంకావుంది

--త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము